ఫేస్‌ క్రీమ్‌ వాడితే కిడ్నీలు డ్యామేజ్..అసలేం జరిగిందంటే.!

Publish Date:Nov 23, 2026

Advertisement

అందంగా కనిపించాలని ఎవరికి మాత్రం ఉండదు? ముఖంపై చిన్న మొటిమ వచ్చినా.. చర్మంపై నల్లటి మచ్చ కనిపించినా అమ్మాయిలు ఆందోళన చెందుతారు. అలాంటిది కొద్ది రోజుల్లోనే తెల్లగా మారిపోతారంటూ సోషల్ మీడియాలో కనిపించే ప్రకటనలు ఎదురైతే ఇంకేమైనా ఉందా? వాటిని నమ్మి ఎన్నో ఉత్పత్తులు కొనుగోలు చేస్తుంటారు. కానీ అందం కోసం చేసే చిన్న ప్రయత్నం ప్రాణాల మీదకు తెస్తే..? కేరళలో వెలుగుచూసిన ఓ బాలిక ఉదంతం ఇప్పుడు అందరినీ కలచివేస్తోంది.

సోషల్ మీడియా ప్రకటనకు ఆకర్షితురాలై..!

కేరళలోని మలప్పురానికి చెందిన 17 ఏళ్ల బాలిక కూడా అందంగా కనిపించాలనే ఆశతో ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చే వీడియోలను చూసి ఆకర్షితురాలైంది. ఆ వీడియోల్లో ప్రచారం చేసిన ఫెయిర్‌నెస్ క్రీమ్‌ను వాట్సాప్ ద్వారా ఆర్డర్ చేసింది. ముఖంపై మచ్చలు, మొటిమలు తగ్గి చర్మం తెల్లగా మారుతుందన్న ఆశతో దాదాపు ఏడాది పాటు ఆ క్రీమ్‌ను ఉపయోగించింది. కానీ తనకు తెలియకుండానే ఆ క్రీమ్ రూపంలో విషాన్ని శరీరంలోకి పంపించుకుంటున్నానని ఆమె ఊహించలేకపోయింది.

అందం మాటున కిడ్నీలకు విషం.!

కొంతకాలానికి ఆమె కాళ్లకు వాపులు రావడం మొదలైంది. రక్తపోటు పడిపోవడం, తరచూ స్పృహ తప్పిపోవడం వంటి సమస్యలు వెంటాడాయి. మొదట ఏదో చిన్న ఆరోగ్య సమస్య అనుకున్నా.. పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు నిర్వహించిన పరీక్షల్లో ఆమెకు 'మెంబ్రానస్ నెఫ్రోపతి' అనే తీవ్రమైన మూత్రపిండాల వ్యాధి ఉన్నట్లు గుర్తించారు. అందంగా కనిపించాలన్న ఆ చిన్నారి ఆశ.. చివరకు కిడ్నీల ఆరోగ్యాన్నే ప్రమాదంలోకి నెట్టింది.

క్రీమ్‌లో 12,500 పీపీఎం మెర్క్యురీ.!

అసలు ఆమెకు ఈ వ్యాధి ఎందుకు వచ్చిందన్న కోణంలో వైద్యులు పరిశీలించగా విస్తుపోయే నిజం బయటపడింది. బాలిక రక్త నమూనాలతో పాటు ఆమె వాడిన క్రీమ్‌ను ప్రయోగశాలలో పరీక్షించగా ప్రమాదకర స్థాయిలో పాదరసం (మెర్క్యురీ) ఉన్నట్లు తేలింది. సాధారణంగా సౌందర్య ఉత్పత్తుల్లో మెర్క్యురీ పరిమితి ఒక పీపీఎం లోపు ఉండాలి. కానీ ఆమె ఉపయోగించిన క్రీమ్‌లో ఏకంగా 12,500 పీపీఎం మెర్క్యురీ ఉన్నట్లు గుర్తించారు. అంటే అనుమతించిన పరిమితి కంటే వేల రెట్లు అధికం. అందం కోసం ముఖానికి రాసుకున్న క్రీమ్‌లో ఇంతటి విషపూరిత రసాయనం ఉండటమే ఈ ఘటన తీవ్రతను తెలియజేస్తోంది.

తెల్లదనం వెనుక దాగున్న విషాదం.!

చర్మానికి రంగునిచ్చే మెలనిన్ ఉత్పత్తిని తగ్గించి త్వరగా తెల్లగా మారుస్తామనే ఉద్దేశంతో కొన్ని అక్రమ తయారీ సంస్థలు ఇలాంటి క్రీముల్లో మెర్క్యురీని కలుపుతుంటాయి. అయితే ఇది చర్మానికే కాదు.. శరీరంలోని కీలక అవయవాలకూ ప్రమాదకరం. చర్మం ద్వారా శరీరంలోకి చేరిన పాదరసం మూత్రపిండాల వడపోత వ్యవస్థను దెబ్బతీస్తుంది. ఫలితంగా మూత్రం ద్వారా ప్రొటీన్లు బయటకు పోవడం, కాళ్లు, చీలమండల్లో వాపులు రావడం వంటి సమస్యలు తలెత్తుతాయి. నాడీ వ్యవస్థపైనా తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది.

తల్లిదండ్రులకు హెచ్చరిక.. ఆన్‌లైన్ క్రీములపై నిఘా.!

ఈ ఘటనపై బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ స్పందించి కేసు నమోదు చేసి విచారణకు ఆదేశించింది. మరోవైపు సోషల్ మీడియా వేదికగా ఎలాంటి ధ్రువీకరణ లేకుండా సౌందర్య ఉత్పత్తులను విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా యువతులు, టీనేజర్లు సోషల్ మీడియాలో వచ్చే ఆకర్షణీయమైన ప్రకటనలకు మోసపోవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

కొద్ది రోజుల్లోనే చర్మ రంగు మారుస్తామనే హామీలను నమ్మి గుర్తుతెలియని వ్యక్తుల నుంచి క్రీములు కొనుగోలు చేయకూడదని సూచిస్తున్నారు. చర్మ సమస్యలు ఉంటే వైద్యులను సంప్రదించాలే తప్ప.. సొంత నిర్ణయాలతో ప్రయోగాలు చేయకూడదని స్పష్టం చేస్తున్నారు. ముఖంపై తెల్లదనం కోసం ప్రయత్నిస్తే.. జీవితంలో చీకట్లు కమ్ముకోవాల్సిన పరిస్థితి రావొద్దు. అందం కోసం ఆరోగ్యాన్ని పణంగా పెట్టకూడదన్న గుణపాఠాన్ని ఈ బాలిక ఉదంతం ప్రతి ఒక్కరికీ గుర్తుచేస్తోంది.

ఇది కూడ చదవండి: ఐఏఎస్ లు ప్రేక్షకపాత్రకు పరిమితమౌతున్నారా: తెలుగువన్ ఇంటలెక్చువల్ టాక్ షోలో చర్చ.!

 

 

[ Kidney damage from face cream, Mercury Poisoning, Kerala Girl Kidney Disease, Membranous Nephropathy, Toxic Cosmetics ]

By
en-us Political News

  
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది.
ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. 
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత   ప్రతి జిల్లాలోనూ పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సవివరంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
పంచాయతీ ఎన్నికలకు పొత్త ధర్మం వర్తించదని ఆ ప్రకటన పేర్కొంది.   గ్రామాభివృద్ధి, స్వేచ్ఛాయుత పాలన, మహాత్మాగాంధీ ఆశయాల సాకారం గ్రామీణ స్థాయి నుంచే సాధ్యమవుతాయని పేర్కొంది.   
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బెంగళూరుకు చేరుకోవడంతో యలహంక ప్యాలెస్ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) రంగంలో లోతైన సాంకేతిక నైపుణ్యం కలిగిన నిపుణులకు ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్ నెలకొంది.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు.
మత్తుపదార్థాల వినియోగానికి వ్యతిరేకంగా నిర్వహిస్తున్న నషా ముక్త్ భారత్ ప్రచార కార్యక్రమంలో పాల్గొనాలని సినీ నటుడు ప్రభాస్‌ను కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ఆహ్వానించారు.
ఇద్దరు ఆడపిల్లలు పుట్టారన్న కారణంతో ఓ భర్త దారుణానికి ఒడిగట్టాడు.
అంతర్జాతీయ దేశీయ మార్కెట్లలో బంగారం ధరలు ఇటీవల గణనీయంగా పడిపోవడంతో పెట్టుబడిదారులు, కొనుగోలుదారుల్లో తీవ్ర చర్చ మొదలైంది.
బుల్లితెర ప్రేక్షకులను నవ్వించే జబర్దస్త్ కమెడియన్లు దొరబాబు, రైజింగ్ రాజు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.
బంగారం ధరలు భారీగా పడిపోవడంపై ఢిల్లీకి చెందిన చాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ (సీటీఐ) ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపింది.
తాళి కట్టిన 24 గంటల్లోనే బిడ్డకు జన్మ..అసలు కథేంటి.?
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.