ఉషాపానం ఆరోగ్యానికి మేలు!

Publish Date:Jan 7, 2023

Advertisement

 

ఉషాపానం ఇదేమిటి ఇదేదో సురాపానమా  అని మాత్రం అనుకోకండి.అందరికీ అర్ధమయ్యే రీతిలో చెప్పాలంటే ఉదయం పూట నిద్రలేవగానే పళ్ళు తోముకోకుండా నీటిని తాగితే ఏమౌతుంది? లాభమా నష్టమా? ఈ ప్రశ్నలకు సమాధానం ఈవ్యాసం.ఉదయం వేళలో నిద్ర లేవగానే ముఖం కూడా కడుక్కోకుండా నీళ్ళు తాగడం మన పూర్వీకులకు అలవాటు. ఇది చాలా సహజమే ఇక్కడ ఆశ్చర్యాన్ని కలిగించే అంశం ఏమిటి అంటే నిద్రలేవగానే ముఖం కడుక్కోకుండా మొట్టమొదట నీటిని తాగడం వల్ల మందులతో తగ్గని రోగాలు కూడా తగ్గుతాయని ప్రముఖనాడీ పతి వైద్యులు డాక్టర్ పి కృష్ణం రాజు తెలిపారు. తెలుగు వన్ హెల్త్ తో మాట్లాడుతూ నిద్ర లేవగానే నీరు తాగడం వల్ల నోటిలో లాలా జలము అంతా కడుపులో చేరి శరీరానికి ఎంతో మేలుచేస్తుంది అని ఎన్నోరోగాలు తగ్గుతయాని  అంటారు కృష్ణం రాజు. మనము ప్రతిరోజూ లాలాజలము బయటకు ఉమ్మివేస్తాము లాలాజలము బయటికి ఉమ్మివేస్తాము మీకు తెలుసా మీ లాలా జలము చాలా విలువైనది అద్భుతమైనది అని తెలియక దీనిని వృధా చేస్తున్నాము. ఇకపై దీనిని వృధా చేయకండి.మీరు ఉపయోగించుకోవాలని డాక్టర్ కృష్ణం రాజు తెలిపారు.నిద్రలేవగానే పళ్ళు తోముకోకుండా నీళ్ళు తాగి తాగడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది.పూర్వకాలం లో ఉదయం పూట నిద్రలేవగానే పళ్ళు తోముకోకుండా రాగి చెంబులో నీళ్ళు తాగడం ఆనవాయితీగా వచ్చేది.ఆతరువాతే వేపపుల్ల,లేదా గానుగ పుల్లలతో పళ్ళు తోముకునే వారని పెద్దలు చెప్పుకునే వారు.ఇదేమిటి నీరు తగిన తరువాత పళ్ళుతోముకోవడమా బ్యాడ్ ప్రాక్టిస్ మాత్రం కాదని పెద్దలకు తెలుసు.ఉదయం పరగడుపున అంటే నిద్రలేవగానే మొహం కూడా కడుక్కోకుండా మొట్టమొదటగా నీరు త్రాగాలి.పుక్కిలించకుండానీరు తాగాలనిఅంటారు అసలు దేని వెనక ఉన్నకారణం ఏమిటో తెలుసుకుందాం. మనము రాత్రి  తిని పడుకున్నప్పుడు మనశరీరం లోని క్రిములన్నీ శిధిల మై పోతాయి. కానీ లాలా జలం క్రియ కొనసాగుతూ ఉంటుంది. అది నోటిలో రక రకాలుగా వుంటుంది. కడుపులోకి వెళ్ళదు. అది చాలా విలువైనది అదీ బ్రహ్మ ముహూర్తం లో లాలా జలము ఆసమయంలో ఎన్నో రెట్లు విలువైనదిగా పేర్కొన్నారు.లేచిన వెంటనే నీరు త్రాగడం వల్ల అందులో లాలాజలము అంతా కడుపులో చేరి శరీరానికి ఎంతో మేలుచేస్తుంది.దీనికారణంగా షుగర్ కంట్రోల్ కు వస్తుంది.ముఖ్య్సంగా కడుపులో పుండ్లు,కురుపులు చాలా కాలానికి కానీ మందులతో తగ్గవు.వీరు ఇలా చేస్తే అద్భుత మైన ఫలితాలు చూడవచ్చని డాక్టర్ కృష్ణం రాజు పేర్కొన్నారు.ఇంతే కాకుండా ఉదయం లేవగానే మన నాలుక మీద ఉన్న ఉమ్మిని తీసుకుని కంటిలో పెట్టుకుంటే. కంటి సమస్యలు పోతాయాని అలాగే చర్మం.ముఖం అలాచేయడం వల్ల అద్భుతమైన మార్పులు గమనించవచ్చని అన్నారు ఇందుకు ఉదాహరణగా జంతువుల నుండి మనం గ్రహించాల్సిన విషయం అదే. ఏదైనా దెబ్బ తగిలినప్పుడు ఆ ప్రదేశం లో అక్కడ నాలుకతో నాకడం మొదలుపెడతాయి. లాలా జాలం లో 18 రకాల పోషకాలు ఉన్నాయని అంటారు.కృష్ణం రాజు. అందుకే మన లాలాజలము విలువైనదే అని అంటారు.ఈ పద్దతిని ఉపయోగించడం ద్వారా ఇదే ఉదయం వేళలో ఉషాపానం లో ఉండే ఆరోగ్య రహాస్యం అని అంటున్నారు డాక్టర్ కృష్ణం రాజు.మీ ఆరోగ్యం మీచేతుల్లోనే ఉందన్న విషయం గ్రహించండి. ఆరోగ్యంగా ఉండండి. 

 

By
en-us Political News

  
ఇంట్లో కాఫీ, టీలు సాధారణంగా స్టీల్ లేదా పింగాణీ కప్పులలో తాగుతారు. కానీ బయటకు వెళ్లినప్పుడు చాలామంది  దుకాణాల దగ్గర కాఫీ..
ఎక్కిళ్లు ఏ వయసు వారికైనా వచ్చే ఒక సాధారణ సమస్య. ఎక్కిళ్లు సాధారణంగా కొన్ని నిమిషాల్లో వాటంతట అవే ఆగిపోతాయి, కానీ కొన్నిసార్లు అవి తగ్గకుండా చాలా అసౌకర్యాన్ని కలిగిస్తాయి...
మన చుట్టూ ఉండే ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన ఔషధాలలో జామ ఆకులు ఒకటి. ఎలాంటి ఖర్చు లేకుండా మన ఇంట్లోనే లభించే ఈ జామ ఆకులతో కషాయం....
ఈ రోజుల్లో ఎయిర్ కండిషనర్లు (ఏసీలు) విలాస వస్తువు లా కాకుండా ఒక అవసరంగా మారాయి. ఇంట్లో, ఆఫీసులో, లేదా కారులో అయినా,  పగలు రాత్రి తేడా లేకుండా ఏసీల చల్లని గాలిలో సమయం గడుపుతారు...
నేటి కాలంలో నిమ్మరసం ఎంతో ప్రజాదరణ పొందిన పానీయాలలో ఒకటి . శరీరాన్ని చల్లబరచడం నుండి డీహైడ్రేషన్‌ను నివారించడం వరకు నిమ్మరసం ప్రయోజనాలు..
కొన్నిసార్లు శరీరంపై నీలం లేదా ఊదా రంగు మచ్చలు  కనిపిస్తాయి. చాలా వరకు ఇలాంటి మచ్చలు ఏవైనా గాయాలు లేదా దెబ్బలు తగిలినప్పుడు బయటకు రక్తం కారడం..
ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో, మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల చాలామంది శరీరానికి కావలసిన పోషకాలను సరిగ్గా అందజేయలేకపోతున్నారు. ఈ క్రమంలో శరీరంలో విటమిన్లు, ఖనిజాల లోపాన్ని భర్తీ చేయడానికి..
గుండె మానవ శరీరంలో అత్యంత కీలకమైన అవయవం, ఇది శరీరమంతటికీ ఆక్సిజన్ , పోషకాలను అందించడానికి నిరంతరం రక్తాన్ని పంపింగ్ చేస్తుంది. అయితే, మారుతున్న జీవనశైలి, ఒత్తిడి,  ఆహారపు అలవాట్లు సరిగా లేకపోవడం..
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యం అనేది ఒక సవాలుగా మారింది. ముఖ్యంగా 30-32 ఏళ్ల చిన్న వయసులోనే జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూనో, ఫంక్షన్లలో డ్యాన్స్ చేస్తూనో అకస్మాత్తుగా గుండెపోటుతో కుప్పకూలిపోతున్న వార్తలు మనల్ని..
చాలామంది రాత్రి వేళల్లో హాయిగా నిద్రిస్తున్న సమయంలో అకస్మాత్తుగా కాళ్ల పిక్కలు పట్టేయడం (Leg Cramps at Night) వల్ల తీవ్రమైన నొప్పితో మేల్కొంటూ ఉంటారు. కండరాలు గట్టిగా బిగుసుకుపోయి, కాళ్లు కదల్చలేనంతగా వచ్చే ఈ నొప్పిని ఆయుర్వేదంలో..
వేడి, విరేచనాలు లేదా వాంతులు వంటివి శరీరంలోని నీరు , ఎలక్ట్రోలైట్ల సమతుల్యతను త్వరగా దెబ్బతీస్తాయి. ఇలాంటి పరిస్థితులలో ఓఆర్ఎస్ తాగడం చాలా ముఖ్యం. చాలా నీరసంగా ఉన్నప్పుడు, ఆహారం సరిగా తీసుకోలేనప్పుడు...
ప్రతి మనిషి ఇతర మనిషికి చాలా  విభిన్నంగా, ప్రత్యేకంగా ఉంటారు. కొందరు చాలా శాంతంగా ఉంటారు, మరికొందరు ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూ చాలా చలాకీగా ఉంటారు. ఇంకొందరు చాలా చిన్న విషయాలకే తొందరగా కోపం
భారతీయులకు టీ, కాఫీ ఒక పెద్ద ఎమోషన్. గతంలో కంటే ప్రస్తుతకాలంలో  టీ తాగేవారి సంఖ్య చాలా పెరిగింది.  ఏదైనా పని చురుగ్గా చేయాలంటే చాలామంది మొదటగా టీ తాగుతారు.  ఇక పని మధ్యలో కూడా టీ తాగుతూ ఉత్సాహం తెచ్చుకుంటారు...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.