వైసీపీలో సస్పెన్షన్లు ఉత్తుత్తివేనా?

Publish Date:Feb 13, 2026

Advertisement

వైసీపీలో సస్పెన్షన్లు ప్రజలను మభ్యపెట్టడానికేనా అంటే ఔనన్న సమాధానమే వస్తుంది. ఎందుకంటే ఏ పార్టీ అయినా సరే క్రమశిక్షణ ఉల్లంఘించినందుకో, నేరారోపణలు ఎదుర్కొంటున్నందుకో ఒక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, లేదా నాయకుడిని సస్పెండ్ చేస్తూ.. అలా సస్పెన్షన్ కు గురైన వ్యక్తిని పార్టీకి దూరంగా ఉంచుతుంది. పార్టీ కార్యక్రమాలలోకి ఎంట్రీ ఇవ్వదు. పార్టీ అధినేతనైతే అసలు కలిసే చాన్సే ఉండదు. సదరు సస్పెన్షన్ ఎత్తివేసేంత వరకూ ఆ సస్పెన్షన్ కు గురైన వారి నీడ కూడా పార్టీ దరిదాపుల్లో పడనీయరు. 

కానీ వైసీపీలో అటువంటి పరిస్థితి ఇసుమంతైనా కనిపించదు. పార్టీలో ఉన్న వారి కంటే సస్పెన్షన్ కు గురైన వారికే పార్టీలో ప్రాధాన్యత ఎక్కువ ఉంటుందా అనిపించేలా పార్టీ అధినేత వ్యవహరిస్తారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలి రోజు వైసీపీ అధినేత జగన్ తన ప్రతిపక్ష హోదా డిమాండ్ కు తిలోదకాలిచ్చి సభకు హాజరయ్యారు. తనతో సహా 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలను వెంటబెట్టుకుని ఆయన సభకు హాజరై ఓ పదకొండు నిముషాల పాటు సభలో కూర్చుని వాకౌట్ చేశారు. అది పక్కన పెడితే.. సభ నుంచి బయటకు వచ్చే సమయంలో అసెంబ్లీ ఆవరణలో ఆయనను పార్టీ నుంచి సస్పెండైన ఇద్దరు ఎమ్మెల్సీలు కలిశారు.  జగన్ వారితో ఆప్యాయంగా మాట్లాడారు. పార్టీ గొంతు బలంగా వినిపించాలని వారికి దిశానిర్దేశం చేశారు. దీంతో వైసీపీలో సస్పెన్షన్లు ఉత్తుత్తివేనా అన్న చర్చకు తెరలేచింది. ఇంతకీ ఆ ఇద్దరు ఎమ్మెల్సీలు ఎవరంటే.. 

కారు డ్రైవర్ ను హత్య చేసి మృతదేహాన్ని డోర్ డెలివరీ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న  ఎమ్మెల్సీ అనంత్ బాబు,   కుటుంబ, వ్యక్తిగత వ్యవహారాలలో రచ్చరచ్చ చేసుకున్న ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. ఈ ఇరువురూ కూడా అసెంబ్లీ ఆవరణలో జగన్ వెంట ఉన్నారు. జగన్ వారితో మాట్లాడారు. పార్టీ వాయిస్ వినిపించమని ఆదేశించారు. తాడేపల్లి వచ్చి కలవమని చెప్పారు కూడా. వీరిరువురిలో ఎమ్మెల్సీ అనంతబాబు అయితే హత్య, డోర్ డెలివరీ కేసులో అరెస్టై బెయిలుపై ఉన్నారు. ఇక దువ్వాడ శ్రీనివాస్ చేసిన రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.జనాల నుంచి వీరిపై వచ్చిన తీవ్ర వ్యతిరేకత కారణంగా ఇద్దరినీ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అయితే  జగన్ తో వారు కలిసి నడవడం, జగన్ వారితో ఆప్యాయంగా మాట్లాడటం చూస్తుంటూ.. ఆ సస్పెన్షన్లు ప్రజలను మభ్యపెట్టడానికి చేసిన ఉత్తుత్తి సస్పెన్షన్లుగా కనిపిస్తున్నాయి పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   

By
en-us Political News

  
వైసీపీలో ఇప్పుడు పేర్ని నాని పాటి నోరున్న నేతలు వేళ్ల మీద లెక్కపెట్టగలిగేంత మందే ఉన్నారు. దీంతో పేర్ని నాని అనివార్యంగా రాజకీయాలలో క్రియాశీలంగా ఉండడమన్నది.. ఆయనకు తన కుమారుడి రాజకీయ భవిష్యత్ దృష్ట్యా మాత్రమే కాకుండా, రాష్ట్రంలో వైసీపీ ఉనికికి కూడా ఒక అవసరంగా మారిపోయింది.
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి దేవ్‌జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, మరో కీలక నేత రాజిరెడ్డితో కలిసి లొంగిపోవడం సంచలనంగా మారింది.
గాంధీల కుటంబానికి మ‌న‌మంతా ఒక చేయి వేసి వెయ్యి కోట్ల రూపాయ‌లు విరాళంగా ఇద్దాం. ఇదీ ఇటీవ‌ల రేవంత్ చేసిన కామెంట్.
కనీసం తండ్రిని నాన్నా అని కూడా సంబోధించకుండా, బీఆర్ఎస్ అధినేత అన్న ప్రస్తావన కూడా చేయకుండా కేవలం పొడి మాటలతో కవిత చెప్పిన శుభాకాంక్షలపై రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
వాస్తవానికి వైసీపీ ఆరోపణలు, విమర్శల స్థాయి రోజురోజుకూ పతనం నుంచి పతనానికి అన్నట్లుగా దిగజారుతోంది. జగన్ సొంత మీడియాలో లోకేష్ శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగిన పాకిస్థాన్, ఇండియా మ్యాచ్ చూడడానికి వెళ్లిన ప్రైవేట్ పర్యటనపై చేసిన ఆరోపణలు అవాస్తవంగా తేలడంతో ఆ పార్టీ ప్రతిష్ఠ మరింత దిగజారింది.
అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలు, పని తీరు, ప్రజా సంక్షేమం చూసి వారంతట వారే స్వచ్ఛందంగా పార్టీలో చేరారని ఘనంగా ప్రకటించుకుంది. ఇప్పుడు అదే పరిస్థితి రివర్స్ లో కనిపిస్తుంటే మాత్రం.. ప్రజాస్వామ్యం ఖూనీ, మా పార్టీ వారికి కాంగ్రెస్ గేలం అంటూ గుండెలు బాదుకుంటోంది. పైగా ఆ ఆరోపణలను స్వయంగా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుకు కల్వకుంట్ల తారకరామారావు నుంచే రావడంతో తెలంగాణ సమాజం ముక్కున వేలేసుకుంటోంది.
ఇక అది పక్కన పెడితే ప్రతిపక్ష హోదా డిమాండ్ నుంచి వెనక్కు తగ్గి కేవలం హాజరు కోసం బుధవారం సభకు హాజరైన జగన్ కు, ఆయన పార్టీ ఎమ్మెల్యేలకూ వ్రతమూ చెడింది, ఫలమూ దక్కలేదని అంటున్నారు. ఎందుకంటే బడ్జెట్ సమావేశాల తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉంటుంది.
రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఉండవల్లిని పరామర్శించిన ఉండవల్లి అరుణ్ కుమార్ ఆ తరువాత మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై నెటిజనులు పెద్ద ఎత్తున విరుచుకుపడుతున్నారు.
ఇప్పటి వరకూ వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీని బాయ్ కాట్ చేసినా.. సభలో చర్చించిన అంశాలు, ఆమోదించిన బిల్లులపై తాడేపల్లి ప్యాలెస్‌లో కూర్చొని ఆ పార్టీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే జగన్ ప్రెస్‌మీట్లు పెట్టి మాట్లాడుతూ వచ్చారు. శాసనసభకు రాకపోయినా ఆ విధంగా తన అభిప్రాయాలు ప్రజలకు తెలియజేస్తే సరిపోతుందని జగన్ స్వయంగా ప్రకటించారు కూడా.
కేంద్ర ఎన్నికల సంఘం టీవీకే పార్టీకి విజిల్ గుర్తు కేటాయించింది. ఈ నేపథ్యంలో చెన్నైలోని చెపాక్ స్టేడియంలో విజిల్ సౌండ్ పై ప్రభుత్వం నిషేధం విధించింది. ఎన్నికల కోడ్ అమలులోకి రాకుండానే విజల్ పై బ్యాన్ విధించడంతో విజయ్ టీవీకే పార్టీ అంటే అధికార డీఎంకే భయపడుతోందా అన్న చర్చ మొదలైంది.
ప‌రామార్శ పేర బలప్రదర్శనలకు దిగడం జగన్ కు రివాజుగా మారిపోయిందంటున్నారు. బలప్రదర్శన పేర జరిగే ఈ నాటకాన్ని రక్తికట్టించేందుకు పేర్ని నాని వంటివారు జగన్ కు ఇతోధికంగా సహాయపడుతుంటారు.
అంబటి రాజమహేంద్రవరం జైలులో ఉంటే జగన్ కనీసం అటుకేసి కూడా చూడటం లేదు. కేవలం గుంటూరుకే పరిమితమై.. అంబటి కుటుంబ సభ్యులను పరామర్శించడంతో సరిపెట్టేయనున్నారు.
పొన్న‌వోలు వాదించ‌డంతో బెయిలుపై బ‌య‌ట‌కు రావ‌ల్సిన అంబ‌టి రాంబాబు రిమాండ్ ఖైదీగా రాజమహేంద్రవరం జైలుకు వెళ్లారు. ఇందుకు పొన్న‌వోలు అత్యుత్సామే కారణమంటున్నారు. కారుమూరి వెంక‌ట‌రెడ్డి విష‌యంలో వెంట‌నే బెయిలు ఇప్పించారు. అదే ఇప్పుడు అంబ‌టి కాపు నేత కావ‌డంతో రిమాండ్ పై పంపించార‌న్న కోణంలో కొన్ని వాదనలు తెరమీదకు వస్తున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.