అసెంబ్లీకి హాజరు.. కేసీఆర్ బాటలోనే జగన్..?

Publish Date:Feb 9, 2026

Advertisement

మాట తప్పం మడమ తిప్పం అంటూ సొంత భుజాలను చరుచుకునే జగన్ ప్రతిపక్ష హోదా విషయంలో యూటర్న్ తీసుకున్నారు. తనకు ప్రతిపక్ష నేత హోదా, తన పార్టీని ప్రతిపక్ష పార్టీగా గుర్తించేంత వరకూ అసెంబ్లీకి హాజరయ్యేది లేదని మంకుపట్టుపట్టిన ఆయన అ హోదో ఎటూ రాదు.. కనీసం సభ్యత్వాన్ని కాపాడుకుని, ఎమ్మెల్యేగా జీతభత్యాలు వదులు కోవడం ఎందుకు అనుకున్నారో ఏమో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరు కావాలని నిర్ణయించుకున్నారు.   రాని హోదా కోసం పాకులాడి ఉన్న సభ్యత్వాన్ని కోల్పోవడమెందుకని భావించారో ఏమో తెలియదు కానీ.. ఈ నెల 11 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరు కావాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు. జగన్ సహా ఆ పార్టీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలూ, బుధవారం (ఫిబ్రవరి 11) నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు హాజరు కానున్నారు.  తొలిరోజు గవర్నర్ ప్రసంగానికి హాజరయ్యాక అదే రోజు మధ్యాహ్నం జగన్ అధ్యక్షతన వైసీపీ శాసనసభాపక్ష సమావేశం జరగుతుంది. పూర్తిస్థాయిలో సమావేశాలకు హాజరవ్వాలా? లేదా? అన్న విషయాన్ని ఆ సమావేశంలో నిర్ణయించనున్నారు.  

బుధవారం (ఫిబ్రవరి 11)  తొలి రోజు సభ ప్రారంభం అవ్వగానే ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉంటుంది.  గత ఏడాది అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగాన్ని వైసీపీ అడ్డుకుంది. ఈసారి కూడా సభకు వచ్చి గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునేందుకే వైసీపీ సభ్యులు ప్రయత్నించే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు.  ఇప్పటి వరకూ వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీని బాయ్ కాట్ చేసినా.. సభలో చర్చించిన అంశాలు, ఆమోదించిన బిల్లులపై తాడేపల్లి ప్యాలెస్‌లో కూర్చొని ఆ పార్టీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే జగన్  ప్రెస్‌మీట్లు పెట్టి మాట్లాడుతూ వచ్చారు. శాసనసభకు రాకపోయినా ఆ విధంగా తన అభిప్రాయాలు ప్రజలకు తెలియజేస్తే సరిపోతుందని జగన్ స్వయంగా ప్రకటించారు కూడా. ఆ క్రమంలో  స్పీకర్ అయన్నపాత్రుడు నో వర్క్ నో పే విధానంపై  మాట్లాడారు. సభకు హాజరు కాకుండా ప్రజాధనం ద్వారా జీతాలు తీసుకోవడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో రాజ్యాంగ పరిధిలో ఉన్న అన్ని అవకాశాలను పరిశీలించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.  కొందరు సభ్యులు అసెంబ్లీ రిజిస్టర్‌లో సంతకం చేసి సభకు రాకపోవడంపైనా ఆయన ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేశారు.

దాంతో ఈ సారి కూడా వైసీపీ ఎమ్మెల్యేలు గైర్హాజరైతే నో వర్క్ నో పే ప్రతిపాదన అమలవుతుందా అనే అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. అలాగే సుదీర్ఘంగా సభకు గైర్హాజరైతే అసెంబ్లీ సభ్యత్వం గల్లంతయ్యే అవకాశాలున్నాయా అన్న చర్చ కూడా జరుగుతోంది. ఈ నేపధ్యంలో వైసీపీ ప్రత్యేక హోదా డిమాండ్ కు తిలోదకాలిచ్చి సభ్యత్వాన్ని కాపాడుకోవడానికో, లేక ఎమ్మెల్యులుగా జీత భత్యాలు వదులు కోవడానికి మనస్కరించకో హాజరు నిర్ణయం తీసుకుని ఉంటారన్న చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది. అయితే జగన్ సహా వైసీపీ ఎమ్మెల్యులుఈ సారి బడ్జెట్ సమావేశాల తొలిరోజున  మాత్రమే హాజరై, రిజిస్టర్ లో సంతకం చేసి వెళ్లిపోతారా? అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయంలో జగన్ తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ బాటలో నడిచే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని పోలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది.  

By
en-us Political News

  
వైసీపీలో ఇప్పుడు పేర్ని నాని పాటి నోరున్న నేతలు వేళ్ల మీద లెక్కపెట్టగలిగేంత మందే ఉన్నారు. దీంతో పేర్ని నాని అనివార్యంగా రాజకీయాలలో క్రియాశీలంగా ఉండడమన్నది.. ఆయనకు తన కుమారుడి రాజకీయ భవిష్యత్ దృష్ట్యా మాత్రమే కాకుండా, రాష్ట్రంలో వైసీపీ ఉనికికి కూడా ఒక అవసరంగా మారిపోయింది.
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి దేవ్‌జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, మరో కీలక నేత రాజిరెడ్డితో కలిసి లొంగిపోవడం సంచలనంగా మారింది.
గాంధీల కుటంబానికి మ‌న‌మంతా ఒక చేయి వేసి వెయ్యి కోట్ల రూపాయ‌లు విరాళంగా ఇద్దాం. ఇదీ ఇటీవ‌ల రేవంత్ చేసిన కామెంట్.
కనీసం తండ్రిని నాన్నా అని కూడా సంబోధించకుండా, బీఆర్ఎస్ అధినేత అన్న ప్రస్తావన కూడా చేయకుండా కేవలం పొడి మాటలతో కవిత చెప్పిన శుభాకాంక్షలపై రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
వాస్తవానికి వైసీపీ ఆరోపణలు, విమర్శల స్థాయి రోజురోజుకూ పతనం నుంచి పతనానికి అన్నట్లుగా దిగజారుతోంది. జగన్ సొంత మీడియాలో లోకేష్ శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగిన పాకిస్థాన్, ఇండియా మ్యాచ్ చూడడానికి వెళ్లిన ప్రైవేట్ పర్యటనపై చేసిన ఆరోపణలు అవాస్తవంగా తేలడంతో ఆ పార్టీ ప్రతిష్ఠ మరింత దిగజారింది.
అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలు, పని తీరు, ప్రజా సంక్షేమం చూసి వారంతట వారే స్వచ్ఛందంగా పార్టీలో చేరారని ఘనంగా ప్రకటించుకుంది. ఇప్పుడు అదే పరిస్థితి రివర్స్ లో కనిపిస్తుంటే మాత్రం.. ప్రజాస్వామ్యం ఖూనీ, మా పార్టీ వారికి కాంగ్రెస్ గేలం అంటూ గుండెలు బాదుకుంటోంది. పైగా ఆ ఆరోపణలను స్వయంగా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుకు కల్వకుంట్ల తారకరామారావు నుంచే రావడంతో తెలంగాణ సమాజం ముక్కున వేలేసుకుంటోంది.
పార్టీ నుంచి సస్పెండైన ఇద్దరు ఎమ్మెల్సీలు కలిశారు. జగన్ వారితో ఆప్యాయంగా మాట్లాడారు. పార్టీ గొంతు బలంగా వినిపించాలని వారికి దిశానిర్దేశం చేశారు.
ఇక అది పక్కన పెడితే ప్రతిపక్ష హోదా డిమాండ్ నుంచి వెనక్కు తగ్గి కేవలం హాజరు కోసం బుధవారం సభకు హాజరైన జగన్ కు, ఆయన పార్టీ ఎమ్మెల్యేలకూ వ్రతమూ చెడింది, ఫలమూ దక్కలేదని అంటున్నారు. ఎందుకంటే బడ్జెట్ సమావేశాల తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉంటుంది.
రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఉండవల్లిని పరామర్శించిన ఉండవల్లి అరుణ్ కుమార్ ఆ తరువాత మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై నెటిజనులు పెద్ద ఎత్తున విరుచుకుపడుతున్నారు.
కేంద్ర ఎన్నికల సంఘం టీవీకే పార్టీకి విజిల్ గుర్తు కేటాయించింది. ఈ నేపథ్యంలో చెన్నైలోని చెపాక్ స్టేడియంలో విజిల్ సౌండ్ పై ప్రభుత్వం నిషేధం విధించింది. ఎన్నికల కోడ్ అమలులోకి రాకుండానే విజల్ పై బ్యాన్ విధించడంతో విజయ్ టీవీకే పార్టీ అంటే అధికార డీఎంకే భయపడుతోందా అన్న చర్చ మొదలైంది.
ప‌రామార్శ పేర బలప్రదర్శనలకు దిగడం జగన్ కు రివాజుగా మారిపోయిందంటున్నారు. బలప్రదర్శన పేర జరిగే ఈ నాటకాన్ని రక్తికట్టించేందుకు పేర్ని నాని వంటివారు జగన్ కు ఇతోధికంగా సహాయపడుతుంటారు.
అంబటి రాజమహేంద్రవరం జైలులో ఉంటే జగన్ కనీసం అటుకేసి కూడా చూడటం లేదు. కేవలం గుంటూరుకే పరిమితమై.. అంబటి కుటుంబ సభ్యులను పరామర్శించడంతో సరిపెట్టేయనున్నారు.
పొన్న‌వోలు వాదించ‌డంతో బెయిలుపై బ‌య‌ట‌కు రావ‌ల్సిన అంబ‌టి రాంబాబు రిమాండ్ ఖైదీగా రాజమహేంద్రవరం జైలుకు వెళ్లారు. ఇందుకు పొన్న‌వోలు అత్యుత్సామే కారణమంటున్నారు. కారుమూరి వెంక‌ట‌రెడ్డి విష‌యంలో వెంట‌నే బెయిలు ఇప్పించారు. అదే ఇప్పుడు అంబ‌టి కాపు నేత కావ‌డంతో రిమాండ్ పై పంపించార‌న్న కోణంలో కొన్ని వాదనలు తెరమీదకు వస్తున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.