మహా సీఎం సుప్రియా సూలే: ఎన్డీయేలోకి ఎన్సీపీ.. శరద్ పవార్ వ్యూహాత్మక అడుగులు..?
Publish Date:Nov 25, 2026
Advertisement
మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠంపై త సుప్రియా సూలేను కూర్చోపెట్టే దిశగా ఎన్సీపీ(శరద్ పవార్) వ్యూహాలు రచిస్తోందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. ఇందుకు తాజాగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నివాసం సిల్వర్ ఓల్ లో జరిగిన సమావేశాలు, సంప్రదింపులను ఉదాహరణగా చూపుతున్నారు. తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొంది ఇటీవలే డిశ్చార్జ్ అయిన శరద్ పవార్.. మహా సీఎం పీఠంపై తన కుమార్తెను కూర్చోపెట్టే లక్ష్యంతో వ్యూహరచన చేస్తున్నారని అంటున్నారు. సిల్వర్ ఓక్ లో రహస్య మంతనాలు ఇందుకేనని విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తన పార్టీని ఎన్డీయే కూటమిలో చేర్చేందుకు ఆయన సమాయత్తమౌతున్నారు. నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే జాతీయ, రాష్ట్ర స్థాయి రాజకీయ పరిణామాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తన ఆరోగ్యం, రాజకీయ వారసత్వం, పార్టీ భవిష్యత్తు వంటి అంశాలపై శరద్ పవాన్ దృష్టి కేంద్రీకరించారని చెబుతున్నారు. ఇటీవల ప్రధానమంత్రి శరద్ పవార్ కు ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలని, సుప్రియ సూలే తదితరులు రాజకీయ వ్యవహారాలు చూసుకుంటారని సూచించిన విషయాన్ని ఈ సందర్భంగా పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. ముఖ్యంగా అజిత్ పవార్ మరణానంతరం మారిన పరిస్థితులు, విలీన చర్చలపై వచ్చిన వాదనలు మహా రాజకీయాలలో మారుతున్న, మారనున్న రాజకీయ సమీకరణాలకు అద్దం పడుతున్నాయి. మహారాష్ట్రలో ఇప్పటికే అధికార కూటమిలోని భాగస్వామ్య పక్షాల మధ్య సమతుల్యత, పదవుల పంపకం వంటి అంశాలు ఒకింత గందరగోళంలో ఉన్నాయి. ఒకవేళ శరద్ పవార్ వర్గం ఎన్డీయే వైపు మొగ్గు చూపితే, మహారాష్ట్ర అధికార కూటమిలో సమీకరణాలు సమూలంగా మారే అవకాశాలున్నాయని అంటున్నారు. శరద్ పవార్ ఎన్సీపీ కనుక ఎన్డీయే కూటమిలో చేరితే.. అందుకు శరద్ పవార్ విధించే ఏకైక షరతు సుప్రియా సూలెకు సీఎం పదవి అని పరిశీలకులు అంటున్నారు. ఆ దిశగా బీజేపీతో ఇప్పటికే తెరవెనుక మంతనాలు సాగుతున్నాయని చెబుతున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు, పరిపాలన, అభివృద్ధి అంశాలపై విపక్షాలు, అధికార పక్షాల మధ్య మాటల తూటాలు కొనసాగుతుండగానే, మరోవైపు కొత్త రాజకీయ పొత్తులపై తెరవెనుక చర్చలు జోరుగా సాగుతుండడాన్ని ఇందుకు ఉదాహరణగా చూపుతున్నారు. నియోజకవర్గాల పునర్విభజన భవిష్యత్తు ఎన్నికల వ్యూహాలను దృష్టిలో ఉంచుకుని శరద్ పవార్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారని రాజకీయవర్గాలలో జోరుగా చర్చ జరుగుతోంది. ఇది కూడా చదవండి: శరద్ పవార్..రాజకీయ చాణక్యుడు! రాబోయే రోజుల్లో పార్లమెంటు సమావేశాలు, నియోజకవర్గాల పునర్విభజన చర్చలు, అలాగే మహారాష్ట్ర కూటమిలోని పరిణామాల ఆధారంగా ఈ ఊహాగానాల సాగుతున్నాయి. మొత్తంగా ఎన్డీయేలో చేరికపై శరద్ పవార్ నిర్ణయం, సుప్రియ సూలే రాజకీయ భవిష్యత్ ఉజ్వలంగా ఉండేందుకు దోహదపడేలా ఉంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మొత్తానికి మహా రాజకీయాలు శరద్ పవార్ చుట్టూ తిరిగుతున్నాయి. ఆయన వ్యూహాలు ఏమేరకు సక్సెస్ అవుతాయి అన్నదానిపైనే మహారాష్ట్ర పొలిటికల్ సినేరియాలో ఎలాంటి మార్పులు జరుగుతున్నాయన్న దానిపై క్లారిటీ వస్తుంది. మీకు నచ్చవచ్చు: రాజ్యసభ బరిలో శరద్ పవార్ అసలు సినిమా ముందుంది.. ఏక్ నాథ్ షిండే.. శివసేన చీలిక వెనుక కేంద్రం.. ఉద్ధవ్ [Supriya Sule, Sharad Pawar, Maharashtra politics, NDA alliance, delimitation,PawarStrategies, TeluguOne]
http://www.teluguone.com/news/content/supriya-sule-25-237923.html





