మూసీ ప్రాజెక్టుకు సీఎం రేవంత్ స్పీడ్.. జనవరిలో ఫేజ్‌-1 పనులు ప్రారంభం.!

Publish Date:Nov 24, 2026

Advertisement

మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు, రేడియల్ రోడ్ల నిర్మాణం, పట్టణాభివృద్ధి పనుల పురోగతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఆయా ప్రాజెక్టుల పనుల స్థితిగతులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు.

మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు ఫేజ్‌-1 పనులపై సీఎం ప్రత్యేకంగా ఆరా తీశారు. ఫేజ్‌-1లో భాగంగా హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 9.20 కిలోమీటర్ల ప్రాంతాన్ని జోన్‌-1ఏగా, ఉస్మాన్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 11.8 కిలోమీటర్ల ప్రాంతాన్ని జోన్‌-1బీగా విభజించి పనులు చేపట్టనున్నట్లు అధికారులు వివరించారు.

వచ్చే ఏడాది జనవరి 2027లో ఫేజ్‌-1 పనులు ప్రారంభించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని సీఎంకు తెలిపారు. ఇప్పటికే టెండర్ల ప్రక్రియను ప్రారంభించినట్లు వెల్లడించారు.

అనంతరం మిరాలం ట్యాంక్ అభివృద్ధి పనుల పురోగతిపై ముఖ్యమంత్రి సమీక్షించారు. జనవరి 2028 నాటికి పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు వివరించారు. చెరువు అభివృద్ధి పనులతో పాటు, అందులో ఏళ్ల తరబడి పేరుకుపోయిన పూడికను కూడా పూర్తిస్థాయిలో తొలగించాలని సీఎం అధికారులను ఆదేశించారు.

రేడియల్ రోడ్ల నిర్మాణం, భూసేకరణ పురోగతిపై కూడా అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. రేడియల్ రోడ్ల నిర్మాణంలో వేగం పెంచాలని, భూసేకరణకు సంబంధించిన ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని రేవంత్ రెడ్డి సూచించారు.

ఇది కూడ చదవండి: అటెండర్ మృతి.. KCR తీవ్ర విచారం.!

మరోవైపు గండిపేట వద్ద నిర్మిస్తున్న ఆధునిక గోశాల పనుల పురోగతిని కూడా సీఎం సమీక్షించారు. ఈ పనులను వచ్చే ఏడాది మార్చి 2027 నాటికి పూర్తి చేసేలా వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు.

నగరాభివృద్ధికి కీలకమైన మూసీ పునరుజ్జీవం, రేడియల్ రోడ్లు, ఇతర మౌలిక వసతుల ప్రాజెక్టులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు ఈ సమీక్ష స్పష్టం చేస్తోంది.

మీకు నచ్చవచ్చు: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్.. ఏ2గా సోదరుడు.!

మీకు నచ్చవచ్చు: తూర్పు గాలుల ద్రోణి ప్రభావం..ఏపీలో మరో నాలుగు రోజులు వర్షాలు.!

 

 

[ Musi River Rejuvenation, Musi Rejuvenation Project, Musi Project Phase 1, Hyderabad Development, Radial Roads, Urban Development, Himayatsagar, Osmansagar, Gandhi Sarovar, Mir Alam Tank, Mir Alam Lake Development, Desilting Works, Land Acquisition ]
 

By
en-us Political News

  
ముంబయిలోని కాలాచౌకి ప్రాంతానికి చెందిన ఉదయ్ పవార్ పట్టుదల, ఆచరణాత్మక ఆలోచనలతో చిన్న స్థాయి సేవను లాభదాయక వ్యాపారంగా తీర్చిదిద్దారు.
పిల్లల కేరింతలు.. ఆటపాటలు.. ఆనందోత్సాహాల మధ్య సాగాల్సిన స్కూల్ పిక్నిక్ ఓ చిన్నారి కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది.
కుటుంబాలను పోషించేందుకు రోజూ పనికి వెళ్లిన ఆ ముగ్గురు కార్మికులకు అదే పని చివరి రోజవుతుందని ఎవరూ ఊహించలేదు
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
చనిపోయిన రోగుల పేర్లపైనా బిల్లులు..ఏసీబీ దాడుల్లో బట్టబయలు.!
నడవడానికి కేటాయించిన ఫుట్‌పాత్‌పై కూడా ప్రశాంతంగా అడుగులు వేయలేని పరిస్థితి.. రోడ్లపై ట్రాఫిక్ రద్దీని తప్పించుకోవడానికి కొందరు వాహనదారులు ఏకంగా పాదచారుల దారినే ఆక్రమిస్తున్నారు.
బంగారం ధరలు భారీగా పడిపోవడం ఆభరణాల కొనుగోలుదారులకు ఊరటనిస్తుంటే.. పసిడిని తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్న వారికి మాత్రం కొత్త కష్టాలు తెచ్చిపెడుతోంది.
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది.
అందంగా కనిపించాలని ఎవరికి మాత్రం ఉండదు? ముఖంపై చిన్న మొటిమ వచ్చినా.. చర్మంపై నల్లటి మచ్చ కనిపించినా అమ్మాయిలు ఆందోళన చెందుతారు.
ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. 
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత   ప్రతి జిల్లాలోనూ పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సవివరంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
పంచాయతీ ఎన్నికలకు పొత్త ధర్మం వర్తించదని ఆ ప్రకటన పేర్కొంది.   గ్రామాభివృద్ధి, స్వేచ్ఛాయుత పాలన, మహాత్మాగాంధీ ఆశయాల సాకారం గ్రామీణ స్థాయి నుంచే సాధ్యమవుతాయని పేర్కొంది.   
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బెంగళూరుకు చేరుకోవడంతో యలహంక ప్యాలెస్ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.