Publish Date:Aug 29, 2024
ఢిల్లీ మద్యం స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ ఇచ్చిన విషయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్, బీజేపీ మధ్య డీల్ కుదరడం వల్లే బెయిల్ వచ్చిందని ఆయన అన్నారు. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్ట్ స్పందించింది. వ్యక్తులు, రాజకీయ పార్టీల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని తాము బెయిల్ ఇస్తామా అని ప్రశ్నించింది. 2015 నాటి ఓటుకు నోటు కేసును మధ్యప్రదేశ్ రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరుగుతున్న సందర్భంగా న్యాయమూర్తులు జస్టిస్ బైఆర్ గవాయ్, పీకే మిశ్రా, కేవీ విశ్వనాథన్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఇలా వ్యాఖ్యానించింది. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి సుప్రీంకోర్టు పట్ల గౌరవంతో ఉండాలని, రాజ్యాంగ బద్ధమైనపదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. ‘‘ఇలాంటి ప్రవర్తన కలిగిన వ్యక్తి ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు. కాబట్టి కేసును బదిలీ చేయాలంటూ పిటిషనర్ కోరినట్టు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి బదిలీ చేయమంటారా?’’ అంటూ రేవంత్ రెడ్డి అడ్వకేట్లు ముకుల్ రోహత్గీ, సిద్దార్థ్ లూథ్రాలను న్యాయమూర్తులు ప్రశ్నించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/supreme-court-serious-on-revanth-comments-25-183873.html
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
ఆఫ్రికాలోని కాంగో నదిలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన పడవ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది.
వైద్యశాస్త్ర రంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతంగా భావించే నోబెల్ బహుమతి ప్రకటన వెలువడింది.
ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతమైన జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల సంఘం ప్రధానాధికారి (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్
చేతిలో రూ.3 లక్షలు.. ఇప్పుడు రూ.100 కోట్ల బిజినెస్.!
కేబీఆర్ పార్క్ ఫ్లైఓవర్ ప్రణాళికల్లో కీలక మార్పులు.. .!
కొందరు దుండగులు ఏకంగా జ్యువెలరీ షాప్‌నే టార్గెట్ చేశారు.
తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా అద్వైత్ కుమార్ సింగ్ ఐఏఎస్ పూర్తి అదనపు బాధ్యతలు (FAC) స్వీకరించారు
మియాపూర్ మెడికో సృజన హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొద్దికొద్దిగా కొలిక్కి వస్తోంది.
సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం టీఆర్ఎస్, హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలో కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు.