Publish Date:Aug 29, 2024
హైదరాబాద్ నగరంలో హైడ్రా సంచలనం సృష్టిస్తోంది. చెరువులున్న ప్రాంతాల్లో కట్టడాలు నిర్మించిన వారు భయపడి చస్తున్నారు. ఈ భయాన్ని కొంతమంది అధికారులు క్యాష్ చేసుకుంటున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాంటి వాళ్ళ తాట తీస్తానని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిస్తున్నారు. హైడ్రా పేరుతో చెప్పి కొంతమంది అవినీతికి పాల్పడుతున్నట్టు తన దృష్టికి వచ్చింది రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రభుత్వం గతంలో ఇచ్చిన నోటీసులను అడ్డుపెట్టుకొని డబ్బు వసూలు చేస్తున్నట్టు తెలిసిందని ఆయన చెప్పారు. ప్రజలకు భయపెట్టి డబ్బు వసూలు చేస్తున్నారని, కొన్ని ప్రాంతాల్లో రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ అధికారులపై కూడా ఆరోపణలు వచ్చాయని ముఖ్యమంత్రి రేవంత్ చెప్పారు. అక్రమంగా డబ్బు వసూలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. హైడ్రా పేరు చెప్పి వసూళ్లకు పాల్పడే వారిపై దృష్టి పెట్టాలని ఏసీబీ, విజిలెన్స్ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/corruption-in-the-name-of-hydra-25-183876.html
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
ఆఫ్రికాలోని కాంగో నదిలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన పడవ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది.
వైద్యశాస్త్ర రంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతంగా భావించే నోబెల్ బహుమతి ప్రకటన వెలువడింది.
ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతమైన జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల సంఘం ప్రధానాధికారి (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్
చేతిలో రూ.3 లక్షలు.. ఇప్పుడు రూ.100 కోట్ల బిజినెస్.!
కేబీఆర్ పార్క్ ఫ్లైఓవర్ ప్రణాళికల్లో కీలక మార్పులు.. .!
కొందరు దుండగులు ఏకంగా జ్యువెలరీ షాప్‌నే టార్గెట్ చేశారు.
తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా అద్వైత్ కుమార్ సింగ్ ఐఏఎస్ పూర్తి అదనపు బాధ్యతలు (FAC) స్వీకరించారు
మియాపూర్ మెడికో సృజన హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొద్దికొద్దిగా కొలిక్కి వస్తోంది.
సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం టీఆర్ఎస్, హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలో కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు.