కేసీఆర్ కుటుంబాన్ని పాతాళానికి తొక్కుతాం : సీఎం రేవంత్

Publish Date:Jul 10, 2026

Advertisement

 

ఖమ్మం జిల్లా చింతకానిలో నిర్వహించిన రైతు ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే సాధారణ ఎన్నికలు 2028 డిసెంబర్‌లో కాకుండా, నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 2029 మే లేదా జూన్‌లో జరిగే అవకాశం ఉందని జోస్యం చెప్పారు. అప్పటికి తెలంగాణలో అసెంబ్లీ స్థానాలు 119 నుంచి 182కు, పార్లమెంట్ స్థానాలు 17 నుంచి 26కు పెరుగుతాయని అన్నారు. కొత్తగా ఏర్పడే 182 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ కనీసం 117 స్థానాలు గెలిచి వరుసగా రెండోసారి అధికారంలోకి వస్తుందని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ 65 స్థానాలు గెలుస్తుందని ముందుగానే చెప్పామని, అదే నిజమైందని గుర్తు చేశారు.

ఖమ్మం జిల్లా ప్రజల మద్దతుతోనే 2023 జూలైలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరిన సందర్భంగా బీఆర్ఎస్‌కు రాజకీయంగా గట్టి ఎదురుదెబ్బ తగిలిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అదే జూలై నెలలో నిర్వహించిన చింతకాని రైతు ఆశీర్వాద సభకు వేలాదిగా తరలివచ్చిన ప్రజలకు ఆయన అభినందనలు తెలిపారు.

సభలో బీఆర్ఎస్, ఆ పార్టీ అధినేత కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్‌ను మళ్లీ తెలంగాణలో బలపడనివ్వబోమని, కురుక్షేత్రం లాంటి రాజకీయ పోరులో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని అన్నారు. కేసీఆర్ కుటుంబంలోనే విభేదాలు ఉన్నాయని, హరీశ్ రావు బీజేపీలోకి వెళ్లరని కేసీఆర్‌పై ఒట్టు వేసి చెప్పాలని సవాల్ విసిరారు. బీఆర్ఎస్‌ను బీజేపీలో విలీనం చేస్తారనే ప్రచారం జరుగుతోందని కూడా వ్యాఖ్యానించారు.

రైతుల సంక్షేమంపై తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం స్పష్టం చేశారు. రైతు ఆశీర్వాద సభలో భాగంగా 1.44 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.1,009 కోట్ల రైతు భరోసా నిధులను విడుదల చేశారు. రైతు భరోసా మొత్తాన్ని రూ.12 వేలుకు పెంచామని, రైతు రుణమాఫీ అమలు చేసి లక్షలాది మంది రైతులను రుణ విముక్తులను చేశామని తెలిపారు.

కన్నెపల్లి పంప్‌హౌస్‌లను ప్రారంభించాలని బీఆర్ఎస్ చేస్తున్న డిమాండ్‌పై స్పందించిన రేవంత్ రెడ్డి... మేడిగడ్డలో మళ్లీ నీటిని నిల్వ చేస్తే భద్రాచలం శ్రీరామాలయం సహా ఖమ్మం జిల్లాలోని 44 గ్రామాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందన్నారు. ప్రజల ప్రాణాల కంటే రాజకీయాలకు ప్రాధాన్యం ఇవ్వలేమని స్పష్టం చేశారు.

అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రస్తావించిన సీఎం... షాదీ ముబారక్, రైతు బంధు వంటి పథకాలను కొనసాగిస్తున్నామని, ప్రతి పేద కుటుంబానికి రేషన్ కార్డు, సన్నబియ్యం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు అందిస్తున్నామని చెప్పారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలోని 26 స్థానాల్లో కనీసం 20 స్థానాలు కాంగ్రెస్‌కు గెలిపించి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మధిరకు ఇంజినీరింగ్ కళాశాల మంజూరు చేస్తామని కూడా హామీ ఇచ్చారు. చివరగా "ఔర్ ఏక్ బార్... కాంగ్రెస్ సర్కార్" అంటూ ప్రసంగాన్ని ముగించారు.

By
en-us Political News

  
భారతదేశ విద్యావ్యవస్థలో త్వరలోనే ఒక విప్లవాత్మక మార్పు రాబోతోంది.
పద్మనాభం మృతి పట్ల తెలుగు రాష్ట్రాల సీఎంలు విచారం..!
సోషల్ మీడియా ప్రపంచంలో ఏది ఎప్పుడు వైరల్ అవుతుందో ఎవ్వరూ ఊహించలేరు.
ఐఏఎస్, ఐపీఎస్‌ల ఫ్యాక్టరీగా మారిన నేతర్‌హాట్ బడి
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక సంచలన శకం ముగిసింది.
టీటీడీలోని వివిధ ట్రస్టులు, పథకాలకు విరాళాలు అందించే దాతలకు కల్పిస్తున్న ప్రివిలేజెస్‌లో పలు మార్పులు చేస్తున్నట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు.
హెచ్‌ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బచ్చు రవీందర్ నివాసంలో సోదాలు ముగిశాయని ఏసీబీ డీఎస్పీ మజీద్ అలీఖాన్ వెల్లడించారు.
కన్న కొడుకు భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్న ఆ తల్లి గుండె, నేడు శోకసంద్రమై ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసింది.
ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం, తిరుపతి విమానాశ్రయాల తర్వాత ఇమిగ్రేషన్ చెక్ పోస్ట్ హోదా దక్కించుకున్న మూడవ విమానాశ్రయంగా భోగాపురం నిలిచింది. ఈ పరిణామం కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నుంచి ఈ ఎయిర్‌పోర్ట్ ఏరోడ్రోమ్ లైసెన్స్ పొందిన తర్వాత కొన్ని రోజులకే చోటుచేసుకోవడం గమనార్హం.
ప్రకాశం జిల్లా సింగరాయ కొండలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది.
నటుడు జూనియర్ ఎన్టీఆర్ పేరును ఉపయోగిస్తూ RAW NTR (రా-ఎన్టీఆర్) పేరుతో కొందరు ప్రైవేట్ వ్యక్తులు సంస్థను నిర్వహిస్తూ అది ఎన్టీఆర్ అధికారిక సంస్థ అన్నట్లుగా ప్రచారం చేస్తున్నారని ఆరోపణలు
తెలంగాణ విమానయాన రంగంలో సరికొత్త అధ్యాయం లిఖించబడబోతోంది.
రూ.2 లక్షల లంచంతో ఏఈ దొరికేశాడు..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.