పాలమూరు, సీతమ్మ సాగర్ లకు సుప్రీం గ్రీన్ సిగ్నల్.!

Publish Date:Jul 30, 2026

Advertisement

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది.  ప్రభుత్వం చేపట్టిన బహుళ ప్రయోజన సాగునీటి ప్రాజెక్టులకు  పర్యావరణ అనుమతులకు సంబంధించి ఎదురవుతున్న  చిక్కులను తొలగిస్తూ సుప్రీంకోర్టు   కీలకమైన తీర్పును వెలువరించింది. పాలమూరు, సీతమ్మ సాగర్  ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతొ ఆ ప్రాజెక్టులపై నెలకొన్న సందిగ్ధత తొలగిపోయింది.  

ఈ కేసు విచారించిన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్  నేతృత్వంలోని   ధర్మాసనం తెలంగాణకు అనుకూలంగా తీర్పు వెలువరించింది.  కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ 2021వ సంవత్సరంలో జారీ చేసిన వివాదాస్పద ఆఫీస్ మెమోరాండంను ధర్మాసనం రద్దు చేసింది. సదరు నిబంధన చట్టబద్ధతపై దాఖలైన పిటిషన్లను పరిశీలించిన దేశ సర్వోన్నత న్యాయస్థానం ఈ తీర్పు  భవిష్యత్తులో చేపట్టే పర్యావరణ అంశాలకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది. గతంలో   ఆఫీస్ మెమోరాండం ఆధారంగా మంజూరైన పర్యావరణ అనుమతులన్నీ యథాతథంగా చెల్లుబాటులోనే ఉంటాయని, వాటి చట్టబద్ధతకు ఎలాంటి ఆటంకం లేదని   స్పష్టం చేసింది.

సుప్రీం  సానుకూల తీర్పుతో దక్షిణ తెలంగాణ ప్రాంతానికి అత్యంత కీలకమైన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సీతమ్మ సాగర్   ప్రాజెక్ట్ తో పాటు , సిద్దిపేట పరిధిలోని గౌరవెల్లి రిజర్వాయర్‌లకు చిక్కులన్నీ తొలగిపోయాయి. గత కొంతకాలంగా ఈ ప్రాజెక్టుల పర్యావరణ క్లియరెన్స్‌లపై కొనసాగుతున్న చట్టపరమైన ఆటంకాలకు చెల్లు చీటీ పడింది. 

Palamuru Rangareddy Project,  Sitarama Sagar, Supreme Court Verdict,  Environmental Clearance 

By
en-us Political News

  
జెన్‌ జీ దెబ్బకు మోదీ అర్ధరాత్రి ఇన్‌స్టా వీడియో పెట్టాల్సి వచ్చింది..!
నువ్వు చాలా బాగా ప‌నిచేస్తున్నావు.. శెహ‌భాష్‌..లోకేష్‌` అంటూ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ఏపీ విద్య‌, ఐటీ శాఖ‌ల మంత్రి నారా లోకేష్ భుజం త‌ట్టారు.
ఏపీ రాజకీయాల్లో ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలు కేవలం విమర్శలు, ప్రతివిమర్శలకే పరిమితం కాకుండా, శాంతిభద్రతలు వ్యవస్థల పనితీరుపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఇటీవల చేపడుతున్న పరామర్శ యాత్రలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
రిలయన్స్‌ క్యాపిటల్‌ లిమిటెడ్‌, ఆ సంస్థ మాజీ ఛైర్మన్‌ అనిల్‌ డి. అంబానీతో పాటు పలువురు గుర్తుతెలియని ప్రభుత్వ అధికారులు, ఇతర వ్యక్తులపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) కేసు నమోదు చేసింది.
తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (TSLPRB) ఆధ్వర్యంలో పోలీస్‌, స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (SPF), ఫైర్‌ సర్వీసెస్‌, జైళ్ల శాఖల్లోని వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రయాణంలో మరొక అద్భుతమైన చారిత్రాత్మక ఘట్టం నమోదైంది.
ఉత్తరాంధ్ర ప్రగతికి ప్రతిరూపంగా నిలిచే భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రావడంపై
విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్‌పోర్టు కోసం భూములు ఇచ్చిన రైతులే ఉత్తరాంధ్ర కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారని సీఎం చంద్రబాబు అన్నారు.
దేశవ్యాప్తంగా వాణిజ్య ఎల్పీజీ వినియోగదారులకు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు తీపి కబురు అందించాయి.
మోదీ వికసిత్ భారత్... సీబీఎన్ విజన్ ప్ర‌తిరూపం భోగాపురం..!
ఉత్తరాంధ్ర సమగ్రాభివృద్ధికి మహత్తర అడుగు పడింది.
పెళ్లైన నెలలకే షాక్..ఆస్ట్రేలియా ఉద్యోగం పేరుతో ఘరానా మోసం..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.