భోగాపురం ఎయిర్‌పోర్ట్... ఉత్తరాంధ్ర భవిష్యత్తుకు నాంది : సీఎం చంద్రబాబు

Publish Date:Aug 1, 2026

Advertisement

 

విజయనగరం జిల్లా  భోగాపురం ఎయిర్‌పోర్టు కోసం భూములు ఇచ్చిన రైతులే ఉత్తరాంధ్ర కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారని సీఎం చంద్రబాబు అన్నారు. రెండేళ్ల క్రితం విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో తాను, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని తెలిపారు.

భోగాపురం ఎయిర్‌పోర్టు ఉత్తరాంధ్రకు మణిహారమని పేర్కొన్న చంద్రబాబు... "ఎర్రబస్సు కూడా రాదన్నారు... ఇప్పుడు ఎయిర్‌బస్ వచ్చింది" అంటూ ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. అభివృద్ధిని అడ్డుకున్నవారే ఇప్పుడు రాజకీయంగా అడ్రస్ లేకుండా పోయారని వ్యాఖ్యానించారు.

అల్లూరి సీతారామరాజు పేరు తలుచుకుంటే గుండె ఉప్పొంగుతుందని... ఆయన పేరును ఈ విమానాశ్రయానికి పెట్టడం గర్వకారణమని చెప్పారు. ఉత్తరాంధ్రకు చెందిన జీఎంఆర్ సంస్థ ఈ ఎయిర్‌పోర్టును నిర్మించడం విశేషమని... మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కృషిని కూడా గుర్తు చేశారు.

విశాఖ ఉక్కు, విశాఖ రైల్వే జోన్, పోలవరం, అమరావతికి ప్రధాని నరేంద్ర మోదీ సహకారం అందించారని చంద్రబాబు పేర్కొన్నారు. 2027 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి ప్రధాని చేతుల మీదుగా జాతికి అంకితం చేస్తామని... 2028 నాటికి అమరావతి తొలి దశను కూడా ప్రధాని చేతుల మీదుగానే ప్రారంభిస్తామని వెల్లడించారు.

విశాఖ నుంచి భోగాపురం వరకు బీచ్ కారిడార్ నిర్మిస్తున్నామని... శంషాబాద్ ఎయిర్‌పోర్టు తెలంగాణ దశ, దిశను మార్చినట్లే భోగాపురం ఎయిర్‌పోర్టు ఉత్తరాంధ్ర భవిష్యత్తును మార్చబోతుందని సీఎం అన్నారు.

గత రెండేళ్లలో ఉత్తరాంధ్రలో 189 ప్రాజెక్టులకు రూ.6.13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని... ఇవి పూర్తైతే 5.57 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. వచ్చే మూడేళ్లలో రూ.2,784 కోట్లతో ఎనిమిది ప్రధాన సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని... 65 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న నేరడి బ్యారేజీకి క్లియరెన్స్ వచ్చిందని చెప్పారు. ఈ నెల 14న గోదావరి జలాలను అనకాపల్లికి తీసుకొస్తామని, వంశధార–గోదావరి అనుసంధానాన్ని కూడా చేపడతామని ప్రకటించారు.

ఉత్తరాంధ్రలో పర్యాటకం, ఫార్మా, జాతీయ రహదారులు, రేర్ ఎర్త్ మినరల్స్ వంటి అపార అవకాశాలు ఉన్నాయని... త్వరలో ఉత్తరాంధ్రకు ఇతర ప్రాంతాల నుంచి వలసలు వచ్చే పరిస్థితి ఏర్పడుతుందని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వం కల్పించే అవకాశాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

Alluri Sitarama Raju International Airport, Nara lokesh, Andhra Pradesh Aviation, Bhogapuram Airport, Prime Minister Narendra Modi, CM Chandrababu, Deputy CM Pawan Kalyan, Alluri Sitarama Raju International Airport, AP Development Projects

By
en-us Political News

  
దేశవ్యాప్తంగా వాణిజ్య ఎల్పీజీ వినియోగదారులకు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు తీపి కబురు అందించాయి.
మోదీ వికసిత్ భారత్... సీబీఎన్ విజన్ ప్ర‌తిరూపం భోగాపురం..!
ఉత్తరాంధ్ర సమగ్రాభివృద్ధికి మహత్తర అడుగు పడింది.
పెళ్లైన నెలలకే షాక్..ఆస్ట్రేలియా ఉద్యోగం పేరుతో ఘరానా మోసం..!
స్వాగతం పలికిన గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు..!
భారతదేశపు మొట్టమొదటి ఆర్‌ఈఐటీ ఇండెక్స్ ఫండ్ ఆగస్టు 2026లో లాంచ్ కానుంది. ఎడెల్‌వీస్ నిఫ్టీ REITs & రియాల్టీ ఇండెక్స్ ఫండ్ NFO వివరాలు, రాబడుల విశ్లేషణ మరియు పన్ను ప్రయోజనాల గురించి క్లియర్‌గా తెలుసుకోండి.
ఆగస్టు 1న దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్, విజయవాడ సహా ప్రధాన నగరాల్లో 24K, 22K, 18K బంగారం నేటి రేట్లు, మార్కెట్ విశ్లేషణల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
పెరిగిపోతున్న ఓటీటీ, క్లౌడ్ సబ్‌స్క్రిప్షన్ ఛార్జీల నుండి విముక్తి పొందేందుకు హోమ్ సర్వర్లు ఎలా సహాయపడతాయో తెలుసుకోండి. పాత పీసీలతో సొంతంగా డిజిటల్ క్లౌడ్ క్రియేట్ చేసుకుని నెలకు వేల రూపాయలు ఆదా చేసే సులభమైన గైడ్.
మానవ DNAలో దాగి ఉన్న రహస్య గోస్ట్ లినేజ్ ఆనవాళ్ళను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. 8 లక్షల సంవత్సరాల నాటి ఈ అజ్ఞాత మానవ జాతి డిఎన్ఏ మన శరీరంలోకి ఎలా వచ్చింది? పరిశోధనలో తేలిన సంచలన గణాంకాలు మరియు నిజాలు ఇవే!
ప్రముఖ సౌండ్ ఇంజనీర్ కుర్ట్ మార్టినెజ్ తన ఇంటి వెనుక ఉన్న 2.5m x 3.5m గార్డెన్ షెడ్‌ను ప్రపంచ స్థాయి డాల్బీ ఆట్మాస్ మ్యూజిక్ స్టూడియోగా ఎలా మార్చారో, అందులో వాడిన స్పీకర్లు, అకౌస్టిక్ టెక్నాలజీ మరియు ఆశ్చర్యపరిచే నిజాలు ఇక్కడ తెలుసుకోండి.
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అర్ధాంగి అన్నా కొణిదెల తన పుట్టినరోజు సందర్భంగా సమాజానికి స్ఫూర్తిదాయకమైన నిర్ణయం తీసుకున్నారు.
మీరు ఎలక్ట్రిక్ వాహనం ఉపయోగిస్తున్నారా? సాధారణ మోటార్ ఇన్సూరెన్స్ మీ EV బ్యాటరీ మరియు ఛార్జింగ్ కిట్‌లకు రక్షణ ఇవ్వదు. EV షీల్డ్, ఆన్ డ్యామేజ్ ప్రీమియం, మరియు జీరో డిప్రిసియేషన్ గురించి తెలుసుకోవాల్సిన పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.