Publish Date:May 31, 2025
పువ్వు పుట్టగానే పరిమళిస్తుందంటారు. అలా ఆ బాలుడు చిన్నతనంలోనే తన నిజాయితీతో ఎందరికో ఆదర్శప్రాయుడయ్యాడు. తన ఆత్మవిశ్వాసం, తనది కాని సొమ్ము వద్దంటూ కరాఖండీగా చెప్పిన తీరు సూపర్ స్టార్ రజనీని సైతం ముగ్ధుడిని చేశాయి. ఔను.. ఆ ఏడేళ్ల బాలుడి నిజాయితీకి, ఆత్మ విశ్వాసానికి సూపర్ స్టార్ రజనీకాంత్ ఫిదా అయ్యారు. తనది కాని సొమ్ము తనకు వద్దని నిష్కర్షగా చెప్పడమే కాదు.. అంతకంతా తాను సంపాదించగలనన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసిన తమిళనాడుకు చెందిన ఏడేళ్ల బాలుడు మహ్మద్ యాసిన్ నిజాయితీకి నిలువెత్తు నిదర్శనంగా వార్తల్లో నిలిచాడు. వివరాల్లోకి వెడితే..
మహ్మద్ యాసిన్ తనకు రోడ్డుపై దొరికిన 50 వేల రూపాయలను తీసుకుని తిన్నగా పోలీసు స్టేషన్ కు వెళ్లాడు. అక్కడ పోలీసు అధికారికి ఆ సొమ్ము ఇచ్చి ఎవరో పారేసుకున్నారు. జాగ్రత్తగా వారికి అందజేయండి అని రిక్వెస్ట్ చేశాడు. సహజంగానే ఆ పోలీసు అధికారి బాలుడి నిజాయితీకి ముచ్చటపడ్డాడు. ఇంత డబ్బు నీకు దొరికింది.. నువ్వే ఉంచేసుకోవచ్చుకదా.. అన్న ఆ పోలీసు అధికారికి ఆ ఏడేళ్ల బాలుడు ఇచ్చిన సమాధానంతో నోట మాటరాలేదు. ఆ బాలుడేమన్నాడంటే.. అది ఎవరో కష్టపడి సంపాదించిన సొమ్ము.. అది నాది కాదు..నాది కాని డబ్బును నేనెలా తీసుకుంటాను అంటూ అమాయకంగానే అయినా చాలా ధృఢంగా చెప్పాడు. దీంతో ఆ బాలుడి నిజాయితీకి ముగ్ధుడైన పోలీసు అధికారి.. నీ కోసం నేనేదైనా చేయాలని ఉంది.. ఏం చేయమంటావు అని అడిగితే.. మహ్మద్ యాసిన్ జవాబు ఏమిటో తెలుసా.. సూపర్ స్టార్ రజనీకాంత్ ను చూడాలని ఉందని.
విషయాన్నిపోలీసులు రజనీకాంత్ దృష్టికి తీసుకువెళ్లారు.వెంటనే స్పందించి రజనీ కాంత్ మహ్మద్ యాసిన్ ను తన వద్దకు పిలిపించుకున్నారు. దగ్గరకు తీసుకుని ఆప్యాయంగా మాట్లాడారు. ఆ పిల్లవాడి చదువు బాధ్యత తీసుకున్నారు. ఆ కుర్రవాడు ఎక్కడ చదువుకోవాలనుకుంటే అక్కడ, ఎం చదువుకుంటానంటే అది.. ఎంత ఖర్చైనా ఆ బాధ్యతంతా తనదేనని చెప్పారు. నిజాయితీకి కులం, మతం ఉండవనీ, అది పుట్టుకతో అబ్బే సుగుణమని అన్న రజనీకాంత్ అలాంటి సుగుణాల పుట్ట అయిన మహ్మద్ యాసిన్ అందరికీ ఆదర్శం అని మెచ్చుకున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/superstar-impressed-to-the-homesty-of-that-kid-39-199063.html
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.
2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్ ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది.
ఏపీలో జరుగుతున్న పురపాలక సంఘం ఎన్నికల ఫలితాల్లో అధికార కూటమి పక్షాలు తమ జోరును ప్రదర్శిస్తున్నాయి.
రాష్ట్రంలోని పలు ముఖ్యమైన మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయాలు నమోదు చేస్తున్నారు. ముఖ్యంగా కడప జిల్లాలోని బద్వేల్ మున్సిపల్ చైర్పర్సన్ పీఠాన్ని కూటమి దక్కించుకుంది.
పులివెందుల మున్సిసిపల్ ఎన్నికల పోలింగ్ రోజున వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్లాన్ చేసిన డ్రామాలు, ఎన్నికల వాతావరణాన్ని దెబ్బతీసేందుకు చేసిన ప్రయత్నాలను ఎస్ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడమే లక్ష్యంగా వైసీపీ శ్రేణులు ప్రవర్తించాయని, రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడానికి ప్రయత్నించారని ఆరోపించారు.
తాను ఒక్కసారి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ప్రత్యర్థులు ఎవరూ నిలబడలేరని ఆయన హచ్చరించారు. ఈ అస్తవ్యస్త పరిస్థితుల మధ్య ఎన్నికల్లో ఓటు వేయడం అంటే ఆ అక్రమాలను అంగీకరించడమే అవుతుందని భావించి, తాను ఓటు హక్కును వినియోగించుకోకుండానే పులివెందుల నుంచి వెనుదిరగారు.
Publish Date:Oct 31, 2026
రేపే మున్సిపల్ ఎన్నికల పోలింగ్.. ప్రశాంతంగా సాగేనా.?