Publish Date:May 31, 2025
రాజకీయం అంటే ప్రత్యర్థులపై కేసులు, ప్రతీకార చర్యలు, కక్ష సాధింపులుగా మారిపోయిన నేటి రోజులలో ఓ నాయకురాలు మాత్రం అందుకు భిన్నంగా నిలిచారు. ప్రత్యర్థి పార్టీకి చెందిన నాయకుడు చేసిన సేవలను గుర్తించి ఒక మండలానికి ఏకంగా ఆయన పేరునే ప్రతిపాదించి ఆదర్శప్రాయంగా నిలిచారు. ఔను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంత్రి సీతక్క ప్రతిపాదనను గౌరవించి ఓ మండలానికి ప్రతిపక్ష పార్టీ నాయకుడి పేరు పెట్టింది.
ములుగు జిల్లాలో కొత్తగా ఏర్పడిన మల్లంపల్లి మండలం పేరును జేడీ మల్లంపల్లిగా రాష్ట్ర ప్రభుత్వం మార్పు చేస్తూ శనివారం (మే 31) గెజిట్ విడుదలైంది. ఇంతకీ జేడీ ఏమిటంటారా. ములుగు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు. జడ్పీ మాజీ అధ్యక్షుడు దివంగత కుసుమ జగదీష్. బీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు మల్లంపల్లిని మండ లంగా ప్రకటించాలంటూ కుసుమ జగదీష్ తీవ్రంగా ప్రయత్నించారు. అయితే అప్పట్లో అది సాధ్యం కాలేదు. కానీ కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారం చేపట్టిన తర్వాత మల్లంపల్లిని మండలంగా ప్రకటిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. కాగా కుసుమ జగదీష్ ఇటీవల మరణించారు. ఆ సమయంలో కుసుమ జగదీష్ కు నివాళులర్పించిన సీతక్క.. మల్లంపల్లి మండలానికి ఆయన పేరు పెడతామనీ, ఇందుకు ప్రభుత్వానికి ప్రతిపాదిస్తాననీ హామీ ఇచ్చారు. ఆ మాట నిలబెట్టుకున్నారు.
కుసుమ జగదీష్ సేవలకు గుర్తింపుగా మల్లంపల్లి మండలానికి ఆయన పేరు పెట్టాలన్న మంత్రి సీతక్క ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మల్లంపల్లి మండలానికి ఆయన పేరు చేరుస్తూ జేడీ మల్లంపల్లిగా మారుస్తూ గెజిట్ విడుదల చేసింది. రాజకీయాలకు అతీతంగా ప్రతిపక్ష పార్టీకి చెందిన నేత పేరును మండలానికి పెట్టడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ఇందుకు కృషి చేసిన మంత్రి సీతక్క రాజకీయాలలో విలువలకు పెద్ద పీట వేశారంటూ మల్లంపల్లి మండల సాధన సమితి సభ్యులు, ప్రజలు ధన్యవాదాలు తెలియజేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/opposition-party-leader-name-to-mallampally-mandal-39-199065.html
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.
2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్ ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది.
ఏపీలో జరుగుతున్న పురపాలక సంఘం ఎన్నికల ఫలితాల్లో అధికార కూటమి పక్షాలు తమ జోరును ప్రదర్శిస్తున్నాయి.
రాష్ట్రంలోని పలు ముఖ్యమైన మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయాలు నమోదు చేస్తున్నారు. ముఖ్యంగా కడప జిల్లాలోని బద్వేల్ మున్సిపల్ చైర్పర్సన్ పీఠాన్ని కూటమి దక్కించుకుంది.
పులివెందుల మున్సిసిపల్ ఎన్నికల పోలింగ్ రోజున వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్లాన్ చేసిన డ్రామాలు, ఎన్నికల వాతావరణాన్ని దెబ్బతీసేందుకు చేసిన ప్రయత్నాలను ఎస్ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడమే లక్ష్యంగా వైసీపీ శ్రేణులు ప్రవర్తించాయని, రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడానికి ప్రయత్నించారని ఆరోపించారు.
తాను ఒక్కసారి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ప్రత్యర్థులు ఎవరూ నిలబడలేరని ఆయన హచ్చరించారు. ఈ అస్తవ్యస్త పరిస్థితుల మధ్య ఎన్నికల్లో ఓటు వేయడం అంటే ఆ అక్రమాలను అంగీకరించడమే అవుతుందని భావించి, తాను ఓటు హక్కును వినియోగించుకోకుండానే పులివెందుల నుంచి వెనుదిరగారు.
Publish Date:Oct 31, 2026
రేపే మున్సిపల్ ఎన్నికల పోలింగ్.. ప్రశాంతంగా సాగేనా.?