Publish Date:Sep 19, 2020
సునీతా విలియమ్స్ పేరు వినగానే.. అంతరిక్ష యానంలో ఆమె చేసిన సాహసాలు గుర్తుకు వచ్చి ప్రతి మహిళ గర్వంగా ఫీల్ అవుతారు. యునైటెడ్ స్టేట్స్ నావికా దళ అధికారిగా పనిచేసిన ఆమె నాసా వ్యోమగామి. రెండుసార్లు
అంతరిక్ష యానం చేయడంతో పాటు నాలుగు సార్లు స్పేస్ వాక్ చేసి రికార్డు
సృష్టించారు. ఎక్కువ రోజులు (322రోజులు) అంతరిక్షంలో ఉన్న మహిళా వ్యోమగామిగా ప్రపంచ చరిత్రలో తన పేరు నమోదు చేసుకున్నారు. అంతేకాదు నీటి అడుగుభాగంలో తొమ్మిదిరోజులు ఉండి మరొ కొత్త రికార్డును ఆమె తన ఖాతాలో జమచేసుకున్నారు. ప్రస్తుతం నాసాలో వ్యోమగాములకు శిక్షణ ఇస్తున్నారు.
సునీతా విలియమ్స్ యూక్లిడ్, ఒహియోలో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు డాక్టర్ దీపక్ పాండ్య, బొన్నీ పాండ్య. దీపక్ పాండ్య తండ్రి, తాత భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రానికి చెందినవారు.
సునీత మసచుసేట్స్ లోని నీధం హై స్కూల్ లో చదివారు. 1987లో యు.ఎస్. నావల్ అకాడమీ నుండి భౌతికశాస్త్రంలో బి.ఎ. పట్టా అందుకున్నారు. యుద్ధ విమానాల పైలట్‌గా నియమించబడిన ఆమె నావల్ టెస్ట్ పైలట్ స్కూలు నుంచి 1993లో డిగ్రీ, ఫ్లోరిడా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి 1995లో ఎం.ఎస్సీ, పట్టా అందుకున్నారు. ఆ తర్వాత 1998లో నాసాకు ఎన్నికయ్యారు. పైలట్ శిక్షణ
పొందిన సునీత వ్యోమనౌకలో పయనించడంతో పాటు నాసా అంతరిక్షంలో ఏర్పాటుచేసిన స్పేష్ స్టేషన్ లోనూ పనిచేశారు. విలియమ్స్ ఎఎస్-116 అంతర్జాతీయ అంతరిక్ష స్టేషనుకు డిస్కవరీ వ్యోమనౌకలో మొదటిసారి డిసెంబర్ 9, 2006లో పయనమయ్యారు. ఏప్రిల్ 2007లో తిరిగి భూమి మీదకు వచ్చారు.
రికార్డు స్థాయిలో విలియమ్స్ 195రోజులు అంతరిక్షంలో ఉన్నారు. నింగిలోనే కాదు నీటిలోనూ ఆమె సాహసాలు చేశారు. నీమో2 సంస్థలో సభ్యత్వం పొందిన ఆమె నీటి అడుగు భాగంలో ఉండే ఆక్వాటిక్ లో తొమ్మిది రోజులు ఉన్నారు.
సునీతా పూర్వీకులు భారతీయులు కావడంతో ఆమె 2007లో ఇండియాకు వచ్చారు.
రన్నింగ్, స్విమ్మింగ్, బైకింగ్, ట్రయాథాన్, స్నోబోర్డింగ్, హంటింగ్ ఆమె అభిరుచులు. ఎన్నో అంతర్జాతీయ అవార్డులను సునీతా అందుకున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/sunitha-williams-25-104245.html
రాజకీయాల్లో నిరంతరం ఉండే సవాళ్లు, మానసిక ఒత్తిడి కారణంగానే తాను దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడ్డానన్న రోజా.. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత తనకు బ్లడ్ ప్రషర్ సమస్య వచ్చిందనీ, ఇక రెండో సారి ఎమ్మెల్యేగా ఎన్నికై, మంత్రిని అయిన తరువాత డయాబెటిస్ అటాక్ అయ్యిందనీ వివరించారు.
కష్టపడిన వారిని గుర్తించాలనేది పార్టీ సిద్ధాంతం అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు.
మావిగన్ ప్రతిపాదనతో జగన్ నెటిజనులకు ఒక ట్రోల్ మెటీరియల్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. ఆ ప్రతిపాదనపై లెక్కలేనన్న మీమ్స్, సెటైర్లు నెట్టింట వెల్లువెత్తాయి. అయినా కూడా జగన్ తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లన్న చందంగా మావిగన్ ను మించిన రాజధాని ఉండనే ఉండదన్నట్లు మాట్లాడుతున్నారు. అయితే ఇదే మావిగన్ ను ఆయన అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఎందుకు ముందుకు తీసుకురాలేదన్న ప్రశ్నకు మాత్రం జగన్ సమాధానం ఇవ్వడం లేదు.
కేరళలోని మొత్తం 140 అసెంబ్లీ స్థానాలకు, పుదుచ్చేరిలోని 30 స్థానాలకు రేపు ఒకేసారి ఓటింగ్ నిర్వహించనున్నారు. అలాగే అస్సాంలో 126 స్థానాలకూ కూడా ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. గతంలో బహుళ విడతల్లో ఎన్నికలు జరిగినప్పటికీ, ఈసారి మాత్రం ఒకే విడతలో పోలింగ్ నిర్వహిస్తున్నారు.
సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు నేపథ్యంలో విజయవాడలోని లోకో పైలట్ల గాలా(సికింద్రాబాద్) డిపోను తరలించకుండా విజయవాడలోనే కొనసాగించేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆ డిపో సిబ్బంది మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. విజయవాడ బోర్డును కొండపల్లి నుంచి మోటమర్రికి పెంచడం వల్ల గత 17 ఏళ్లుగా విజయవాడలో ఉన్న సికింద్రాబాద్(గాలా) డిపో ఉనికి సందిగ్ధంలో పడిందని, డిపోను మోటమర్రికి లేదా డోర్నకల్ కు తరలిస్తారనే ప్రచారంతో సుమారు 500 కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయనే విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమరం తుది ఘట్టానికి చేరుకుంది.
సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన కిద్వాయ్, గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితురాలిగా గుర్తింపు పొందారు. మోహ్సినా కిద్వాయ్ అంత్యక్రియలు ఢిల్లీలోని నిజాముద్దీన్ స్మశాన వాటికలో బుధవారం (ఏప్రిల్ 8) సాయంత్రం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
జగన్ చుట్టపుచూపుగా రాష్ట్రానికి వస్తున్నారు. అడపాదడపా పరామర్శలంటూ రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో వినా మిగిలిన సమయంలో రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి ఉనికి మాత్రంగానే మారింది. గత ఎన్నికలలో వైసీపీ కేవలం 11 స్థానాలలో మాత్రమే గెలిచిన సంగతి తెలిసిందే. ఆ గెలిచిన స్థానాలలో కూడా వెసీపీ స్తబ్దుగానే ఉంది. అయితే మచిలీపట్నంలో మాత్రం వైసీపీ హడావుడి ఒకింత ఎక్కువగా ఉంది.
ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన జనసేన నేతలు ద్వారంపూడిపై చర్యల తీసుకోవాల్సిందే అని ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అవినీతి బండారాన్ని బట్టబయలు ప్రభుత్వం పకడ్బందీగా అడుగులు వేస్తున్నదని అంటున్నారు. రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్‌లో ద్వారంపూడికి ఉన్న పట్టును సడలించడం ద్వారా ఆయన ప్రాభవాన్ని తగ్గించాలని ప్రయత్నిస్తున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై అంబటి రాంబాబును కొద్ది రోజుల కిందట గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. అయితే.. ఆ సమయంలో పోలీసు స్టేషన్‌లో తనను చిత్రహింసలకు గురిచేశారని ఆరోపిస్తూ అంబటి రాంబాబు తాజాగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
మాజీ మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రా రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మహేశ్ రెడ్డి, నరేందర్ రెడ్డి, వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ వంటి నేతలను అక్రమంగా నిర్బంధించడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఆవేదనను వినాల్సింది పోయి, వారికి మద్దతుగా వస్తున్న విపక్ష నేతలపై ఆంక్షలు విధించడం దారుణమన్నారు.
రిలే దీక్షకు మద్దతుగా గ్రామానికి చేరుకోవాలని ప్రయత్నించిన బీఆర్ఎస్ నేతలు, కార్య కర్తలను పోలీసులు మార్గ మధ్యలోనే నిలిపివేస్తూ వెనక్కి పంపించేశారు. దీంతో పరిగి పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది.
ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ చారిత్రాత్మక విజయం సిద్ధించిన రోజిదని పేర్కొన్నారు. అమరావతి రైతుల త్యాగాలకు దక్కిన న్యాయమన్నారు. అమరావతి ఇప్పుడు కేవలం నగరం కాదు, మన ఆత్మగౌరవానికి ప్రతీక అని బాలకృష్ణ పేర్కొన్నారు.