Publish Date:Sep 19, 2020
కరోనా వైరస్ ను ప్రపంచానికి వ్యాపింప జేసిన చైనాలో మరో ఉపద్రవం ముంచుకు వస్తుంది. వాయువ్య చైనాలో బ్రూసె ల్లోసిస్ అనే బ్యాక్టీరియా ద్వారా కొన్నివేల మంది అస్వస్థతకు గురవుతున్నారు. ఈ బ్యాక్టీరియా కారణంగా మగవారి శరీరభాగాల్లో వాపు, వృషణాలు ఎర్రబడటం, సంతాన హీనత వంటి దీర్ఖకాలిక సమస్యలు ఎదురవుతాయని హెచ్చరిస్తున్నారు. శుభ్రత లేని ఆహారం తీసుకున్నప్పుడు ఇది మనుషుల్లో కి వ్యాపించి ఒకరి నుంచి ఒకరికి అంటువ్యాధిగా మారుతుందని గన్సు ప్రావిన్స్ రాజధాని నగరం లాన్జౌ ఆరోగ్య కమిషన్ స్పష్టం చేసింది. వారి లెక్కల ప్రకారం 3,245 మందికి ఈ వ్యాధి సోకింది. చైనాలో వేలాది మంది పురుషులను వంధ్యత్వానికి గురిచేసే బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కోసం పరీక్షలు నిర్వహించినప్పుడు ఈ విషయం బయటపడింది. చైనాలో పశువులపై ఉండే బ్రూసెల్లోసిస్ బ్యాక్టీరియా కారణంగా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. వాయువ్య చైనాలో అనేక వేల మంది ప్రజల్లో బ్రూసెల్లోసిస్ బ్యాక్టీరియా వ్యాధికి నిర్ధారణ పరీక్షలు చేసినట్లు చైనా అధికారులు ధృవీకరించారు. పరీక్షలు నిర్వహించిన 21వేల మందిలో 3245 పాజిటివ్ కేసులు బయటపడ్డాయని చెప్పారు.
బ్రూసెల్లోసిస్ బ్యాక్టీరియా సోకిన వారిలో వచ్చే అనారోగ్యాన్ని మాల్ట ఫీవర్ లేదా మెడిటేరియన్ ఫీవర్ గా పిలుస్తారు. తలనొప్పి, కండరాల నొప్పులు, జ్వరం, అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయని యునైటెడ్ స్టేట్స్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సిడిసి) తెలిపింది. ఈ లక్షణాలు చికిత్స తర్వాత తగ్గినప్పటికీ వ్యాధి సోకిన వారు దీర్ఘకాలంలో ఆర్థరైటిస్, కొన్ని అవయవాలలో ముఖ్యంగా వృషణాలు వాపు , ఎర్రబడటం వంటి సమస్యలు వస్తాయని స్పష్టం చేశారు. అంతేకాదు సంతాన హీనతకు ఈ బ్యాక్టీరియా కారణం అవుతుందని హెచ్చరిస్తున్నారు.
బ్రూసెల్లా అనే బ్యాక్టీరియా ఉన్న పశువులతో సంపర్కం వల్ల సంభవిస్తుందని కొన్ని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. మగవారిపైనే దీని దుష్ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ వ్యాధి మనుషులకు సంక్రమించడం చాలా అరుదు అని సిడిపి స్పష్టం చేసింది. కలుషితమైన ఆహారాన్ని తీసుకోవడం, శ్వాస ద్వారా బ్యాక్టీరియా శరీరంలోకి చేరడం వల్ల ఎక్కువగా వ్యాపిస్తుంది. వాపు, ఎర్రబడిన వృషణాలు కొంతమంది మగవారిని వంధ్యత్వానికి గురిచేస్తాయని హెచ్చరిస్తున్నారు.
సిఎన్ఎన్ నివేదిక ప్రకారం గత ఏడాది జూలై చివరి వారం, ఆగస్టు మొదటి వారం మధ్యకాలంలో లాన్జౌ బయోలాజికల్ ఫార్మాస్యూటికల్ ఫ్యాక్టరీలో లీకేజ్ ద్వారా ఈ బ్యాక్టీరియా వ్యాప్తి చెందింది. జంతువుల కోసం బ్రూసెల్లా వ్యాక్సిన్లను ఉత్పత్తి చేస్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగిందని వివరిస్తున్నారు. ఫ్యాక్టరీలో అవుట్ డేటెడ్ మందులు, శానిటైజర్లు ఉపయోగించడంతో ఈ బ్యాక్టీరియా అలాగే ఉండిపోయిందని అంటున్నారు.
ఈ వ్యాధి సోకిందన్న అనుమానంతో 21,000 మందిని పరీక్షించడంతో ఇన్ఫెక్షన్ల సంఖ్య చాలా ఎక్కువగా ఉందని తేలింది. అయితే ఇంతవరకు ఈ వ్యాధి కారణంగా ఎవరూ చనిపోలేదని చైనా పత్రిక గ్లోబల్ టైమ్స్ పేర్కోంది. అయితే ఈ వ్యాధి సోకిన వారి సంఖ్య ఊహించిన దానికంటే ఎక్కువగా ఉందని, వ్యాప్తిని నివారించడానికి చైనా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఈ పత్రిక తెలిపింది.
చైనాలో పుట్టి ప్రపంచమంతా వ్యాపించిన కోవిడ్ 19 వైరస్ వ్యాప్తినే అరికట్టలేక గత కొన్ని నెలలుగా ప్రపంచదేశాలన్నీ ఆందోళన చెందుతుంటే కొత్తగా ఈ బ్యాక్టీరియా వ్యాప్తి మరింత ఆందోళన కలిగిస్తుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/china-25-104243.html
రాజకీయాల్లో నిరంతరం ఉండే సవాళ్లు, మానసిక ఒత్తిడి కారణంగానే తాను దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడ్డానన్న రోజా.. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత తనకు బ్లడ్ ప్రషర్ సమస్య వచ్చిందనీ, ఇక రెండో సారి ఎమ్మెల్యేగా ఎన్నికై, మంత్రిని అయిన తరువాత డయాబెటిస్ అటాక్ అయ్యిందనీ వివరించారు.
కష్టపడిన వారిని గుర్తించాలనేది పార్టీ సిద్ధాంతం అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు.
మావిగన్ ప్రతిపాదనతో జగన్ నెటిజనులకు ఒక ట్రోల్ మెటీరియల్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. ఆ ప్రతిపాదనపై లెక్కలేనన్న మీమ్స్, సెటైర్లు నెట్టింట వెల్లువెత్తాయి. అయినా కూడా జగన్ తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లన్న చందంగా మావిగన్ ను మించిన రాజధాని ఉండనే ఉండదన్నట్లు మాట్లాడుతున్నారు. అయితే ఇదే మావిగన్ ను ఆయన అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఎందుకు ముందుకు తీసుకురాలేదన్న ప్రశ్నకు మాత్రం జగన్ సమాధానం ఇవ్వడం లేదు.
కేరళలోని మొత్తం 140 అసెంబ్లీ స్థానాలకు, పుదుచ్చేరిలోని 30 స్థానాలకు రేపు ఒకేసారి ఓటింగ్ నిర్వహించనున్నారు. అలాగే అస్సాంలో 126 స్థానాలకూ కూడా ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. గతంలో బహుళ విడతల్లో ఎన్నికలు జరిగినప్పటికీ, ఈసారి మాత్రం ఒకే విడతలో పోలింగ్ నిర్వహిస్తున్నారు.
సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు నేపథ్యంలో విజయవాడలోని లోకో పైలట్ల గాలా(సికింద్రాబాద్) డిపోను తరలించకుండా విజయవాడలోనే కొనసాగించేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆ డిపో సిబ్బంది మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. విజయవాడ బోర్డును కొండపల్లి నుంచి మోటమర్రికి పెంచడం వల్ల గత 17 ఏళ్లుగా విజయవాడలో ఉన్న సికింద్రాబాద్(గాలా) డిపో ఉనికి సందిగ్ధంలో పడిందని, డిపోను మోటమర్రికి లేదా డోర్నకల్ కు తరలిస్తారనే ప్రచారంతో సుమారు 500 కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయనే విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమరం తుది ఘట్టానికి చేరుకుంది.
సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన కిద్వాయ్, గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితురాలిగా గుర్తింపు పొందారు. మోహ్సినా కిద్వాయ్ అంత్యక్రియలు ఢిల్లీలోని నిజాముద్దీన్ స్మశాన వాటికలో బుధవారం (ఏప్రిల్ 8) సాయంత్రం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
జగన్ చుట్టపుచూపుగా రాష్ట్రానికి వస్తున్నారు. అడపాదడపా పరామర్శలంటూ రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో వినా మిగిలిన సమయంలో రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి ఉనికి మాత్రంగానే మారింది. గత ఎన్నికలలో వైసీపీ కేవలం 11 స్థానాలలో మాత్రమే గెలిచిన సంగతి తెలిసిందే. ఆ గెలిచిన స్థానాలలో కూడా వెసీపీ స్తబ్దుగానే ఉంది. అయితే మచిలీపట్నంలో మాత్రం వైసీపీ హడావుడి ఒకింత ఎక్కువగా ఉంది.
ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన జనసేన నేతలు ద్వారంపూడిపై చర్యల తీసుకోవాల్సిందే అని ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అవినీతి బండారాన్ని బట్టబయలు ప్రభుత్వం పకడ్బందీగా అడుగులు వేస్తున్నదని అంటున్నారు. రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్‌లో ద్వారంపూడికి ఉన్న పట్టును సడలించడం ద్వారా ఆయన ప్రాభవాన్ని తగ్గించాలని ప్రయత్నిస్తున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై అంబటి రాంబాబును కొద్ది రోజుల కిందట గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. అయితే.. ఆ సమయంలో పోలీసు స్టేషన్‌లో తనను చిత్రహింసలకు గురిచేశారని ఆరోపిస్తూ అంబటి రాంబాబు తాజాగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
మాజీ మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రా రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మహేశ్ రెడ్డి, నరేందర్ రెడ్డి, వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ వంటి నేతలను అక్రమంగా నిర్బంధించడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఆవేదనను వినాల్సింది పోయి, వారికి మద్దతుగా వస్తున్న విపక్ష నేతలపై ఆంక్షలు విధించడం దారుణమన్నారు.
రిలే దీక్షకు మద్దతుగా గ్రామానికి చేరుకోవాలని ప్రయత్నించిన బీఆర్ఎస్ నేతలు, కార్య కర్తలను పోలీసులు మార్గ మధ్యలోనే నిలిపివేస్తూ వెనక్కి పంపించేశారు. దీంతో పరిగి పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది.
ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ చారిత్రాత్మక విజయం సిద్ధించిన రోజిదని పేర్కొన్నారు. అమరావతి రైతుల త్యాగాలకు దక్కిన న్యాయమన్నారు. అమరావతి ఇప్పుడు కేవలం నగరం కాదు, మన ఆత్మగౌరవానికి ప్రతీక అని బాలకృష్ణ పేర్కొన్నారు.