వల్లభనేని వంశీకి మైండ్ బ్లాక్ అయ్యే కౌంటర్!

Publish Date:Nov 9, 2022

Advertisement

వల్లభనేని వంశీమోహన్. గన్నవరం ఎమ్మెల్యే. తెలుగుదేశం గుర్తుపై గెలిచిన వంశీ   ఆ తరువాత జగన్ చెంతకు చేరారు. వంశీకి వాచాలత ఎక్కువ అన్న విషయం రాజకీయాలతో పరిచయం ఉన్న అందరికీ తెలిసిందే.  ఆ మధ్యన టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. వంశీ వ్యాఖ్యలు టీడీపీ, వైసీపీ నేతల మధ్య పెద్ద ఎత్తున మాటల యుద్ధాన్నే సృష్టించాయి. వంశీ వ్యాఖ్యలు చివరికి శాసనసభలోకి కూడా చొరబడ్డాయి. ప్రతిపక్ష నేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడికి సభలోనే తీవ్ర అవమానం జరిగింది. అంతటి అవమానాన్ని భరించలేక చంద్రబాబు నాయుడు ‘ఈ కౌరవ సభలో ఉండను.. మళ్లీ సీఎంగానే అసెంబ్లీలో అడుగు పెడతా’ అని భీషణ ప్రతిజ్ఞ చేసే దాకా వ్యవహారం వెళ్లడానికి  వల్లభనేని వంశీ వ్యాఖ్యలే ప్రధాన కారణం అని చెప్పాలి.

అలాంటి వంశీకి ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో ఓ మహిళ తల మైండ్ బ్లాక్ అయిపోయే కౌంటర్ ఇచ్చారు.   నోరు మూయించారు. నోటికి ఎంత మాట వస్తే అంత అనేసే వంశీ ఆ మహిళ కౌంటర్ తో మళ్లీ నోరు ఎత్తకుండా చేశారు. ఊహించని పరిణామం ఎదురవడంతో వల్లభనేని వంశీ ఏమి చేయాలో… ఏమి చెప్పాలో తెలియక తికమక పడిపోయారు. విజయవాడ గ్రామీణ మండలం నిడమానూరులో జరిగిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి..

 వైసీపీ ఎమ్మెల్యే కాని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆ పార్టీ ప్రజాప్రతినిధులు చేస్తున్న ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో పర్యటిస్తుండగా సీహెచ్ భవాని అనే మహిళ ఆయనను నిలదీశారు. ‘గతంలో ఈ ప్రాంతంలో ఐటీ కంపెనీలు ఉండేవి. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్లిపోయాయి. దీంతో యువత ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారు’  అన్నారు. ‘మీ ముఖ్యమంత్రి జగన్ ను అడిగి పరిశ్రమలు, ఐటీ కంపెనీలు తిరిగి తీసుకురండి’ అని కోరారు.

సమస్యల గురించి భవాని చెబుతుండగానే.. వల్లభనేని వంశీలో వెటకారం తన్నుకొచ్చింది. ఆమెను ఉద్దేశించి ‘చూడండి అక్కా. మీరు ‘ఆ రెండు పత్రికలు’ బాగా చదువుతున్నట్లున్నారు అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. అయితే.. భవాని మాత్రం స్పాంటేనియస్ గా  ‘వాటివల్లేగా మీరు పైకొచ్చింది’ అంటూ రిటార్డ్ ఇచ్చారు. దీంతో ఒక్కసారిగా అవాక్కవడం అక్కడ ఉన్నవారందరి వంతు అయింది.

దీంతో తడబాటును కొద్దిగా తమాయించుకుని.. ‘ఇక్కడి వాతావరణంలో ఉద్యోగులు పని చేయలేకపోవడంతో చాలా కంపెనీలు వెళ్లిపోయాయి’ అనగానే.. భవానీ కల్పించుకుని ‘మీరు ఇంకా హైదరాబాద్ నే అభివృద్ధి చేయాలని చూస్తున్నారు’ అని మళ్లీ ఘాటుగా రిప్లై ఇచ్చారు. భవానీ మాటలతో ఏం జవాబు చెప్పాలో తెలియని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బిత్తర చూపులు చూశారంటున్నారు.

By
en-us Political News

  
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ అక్టోబర్ 13న ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించే అవకాశం ఉందన్న వార్తలు రాజకీయ, జలవనరుల వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
జాతీయ రాజధాని ఢిల్లీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర రాజకీయ ఉద్రిక్తతలు నడుస్తున్న వేళ, కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది.
శ్రీవారికి జైపూర్ దంపతులు రూ.51.55 లక్షల ఆభరణాల కానుక.!
గోల్డ్ కొనాలన్న ఆశ.. బిడ్డను కోల్పోయిన విషాదం.!
ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్యకు హైదరాబాద్‌లో భూమి పేరుతో మోసం జరిగిన ఘటన వెలుగులోకి వచ్చింది.
దేశ రాజధాని దిల్లీలో రాజకీయంగా ఉత్కంఠ నెలకొంది.
కన్నవారిని చూడాలని.. స్వస్థలానికి చేరుకోవాలని ఎన్నో ఆశలతో రైలు ఎక్కిన ఓ యువతి ప్రయాణం విషాదాంతమైంది.
దేశ రాజధాని దిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) తలపెట్టిన నిరసన కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
భారతీయ రాజకీయ రంగంలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
దసరా పండుగ సెలవులు ప్రారంభం కావడంతో భాగ్యనగరంలో ప్రయాణికుల రద్దీ తారాస్థాయికి చేరింది.
దేశ రాజధాని న్యూఢిల్లీలో రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.