సీజేఐగా డీవై చంద్రచూడ్ ప్రమాణ స్వీకారం

Publish Date:Nov 9, 2022

Advertisement

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)గా జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రమాణ స్వీకారం చేశారు. 50వ సీజేఐగా ఆయన బుధవారం (నవంబర్9) ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. ఆయన ఈ పదవిలో రెండేళ్లు అంటు 2024 నవంబర్ 10 వరకూ కొనసాగుతారు.

రాష్ట్రపతి భవన్ లో జరిగిన సీజేఐ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి  రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తదితరులు హాజరయ్యారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పలు కీలక కేసుల తీర్పులను వెలువరించిన జస్టిస్ చంద్రచూడ్     తండ్రి వైవీ చంద్రచూడ్ కూడా సీజేఐగా  బాధ్యతలు నిర్వహించారు. దేశంలో అత్యంత ఎక్కువ కాలం పని చేసిన సీజైఐగా వైవీ చంద్రచూడ్ రికార్డు సృష్టించారు. ఆయన దాదాపు ఏడేళ్ల పాటు సీజేఐ పదవిలో ఉన్నారు.

ఇక జస్టిస్ డీవై చంద్రచూడ్ విషయానికి వస్తే అయోధ్య భూవివాదం కేసు, వ్యక్తిగత గోప్యత హక్కు కేసు, శబిరమల ఆలయంలోకి మహిళల ప్రవేశం, ఆధార్ చెల్లుబాటు వంటి కేసుల తీర్పు వెలువరించిన ధర్మాసనాల్లో ఆయన కూడా ఉన్నారు. 1959 నవంబర్ 11న జన్మించిన జస్టిస్ డీవై చంద్రచూడ్..  సుప్రీం కోర్టులో, బోంబే హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీసు చేశారు.

 1998 జూన్‌లో బోంబే హైకోర్టులో సీనియర్‌ న్యాయవాది హోదా పొందారు. అదే ఏడాది భారత అదనపు సొలిసిటర్‌ జనరల్‌గా నియమితులయ్యారు.  2000 మార్చి 29న బోంబే హైకోర్టు న్యాయమూర్తి అయ్యారు. 2 013 అక్టోబరు 31న అలహాబాద్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2016 మే 13న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు.  

By
en-us Political News

  
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ అక్టోబర్ 13న ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించే అవకాశం ఉందన్న వార్తలు రాజకీయ, జలవనరుల వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
జాతీయ రాజధాని ఢిల్లీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర రాజకీయ ఉద్రిక్తతలు నడుస్తున్న వేళ, కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది.
శ్రీవారికి జైపూర్ దంపతులు రూ.51.55 లక్షల ఆభరణాల కానుక.!
గోల్డ్ కొనాలన్న ఆశ.. బిడ్డను కోల్పోయిన విషాదం.!
ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్యకు హైదరాబాద్‌లో భూమి పేరుతో మోసం జరిగిన ఘటన వెలుగులోకి వచ్చింది.
దేశ రాజధాని దిల్లీలో రాజకీయంగా ఉత్కంఠ నెలకొంది.
కన్నవారిని చూడాలని.. స్వస్థలానికి చేరుకోవాలని ఎన్నో ఆశలతో రైలు ఎక్కిన ఓ యువతి ప్రయాణం విషాదాంతమైంది.
దేశ రాజధాని దిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) తలపెట్టిన నిరసన కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
భారతీయ రాజకీయ రంగంలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
దసరా పండుగ సెలవులు ప్రారంభం కావడంతో భాగ్యనగరంలో ప్రయాణికుల రద్దీ తారాస్థాయికి చేరింది.
దేశ రాజధాని న్యూఢిల్లీలో రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.