మునుగోడుతో మొదలు ముందున్నదంతా ఎన్నికల కాలమే

Publish Date:Oct 16, 2022

Advertisement

తెలంగాణలో మునుగోడు అసెంబ్లీ స్థానం సహా, దేశంలో మరి కొన్ని కొన్ని రాష్ట్రాలలో ఆరు అసెంబ్లీ, ఒకటి రెండు లోక్ సభ స్థానాలకు వచ్చే నెల, నవంబర్ 3 న పోలింగ్ జరుగుతుంది. నవంబర్ 6 ఓట్ల లెక్కింపు.. ఫలితాలు. ఇక ఆ తర్వాత వారం రోజులు అయినా తిరక్కుండానే, నవంబర్ 12  హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూలు ప్రకటించింది. ఇక అక్కడి నుంచి వచ్చే సంవత్సరం చివరి వరకు ఎన్నికలే ఎన్నికలు. ఈ 13 - 14  నెలల కాలంలో ఒకటి రెండు కాదు, ఏకంగా 11 రాష్ట్రల శాసన సభలకు ఎన్నికలు జరుగుతాయి. అంటే మునుగోడు ఉప ఎన్నికతో మొదలవుతున్న నిరంతర ఎన్నికల ప్రవాహం వచ్చే సంవత్సరం డిసెంబర్ లో జరిగే తెలంగాణ శాసన సభ ఎనికల వరకు కొనసాగుతూనే,,ఉంటుంది. 

ఇలా వరసగా అసెంబ్లీ ఎన్నికలు రావడం, భారాసగా పేరు మార్చుకుని జాతీయ పార్టీగా ఎదిగేందుకు నూతన ప్రస్థానం ప్రారంభించిన తెరాసకు శుభ సూచకంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. భారాస బారసాల వేళా విశేషమేమో కానీ, గులాబి కారు రెక్కలు విచ్చుకునేందుకు 11 రాష్ట్రల అసెంబ్లీ ఎన్నికలు స్వాగతం పలుకుతున్నాయి.అయితే, భారాస అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తుందా ? పోటీ చేస్తే అన్ని రాష్ట్రాలలో పోటీ చేస్తుందా? కొన్ని రాష్టాలకే పరిమితం అవుతుందా? అసలు పూర్తిగా పోటీకి దూరంగా ఉంటుందా ? అనేది  ఆపార్టీ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. అది వేరే విషయం. అవకాశం అయితే తలుపులు తడుతోందని ఎంతవరకు ఉపయోగించుకుంటారు అనేది గులాబీ బాస్ ఇష్టమని పరిశీలకులు భావిస్తున్నారు.

 తెరాస, భారాస విషయాన్ని పక్కన పెడితే, రానున్న సంవత్సరం పై చిలుకు కాలంలో జరిగే 11 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, ప్రధాన జాతీయ, ప్రాంతీయ పార్టీలు అన్నింటికీ పెద్ద పరీక్షగానే, భావించవలసి ఉంటుంది. ముఖ్యంగా, ఈ సంవత్సరం చివరిలో ఎన్నికలు జరిగే హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలతోపాటుగా, వచ్చే సంవత్సరం ఎన్నికలు జరిగే, కర్ణాటక, రాజస్థాన్, మధ్య ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు దేశ భవిష్యత్ రాజకీయ ముఖ చిత్రాన్ని నిర్దేశిస్తాయని అంటున్నారు. ఇందులో రాజస్థాన్, తెలంగాణ మినహ మిగిలిన నాలుగు రాష్ట్రాలలో ప్రస్తుతం బీజేపీ అధికారంలో వుంది. రాజస్థాన్ లో కాంగ్రెస్, తెలంగాణలో తెరాస అధికారంలో ఉన్నాయి. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రెండవ రాష్ట్రం  ఛత్తీస్ గడ్ లోనూ 2023 డిసెంబర్ లో తెలంగాణతో పాటుగా ఎన్నికలు జరుగుగుతాయి. 

అలాగే వచ్చే సంవత్సర కాలంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఐదు ఈశాన్య రాష్ట్రాలలో నాలుగు రాష్ట్ర్లాలో బీజేపీ, బీజేపీమిత్ర పక్షాల సంకీర్ణ ప్రభుత్వాలున్నాయి. ఈశాన్య రాష్ట్రాలలో త్రిపుర కీలక రాష్ట్రంగా భావిస్తున్నారు. కమ్యూనిస్టుల కంచుకోటగా ఉన్న త్రిపురలో తొలిసారిగా 2018లో కమల దళం కాషాయ జెండా ఎగరేసింది. ఎన్నికలు జరిగే 11 రాష్ట్రాలలో ఏడు రాష్ట్రాలలో అధికారంలో ఉన్న బీజేపీ, ఉన్న రాష్ట్రాలను నిలుపుకోవడంతో పాటుగా, రాజస్థాన్, ఛత్తీస్ గడ్, తెలంగాణ  రాష్ట్రాలలో పాగా వేసేందుకు, ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించింది. ఒక రకంగా 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు జరిగే, సెమీఫైనల్ ఎలక్షన్స్  మోడీ షా జోడీకి సవాలుగా భావిస్తున్నారు. ఒక విధంగా మోడీ హ్యాట్రిక్ అవకాశాలను సెమీఫైనల్స్ నిర్ణయిస్తాయని అంటున్నారు. ఆ విధంగానూ నెక్ట్స్ ఇయర్ ఎలక్షన్స్ కీలకం కానున్నాయి. 

అలాగే  ప్రస్తుతం కేవలం రెండే రెండు రాష్ట్రాలలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి, ఈ పదకొండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముఖ్యంగా ప్రస్తుతం అధికారంలో ఉన్న రాజస్థాన్, చతీస్ గఢ్ రాష్ట్రాలలో అధికారాన్ని నిలుపుకోవడంతో పాటుగా, కర్ణాటక, మధ్య ప్రదేశ్, తెలంగాణ సహా మరికొన్ని రాష్ట్రాలలో అధికారం అందుకోవడం కీలకం కానుందని అంటున్నారు. ఒక  విధంగా, రాహుల గాంధీ  భారత్ జోడో యాత్రకు వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఒక పరీక్ష కాగలవని అంటున్నారు.ముఖ్యంగా గుజరాత్, హిమాచల్ తో పాటుగా 2023 ప్రధమార్దంలో ఎన్నికలు జరిగే, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి అత్యంత కీలకం కానున్నాయని అంటున్నారు. రాహుల్ గాంధీ భాజో యాత్ర కర్ణాటకలో గట్టి ప్రభావాన్ని చూపిందని ప్రచారం జరుగతున్న నేపధ్యంలో రాహుల్  యాత్ర ఎన్నికల ఫలితాలపై ఏ మేరకు ప్రభావం చూపుతుంది,. అనే ప్రశ్నకు కర్ణాటక ఫలితాలు సమాధానంగా నిలుస్తాయి. అంతకంటే ముఖ్యంగా కాంగ్రెస్ కు కాబోయే కొత్త అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్వరాష్ట్రం కర్ణాటక కావడంతో, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు, ఆయన నాయకత్వానికి తొలి పరీక్ష కాగలవని అంటున్నారు. అందుకే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు అటు రాహుల్ గాంధీకి, ఇటు ఖర్గేకి కూడా సవాలు కానున్నాయని అంటున్నారు. 

అదలా ఉంటే, రానున్న రోజుల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలు, ముఖ్యంగా. గుజరాత్ (182), రాజస్థాన్ (200) మధ్య ప్రదేశ్,(230) కర్ణాటక (224), ఛత్తీస్ గఢ్ (60)లలో ప్రధాన పోటీ బీజేపే, కాంగ్రెస్ మధ్యనే ఉంటుంది. ఈ ఐదు రాష్ట్రాలలో కలిపి మొత్తం వందకు పైగా ( గుజరాత్ 26, రాజస్థాన్ 25, మధ్య ప్రదేశ్ 29 కర్ణాటక28, ఛత్తీస్ గఢ్ 11) లోక్ సభ స్థానాలున్నాయి.  సో.. 2023లో జరిగే వరస అసెంబ్లీ ఎన్నికలు, 2024 లోక్ సభ ఎన్నికల ఫలితాలను కూడా ప్రతిబింబిస్తాయని  చెప్పవచ్చును.

By
en-us Political News

  
పార్టీ వర్గాల సమాచారం ప్రకారం మొయినాబాద్ లోని పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్ హౌస్ లో ఆయన సమక్షంలో జరిగిన డగ్ర్స్ పార్టీ వ్యవహారంలో ఈ నోటీసులు జారీ అయ్యాయి. ఈ ఘటనపై స్పష్టత కోరుతూ వారం రోజులలో వివరణ ఇవ్వాలంటూ షోకాజ్ నోటీసు జారీ అయ్యింది.
ముఖ్యంగా ఢిల్లీ హైకోర్టులో ప్రస్తుతం తన కేసును విచారిస్తున్న జస్టిస్ స్వర్ణకాంత శర్మ బెంచ్ నుండి విచారణను వేరే బెంచ్‌కు బదిలీ చేయాలని ఆయన తన పిటిషన్ లో పేర్కొన్నారు. ప్రస్తుత ధర్మాసనం వద్ద విచారణ జరుగుతుందన్న నమ్మకం లేదని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ రాజాసింగ్ పై సెటైర్లు వేశారు. రాజాసింగ్, కేటీఆర్ మధ్య రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ వ్యక్తిగత స్థాయిలో ఇలాంటి స్నేహపూర్వక సంభాషణలు సాగడం మంచి వాతావరణానికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
తాజా ఇంటర్వ్యూలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిత్వానికి, పార్టీ ఇమేజ్‌కు నష్టం కలిగించేలా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వందేమాతరం అంశం చర్చనీయాంశంగా మారింది.
2024 ఎన్నికల సమయానికి ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న జనసేన పార్టీ తెలుగుదేశం, బీజేపీలతో పొత్తు పెట్టుకుని ఎన్నికల రంగంలోకి దిగింది. ఆ ఎన్నికలలో నాగబాబు అనకాపల్లి లోక్ సభ స్థానం నుంచి రంగంలోకి దిగుతారని పెద్ద ఎత్తున ప్రచారం అయ్యింది. అయితే పొత్తు ధర్మంలో భాగంగా నాగబాబుకు ఆ ఎన్నికలలో పోటీ చేసే అవకాశమే దక్కలేదు.
తమిళనాడులో బీజేపీ, హీరో విజయ్ సారథ్యంలోని టీవీకేల పొత్తు విషయంలో మరోసారి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఈసీ తీరుపై నమ్మకం లేదని చెబుతున్న పార్టీ, ఇప్పుడు సీఈసీపై అభిసంశన తీర్మానానికి మద్దతుగా నిలబడకుంటే.. ఆ పార్టీ నైతికతే ప్రశ్నార్థకంగా మారుతుంది. ఒక వేళ వైసీపీ ఈ తీర్మానాన్ని వ్యతిరేకిస్తే ఇక ముందు, ఎన్నికల అక్రమాలపై మాట్లాడేందుకు వైసీపీకి అర్హతే ఉండదు. ఇంత వరకూ తెలుగుదేశం కూటమి విజయంపై వారు చేసిన విమర్శలన్నీ దూదిపింజెల్లా ఎగిరిపోతాయి.
బీఆర్ఎస్ హయాంలో ఇదే ఫామ్‌హౌస్ వేదికగా జరిగిన ఎమ్మెల్యేల కొనుగోలు ఉదంతం అప్పట్లో పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అప్పట్లో రోహిత్ రెడ్డి ఫిర్యాదుతోనే పోలీసులు అక్కడ సోదాలు నిర్వహించి, ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అప్పట్లో ఈ కేసు జాతీయ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది.
దేవ్ జీ అరెస్ట్ ఎలా జరిగింది? అరెస్టు తరువాత ఆయన లొంగుబాటు ప్రకటన చేసి జనజీవన స్రవంతిలో కలుస్తున్నట్లు ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది? లొంగిపోలేదు అంటూనే.. ప్రస్తుత పరిస్థితుల్లో అజ్ణాతంగా ఉండి ఉద్యమాన్ని కొనసాగించడం కష్టసాధ్యమని ఎందుకు చెబుతున్నారు?
త్రిష త్వరలోనే సినిమాలకు గుడ్‌బై చెప్పి రాజకీయాల్లోకి రావడం కన్ఫర్మ్ అన్న వాదన బలంగా వినిపిస్తోంది. అయితే ఇందుకు సంబంధించి త్రిష నుంచి ఎటువంటి క్లారిటీ అయితే ఇప్పటి వరకూ రాలేదు. ప్రస్తుతం త్రిష పలు సినిమాలలో నటిస్తున్నారు. వాటిలో మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమా కూడా ఉంది.
మంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వర్తిస్తూ కూడా పవన్ కల్యాణ్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనీ, షూటింగ్ లంటూ అధిక సమయం హైదరాబాద్ లోనే ఉంటున్నారని రోజా అన్నారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసి సినిమాలలో యాక్టింగ్ కి పరిమితమైనట్లుగా పవన్ కల్యాణ్ తీరు ఉందని రోజా అన్నారు. కీలకమైన మంత్రివర్గ సమావేశానికి డుమ్మా కొట్టడం సరికాదన్న రోజా దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విధానసౌధలో కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్న సమయంలోనే.. పాతిక మంది ఎమ్మెల్యేలు ఓ ప్రైవేట్ హోటల్‌లో ఈ భేటీ జరగడం సంచలనం సృష్టించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.