శ్రీసిటీలోరూ.1,740 కోట్ల పెట్టుబడి

Publish Date:Jan 13, 2012

Advertisement

హైదరాబాద్ : శ్రీసిటీ సెజ్‌లో సుమారు 1,740 కోట్ల రూపాయల పెట్టుబడులతో కొత్తగా మరో 14 పరిశ్రమలు రాబోతున్నాయి. ఈపరిశ్రమలను ఏర్పాటు చేస్తున్నట్లు శ్రీ సిటీ సెజ్ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి చెప్పారు. సెజ్‌లో పెట్టుబడులు పెట్టనున్న కంపెనీలన్ని మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీలని ఆయన తెలిపారు. భాగస్వామ్య సదస్సు 2012 సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం  ఆయా కంపెనీలతో అవగాహనా ఒప్పందాలు (ఎంఒయు) కుదుర్చుకోనుందని ఆయన తెలిపారు.శ్రీ సిటీలోని 400 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న ఈ కంపెనీల్లో తొలి దశలో సుమారు 2,800 మందికి ఉపాధి లభించనుందని రవీంద్ర చెప్పారు.

జపాన్‌కు చెందిన ఎన్‌హెచ్‌కె స్ప్రింగ్ (రూ.300 కోట్లు), యునీచార్మ్ (రూ.250 కోట్లు), ఇండియా మెటల్ వన్ (రూ.200 కోట్లు)లతో పాటు లావాజ్జా (రూ.170 కోట్లు, ఇటలీ), ఆల్‌స్టోమ్ (రూ.140 కోట్లు, ఫ్రాన్స్), హంటర్ డగ్లస్ (రూ.50 కోట్లు, నెదర్లాండ్స్), చేత్రా (రూ.41 కోట్లు, రష్యా), బెర్గన్ పైప్ (రూ.24 కోట్లు,యుకె), ఈగల్ బర్మన్ (రూ.20 కోట్లు, డెన్మార్క్), ఎవర్టాన్ (రూ.9 కోట్లు,ఇటలీ)లుండగా భారత్‌కు చెందిన ఆస్ట్రోటెక్ స్టీల్స్ (రూ.41కోట్లు), ఫ్రీవరల్డ్ (రూ.33 కోట్లు), టెక్‌ప్రో (రూ.12 కోట్లు) కంపెనీలు శుక్రవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఎంఒయులు కుదుర్చుకోనున్నాయి. వీటితో పాటు ఇటలీకి చెందిన డానియెలి (రూ.300 కోట్లు),
కోబెల్కో (రూ. 131 కోట్లు) ప్లాంట్ల ఏర్పాటుకు ఉత్వర్వులు జారీ చేయనున్నారు.

By
en-us Political News

  
ముఖ్యమంత్రి పాడ్ టాక్సీల కోసం మూడు మార్గాలను ఎంపిక చేశారు.  డిసెంబరు నాటికి టెండర్ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం మెట్రో రైలు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.  
భవనం పైకప్పు సమీపంగా వెళ్తున్న హైటెన్షన్ విద్యుత్ తీగలు తగలడంతో నాలుగో తరగతి చదువుతున్న రెబికా అనే 11 ఏళ్ల బాలిక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఆమెను కాపాడటానికి ప్రయత్నించిన నందిని అనే విద్యార్థిని తీవ్రంగా గాయపడింది.
అక్వాన్ ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇప్పటికే ఆ ప్రభావంతో రాష్ట్రంలో వాతావరణంలో మార్పులు కనిపిస్తున్నాయి. ఇక పోతే ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలతో పాటు పలు ప్రాంతాల్లో దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. 
సాయంత్రాలు ఒకింత సేదదీరుదామని పార్కులకు వెడదామనుకునే మధ్య తరగతి వేతన జీవులు, కష్ట జీవులకు ఇక పార్కులలో ప్రవేశం భారంగా మారనుంది. జీహెచ్ఎంసీ పరిధిలోని పార్కులలో ప్రవేశ రుసుము ఇక దాదాపు రెట్టింపు కానుంది.
రాష్ట్రంలో ఆన్‌లైన్ ఫార్మసీ వేదికల ద్వారా జరుగుతున్న మందుల విక్రయాలపై తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ (టీజీ సేఫ్)  దాడులు నిర్వహించారు.  ఔషధ విక్రయాలకు సంబంధించిన చట్టపరమైన నిబంధనలను  ఉల్లంఘించినట్లు తేలడంతో, ఆన్‌లైన్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లతో భాగస్వామ్యం కలిగి ఉన్న మొత్తం 23 మెడికల్ షాపుల లైసెన్సులను అధికారులు సస్పెండ్ చేశారు. 
ప్రభుత్వ ఉద్యోగం.. అందులోనూ కీలకమైన టౌన్ ప్లానింగ్ అధికారి బాధ్యతలు.
హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూ యూనివర్సిటీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
క్రీడా రంగానికి పెద్దపీట వేస్తూ రాష్ట్రంలో నిర్వహిస్తున్న ఖేలో ఇండియా క్రీడలు యువతలో ఉత్సాహాన్ని నింపుతాయని ప్రధాని రేవంత్ తో అన్నట్లు సమాచారం. ప్రధాని మోదీతో జరిగిన ఈ సమావేశం రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా  ప్రాధాన్యత సంతరించుకుంది.
అలాగే మాజీ సీబీఐ డైరెక్టర్ ఎం. నాగేశ్వరరావు, సజ్జనార్‌పై  బహిరంగంగా పలు ఆరోపణలు, తీవ్ర వ్యాఖ్యలు చేశారనీ,   పోలీసు యూనిఫాం వెనుక దాక్కున్న నేరస్థుడిగా ఆయన సజ్జనార్ ను అభివర్ణించారనీ తన లేఖలో పేర్కొన్న రాజాసింగ్, అటువంటి ఆరోపణలను ఎదుర్కొంటున్న సజ్జనార్ పై చర్యలు తీసుకోకుండా కేవలం బదలీతో సరిపెట్టడమేంటని నిలదీశారు.
అక్వాన్ ప్రభావం ప్రధానంగా తెలంగాణలోని తూర్పు దక్షిణ జిల్లాలపై అధికంగా ఉంటుంది. ఈ నెల 20 నుంచి 22 వరకూ అక్వాన్ ప్రభావంతో తెలంగాణలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది.  
ఐదు తులాల బంగారం ఆశ.. రెండున్నర తులాల గొలుసు స్వాహా.!
తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
భారత రాజకీయాల్లో దేశంలోనే అత్యంత సంపన్నుల ఎదుగుదలపై, ముఖ్యంగా పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ అసాధారణ ప్రగతిపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.