స్పీడ్ న్యూస్ 3

Publish Date:Jul 25, 2023

Advertisement

సాంకేతిక లోపంతో నిలిచిన టికెట్ల బుక్కింగ్

26. సాంకేతిక లోపంతో ఐఆర్‌సీటీసీలో టికెట్ల బుకింగ్‌ నిలిచిపోయింది.  ఈ మేరకు ట్వీట్ చేసిన ఐఆర్‌సీటీసీ  సమస్యను పరిష్కరించేందుకు తమ సాంకేతిక సిబ్బంది ప్రయత్నిస్తున్నారని పేర్కొంది.  సాధ్యమైనంత త్వరలో టికెట్ బుకింగ్ ను పునరుద్ధరిస్తామని తెలిపింది.

...............................................................................................................................................................

రోడ్లపైకి వరద నీరు

27.ఎన్టీఆర్‌ జిల్లా పెనుగంచిప్రోలు నుంచి జగ్గయ్యపేటకు వెళ్లే ఆర్‌అండ్‌బీ రోడ్డు గోతులతో అధ్వానంగా తయారైంది.  మరోవైపు పక్కనే ఉన్న పంట పొలాల్లో నుంచి వచ్చిన వరద రోడ్డుపై ప్రవహిస్తోంది.

.................................................................................................................................................

కట్టేరు వాగు ఉధృతి

28. భారీ వర్షాలకు తిరువూరు నియోజకవర్గ పరిధిలోని  వినగడప వద్ద కట్లేరు వాగు పొంగి ప్రవహిస్తోంది.  కట్లేరు వాగు ఉధృతి కారణంగా రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో సమీప 20 గ్రామాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. వరద తగ్గే వరకు వాగు దాటవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

............................................................................................................................................................

కోటిపల్లి ప్రాజెక్టులోని వరద నీరు

29. గత ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కోటిపల్లి ప్రాజెక్టులోకి భారీగా నీరు చేరాయి.  పూర్తిస్థాయి నీటిమట్టంతో కోట్లు ప్రాజెక్ట్ ఆ లుగు పారుతుంది. కోట్పల్లి ప్రాజెక్ట్ నుండి నీరు కుదరడంతో నాగ సంబంధర్ దోర్నాల మీదుగా వాగు పొంగి ప్రవహిస్తుంది 

..............................................................................................................................................

భారీ వర్షాలకు తెగిపోయిన రహదారి

30.ఆర్మూర్ లో గత రాత్రి  కురిసిన భారీ వర్షం కారణంగా  , రైల్వే స్టేషన్ ప్రధాన రహదారిపైకి భారీగా వరద నీరు రావడంతో ఆ రహదారి తెగిపోయింది.  దీంతో రైల్వే స్టేషన్ కు రాకపోకల నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న్నారు.

..................................................................................................................................................

నేతన్నలపై దాడులు సహించం: పరిటాల శ్రీరామ్

31. నేతన్నలపై దాడులకు పాల్పడితే ఊరుకునేది లేదని  తెలుగుదేశం నాయకుడుపరిటాల శ్రీరామ్ హెచ్చరించారు. గత నెలలో విజయవాడ ఆలయ సిల్క్స్ యజమాని ధర్మవరం పట్టు వ్యాపారస్తులైన గిర్రాజు శశి, కోటం ఆనంద్ లపై దాడి పట్ల పరిటాల శ్రీరామ్ తీవ్రంగా స్పందించారు.  

.........................................................................................................................................................

మోడీ సర్కార్ పై అవిశ్వాసం

32. మణిపూర్ లో   హింసపై ప్రధాని మోడీ పార్లమెంటులో ప్రకటన చేయాలన్న తమ డిమాండ్ ను కేంద్రం పట్టించుకోకపోవడంతో  విపక్ష కూటమి ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. మణిపూర్ అంశంపై కేంద్రపై  లోక్ సభలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది.

................................................................................................................................................

27న రైతుల ఖాతాల్లోకి ఆ సొమ్ములు

33. రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు తీసుకొచ్చిన పీఎం కిసాన్ యోజన పథకం నిధులను ఈ నెల 27న విడుదల చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ పథకం కింద ఇప్పటి వరకు 13 విడతలుగా రైతుల ఖాతాల్లో కేంద్ర ప్రభుత్వం నగదు జమ చేసిన సంగతి తెలిసిందే.

........................................................................................................................................................

ఢిల్లీలో డెంగ్యూ జ్వరాలు

34.  యమునానది వరదలతో అతలాకుతలమైన ఢిల్లీ నగరం ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులకు చేరుకుంటోంది. అంతలోనే మరో ముప్పు నగరవాసులను భయంపెడుతోంది.   ఢిల్లీ వాసులు డెంగ్యు కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు 187 డెంగ్యు కేసులు నమోదు అయ్యాయి.

....................................................................................................................................................

మణిపూర్ లో మరో దారుణం

35.  మణిపూర్ లో మరో దారుణ వెలుగులోకి వచ్చింది. కొందరు సాయుధ వ్యక్తులు ఓ స్వాతంత్ర్య సమయోధుడి భార్యను ఇంట్లో బంధించి, సజీవ దహనం చేశారు. కాక్చింగ్ జిల్లాలోని సెరో గ్రామంలో మే 28న ఈ దారుణం జరిగింది. బాధిత వృద్ధురాలు ఇబెటోంబికు 80 ఏళ్ల వయసు ఉంటుంది.

...............................................................................................................................................................

ఇండియాపై మోడీ విమర్శలు

36. విపక్ష కూటమిపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ  పార్లమెంటరీ పార్టీ సమావేశంలో  మాట్లాడిన మోడీ  విపక్ష కూటమి పేరు లక్ష్యంగా ఆయన  గుప్పించారు. పీఎఫ్ఐ, ముజాహిదీన్ వంటి  వంటి ఉగ్ర సంస్థల పేరులోనూ ఇండియా ఉందన్నారు.  

...................................................................................................................................................

ఆకాశంలో స్వర్గానికి ద్వారం

37. బెంగళూరులో వినువీధిలో కనిపించిన వింత ఆకారం అందరినీ ఆశ్చర్య చకితులను చేసింది. ఆకాశంలో మబ్బుల మధ్య ధ్వారం ఆకారం ఏర్పడటం చూపరులను ఆకట్టుకుంది. స్వర్గానికి ద్వారంలా ఉందంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.  

...............................................................................................................................................................

జల దిగ్బంధనంలో వేల్పూర్

38. నిన్న రాత్రి కురిసిన భారీ వర్షాలకు నిజామాబాద్ జిల్లా వేల్పూరు మండలం జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఆర్మూర్ - మెట్ పల్లి రోడ్డులో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.  వేల్పూర్ జల దిగ్బంధం పై క్షేత్రస్థాయిలో  మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పర్యవేక్షించారు.

........................................................................................................................................................

తిరుమల ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల

39. తిరుమల శ్రీవారి రూ.300 ప్రత్యేక దర్శన టికెట్లు విడుదలయ్యాయి. tirupatibalaji.ap.gov.in సైట్లో భక్తులు తమ వివరాలు నమోదు చేసి టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఇక వృద్ధులు, వికలాంగుల దర్శన కోటా టికెట్లు కూడా విడుదలయ్యాయి.

............................................................................................................................................................

వరంగల్ ఖమ్మం హైవేపై భారీగా వరద నీరు

40. వరంగల్-ఖమ్మం హైవేపై భారీగా వరదనీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. పంతిని హైవేపై వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. 5 కి.మీ మేర ట్రాఫిక్ స్తంభించింది. ఓ లారీ వరద నీటిలో చిక్కుకుంది.  

By
en-us Political News

  
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.  
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో   పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. 
 ధనుష్‌ తన కొత్త రాజకీయ పార్టీ కోసం  తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు  ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.