Publish Date:Jul 25, 2023
కుకీ, మెయిటీ తెగల మధ్య ఘర్షణలతో మండుతున్న మణిపూర్‌లో వెలుగులోకి వస్తున్న దారుణాలు ప్రజలని భయకంపితుల్ని చేస్తున్నాయి. మే 4న రాష్ట్రంలో ఘర్షణలు ప్రారంభం కాగా, అంతకు కొన్ని రోజుల ముందు అంటే ఏప్రిల్ 30న హంగ్లాల్‌మౌన్ వైఫీ (21) అనే యువకుడిని పోలీసులు చుర్‌చాంద్‌పూర్‌లోని అతడి ఇంటి నుంచి అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యమంత్రి బీరేన్ సింగ్, మెయిటీ కమ్యూనిటీపై ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టినందుకు గాను అతడిని అదుపులోకి తీసుకుని ఇంఫాల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఆ తర్వాత నాలుగు రోజులకు రాష్ట్రంలో ఘర్షణలు ప్రారంభం కాగా, పోలీసు కస్టడీలో ఉన్న వైఫీని దుండగులు వీధిలోకి లాక్కొచ్చి మరీ కొట్టి చంపేశారు. బీకాం చదువుతున్న వైఫీని మణిపూర్ హైకోర్టు నుంచి సజివాలోని సెంట్రల్ జైలుకు తరలిస్తుండగా దుండగుల మూక దాడిచేసి, పోలీస్ వ్యాన్ నుంచి అతనిని కిందకు లాగి, కొట్టి చంపేసినట్టు పోలీసులు ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు.
పోలీసుల నుంచి ఆ మూక ఆయుధాలు, మందుగుండు సామగ్రిని లాక్కుందని, రాడ్లు, కర్రలతో వైఫీపై దాడిచేసిందని ఎఫ్ఐఆర్‌లో పోలీసులు పేర్కొన్నారు. వైఫీపై గుంపు భయంకరంగా దాడి చేస్తుండడంతో భయపడిన పోలీసులు అక్కడి నుంచి పారిపోయారు.
మణిపూర్ లో ప్రధానంగా రెండు మతాల మధ్య జరుగుతున్న ఘర్షణ అని చెప్పొచ్చు. మెయితీస్ హిందూ మతానికి ప్రాతినిద్యం వహిస్తున్నారు. కుకీలు క్రైస్తవులు. వీళ్లు కొండలలో నివసిస్తారు.
కుకీలు కంటే మెయిటీలు ఎక్కువ విద్యావంతులు. వ్యాపార, రాజకీయ రంగాల్లోరాణించిన తెగ ఇది. కుకీలు. వీరిని నాగాలు అని కూడా అంటారు. ఎక్కువ మంది క్రైస్తవులు. కుకీలు ఈశాన్య మయన్మార్ అంతటా విస్తరించి ఉన్నారు. మణిపూర్‌లో ఉన్న వారిలో ఎక్కువగా మయన్మార్ నుండి వలస వచ్చిన వారే. కొన్ని శతాబ్దాల క్రితం ప్రారంభమైన ఈ వైరుధ్యం ఇంకా కొనసాగుతూ వస్తోంది.
మణిపూర్‌లో మెజారిటీ కమ్యూనిటీ మైటీస్. కుకీలు-దాదాపు అందరూ క్రైస్తవులు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/manipur-voilence-not-a-new-39-158982.html
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని.