తగ్గేదే లే: ఎఫ్ఐఆర్ లో ప్రజా పక్షాన నిలిచినందుకు దక్కిన మెడళ్లు.. రాహుల్ గాంధీ.!
Publish Date:Oct 8, 2026
Advertisement
ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ రాటుదేలుతున్నారు. కాంగ్రెస్ అగ్రనేతగా పార్టీని ముందుండి నడిపించడంలో గతం కంటే ఎంతో మెరుగ్గా సాగుతున్నారు. ప్రభుత్వ అణచివేత చర్యలకు దీటుగా స్పందిస్తున్నారు. కేసులు, అరెస్టులతో భయపెట్టలేరని కుండబద్దలు కొడుతున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ణానేశ్వర్ రాజీనామా డిమాండ్ తో చేపట్టిన ఆందోళన సందర్భంగా రాహుల్ గాంధీని ఢిల్లీ పోలీసులు వరుసగా అరెస్టు చేశారు. ఎన్నికల సంఘం ముట్టడి సందర్భంగా మంగళవారం, (అక్టోటబర్ 6)జంతర్ మంతర్ వద్ద ఆందోళన సందర్భంగా బుధవారం (అక్టోబర్ 7) అరెస్టు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీనిపై రాహుల్ ఘాటుగా స్పందించారు. ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. ఎన్ని కేసులు నమోదైనా రాజ్యాంగ పరిరక్షణ కోసం చేస్తున్న ఈ పోరాటాన్ని ఆపేది లేదన్న రాహుల్ వ్యాఖ్యలు.. పోరాటాన్ని మరింత ఉధృతం చేయనున్నారనడానికి సంకేతాలుగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలన్న డిమాండ్ ను రాహుల్ గాంధీ పునరుద్ఘాటించారు. ఎఫ్‌ఐఆర్‌ను ప్రజలపక్షాన నిలిచినందుకు దక్కిన మెడల్ గా అభివర్ణించడం ద్వారా రాహుల్ ముందుముందు మరింత దూకుడుగా ముందుకు సాగనున్నారని అవగతమౌతోందని పరిశీలకులు అంటున్నారు. అంతే కాకుండా ఎన్నికల సంఘంపై ప్రారంభించిన ఈ పోరాటాన్ని జ్ణానేశ్ కుమార్ రాజీనామాతో లాజికల్ ఎండ్ కు తీసుకువెళ్లే వరకూ విరమించేది లేదని విస్పష్టంగా చాటినట్లేనని అంటున్నారు.
[Rahul Gandhi, 100 FIRs arget, Rahul Gandhi FIR, Election Commission Protest, Gyanesh Kumar, INDIA Bloc, Telugu One]
http://www.teluguone.com/news/content/rahul-gandhi-39-233720.html





