టీఆర్ఎస్ ప్రస్థానంలో మరో మలుపు!?

Publish Date:Apr 27, 2022

Advertisement

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) రెండు పదుల వయసును దాటేసింది. 21 ఏళ్లను పూర్తి చేసుకుని 22లోకి అడుగుపెడుతోంది. ఒక ప్రాంతీయ పార్టీ చరిత్రలో 20 ఏళ్లు అంటే చిన్న వయసు కాదు. నిజానికి, తెరాస ఆవిర్భావ సందర్భంలో అయితే అంతకు ముందు ప్రత్యేక తెలంగాణ సాధనే లక్ష్యంగా అంతకు ముందు ఏర్పడిన పార్టీల బాటలోనే తెరాస కూడా తెరమరుగై పోతుందనే అభిప్రాయమే బలంగా వినిపించింది. అయితే, పుష్కర కాలం పైగా తెరాస సారధ్యంలో సాగిన తెలంగాణ ఉద్యమం 1200 మంది తెలంగాణ బిడ్డల బలిదానంతో 2014 లో విజయవంతమైంది. అది చరిత్ర.

ఇక ప్రస్తుతంలోకి వస్తే, అలా, మఘలో పుట్టి పుబ్బలో పోతుందనుకున్న పార్టీ, ఈరోజు 21సంవత్సరాలు పూర్తి చేసుకుని 22 వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటోంది.అంతే కాదు, ఉద్యమ పార్టీగా పురుడు పోసుకున్న తెరాస, కాలానుగుణంగా రూపాంతరం చెందుతూ వచ్చింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం వరకు ఉద్యమ పార్టీగా అందరినీ కలుపుపోయిన తెరాస, రాష్ట్ర ఆవిర్భావ క్షణం నుంచే, ఫక్తు పదహారు అణాల రాజకీయ పార్టీగా అవతరించింది. అక్కడి నుంచి ఇప్పటి వరకు ఏమి జరిగింది అనేది, కళ్ళ ముందు కదులుతున్న చరిత్ర. నిజానిజాలు ఎలా ఉన్నప్పటికీ, ఉద్యమ పార్టీగా అవతరించిన తెరాస, ఇప్పుడు కుటుంబ పార్టీగా మారిపోయిందనే విమర్శలు, ఆ నాటి ఉద్యమ నాయకులే ఆరోపిస్తున్నారు.  

ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం తెరాస భవిష్యత్ విషయంలో పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర అవతరణ నాటి నుంచి ఇంతవరకు జరిగిన అన్ని ఎన్నికలలో తెరాస ఆధిపత్యం కొనసాగుతూనే వుంది. అయినా, ముఖ్యమంత్రి ఇజ్జత్ కాసవాల్ గా తీసుకున్న హుజురాబాద్ ఉప ఎన్నికలో వేల కోట్ల రూపాయలు కుమ్మరించినా, ఫలితం లేక పోవడంతో తెరాసలో భయం మొదలైంది. హుజురాబాద్ ఓటమితో మొదలైన  అలజడి, ఈరోజు వరకు కూడా కొనసాగుతూనే వుంది. చివరకు, ఎన్నికల వ్యూహరచనలో ఎవరికీ తీసిపోని, కేసీఆర్, దేశంలో ఎన్నికల వ్యూహకర్తగా ఓ వెలుగు వెలుగుతున్న ప్రశాంత్ కిశోర్’ ను ఎంగేజ్ చేసుకున్నారు. ఇందుకు తెరాస నాయకులు ఏకారణం చెప్పినా, తెరాస నాయకత్వానికి విశ్వాసం సన్నగిల్లడం వల్లనే పీకే. ఐప్యాక్ అవసరం ఏర్పడిందని పరిశీలకులే కాదు, ప్రజలు కూడా నిశ్చితాభిప్రాయానికి వచ్చారు. ఎవరో అన్నట్లుగా ఇలా ఒక ఉద్యమ పార్టీ, కిరాయి వ్యూహకర్తను వేల కోట్ల రూపాయలు కుమ్మరించి హైర్ చేసుకోవడం, ఉద్యమ స్పూర్తికే అవమానమా అనే మాట వినవస్తోంది.

అయితే ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, అందుకు ఇంకా కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ, అన్నటికంటే ముఖ్యంగా 1200ల మంది బలిదానంతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలన, కుటుంబ అవినీతి పడుకుపోవదమే ప్రధాన కారణంగా కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు. అయితే, తెరాస నాయకత్వం మాత్రం, ఆవిషయంలో తగ్గేదేలే, అన్న విధంగా ముందుగు సాగుతోంది. ఈ రోజు జరుగుతున్న ప్లీనరీ క్రతువు మొత్తం, అంతా (తారక) రామ మయం అన్నవిధంగా సాగుతోంది. అంటే, కుటుంబ పాలనకు జై కొడుతోంది. కేసీఆర్’ స్థానంలో కేటేఆర్’ బొమ్మ కనిపిస్తోంది.ఈ నేపధ్యంలో తెరాస భవిష్యత్ ఏమిటి? ఎలా ఉంటుంది? ఏమవుతుంది?అనేది కాలమే నిర్ణయించాలి..నిర్ణయిస్తుంది, అంటున్నారు రాజకీయ పరిశీలకులు.

By
en-us Political News

  
ఈ నేపథ్యంలో, రాజధానిగా అమరావతి ఎంపిక ప్రక్రియ, నిర్మాణ కార్యక్రమాలపై వివరాలను కూడా కేంద్రానికి నోట్‌ ద్వారా రాష్ట్ర ప్రభఉత్వం అందజేసింది. ఈ విషయమై, కేంద్రం ఇప్పటికే అన్ని మంత్రిత్వ శాఖల నుంచి అభిప్రాయాలు సేకరించడమే కాకుండా, నీతి ఆయోగ్‌ అభిప్రాయాన్ని కూడా కోరినట్లు సమాచారం.
హరీష్ రావును విచారించిన అధికారులు, 2018 అసెంబ్లీ ఎన్నికల అనంతరం కొన్ని నెలల పాటు ఆయన ఫోన్ నిఘాలో ఉన్నట్టు తెలిపారు. ఈ విషయాన్ని పోలీసులు చెప్పగానే హరీష్ రావ్ షాక్‌కు గురైనట్లు సమాచారం.
చదువుకుంటేనేగా గ్రామాల్లో వికాసం అంటూ ఉండేది. చదువు చెప్పేవారే ఉంటే పిల్లలు గేదెలెనకా, మేకలేకనా పరిగెత్తాల్సిన ఖర్మేంటి? కాస్తంత గ్రామాభివృద్ధి, విద్యారంగంలో రావాల్సిన మార్పుల గురించి ఏకరవుపెడుతున్నవారంతా గొంతుపోవడం, అనారోగ్యం పాలవడం తప్ప ఒరుగుతున్నది దాదాపు శూన్యమన్న అభిప్రాయాలే ఎక్కువ వినపడుతున్నాయి.
విచారణలో భాగంగా హరీష్ రావుతో పాటు ఈటల రాజేందర్ ఫోన్లు ట్యాప్ అయినట్లుగా ఆధారాలను సిట్ బృందం హరీష్ ముందు ఉంచి ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అయితే అవన్నీ ఫేక్ అని హరీష్ రావు వాదించినట్లు తెలుస్తోంది.
సరే అసలు తాను కవిత పార్టీకి వ్యూహకర్తగా పని చేయనున్నానంటూ వస్తున్న వార్తలు శుద్ధ అబద్ధాలని ప్రశాంత్ కిశోర్ కొట్టి పారేశారనుకోండి అది వేరు సంగతి. ఇటీవ‌ల క‌విత‌- ప్ర‌శాంత్ కిషోర్ మధ్య రెండు సమావేశాలు జరిగాయనీ, కవిత త‌న పొలిటిక‌ల్ స్ట్రాట‌జిస్టుగా ఆయ‌న్ను నియ‌మించుకునే అవ‌కాశం క‌నిపిస్తోంద‌న్న వార్తలు మాత్రం జోరుగా వినిపిస్తున్నాయి. దీంతో ప్రశాంత్ కిశోర్ ఖండించినప్పటికీ చర్చ మాత్రం ఆగడం లేదు.
ఇప్పుడు బీఆర్ఎస్ వ‌ర్సెస్ కాంగ్రెస్ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో ఒక వార్ న‌డుస్తోంది. త‌మ‌కున్న మీడియా ప‌లుకుబ‌డి ద్వారా... న్యూస్ ట్యాపింగ్ జ‌రుగుతోందంటూ ఓ ప్రచారాన్ని మొదలెట్టింది కారు పార్టీ. ఈ విష‌యంలో బీఆర్ఎస్ ఎక్కువ‌గా ఇరుక్కోకుండా ఈ ప‌థ‌క ర‌చ‌న చేసిన‌ట్టు క‌నిపిస్తోంది. ఇదే అంశంలో ఇక్క‌డి నుంచి జ‌గ‌న్ మద్దతు కూడా కారు పార్టీకి ఉన్నట్లు సమాచారం.
ముఖ్యంగా నిజామాబాద్ మునిసిపల్ బరిలో స్పష్టమైన ప్రభావం చూపే దిశగా అధిక సంఖ్యలో వార్డు సభ్యులను బరిలోకి దింపాలని నిర్ణయించారు. సోమవారం హైదరాబాద్ లోని తన నివాసంలో తెలంగాణ జాగృతి కీలక నేతలతో జరిగిన ప్రత్యేక సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
దేశంలోని అన్ని శాసన సభలలో గవర్నర్ ప్రసంగానికి ముందు జాతీయ గీతాలాపన చేయడం సంప్రదాయంగా కొనసాగుతోందనీ, కానీ స్టాలిన్ సర్కారు మాత్రం ఆ సంప్రదాయాన్ని బ్రేక్ చేసిందనీ, దీనికి నిరసనగా గవర్నర్ ఆర్.ఎన్.రవి అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసినట్లు లోక్ భవన్ పేర్కొంది.
ఎన్నికల వ్యూహకర్తగా పలు రాష్ట్రాలలో ప్రభుత్వాల ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన ప్రశాంత్ కిశోర్.. తన సొంత రాష్ట్రం బీహార్ లో మాత్రం సొంత పార్టీని ఎన్నికలలో విజయపథంలో నడిపించే విషయంలో ఘోరంగా విఫలమై బొక్కబోర్లా పడ్డారు.
హరీష్ రావును జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో విచారించనున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. ఇకపోతే తెలంగాణ భవన్ వద్ద కూడా పోలీసులు భారీ బందోబస్తు చేశారు. అదలా ఉంటే.. హరీష్ రావు సిట్ విచారణకు బయలుదేరడానికి ముందుగానే మరో మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు హరీష్ రావు నివాసానికి చేరుకున్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే పలువురు అధికారులను విచారించిన సిట్, తాజాగా రాజకీయ నేతల వైపు దృష్టి సారించింది. ఇలా ఉండగా హరీష్ రావుకు సిట్ అధికారులు నోటీసులు జారీ చేయడంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండి పడ్డారు. రాజకీయ వేధింపులే కాంగ్రెస్ పార్టీ ఏకైక అజెండాగా మారిపోయిందంటూ సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో పోస్టు చేశారు.
ఈ నామినేషన్ల ప్రక్రియ ముగిసే సరికి ఆ పదవి కోసం నితిన్ నబిన్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. బీజేపీ జాతీయ అధ్యక్ష ఎన్నికకు ప్రధాన ఎన్నికల అధికారిగా కె.లక్ష్మణ్‌ వ్యవహరించారు.
సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల ప్రకారం.. మూడు నెలల్లోపు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌కు సూచించినప్పటికీ.. ఆ ఆదేశాలను అమలు చేయలేదని బీజేపీ తన పిటిషన్ లో పేర్కొంది. ఈ మేరకు స్పీకర్‌పై కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టాలని కోరుతూ తెలంగాణ బీజేపీ శాసనసభా పక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.