40 ఏళ్ల తెలుగుదేశం.. తెలుగుజాతిపై చెరగని సంతకం..
Publish Date:Mar 29, 2022
Advertisement
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం అంటే.. తెలుగు వారికి ఓ పండగ. ఇంకా చెప్పాలంటే పసుపు పచ్చని పండగ. దేశ రాజధాని హస్తినలో హస్తం పార్టీ అధిష్టానం ముందు తెలుగు రాజకీయ నేతలు చేతులు కట్టుకునీ.. జీ హూజురు అంటూ అనుష్ఠానం చేసే రోజులకు చరమగీతం పాడించిన ఏకైక పార్టీ.. తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీని స్థాపించి తెలుగు వాడి వాడి వేడి ఇది.. తెలుగు వాడి పౌరుషం ఇలా.. ఇలాగే ఉంటుంది.. తెలుగు వాడి ఆత్మ గౌరవానికి దెబ్బ తగిలితే.. ఎలా ఉంటూందో హస్తిన పెద్దలకు షడ్ రుచులు చూపిన ఒకే ఒక్క స్వీట్ నేమ్.. ఎన్ టీ ఆర్. ద టీ ఈజ్ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు. అలాంటి పార్టీ 2022, మార్చి 29 వేళ.. 40 వసంతాలు పూర్తి చేసుకుంది. అలాంటి వేళ.. ఆ పార్టీలో లీడర్ నుంచి కేడర్ వరకు ప్రతి ఒక్కరి ముఖాల్లో ఆనందం వెల్లువిరుస్తోంది. ఈ నలభై ఏళ్ల ప్రస్థానంలో ఆ పార్టీ ఎన్నో ఎత్తు పల్లాలను చవి చూసింది. అంతేకాదు.. పార్టీలోకి ఎంత మంది వచ్చినా.. వారిలో కొత్త వారు ఉన్నా.. వారందరినీ అక్కున చేర్చుకొని రాజకీయ ఓనామాలు దిద్దించింది. మరికొంత మంది పార్టీని వీడినా.. వారికి క్రమశిక్షణతోపాటు రాజకీయంగా జీవితంలో ఎలా ఎదగాలి... ఆ ఎదిగే క్రమంలో ఎలా ఒదిగి ఉండాలో ఓ తల్లిగా.. ఓ తండ్రిగా.. ఓ గురువుగా.. ఓ అతిథిలా జీవిత పాఠాలను నేర్పించి మరీ సాగనంపిందీ పార్టీ. ఇలా తెలుగు నాట అదీ కాలం మహిమ ముందు కొట్టుకొని పొకుండా.. తట్టుకుని నిలబడ్డ ఏకైక పార్టీ తెలుగు దేశం పార్టీ. పసుపు పార్టీ పని అయిపోయిందంటూ ఇతర పార్టీలు గేలి చేసి.. గోల చేసినా.. సమయమనం పాటించే ఒకే ఒక్క పార్టీ.. అదీ తెలుగుదేశం పార్టీ. 1982, మార్చి 29న హైదరాబాద్‌లో ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో జస్ట్ ఓ నలబై మందితో సమావేశం ఏర్పాటు చేసి.. పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారీ ఎన్టీఆర్. ఆ క్షణంలో ఈ తెరవేల్పు.. తెలుగు నాట ప్రతి ఇంటా ఇలవేల్పుగా ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకొంటానని బహుశ ఆయన కలలో కూడా ఊహించుకొని ఉండక పోవచ్చు. తెలుగు దేశం పార్టీ స్థాపించిన విషయాన్ని.. బుల్లి ఆల్ ఇండియా రేడియో ప్రసారం అయితే.. ఢిల్లీ నుంచి గల్లీలోని హస్తం పార్టీ నేతలంతా లైట్ తీసుకున్నారు. కానీ తెలుగు ప్రజలు మాత్రం స్ట్రాంగ్ బ్రూ కాఫీ తాగినంత స్ట్రాంగ్‌గా నిర్ణయం తీసుకున్నారు. అంతే.. కేవలం తొమ్మిదే తొమ్మిది నెలల్లో ఎన్నికలు రావడం.. పార్టీ స్థాపించిన నాటి నుంచి.. ఎన్నికల పోలింగ్ మధ్య కాలవ్యవధిలో ఎన్టీఆర్.. తన చైతన్యరథంపై సుడిగాలి పర్యటనలు చేస్తూ.. తెలుగు నాట ప్రజల్లో రాజకీయ చైతన్యం కలిగించడంతో.. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయ దుంధుబి మోగించింది. దీంతో ఎన్టీఆర్.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇదంతా ప్రజల కళ్లు ముందు సినిమా రీల్ తిరిగినట్లు గిర్రున తిరిగిపోయింది. కానీ నటసార్వభౌమ రాజకీయంతో ఢిల్లీలోకి కాంగ్రెస్ పెద్దలకు మాత్రం ఈస్ట్ మన్ కలర్‌లో ఎన్టీఆర్ బొమ్మ కనిపించింది. అయితే ఎన్టీఆర్.. లక్ష్మీ పార్వతీని వివాహం చేసుకోవడం... ఆ తర్వాత ఆయన మళ్లీ బంపర్ మెజార్టీతో గెలిచి.. ముఖ్యమంత్రి కావడం.. ఆ క్రమంలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో .. పార్టీ పగ్గాలు చంద్రబాబు అందుకోవడం.. ఆ తర్వాత జరిగిందంతా అందరికీ తెలిసిందే. చంద్రబాబు నాయకత్వంలో తెలుగు దేశం పార్టీ ఇరవై ఆరు ఏళ్లుగా సాగుతోంది. అందులో చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్.. పసుపు పార్టీని గ్లామర్, గ్రామర్‌లో ముందుకు దూకిస్తే..... చంద్రబాబు మాత్రం ఆ పార్టీని గ్రామర్‌తోపాటు ఓ విజన్‌తో ముందుకు నడిపించారు... నడిపిస్తున్నారు. అంతేకాదు.. ఎన్టీఆర్, చంద్రబాబులు రింగ్ మాస్టర్‌లుగా హస్తిన రాజకీయాల్లో సైతం చక్రం తిప్పారు. ఒకానొక సమయంలో అదీ లోక్‌సభలో టీడీపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా అవతరించిందంటే.. ఆ పార్టీ సత్తా ఏమిటో ఇప్పటికే అందరికీ అర్దమై ఉంటుంది. తెలుగు దేశం పార్టీకి బీసీ వర్గమే వెన్నుముక. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండుగా విడిపోయినా.. ఆంధ్రప్రదేశ్‌లో ఆ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా.. అలాగే తెలంగాణలో ఆ పార్టీ ప్రస్తుతం బలహీనంగా ఉన్నా.. రానున్న్ రోజుల్లో బలం పుంజుకుంటోందనడంలో ఎటువంటి సందేహం లేదు. సైకిల్ పార్టీకి క్యాడరు కూడా వెన్నుముకే. తెలుగు రాష్ట్రాల్లో శతాబ్దాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ.. పరిస్థితి ఎలా ఉన్నా.. నలభై వసంతాలు పూర్తి చేసుకొన్న తెలుగు దేశం పార్టీ మాత్రం అమృతం తాగి.. నిత్య యవ్వనంతో.. సైకిల్‌పై పార్టీ షికారు చేస్తోందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎన్టీఆర్ జన్మస్థలమైన కృష్ణాజిల్లా నిమ్మకూరులో కూడా పసుపు పచ్చని పండగ వాతావరణం నెలకొంది. ఇక దేశ విదేశాల్లో కూడా ఈ పసుపు పండగ జరుపుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు తమ్ముళ్లంతా ఊపు ఉత్సాహంతో హడావుడి చేస్తున్నారు. తెలుగు దేశం పార్టీ 40 వసంతాలే కాదు.. నాలుగు వేల వసంతాలైనా.. చెక్కు చెదరకుండా... పున్నమి నాటి చంద్రుడి వలే.. వెన్నెలలు ప్రసరిస్తునే ఉంటోందని అందులో ఎటువంటి సందేహం లేదని లీడర్ నుంచి క్యాడర్ వరకు అంతా పేర్కొనడం విశేషం. గ్రహణ సమయంలో ఏ విధమైన ఇబ్బందులు ఎదురైనా అది తాత్కాలికమేనని వారంతా ఒకే తాటిపైకి వచ్చి ఒకే మాట చెప్పడం మరో విశేషం.
అయితే ఈ నలబై ఏళ్ల పార్టీ ప్రస్థానంలో మొదటి పద్నాలుగేళ్లు ఎన్టీఆర్ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఎనిమిదేళ్లు పని చేశారు. ఎన్టీఆర్ శకంలో రెండు రూపాయిలకు కిలో బియ్యం , ఆడపిల్లలకు ఆస్తి సమానా వాటా హక్కు .. ఇలా అనేక పథకాలు ప్రవేశపెట్టి.. సమాజంలోని ప్రజల ఆశీస్సులను పుష్కలంగా అందుకున్నారు. అంతేకాదు.. తెలుగు నాట... కొత్త వ్యక్తులు రాజకీయ తెరంగ్రేటం చేసేందుకు ఈ పుణ్య పురుషుడు ద్వారాలు తెరిచి సాదరంగా ఆహ్వానించారు. దీంతో యువత..రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆస్కారం ఏర్పడింది. ఇలా తెలుగు నాట ఎన్టీఆర్ ఓ చరిత్ర సృష్టించారు. ఆయన మాట్లాడే మాటాకు.. ఆయన బాటాకు తెలుగు జనాలు నీరాజనాలు పలికారు. ఎన్టీఆర్ పేరులోనే ఓ వైబ్రేషన్స్ ఉందని ఢిల్లీలోని హస్తం పార్టీ పెద్దల చేతి రేఖలు గట్టిగానే అర్థమైందీ. ఆ అవతార పురుషుడితో పెట్టుకుంటే.. మన అవతారాలు మాడి మసి అవుతాయని సదరు ఢిల్లీ పెద్దలకు క్లియర్ కట్‌గా అర్థమైందీ.
టీడీపీ నలభై వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా అందుకు సంబంధించిన లోగోను.. ఆ పార్టీ జాతీయ అద్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. ఎన్టీఆర్‌ది ఓ చరిత్ర.. టీడీపీదీ అదే చరిత్ర అని ఆయన స్పష్టం చేశారు. పార్టీ కోసం కేడర్ అంతా పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. నలభై ఏళ్ల వేడుకలను ఘనంగా తెలుగు నాట ఊరు వాడ అంతా నిర్వహించాలని ఆదేశించారు.
http://www.teluguone.com/news/content/special-story-on-tdp-40-years-25-133635.html





