అస్తమించని సూర్యుడు.. సీమసింహం.. పరిటాల రవీంద్ర‌ చ‌రిత్ర ఇదే..

Publish Date:Jan 24, 2022

Advertisement

పరిటాల రవి.. దివంగత టీడీపీ నేత. 2005 జనవరి 24న ప్రత్యర్థుల చేతిలో పట్టపగలే హత్యకు గురైన ప్రజల మనిషి. చివరి శ్వాస వరకూ ప్రజల సమస్యలపై అలుపెరుగని పోరాటం చేసిన నాయకుడు. అరాచక శక్తులకు సింహస్వప్నంలా తిరుగాడిన నేత. అయితేనేం.. శత్రువులు పకడ్బందీగా పన్నిన పద్యవ్యూహంలో క్షణం పాటు పొరపాటుతో వేసిన ఆయన అడుగే నెత్తుటి మడుగులో ముంచింది. పరిటాల రవి మీద ప్రత్యర్తులు బుల్లెట్ల వర్షం కురిపించి, అనంతపురంలోని తెలుగుదేశం పార్టీ ఆఫీసు ఆవరణలోనే ఆయన ఆఖరి శ్వాసను తీసేశారు దుర్మార్గులు.

తండ్రి శ్రీరాములు, సోదరుడు హరిబాబు సాగించిన భూస్వామ్య వ్యతిరేక పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లిన ప్రజా నాయకుడు పరిటాల రవి. అనంతపురం జిల్లాలోని ముఠా కక్షల నిర్మూలనే జీవిత ధ్యేయంగా ప్రతి క్షణమూ తపించారు పరిటాల రవి. ఏపీలో తొలి మండల వ్యవస్థకు జరిగిన ఎన్నికల్లో పరిటాల రవి మద్దతుతో రామగిరి మండల అధ్యక్ష పదవికి రంగంలో దిగిన దళితుడు ఓబన్న అత్యధిక మెజార్టీతో విజయం సాధించడంతో రవి రాజకీయ రంగంలో తొలిసారిగా తన ఉనికికి చాటుకున్నారు పరిటాల రవి. భారీ పోలీస్ బందోబస్తుతో ఎన్నికల ప్రచారానికి వచ్చిన చెన్నారెడ్డిని రామగిరి మండలంలో  కాలిడనివ్వకుండా పరిటాల రవి ఆత్మాహుతి దళంతో అడ్డుకున్నారు. రవి చేసిన ఈ చర్యతో బడుగు బలహీన వర్గాలకు కొండంత బలాన్నిచ్చింది.

1991 నుంచి ప్రత్యర్థులు పెనుగొండ, ధర్మవరం ప్రాంతాలపై విశృంఖల స్వైర విహారంతో విరుచుకుపడ్డారు. హత్యలు, అపహరణలు, మానభంగాలు నిత్యకృత్యం అయ్యాయి. అలాంటి అరాచక శక్తులతో ఎదురొడ్డి పోరాడిన పరిటాల రవి స్థానికుల్లో హీరో అయ్యారు. తనపై, తన అనుచరులపై నక్సలైట్ల ముద్ర వేసి హతమార్చాలనే ప్రయత్నం జరుగుతోందని తెలుసుకున్న రవి 1992లో జిల్లా ఎస్పీ కేవీ రెడ్డి సమక్షంలో పోలీసుల ఎదుట లొంగిపోయారు.

1993 జూన్ 7న పరిటాల రవి తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీలో చేరిన రవికి అనంతపురం జిల్లాతో పాటు మొత్తం రాయలసీమ టీడీపీ కార్యకర్తలు, సానుభూతిపరులు పరిటాల రవికి బ్రహ్మరథం పట్టారు. మద్దెలచెరువు టీవీ బాంబు కేసులో జైలులో ఉన్న రవి జైలు నుంచే టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ వేసి, అన్ని అవాంతరాలు అధిగమించి అత్యధిక మెజార్టీతో విజయం సాధించారు. పరిటాల రవి తొలిసారిగా అసెంబ్లీకి ఎన్నికైనా.. అప్పటి సీఎం ఎన్టీ రామారావు కేబినెట్ లో కార్మికశాఖ మంత్రి పదవి వరించింది. ఇక ఆ తర్వాత అనంపురం జిల్లా చరిత్రే పరిటాల రవి అడుగుజాడల్లో నడిచిందంటే అతిశయోక్తి కాదు.

పరిటాల రవి తన బలంతో శత్రు సంహారం చేస్తాడని ప్రత్యర్థులు భయపడ్డారు. వారి భయాలు, అంచనాలను చిత్తు చేశారు పరిటాల రవి. అనేక గ్రామాల్లోని వివిధ ఫ్యాక్షన్ గ్రూపుల మధ్య సయోధ్య కుదిర్చారు. ఫ్యాక్షన్ బాధిత కుటుంబాలకు పునరావాసమూ కల్పించారు. జిల్లాను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు కృషిచేశారు. ఆ తర్వాత టీడీపీ పగ్గాలను, సీఎం పదవిని ఆయన అల్లుడు చంద్రబాబు నాయుడు చేపట్టారు. ఎనిమిదేళ్లు కేబినెట్ మంత్రిగా పనిచేసిన పరిటార రవి ఎన్టీఆర్ మరణానంతరం శాసన సభ్యత్వానికి రాజీనామా చేశారు. తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో మరోసారి విజయం సాధించి చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీలో చేరారు. 

1997లొ తన తండ్రి జీవిత కథ ఆధారంగా తాను నిర్మిస్తున్న ‘శ్రీరాములయ్య’ సినిమా ముహూర్తం నవంబర్ 19న కారుబాంబు పేలుడులో తీవ్రంగా గాయపడినా ప్రాణాలతో బయటపడ్డారు. నసనకోట వద్ద శిథిలావస్థలో ఉన్న రాయల కాలంనాటి దేవాలయాన్ని 2003లో ఎంతో శ్రమతో పునరుద్ధరించారు. అదే ఆలయం ప్రాంగణంలో రెండున్నర లక్షల మంది ప్రజల సమక్షంలో పరిటాల రవి 550 జంటలకు సామూహిక వివాహాలు చేయించారు. 2004 ఫిబ్రవరిలో మరో 1,116 జంటలకు పెళ్లిళ్లు జరిపించారు.

2004లో టీడీపీ పరాజయం పాలైంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అనంతపురం జిల్లాలో పరిటాల రవి అనుచరుల ఏరివేత ప్రారంభించింది. రవిపై ఉన్న పాత కేసులు తిరగదోడింది. తన ప్రాణానికి ముప్పు ఉందని, సరైన రక్షణ కల్పించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు పరిటాల రవి. దీంతో రవికి అప్పటి వరకు రక్షణగా ఉండే గన్ మెన్ సంఖ్యను రెండుకు తగ్గించింది కాంగ్రెస్ సర్కార్. రవి ఇళ్లలో సోదాలు జరిగాయి. తెలుగుదేశం అనుచరులు, మద్దతుదారుల మీద దాడులు, హత్యల పరంపర కొనసాగింది.

ఇక తన ప్రాణాలకు వాటిల్లే పరిస్థితి వచ్చిందని తెలుసుకున్న రవి మానసికంగా అన్నింటికీ సిద్ధం అయ్యారు. తన ఒక్కడి ప్రాణాలను రక్షించుకోవడం కోసం తనను నమ్ముకున్న ప్రజలను వదిలిపెట్టి వెళ్లే ప్రసక్తే లేదని నిర్ణయించుకున్నారు. 2005 జనవరి 24న అనంతపురం టీడీపీ ఆఫీసులో అనేక మంది అతిరథ మహారథులు, పార్టీ శ్రేణులు, నాయకులు, సాయుధులైన అంగరక్షకులు ఉండగానే పరిటాల రవిపై ప్రత్యర్థులు గుళ్ల వర్షం కురిపించారు. ప్రజల నాయకుడిని నెత్తుటి మడుగులో నింపేశారు.

దివంగత జననేత పరిటాల రవికి స్వగ్రామం రామగిరి మండలం వెంకటాపురంలో ప్రతి ఏటా వర్ధంతి కార్యక్రమం జరుగుతోంది. కుల, మత, ప్రాంతాలకు అతీతమైన వ్యక్తిత్వంతో ప్రాణం ఇచ్చే అసంఖ్యాకమైన అభిమానులను సంపాదించుకుని ‘అస్తమించని సూర్యుడు రవి’ అని ప్రజల గుండెల్లో నిలిచిపోయారు.

By
en-us Political News

  
తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరు తారక రామ రావు,,జయంతి రేపు.(శనివారం) 1923 మే 23 న జన్మిచిన ఎన్టీఅర్, 1996 జనవరి 18 కన్ను మూశారు. అప్పటి నుంచి తెలుగు దేశం పార్టీ, హైదరాబాద్’లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ప్రతి సంవత్సరం ఎన్టీఅర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తోంది. ఈ సంవత్సరం కూడా, తెలంగాణ తెలుగు దేశం పార్టీ ఎన్టీఆర్ జయంతి వేడుకలు నిర్వహిస్తోంది. అయితే, ఈ సంవత్సరం వేడుకలకు ఒక ప్రత్యేకత వుంది. ముఖ్యంత్రి కేసీఆర్ జయంతి వేడుకలకు హాజరవుతున్నారు.
స్పీకర్ పదవికి ఒక గౌరవం ఉంటుంది. ఆ పదవిలో ఉన్న వారు రాజకీయాలు మాట్లాడరు. తాము గెలిచి వచ్చిన పార్టీ కార్యక్రమాలలో పాల్గొనరు. బాధ్యత గలిగిన రాజ్యాంగ పదవుల్లో ఉన్న ఎవరైనా పాటించాల్సిన నైతికత ఇది. అలాంటి బాధ్యత కలిగిన రాజ్యంగ పదవిలో ఉన్న తమ్మినేని ఆ గౌరవానికి తగరని తన వ్యాఖ్యలతో నిరూపించుకున్నారు. తెలుగుదేశం మహానాడుపై అనుచిత వ్యాఖ్యలతో బరితెగించి స్పీకర్ పదవికి మాయని మచ్చ తీసుకొచ్చారు. మహానాడును వల్లకాడనీ, చచ్చిపోయిన పార్టీకి దహన సంస్కారాలు చేస్తున్నారనీ సంస్కార హీనమైన వ్యాఖ్యలు చేశారు.
రాజకీయాలలో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరంటారు. కానీ దొంగ శత్రువులు ఉంటారా అంటే మాత్రం కచ్చితంగా ఉంటారంటూ మోడీ, కేసీఆర్ లను చూపుతున్నారు రాజకీయ పరిశీలకులు. ప్రధాని నరేంద్రమోడీ హైదరాబాద్ పర్యటనకు వస్తే కేసీఆర్ నగరం విడిచి వెళ్లడం రాజకీయ కుమ్మక్కులో భాగమేనంటున్నారు. కాంగ్రెస్ ముక్త్ భారత్ అన్న మోడీ నినాదాన్ని కేసీఆర్ అందిపుచ్చుకుని దానిని తెలంగాణకు అనుగుణంగా కాంగ్రెస్ ముక్త తెలంగాణగా సవరించుకున్నారని, ఆ లక్ష్యం సాధించేందుకే బీజేపీకి రాష్ట్రంలో లేని ప్రాధాన్యతకు కట్టబెడుతున్నారన్నది వారి విశ్లేషణ. క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ బలం చెక్కు చెదరకపోవడం, నేతలు బలహీనపడినా కార్యకర్తల బలం తెలంగాణలో కాంగ్రెస్ కు ఎలా ఉన్నది అలాగే ఉండటాన్ని వారు ఎత్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే రెండు ధఫాలు వరుసగా అధికారంలో ఉన్న టీఆర్ఎస్ తీవ్రమైన యాంటీ ఇన్ కంబెన్సీని ఎదుర్కొంటోందనీ, ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాంగ్రెస్ వైపు మళ్ల కుండా ఉండాలంటే బీజేపీ బలోపేతం అయ్యిందన్న భావన ప్రజలలో కలిగించేందుకే ఆ పార్టీకి అధిక ప్రాధాన్యతను కేసీఆర్ ఇస్తున్నారని పరిశీలకులు అంటున్నారు.
మరో రెండు మూడు నెలలు ఆగండి, మీకో సంచలన వార్త చెపుతా .. గురువారం బెంగుళూరు వెళ్లి మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామితో భేటీ అనంతరం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన మరో సంచలన ప్రకటన ఇది. ఇంతకీ ఆయన ఏమన్నారంటే, “జాతీయస్థాయిలో మార్పు రాబోతోంది.. దాన్ని ఎవరూ ఆపలేరు. రెండు మూడు నెలల తర్వాత మీకు సంచలన వార్త అందుతుంది” అని మీడియాకు చెప్పారు.అయితే ఆ సంచలన ప్రకటన ఏమిటో, ఆయన మనసులో ఏముందో మాత్రం ఆయన బయట పెట్టలేదు. కానీ, ఆయన బెంగుళూరు నుంచి హైదరాబాద్ బయలుదేరిన తర్వాత, కుమార స్వామి అసలు గుట్టు విప్పేశారు.
విజయనగరం జిల్లాలో జరగాల్సిన సామాజిక న్యాయ భేరి బస్సు యాత్ర రద్దైంది. మంత్రి బొత్ ఇలాకాలోనే సామాజిక న్యాయ భేరి వైఫల్యం ఆ పార్టీని తీవ్ర నిరాశలో ముంచేసింది. సామాజిక న్యాయ భేరి విజయనగరంలో రద్దు కావడానికి వర్షం కారణమంటూ నేతలు నెపం వర్షం మీదకు తోసేస్తున్నారు
ఆంధ్ర ప్రదేశ్’ ప్రభుత్వం మరో మూడు రోజుల్లో మూడేళ్ళు పూర్తి చేసుకుంటోంది. 2019 మే 30 తేదీన వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఎన్నికల ప్రచారంలో ఒక్క ఛాన్స్ అని వేడుకున్న జగన్ రెడ్డి, ప్రమాణ స్వీకారం వేదిక నుంచే, ఆరు నెలల్లో అద్భుతాలు సృష్టిస్తానని, బ్రహ్మాండం బద్దలు చేస్తాని ప్రజలకు వాగ్దానం చేశారు. వరస పెట్టి హామీలు గుప్పించారు. కానీ, ఆరు నెలలు మూడేళ్ళు అయినా, పరిస్థితిలో మార్పులేదు.
తెలుుదేశం అంటే చైతన్యం. తెలుగుదేశం అంటే అభివృద్ధి, తెలుగుదేశం అంటే సంక్షేమం. అలాంటి తెలుగుదేశం పార్టీని అంతమొందించడం ఎవరి తరం కాదు. తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలను ఎంతగా ఇబ్బందులకు గురి చేస్తే అంతకు రెట్టింపు ఉత్సాహంతో ముందుకు సాగుతారు. ఒంగోలులో రెండు రోజుల పాటు జరిగే మహానాడు కార్యక్రమంలో తొలి రోజు శుక్రవారం చంద్రబాబు ప్రారంభోత్సవంలో చంద్రబాబు తొలి పలుకులివి.
తెలుగుదేశం ఎమ్మెల్యే బాలకృష్ణ కాన్వాయ్ ను పోలీసులు అడ్డుకున్నారు. ఆయన సొంత నియోజకవర్గం హిందూపురంలోనే పోలీసులు ఆయన కాన్వాయ్ ను అడ్డుకున్నారు. చితమత్తూరు మండలంలోని కొడికొండ గ్రామం వద్ద ఈ సంఘటన శుక్రవారం జరిగింది.
సిక్సర్ల సిద్ధూగా క్రికెట్ అభిమానులను అలరించిన నవజోత్ సింగ్ సిద్ధు ఆ తరువాత రాజకీయ నాయకుడి అవతారం ఎత్తాడు. తన దైన వాగ్ధాటితో పంజాబ్ రాజకీయాలలో అగ్రతారగా ఎదిగాడు. పంజాబ్ ముఖ్యమంత్రి పదవిపై కన్నేశారు. అయితే ఇటీవలి పంజాబ్ ఎన్నికలలో కాంగ్రెస్ పరాజయం పాలవడంతో ఆ ఆశలు నెరవేరలేదు. ఈ లోగా 1988 నాటి కేసులో సిద్ధూకు కోర్టు జైలు శిక్ష విధించింది.
ఒంగోలుకు జనం పోటెత్తారు.. వందల్లో, వేలల్లో కాదు లక్షల్లో అవధులు లేని ఉత్సాహంతో మహానాడుకు తరలి వచ్చిన తెలుగు తమ్ముళ్లతో ఒంగోలు పట్టణం కక్కిరిసి పోయింది. ఒంగోలుకు తరలి వస్తున్న జన ప్రవాహాన్ని చూసేందుకు ఒంగోలు ప్రజ ఒక్కుదుటన రోడ్ల పైకి వచ్చారు. దీంతో ఒంగోలులో ఏ వీధి చూసినా ఇసుక వేస్తే రాలనంత మంది జనం కనిపిస్తున్నారు. దీంతో ఒంగోలు పట్టణం ఉక్కిరి బిక్కిరైపోయింది. గురువారం సాయంత్రం నుంచే ఒంగోలుకు జన ప్రవాహం ఆరంభమైంది. నిముష నిముషానికీ అది పెరిగి ఒంగోలును జన సునామీ ముంచెత్తిందా అనిపించేలా పోటెత్తింది.
పంచ్ ప్రభాకర్.. ఏపీ హైకోర్టు పంచ్ ప్రభాకర్ ను అరెస్టు చేయాలని సీబీఐకి పలుమార్లు ఆదేశాలిచ్చింది. కానీ అతగాడు పరారీలో ఉన్నాడంటూ అన్ని మార్లూ సీబీఐ కోర్టుకు నివేదించింది. ఏపీ హైకోర్టు తీర్పులు, ఆ తీర్పులు ఇచ్చిన న్యాయమూర్తలకు వ్యతిరేకంగా సామాజిక మాధ్యమంలో పోస్టులు, వీడియోలు పెట్టిన కేసులో నిందితుడు అయిన పంచ్ ప్రభాకర్ దావోస్ లో దర్జాగా తిరుగుతున్నాడు.
కేంద్రపాలిత ప్రాంతంగా హైదరాబాద్ ప్రతిపాదన మళ్లీ తెరపైకి వస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. గతంలో అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ సమయంలో ఈ ప్రతిపాదన బలంగా తెరపైకి వచ్చింది. అప్పట్లో ఈ ప్రతిపాదనకు ప్రస్తుత తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూడా అంగీకారం తెలిపారు. అయితే తరువాత ఈ ప్రతిపాదన మరుగున పడింది. హైదరాబాద్ ను రెండు తెలుగు రాష్ట్రాల రాజధానిగా నిర్ణయించారు.
ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ద్విదశాబ్ది వార్షికోత్సవం, స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ గురువారం హైదరాబాద్ వచ్చారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన మోడీకి బేగంపేట విమానాశ్రయంలో బీజేపీ నేతలు, శ్రేణులు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం ప్రాంగణంలోనే బీజేపీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడిన మోడీ తెలంగాణ సీఎం కేసీఆర్ పై విమర్శలు సంధించారు. బేగంపేట నుంచి హెలికాప్టర్ లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ లో దిగారు. అక్కడి నుంచి రెండు కిలోమీటర్ల దూరంలోని ఐఎస్ బీ వరకు రోడ్డు మార్గంలో వెళ్లారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.