తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపుకు ప్రత్యేక కార్యాచరణ : మంత్రి పొన్నం

Publish Date:Jun 4, 2026

Advertisement

 

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరినీ గుర్తించి వారికి సముచిత గౌరవం కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు, గౌరవం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సమావేశం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సమావేశంలో కమిటీ చైర్మన్ కే. కేశవరావు, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీలు కోదండరాం, అద్దంకి దయాకర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారి వివరాలను సేకరించి పారదర్శకంగా అర్హుల జాబితాను రూపొందించేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను కమిటీ ఆదేశించింది.

ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ కే. కేశవరావు మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమకారులను గుర్తించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసిందని తెలిపారు. ఉద్యమానికి మద్దతు తెలిపిన రాజకీయ పార్టీల అభిప్రాయాలు, సూచనలు స్వీకరించేందుకు అఖిలపక్ష సమావేశం నిర్వహించినట్లు చెప్పారు. కేవలం రాజకీయ పార్టీలకే కాకుండా విద్యార్థి సంఘాలు, న్యాయవాదులు, వైద్యులు, జర్నలిస్టులు, ప్రజా సంఘాలు, ఉద్యమంలో భాగమైన వివిధ వర్గాలతో కూడా సమావేశాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

మొదటి దశలో ఉద్యమకారులను గుర్తించే ప్రక్రియ చేపడతామని, ముఖ్యంగా తొలి తరం ఉద్యమకారుల వివరాలను సేకరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. కమిటీ నివేదికను నిర్దిష్ట గడువులో ప్రభుత్వానికి అందించేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, ప్రజాపాలన ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేయాలనే సంకల్పంతో ఈ కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. ఉద్యమ సమయంలో గాయపడినవారు, కేసులు ఎదుర్కొన్నవారు, జైలు శిక్ష అనుభవించినవారు, అలాగే కవులు, కళాకారులు, వివిధ రంగాల కార్యకర్తలను గుర్తించి గౌరవించే దిశగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

అమరవీరుల స్మారక స్థలం వద్ద కమిటీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించిన ఆయన, రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరి సూచనలు, సలహాలను స్వీకరిస్తామని తెలిపారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానాల్లో దరఖాస్తులు, విజ్ఞప్తులు స్వీకరించనున్నట్లు చెప్పారు. ఎమ్మెల్సీ కోదండరాం మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వివిధ జేఏసీలు, విశ్వవిద్యాలయాల విద్యార్థి సంఘాలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. ఉద్యమంలో తమ యవ్వనాన్ని, జీవితాన్ని అంకితం చేసిన వారికి ప్రభుత్వం గుర్తింపు ఇవ్వాలని వారు కోరుకుంటున్నారని చెప్పారు.

ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మాట్లాడుతూ, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, వివిధ సామాజిక వర్గాలతో సమావేశాలు నిర్వహించి వారి అభిప్రాయాలను సేకరిస్తామని తెలిపారు. 1969 తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారిని కూడా గుర్తించాలని సమావేశంలో పలువురు సూచించారని చెప్పారు. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసినవారు, గాయపడినవారు, కేసులు ఎదుర్కొన్నవారందరినీ గుర్తించి గౌరవించడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన అని పేర్కొన్నారు.మొదటి దశలో రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకున్న కమిటీ, తదుపరి దశలో అన్ని వర్గాల అభిప్రాయాలను సేకరించి సమగ్ర నివేదికను సిద్ధం చేయనుంది.
 

By
en-us Political News

  
భాగ్యనగర ప్రజలకు అలర్ట్. నగరంలోని నాంపల్లి పరిసర ప్రాంతాల్లో ప్రయాణించే వాహనదారులకు హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీస్ విభాగం కీలక సూచనలు చేసింది.
తెలంగాణ క్రికెట్‌లో సరికొత్త అధ్యాయానికి తెరలేచింది
హైదరాబాద్ నగర గుండెకాయ లాంటి నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సరికొత్త ప్రస్థానానికి సిద్ధమైంది.
న్యూ చండీగఢ్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా పరుగుల పండగ చేసుకుంది.
తనను చూడాలని ఉందటూ.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వృద్ధుడి వీడియోపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు.
కూకట్‌పల్లిలోని కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్లో అర్ధరాత్రి నిర్వహించిన ఓ సీక్రెట్ ఆపరేషన్ ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణవ్యాప్తంగా వేసవి సెలవులను ఎంజాయ్ చేస్తున్న విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు రాష్ట్ర విద్యాశాఖ ఒక అతి ముఖ్యమైన శుభవార్తను అందించింది.
ఏపీలో కూటమి పాలనలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతున్నట్టే 108 అంబులెన్స్ సర్వీసులూ లక్షలాదిమందికి ప్రాణదాతగా నిలుస్తూ సమర్థతను చాటుకుంటున్నాయి.
సినీ రంగంలో నటుడిగా, అద్భుతమైన కొరియోగ్రాఫర్‌గా, విలక్షణ దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాఘవ లారెన్స్ చుట్టూ ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.
భాష్యం విద్యాసంస్థల చైర్మన్‌గా సుపరిచితులైన భాష్యం రామకృష్ణ.
ఒడిశా రాష్ట్రంలో వెలుగుచూసిన ఒక ప్రభుత్వ ఇంజనీర్ అవినీతి ఉదంతం ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.
కూకట్‌పల్లి మంజీరా మాల్‌లోని కింగ్ & క్వీన్స్ పబ్ రాత్రి సాధారణంగా హడావుడిగా ఉండే ప్రదేశమే.
గతంలో కంప్యూటర్లు కొత్తగా వచ్చినప్పుడు కూడా ఇలాంటి భయాలే వ్యక్తమయ్యాయి. కంప్యూటర్లు వస్తే అకౌంటెంట్లు, క్లర్కుల ఉద్యోగాలు పోతాయని అంతా భావించారు. కానీ వాస్తవంగా జరిగిందేమిటి? కంప్యూటర్ల వల్ల పాత ఉద్యోగ పద్ధతులు మారాయి తప్ప ఉద్యోగాలు తగ్గలేదు.. సరికదా మరిన్ని అవకాశాలు వచ్చాయి. సాఫ్ట్‌వేర్ అనే రంగం తెరమీదకు వచ్చింది. కోట్లాది మందికి సరికొత్త ఉపాధి లభించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.