ఐదో టి20లో సఫారీలు చిత్తు..టి20 సిరీస్ టీమ్ ఇండియా కైవసం
Publish Date:Dec 19, 2025
Advertisement
దక్షిణాఫ్రికాతో ఐదు టి20ల సిరీస్ ను టీమ్ ఇండియా 3-1 తేడాతో కైవసం చేసుుకుంది. అహ్మదాబాద్ లోని నరేంద్రమోడీ స్టేడియంలో శుక్రవారం (డిసెంబర్ 19) రాత్రి జరిగిన చివరి ఐదో టి20 మ్యాచ్ లో టీమ్ ఇండియా సఫారీలను 30 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ కోల్పోయి తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా నిర్నీత 20 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 231 పరుగుల భారీ స్కోరు సాధించింది. 232 పరుగులు విజయ లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి కేవలం 201 పరుగులు మాత్రమే చేసి పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ కు ఓపెనర్లు సంజూ శాంసన్, అభిషేక్ శర్మ అదిరే ఆరంభాన్నిచ్చారు. సంజు శాంసన్ 22 బంతుల్లో 37 పరుగులు, . అభిషేక్ శర్మ 21 బంతుల్లో34 పరుగులు చేశాడు. ఆ తరువాత తిలక్ వర్మ, హార్ధిక్ పాండ్యాలు పరుగుల సునామీ సృష్టించారు. ముఖ్యంగా హార్ధిక్ పాండ్యా ఆకాశమే హద్దుగా చెలరేగి పాతిక బంతుల్లో 65 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అతడు కేవలం 16 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. అలాగే తిలక్ వర్మ 42 బంతుల్లో 73 పరుగులు చేశాడు. ఇక భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి అద్భుతంగా రాణించి నాలుగు వికెట్లు తీసుకున్నాడు. బుమ్రా రెండు వికెట్లు పడగొట్టగా, హర్షదీప్ సింగ్, హార్ధిక్ పాండ్యా చెరో వికెట్ తీసుకున్నారు.ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ హార్ధిక్ పాండ్యాకు దక్కింది. ఇక ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా వరుణ్ చక్రవర్తి నిలిచాడు.
భారీ విజయలక్ష్యంతో భాటింగ్ ఆరంభించిన దక్షిణాఫ్రికాకు ఓపెనర్ క్వింటన్ డికాక్ అద్భుత ఆరంభాన్ని అందించాడు. డికాక్ దూకుడుగా ఆడటంతో పవర్ ప్లే ముగిసే సరికి దక్షిణాఫ్రికా ప వికెట్ కోల్పోకుండా 67 పరుగులు చేసి మంచి స్థితిలో ఉంది. ఆ తరువాత 13 పరుగులు చేసిన హండ్రిక్స్ ఔటయ్యాడు. అయితే డికాక్ దూకుడు కొనసాగించాడు. డికాక్ క్రీజ్ లో ఉన్నంత సేపూ దక్షిణాఫ్రికా లక్షాన్ని ఛేదిస్తుందనే అనిపించింది. అయితే 11వ ఓవర్‌లో జస్ప్రీత్ బుమ్రా డికాక్ ను కాట్ అండ్ బౌల్డ్ గా పెవిలియన్ కు పంపాడు. డీకార్ డికాక్ 35 బంతుల్లో 65 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఆ తర్వాత దక్షిణాఫ్రికా లయ కోల్పోయింది. బ్యాట్స్ మన్ పరుగుల కోసం అంత చలిలోనూ చెమటోడ్చాల్సి వచ్చింది. దీంతో సాధించాల్సిన రన్ రేట్ పెరిగిపోయింది. డికాక్ ఔటైన తర్వాత 5 ఓవర్లలో ఆఫ్రికా 38 పరుగులు మాత్రమే చేయగలిగిందంటే.. భారత బౌలర్లు ఎంత కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారో అర్ధమౌతుంది. డివాల్డ్ బ్రెవిస్ (31) ధాటిగా ఆడినా ఫలితం లేకపోయింది.
http://www.teluguone.com/news/content/south-africa-defeated-in-fifth-t20-36-211288.html





