Publish Date:Dec 22, 2025
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో చారిత్రక ప్రయోగానికి రెడీ అయిపోయింది. ఎల్వీఎం 3 బాహుబలి రాకెట్ ద్వారా బ్లూబర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహాన్ని ఈ నెల 24 ప్రయోగించనుంది. ఇది సెల్యులార్ కవరేజ్ లేని ప్రాంతాలకు సేవలు అందించడమే లక్ష్యంగా చేపట్టిన భారీ మిషన్. 4జీ, 5జీ సిగ్నల్‌ను నేరుగా సాధారణ స్మార్ట్‌ఫోన్‌లకు అందించడానికి ఉద్దేశించిన ప్రయోం. ఈ నెల 24 ఉదయం 8:54 నిమిషాలకు ఎల్వీఎం 3 శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి అంతరిక్షానికి దూసుకెళ్లనుంది.
ఎల్వీఎం 3 సిరీస్ లో ఇది తొమ్మిదది. ఈ ఏడాది ఇస్రో చేపట్టిన అయిదో ప్రయోగం ఇది. అమెరికాకు చెందిన ఏఎస్‌టీ స్పేస్‌మొబైల్ అభివృద్ధి చేసిన బ్లూబర్డ్ బ్లాక్ 2, ఉపగ్రహ టెలికమ్యూనికేషన్స్‌లో ఓ వ్యూహాత్మక ప్రయోగంగా భావిస్తున్నారు. బ్లూబర్డ్ బ్లాక్ శాటిలైట్ బరువు 6,100 కిలోలు. ఈ బాహుబలి రాకెట్ ఎత్తు 43.5 మీటర్లు. 640 టన్నుల బరువు. ఈ ప్రయోగం విజయవంతమైతే కమ్యూనికేషన్ల ముఖచిత్రం మారిపోతుందంటున్నారు. ఇలా ఉండగా ఈ బాహుబలి రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని కోరుతూ ఇస్రో ఛైర్మన్ వి. నారాయణన్ తిరుమల శ్రీవారి ఆలయంలో బ్లూబర్డ్ 2 ఉపగ్రహానికి పూజలు చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/isro-chairman-prayers-lord-tirumala-36-211381.html
రెండో విడతలో భాగంగా బుధవారం యండ్రాయి, వడ్డమాను గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ ఆరంభమైంది. మొత్తం ఏడు గ్రామాల్లో దశలవారీగా అమలు చేయనున్న ఈ కార్యక్రమం వైకుంఠపురం, పెద్దమద్దూరు, యండ్రాయి, కర్లపూడి, వడ్డమాను, హరిచంద్రాపురం, పెద్దపరిమి గ్రామాలలో కొనసాగుతుంది.
శాస్త్రోక్తంగా పది రోజుల పాటు భక్తులకు ఉత్తర ద్వార దర్శనాలకు అవకాశం కల్పించిన తిరుమల తిరుపతి దేవస్థానం గురువారం అర్ధరాత్రి నిర్వహించే ఏకాంత సేవ సమయంలో పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఉత్తర ద్వారాలను అధికారికంగా మూసివేయనుంది.
2027 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం ఇవ్వాలన్న లక్ష్యంతో చంద్రబాబు ప్రభుత్వం ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే. కాగా ప్రాజెక్టు పనులు ఇప్పటికే 88 శాతం మేర పూర్తి అయ్యాయి.
ఐసీసీ బంగ్లాదేశ్ జట్టు భారత్‌కు వచ్చి ఆడాల్సిందేనని, లేకుంటే ఆయా మ్యాచ్‌ల పాయింట్లను కోల్పోవాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది.
ఈ సంస్థ వలలో పడి 1,044 మంది మోసపోయినట్లు పోలీసుల దర్యాప్తులో చేరింది. ఎల్బీఎఫ్ బాధితుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే అత్యధికులని తేలింది. ఈ సంస్థపై కృష్ణా జిల్లా విస్సన్నపేట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తమిళనాడుతో పాటు పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లోకూడా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. వచ్చే 48 గంటలలో ఈ వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశాలున్నాయని పేర్కొంది.
ఆ వెంటనే కవిత బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికీ, బీఆర్ఎస్ ద్వారా తనకు లభించిన శాసనమండలి సభ్యత్వానికి కూడా అప్పుడే రాజీనామా చేశారు. ఆ రాజీనామాను మండలి చైర్మన్ ఇప్పుడు ఆమోదించారు.
బ్లో ఔట్ కారణంగా ఎగజిమ్ముతున్న మంటలను ఒకే సారి నియంత్రిస్తే సాంకేతిక సమస్యలు తలెత్తే అవకాశం ఉందనీ, అందుకే దశలవారీగా మంటల అదుపునకు ప్రయత్నాలు చేస్తున్నామనీ ఓఎన్జీసీ అధికారులు తెలిపారు.
పోలీసులు పలు క్లబ్లులు, పేకాట రాయుళ్లపై కేసులు నమోదు చేశారు.
ఈ నేపథ్యంలోనే 13 ముక్కల పేకాటకు అనుమతి ఇవ్వాలంటూ భీమవరం పట్టణంలోని కొన్ని క్లబ్బులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి.
ఆక్రమణల తొలగింపు కోసం ఢిల్లీ మునిసిపల్ కార్పొరేష్ బుధవారం తెల్లవారు జామున కూల్చివేతల డ్రైవ్ చేపట్టింది. ఈ కూల్చివేతలను స్థానికులు తీవ్రంగా వ్యతిరేకించారు. కూల్చివేతల ప్రాంతంలో ఏర్పాటు చేసిన బారికేడ్లను దాటుకుని వచ్చి మరీ పోలీసులపై రాళ్లు రువ్వారు.
ఖమ్మం నుండి విశాఖపట్నం వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో షార్ట్ సర్క్యూట్ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
బస్సు కొవ్వూరు ఫ్లైఓవర్‌పైకి చేరుకున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టును సీఎం చంద్రబాబు రేపు సందర్శించనున్నారు. ప్రాజెక్టు నిర్మాణం పనుల పురోగతిని సీఎం స్వయంగా పరిశీలించనున్నారు.
టీటీడీ శ్రీవాణి దర్శన టికెట్ల జారీ విధానంలో మార్పులు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.