కేసీఆర్ తో భేటీకి సోనియా నో.. తెలంగాణ సీఎంకు ఎక్కడా దొరకని ఆసరా!

Publish Date:May 24, 2022

Advertisement

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జాతీయ రాజకీయ ప్రవేశం ప్రయత్నాలు ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కి చందంలా  సాగుతున్నాయి. ఆయన ఇటీవల దేశ వ్యాప్త పర్యటన అంటూ  చేపట్టిన టూర్ ఒక ఫార్స్ గా మారింది.

జాతీయ స్థాయిలో బీజేపీయేతర, కాంగ్రెసేతర ఫ్రంట్ అంటూ ఆయన చేసిన ప్రయత్నంతో బీజేపీతో పూర్తిగా తెగదెంపులు అయిపోయింది. ఇక మళ్లీ బీజేపీతో సంబంధాలు రివైవ్ చేసుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఒక విధంగా చెప్పాలంటే కేసీఆర్ దరి చేరాలని భావించినా బీజేపీ దగ్గరకు రానిచ్చే పరిస్థితి లేదు. దీంతో ఆయన కాంగ్రెస్ కు చేరువ కావడానికి చేసిన ప్రయత్నాలు కూడా బెడిసి కొట్టినట్లు చెబుతున్నారు.

తన హస్తిన పర్యటనలో భాగంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో భేటీ అయ్యేందుకు చేసిన ప్రయత్నాలు కూడా బెడిసికొట్టాయని చెబుతున్నారు. కాంగ్రెస్ లో అత్యంత విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం సోనియా గాంధీతో భేటీ కోసం ఆయన ప్రయత్నించారు, ఆ సమాచారాన్ని కాంగ్రెస్ లోని తన పరిచయస్తుల ద్వారా ఆమెకు చేరవేశారు. అయతే కేసీఆర్ తో భేటీకి సోనియా తిరస్కరించారు. సోనియా గాంధీని కలసి రాష్ట్రపతి ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిని నిలిపితే తాను బేషరతుగా మద్దతు ఇస్తానని కేసీఆర్ ఆమెకు తెలియ జేయాలని భావించినట్లు చెబుతున్నారు. అయితే కేసీఆర్ తో భేటీకి సోనియా నిరాకరించారనీ ఆ వర్గాలు తెలిపాయి.  

ఇంత కాలం కాంగ్రెస్ లక్ష్యంగా కేసీఆర్ విమర్శలు, తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా సకుటుంబంగా సోనియా గాంధీని కలిసి పార్టీని విలీనం చేస్తామంటూ ఇచ్చిన హామీని ఉల్లంఘించిన సంఘటనలపై సోనియా ఇప్పటికీ ఆగ్రహంగా ఉన్నట్లు ఆ వర్గాల సమాచారం. ఆ కారణంగానే కేసీఆర్ తో భేటికీ ఆమె ససేమిరా అన్నట్లు తెలుస్తోంది. ఇటు బీజేపీతోనూ, అటు కాంగ్రెస్ తోనూ చెడి ఇప్పుడు కేసీఆర్ జాతీయ రాజకీయ ఎరీనాపై ఒంటరిగా నిలబడిపోయారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆ పరిస్థితుల్లో ఆయన జాతీయ అజెండాకు మద్దతు లభించే అవకాశాలు ఇసుమంతైనా లేవంటున్నారు. జాతీయ అజెండా సంగతి అటుంచితే.. ఇటు తెలంగాణలోనే ఆయనకు గడ్డు పరిస్థితి ఎదురౌతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

ఇక రాష్ట్ర పర్యటనకు గురువారం రానున్న ప్రధాని నరేంద్ర మోడీని అవాయిడ్ చేసేందుకు ఏ పర్యటన పెట్టుకుంటారని బీజేపీ ఎద్దేవా చేస్తున్న పరిస్థితిని కేసీఆర్ ఎదుర్కొంటున్నారు.   తన కుమారుడికి రాష్ట్రాన్ని అప్పగించి తాను జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలన్న అకాంక్షను సాకారం చేసుకునేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలు ఒక్కొటొక్కటిగా విఫలం కావడంతో రాష్ట్రంలో కూడా ఆ పార్టీ నేతల జోరు మందగించింది. ఎనిమిదేళ్లుగా అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంటున్నది. దానిని అధిగమింయి మరోసారి అధికారంలోకి వచ్చేందుకు ఆయన తన జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పుతున్న బిల్డప్ ఇవ్వడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. దీంతో రాష్ట్రంలో కూడా టీఆర్ఎస్ జోరు తగ్గింది. విపక్షాల విమర్శలకు గతంలోలా టీఆర్ఎస్ శ్రేణులు దీటుగా బదులివ్వలేని పరిస్థితి ఎదుర్కొంటున్నారు.

ఇంత కాలం టీఆర్ఎస్ బలోపేతానికి దోహదపడిన ఆపరేషన్ ఆకర్ష్ ఇప్పుడు ఆ పార్టీ రాష్ట్రంలో బలహీన పడేందుకు హేతువౌతోందని పరిశీలకులు అంటున్నారు. నల్లాల ఓదెలు బాటలో మరింత మంది కారు దిగేందుకు సిద్ధంగా ఉన్నారని చెబుతున్నారు. కారు పార్టీలో అసమ్మతులకు గాలం వేయడానికి కాంగ్రెస్, బీజేపీలు పోటీ పడుతున్నాయి. పార్టీ వీడే వారిని ఆపలేక, పార్టీలోకి వచ్చే వారు ఎవరూ కనిపించక టీఆర్ఎస్ గత ప్రాభవాన్ని కోల్పోయిందంటున్నారు. పార్టీలో కర్త, కర్త, క్రియా అన్నీ తానే అన్నట్లుగా వ్యవహరించిన కేసీఆర్ ఇప్పుడు రాష్ట్రంలో పార్టీ ఎదుర్కొంటున్న పరిస్థితికి కూడా బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. తన దేశ వ్యాప్త పర్యటనను అర్ధంతరంగా ముగించుకు వచ్చిన తరువాత ఇప్పటి వరకూ కనీసం మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేయకపోవడమే కేసీఆర్ డీలా పడ్డారనడానికి తార్కానమని రాజకీయ వర్గాలు అంటున్నాయి. 

By
en-us Political News

  
దేశవ్యాప్తంగా విద్యా రంగంలో చోటుచేసుకుంటున్న ప్రశ్నపత్రాల లీకేజీలు, పరీక్షల నిర్వహణలో లోపాలు, మూల్యాంకన వ్యవస్థ వైఫల్యాలపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
వేలమంది బలిదానాలతో ఏర్పడిన తెలంగాణలో ప్రాంతీయ ఆకాంక్షలను, ఉద్యమాలను జనసేన గౌరవించాలని కేటీఆర్ పవన్ కు హితవు పలికారు. అయితే, ఈ వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. కేటీఆర్ సంధించిన ప్రశ్నలనే తిరిగి కల్వకుంట్ల కుటుంబానికి గురిపెడుతూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
2024 ఎన్నికలలో వైనాట్ 175 అంటూ బీరాలు పలికిన జగన్.. తీరా ఎన్నికల ఫలితాలు వచ్చే సరికి కేవలం 11 స్థానాలతో సరిపెట్టుకోవలసి వచ్చింది. ఐదేళ్ల పాటు రాష్ట్రంలో అధికారాన్ని చెలాయించిన ఆయనకు, ఆయన పార్టీకీ కనీసం విపక్ష హోదా కూడా ఇవ్వడానికి జనం నిరాకరించారు.
రాష్ట్రంలో వైసీపీ పాలన అంతమై రెండేళ్లు గడిచిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా వేదికగా భావోద్వేగ పోస్ట్ పెట్టారు. రాష్ట్ర చరిత్రలో జూన్ 4ని చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే రోజుగా అభివర్ణించారు.
భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం ప్రాణాలర్పించిన పొట్టి శ్రీరాములు వంటి మహనీయుడిని సైతం నేడు ఒకే ఒక్క కులానికి పరిమితం చేసే దుస్థితి మన రాష్ట్రంలో నెలకొందన్న పవన్ కల్యాణ్.. కులాల పేరుతో సమాజాన్ని విడదీసే ఈ దుర్మార్గపు రాజకీయాలకు ఎక్కడో ఒకచోట చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. కులాల ఐక్యతే జనసేన పార్టీ మూల సిద్ధాంతమన్నారు.
గద్దర్ కుమార్తె వెన్నెల పవన్ కల్యాణ్ మాటలు తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని, తన తండ్రి గద్దర్ వారసత్వాన్ని అవమానించేలా ఉన్నాయని మండిపడ్డారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా వేదికగా పవన్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు.
తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరమైన మలుపులతో దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తుంటాయి.
పవన్ కళ్యాణ్‌పై తెలంగాణలోని కొన్ని రాజకీయ పార్టీల నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు.
చివరి గింజ ధాన్యం కొంటామన్న కాంగ్రెస్ సర్కార్  అప్పులు చేయడంలో రేవంత్ ప్రభుత్వం రికార్డులు సృష్టిస్తోందని విమర్శించిన కేటీఆర్..  రెండున్నరేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం  4 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిందన్నారు.
లంగాణ ప్రజల దశాబ్దాల కల సాకారమైన రోజున ఇక్కడి సెంటిమెంట్‌ను దెబ్బతీసేలా మాట్లాడటం సరికాదన్నారు. గతంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పుడు తాను 11 రోజుల పాటు అన్నం తినలేదని పవన్ కల్యాణే స్వయంగా చెప్పారనీ.. అలాంటి వ్యక్తి మళ్లీ ఇప్పుడు తెలంగాణకు తాను వ్యతిరేకం కాదంటూ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నారని కేటీఆర్ అన్నారు.
జగన్ ఎప్పుడెప్పుడు అధికారం నుంచి దిగిపోతారా అని దేవుళ్లకు పూజలు చేశారు, శాపనార్థాలు పెట్టారు. జగన్ అధికారంలో ఉంటే తమ అమరావతి కలలు ఎప్పటికీ ఫలించవని ఆవేదన చెందారు. అలాంటిది, ఇప్పుడు అదే అమరావతికి చెందిన రైతులు తాడేపల్లిలోని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసానికి వెళ్లి, ఆయనతో సుదీర్ఘంగా భేటీ అయ్యారనే వార్త పొలిటికల్ సర్కిల్స్ నే కాకుండా సామాన్య ప్రజలను కూడా విస్మయానికి గురి చేసింది.
దశాబ్దాలుగా కోలీవుడ్ లో సంపాదించుకున్న తన స్టార్ డమ్ ను, ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఓటు బ్యాంకుగా మార్చుకోవడంలో విజయ్ సఫలమయ్యారు. వీటన్నింటికీ తోడు తమిళనాట కరుణానిధి, జయలలిత వంటి దిగ్గజ నేతల మరణాల తర్వాత ఏర్పడిన రాజకీయ శూన్యం విజయ్ కు అనుకూలంగా మారింది.
ఈ విజయం కేవలం ఒక పదవి మాత్రమే కాదని, తన దశాబ్దాల కఠిన శ్రమకు, అంకితభావానికి దక్కిన అసలైన ఫలితమని ప్రకటించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.