Publish Date:May 16, 2025
బీఆర్ఎస్ పార్టీలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు నివాసానికి వెళ్లారు. హరీశ్ రావు పార్టీ మారతారంటూ ప్రత్యర్థులు చేస్తున్న నేపథ్యంలో కేటీఆర్ ఆయన ఇంటికి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Publish Date:May 16, 2025
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో ఒక వైపు సిట్ వేగం పెంచింది. వరుస అరెస్టులతో కేసు దర్యాప్తును ఫుల్ స్పీడ్ తో సాగిస్తోంది. అదే సమయంలో మరో పక్క నుంచి ఈడీ కూడా వేగంగా అడుగులు వేస్తున్నది.
Publish Date:May 16, 2025
తిరుమల శ్రీవారికి ప్రముఖ వ్యాపారవేత్త, లక్నో సూపర్ జెయింట్స్ అధినేత సంజీవ్ గోయెంకా రూ.5 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను బహూకరించారు. దాదాపు 5 కేజీల బంగారంతో చేయించిన కటి హస్తం, వరద హస్తాలను టీటీడీ అదనపు ఈఓ వెంకయ్య చౌదరికి అందజేశారు.
Publish Date:May 16, 2025
ఎంతటి వారైనా కర్మఫలం అనుభవించక తప్పదు అనడానికి మైనింగ్ మాఫియా కింగ్ గాలి జనార్దన్ రెడ్డి ఒక ఉదాహరణ. ఒకప్పుడు అపర కుబేరుడిగా వెలుగొందిన ఆయన ఇప్పుడు సాధారణ ఖైదీగా జైలు ఊచలు లెక్కిస్తున్నారు. గతంలో తన కుమార్తె వివాహాన్ని నభూతో నభవిష్యత్ అన్నట్లుగా కోట్లు గుమ్మరించి అంగరంగ వైభవంగా చేశారు. ఆ సందర్భంగా ఆయన తన కుమార్తను తల నుంచి కాళ్ల వరకూ వజ్రాభరణాలతో అలంకరించిన తీరు అప్పట్లో వార్తల పతాక శీర్షికల్లో నిలిచింది.
Publish Date:May 16, 2025
మంత్రులు కమిషన్లు తీసుకుంటారని మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. రాష్ట్రంలో మంత్రులు కమీషన్లు తీసుకుంటున్నారని స్వయంగా ఒప్పుకున్నారు. ఎవరు ఎంత కమీషన్ తీసుకున్నారో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచారణ జరిపించాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.
Publish Date:May 16, 2025
క్వార్ట్జ్ అక్రమాల కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డికి బెయిల్ ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను ధర్మాసనం తోసిపుచ్చింది. ఆయనకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది.
Publish Date:May 16, 2025
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో మరో ఇద్దరు నిందితుల అరెస్టునకు రంగం సిద్ధమైపోయినట్లే.. ఎందుకంటే వారిద్దరి ముందస్తు బెయిలు పిటిషన్ ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఈ దశలో బెయిలు ఇవ్వడమంటే దర్యాప్తు అధికారి చేతులు కట్టేసినట్లే అవుతుందని సుప్రీం కోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.
Publish Date:May 16, 2025
చేసిన తప్పులు దండంతో సరి అన్నది ఎక్కడైనా చెల్లుతుందేమో కానీ రాజకీయాలలో మాత్రం కాదు. అందులోనూ నిలువెల్లా అహంకారంతో విర్రవీగి.. స్థాయి మరిచి చేసిన వ్యాఖ్యలతో చెలరేగిపోయిన వల్లభనేని వంశీ వంటి వారి విషయంలో అసలు కాదు అని అనక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది.
Publish Date:May 16, 2025
భారత్, పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ తమ ఘనతేనని, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఒకటికి పదిసార్లు చెప్పుకుంటున్నారు. చెప్పుకుంటున్నారు అనే కంటే ట్రంప్ సొంత డబ్బా వాయించుకుంటున్నారు అనడమే కరెక్ట్.
Publish Date:May 16, 2025
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు తాను ఫోన్ వాడనని సమయం వచ్చినా లేకున్నా, సందర్భం ఉన్నా లేకున్నా పదేపదే చెప్పుకుంటూ ఉంటారు. అలాంటి ఆయన హఠాత్తుగా ఫోన్ కొనేశారు. అది ఐఫోన్. ఇక ఫోన్ వాడకం కూడా మొదలెట్టేశారు.
Publish Date:May 16, 2025
నమ్మక ద్రోహానికీ, విశ్వాస ఘాతుకానికీ పాల్పడిన టర్కీకి భారత్ బిగ్ షాక్ ఇచ్చింది. ఆ దేశ సంస్థ సెలిబి ఏవియేషన్ కు భద్రత అనుమతిని రద్దు చేసింది. ఆపరేషన్ సిందూర్, తదననంతర పరిణామాలలో భారత్, పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న వేళ టర్కీ పాకిస్థాన్ కు పూర్తి మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే. గతంలో భారీ భూకంపంలో టర్కీ దయనీయ స్థితిలో ఉన్న సమయంలో భారత్ దోస్త్ అంటూ ఆ దేశానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించింది.
Publish Date:May 16, 2025
విజయ్ షా, బీజేపీ నాయకుడు. బీజేపీ పాలిత మధ్య ప్రదేశ్ మధ్యప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్గంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి.
Publish Date:May 15, 2025
పహల్గాం ఉగ్రదాడి మొదలు కాంగ్రెస్ పార్టీ ఆచారానికి భిన్నంగా ఆచి చూచి అడుగులు వేస్తూ వచ్చింది. వ్యూహతంకంగా పావులు కదిపింది. అక్కడ ఇక్కడ ఒకటి రెండు అపశ్రుతులు వినిచ్పించినా.. అందరిదీ ఒకటే మాట అన్నట్లుగా ప్రభుత్వానికి అండగా, ఒకే మాటపై నిలిచింది.