సోనియా గాంధీతో వైఎస్ షర్మిల భేటీ..ఆసక్తికరంగా మారిన పుస్తకం బహూకరణ.!

Publish Date:Nov 11, 2026

Advertisement

కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీతో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రత్యేకంగా భేటీ అయ్యారు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో షర్మిల తన భర్త అనిల్ కుమార్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన కుమార్తె అంజలి వివాహానికి హాజరుకావాలని కోరుతూ సోనియా గాంధీకి వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు.

షర్మిల దంపతులను ఆప్యాయంగా పలకరించిన సోనియా గాంధీ.. ఈ సందర్భంగా తాను ఇటీవల రచించిన 'బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్' (Belonging: A Journey of Love) పుస్తకాన్ని వారికి బహూకరించారు. అంతేకాదు, పుస్తకంపై స్వయంగా ఆటోగ్రాఫ్ చేసి అందించడం విశేషం.

ఇది కూడా చదవండి: విదేశీ మహిళ దేశాధినేత ఎలా అయ్యారు.. సోనియాపై కంగనా సంచలన వ్యాఖ్యలు.!

సోనియా గాంధీ జీవిత ప్రయాణం, వ్యక్తిగత అనుభవాలు, కుటుంబ బంధాలు, భారత రాజకీయాల్లో ఆమె ఎదుర్కొన్న సవాళ్లను ఈ పుస్తకం ఆవిష్కరిస్తోంది. ముఖ్యంగా గాంధీ కుటుంబంలోని అనుబంధాలు, విభేదాలకు సంబంధించిన ఆసక్తికర అంశాలు ఇందులో ప్రస్తావనకు వచ్చాయి.

ముఖ్యంగా మేనకా గాంధీతో తనకు ఉన్న సంబంధాలు, కుటుంబంలో చోటుచేసుకున్న పరిణామాల గురించి సోనియా వెల్లడించిన విషయాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో 'బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్' పుస్తకంపై ఆసక్తి పెరుగుతోంది.

మరోవైపు, సోనియా గాంధీతో షర్మిల భేటీ రాజకీయంగానూ ప్రాధాన్యత సంతరించుకుంది. కుమార్తె వివాహ ఆహ్వానం కోసం జరిగిన ఈ సమావేశంలో రాజకీయ అంశాలు కూడా చర్చకు వచ్చాయా? అన్న ఆసక్తి నెలకొంది. అయితే, ఈ భేటీలో రాజకీయ చర్చలు జరిగినట్లు అధికారిక సమాచారం లేదు. మొత్తానికి, ఒకవైపు కుమార్తె వివాహ ఆహ్వానం.. మరోవైపు సోనియా గాంధీ స్వయంగా ఆటోగ్రాఫ్ చేసి అందించిన పుస్తకం.. ఈ భేటీకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

మీకు నచ్చవచ్చు: మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌కు తీవ్ర అస్వస్థత.. ఎయిమ్స్‌లో అత్యవసర చికిత్స.!

 

 

[ Sonia Gandhi, YS Sharmila, Anil Kumar, Anjali Wedding, Belonging A Journey of Love, Maneka Gandhi ]

By
en-us Political News

  
చనిపోయిన రోగుల పేర్లపైనా బిల్లులు..ఏసీబీ దాడుల్లో బట్టబయలు.!
నడవడానికి కేటాయించిన ఫుట్‌పాత్‌పై కూడా ప్రశాంతంగా అడుగులు వేయలేని పరిస్థితి.. రోడ్లపై ట్రాఫిక్ రద్దీని తప్పించుకోవడానికి కొందరు వాహనదారులు ఏకంగా పాదచారుల దారినే ఆక్రమిస్తున్నారు.
బంగారం ధరలు భారీగా పడిపోవడం ఆభరణాల కొనుగోలుదారులకు ఊరటనిస్తుంటే.. పసిడిని తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్న వారికి మాత్రం కొత్త కష్టాలు తెచ్చిపెడుతోంది.
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది.
అందంగా కనిపించాలని ఎవరికి మాత్రం ఉండదు? ముఖంపై చిన్న మొటిమ వచ్చినా.. చర్మంపై నల్లటి మచ్చ కనిపించినా అమ్మాయిలు ఆందోళన చెందుతారు.
ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. 
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత   ప్రతి జిల్లాలోనూ పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సవివరంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
పంచాయతీ ఎన్నికలకు పొత్త ధర్మం వర్తించదని ఆ ప్రకటన పేర్కొంది.   గ్రామాభివృద్ధి, స్వేచ్ఛాయుత పాలన, మహాత్మాగాంధీ ఆశయాల సాకారం గ్రామీణ స్థాయి నుంచే సాధ్యమవుతాయని పేర్కొంది.   
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బెంగళూరుకు చేరుకోవడంతో యలహంక ప్యాలెస్ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) రంగంలో లోతైన సాంకేతిక నైపుణ్యం కలిగిన నిపుణులకు ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్ నెలకొంది.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు.
మత్తుపదార్థాల వినియోగానికి వ్యతిరేకంగా నిర్వహిస్తున్న నషా ముక్త్ భారత్ ప్రచార కార్యక్రమంలో పాల్గొనాలని సినీ నటుడు ప్రభాస్‌ను కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ఆహ్వానించారు.
ఇద్దరు ఆడపిల్లలు పుట్టారన్న కారణంతో ఓ భర్త దారుణానికి ఒడిగట్టాడు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.