పోలీసులపై సోము దాష్టీకం.. నడి రోడ్డుపై వీరంగం

Publish Date:Jun 8, 2022

Advertisement

అమలాపురం బయలుదేరిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పోలీసులపై దౌర్జన్యానికి దిగారు. ఇంతకీ ఆయన అమలాపురం ఎందుకు బయలుదేరారంటే.. అమలాపురం అల్లర్లలో గాయపడిన బాధితులను పరామర్శించేందుకు. అయితే అమలాపురం లో ఆంక్షలు అమలులోన ఉన్నందున ఆయనను పట్టణంలోనికి అనుమతించేది లేదని పోలీసులు ఆయనను జొన్నాడ సమీపంలో అడ్డుకున్నారు. ఆయన మొండిగా ముందుకు సాగేందుకు ప్రయత్నించడంతో ఆయన వాహనానికి అడ్డంగా మరో వాహనాన్ని నిలిపారు. నిజానికి అమలాపురంలో ఇంకా ఆంక్షలు అమలులో ఉన్నాయి. దాదాపు పక్షం రోజుల తరువాత మంగళవారం నాడు పట్టణంలో అంతర్జాల సేవలను పునరుద్ధరించారు. బయట వారెవరికీ పట్టణంలోకి అనుమతి లేదన్న ఆంక్షలను ఇంకా తొలగించలేదు.

ఈ నేపథ్యంలోనే సోము వీర్రాజు అమలాపురం పర్యటనకు అడ్డుకున్నారు. అంతే ఒక్కసారిగా సోము వీర్రాజు పోలీసులపై ఫైర్ అయిపోయారు. నచ్చచెప్పబోయిన పోలీసులపై దౌర్జన్యం చేశారు. ఫోను మాట్లాడుతున్న పోలీసుపై చేయి వేసి పక్కకు నెట్టేశారు. తన వాహనానికి పోలీసలు అడ్డంగా ఉంచిన వాహనం డ్రైవర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి ఆయనను లారీ నుంచి కిందకు లాగేందుకు ప్రయత్నించారు.

అడ్డుకున్న పోలీసులపైకి కన్నెర్రచేసి వార్నింగ్ ఇచ్చారు. అల్లర్ల బాధితుల పరామర్శకు వెళుతున్న తనను ఎలా అడ్డుకుంటారని నిలదీశారు. సోము ఎంత వీరంగమాడినా పోలీసులు తమ మాటకే వినలేదు. చివరికి చేసేదేమి లేక తన అమలాపురం పర్యటనను రద్దు చేసుకుని సోము వీర్రాజు రావుల పాలెం నుంచి వెనుదిరిగారు. 

By
en-us Political News

  
భారత పైలట్ చెప్పిన షాకింగ్ నిజాలు..!
ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన చందాదారులను ఆకట్టుకునేందుకు మరో వినూత్నమైన ఆఫర్‌ను ముందుకు తెచ్చింది.
ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూ సమస్యల పరిష్కారంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
భాగ్యనగరంలో వరుస ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
పాతబస్తీ రాజకీయాల్లో కీలక నేతగా, ఎంఐఎం శాసనసభా పక్ష నేతగా కొనసాగుతున్న అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపాయి.
తెలంగాణ సాంస్కృతిక ఆత్మకు ప్రతీక అయిన బతుకమ్మ సంబరాలను ఈ ఏడాది అత్యంత వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది.
భార్యాభర్తల బంధం అంటే కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా నిలవడం.. జీవితాంతం కలిసి నడవడం. కానీ.. మధ్యప్రదేశ్‌లో ఓ భర్త డబ్బు కోసం ఆ బంధానికే తూట్లు పొడిచాడు.
దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో భారత సంతతి పైలట్ స్మిత్ మచ్చర్‌పై కో-పైలట్ హమామ్ అల్ హమామీ దాడికి పాల్పడిన ఘటన ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
భారతదేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన యూపీఐ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.
పెట్రోల్‌లో ఇథనాల్‌ కలపడాన్ని ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వ తాజా విధానాలు ఇప్పుడు సామాన్యుల వంటగదిపై తీవ్ర ప్రభావం
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
వికారాబాద్ జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అనంతగిరి హిల్స్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్‌‌ నగరంలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.