మహిళా క్రికెట్ దిగ్గజం మిథాలీ రాజ్ అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పారు. 1999 జూన్ లో ఆమె అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన మిథాలీ రాజ్ ప్రపంచ మహిళా క్రికెట్ లో వన్డేల్లో ఎక్కువ పరుగులు సాధించిన రికార్డ్ మిథాలీ పేరుమీదే ఉంది. ఇండియా తరపున ఆమె 232 వన్డేలకు ప్రాతినిధ్యం వహించారు.
50.68 యావరేజ్ తో 7,805 పరుగులను సాధించారు. మైదానంలో అడుగుపెట్టిన ప్రతిసారి మన దేశ గెలుపుకోసం తన వంతు కృషి చేశానని మిథాలి తెలిపారు. తనకు ఎంతో సహకరించిన బీసీసీఐకి ధన్యవాదాలు చెపుతున్నానని చెప్పారు. ఎన్నో ఏళ్ల పాటు ఇండియాకు కెప్టెన్ గా వ్యవహరించడాన్ని ఎంతో గర్వంగా భావిస్తున్నానని తెలిపారు.
భారత మహిళా క్రికెట్ కు మిథాలీరాజ్ అందించిన సేవలు మరువలేనివని బీసీసీఐ కార్యదర్శి జైషా పేర్కొన్నారు. మిథాలీ క్రికెట్ కు గుడ్ బై చెబుతూ ప్రకటన చేసిన నిముషాల వ్యవధిలో జైషే వరుస ట్వీట్లతో మిథాలీరాజ్ క్రికెట్ కు చేసిన సేవలను ప్రస్తుతించారు.
23 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ లో మిథాలీరాజ్ అనితర సాధ్యమైన రికార్డులెన్నో సొంతం చేసుకుంది. దేశంలో మహిళా క్రికెట్ అభివృద్ధికి ఎంతో దోహదపడింది. ఆమె స్ఫూర్తితోనే మహిళలు క్రికెట్ పట్ల మక్కువపెంచుకున్నారంటే అతిశయోక్తి కాదు. దేశంలో టెన్నిస్ పట్ల ఆదరణ పెరిగేందుకు సానియా మీర్జా ఎలా స్ఫూర్తిగా నిలిచారో.. మహిళల క్రికెట్ కు ఆదరణ పెరిగేందుకు మిథాలీ రాజ్ అలా దోహదపడ్డారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/mithali-raj-resigns-to-cricket-25-137285.html
ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన చందాదారులను ఆకట్టుకునేందుకు మరో వినూత్నమైన ఆఫర్‌ను ముందుకు తెచ్చింది.
ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూ సమస్యల పరిష్కారంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
భాగ్యనగరంలో వరుస ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
పాతబస్తీ రాజకీయాల్లో కీలక నేతగా, ఎంఐఎం శాసనసభా పక్ష నేతగా కొనసాగుతున్న అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపాయి.
తెలంగాణ సాంస్కృతిక ఆత్మకు ప్రతీక అయిన బతుకమ్మ సంబరాలను ఈ ఏడాది అత్యంత వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది.
భార్యాభర్తల బంధం అంటే కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా నిలవడం.. జీవితాంతం కలిసి నడవడం. కానీ.. మధ్యప్రదేశ్‌లో ఓ భర్త డబ్బు కోసం ఆ బంధానికే తూట్లు పొడిచాడు.
దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో భారత సంతతి పైలట్ స్మిత్ మచ్చర్‌పై కో-పైలట్ హమామ్ అల్ హమామీ దాడికి పాల్పడిన ఘటన ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
భారతదేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన యూపీఐ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.
పెట్రోల్‌లో ఇథనాల్ కలపడాన్ని ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వ తాజా విధానాలు ఇప్పుడు సామాన్యుల వంటగదిపై తీవ్ర ప్రభావం
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి.
వికారాబాద్ జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అనంతగిరి హిల్స్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్ నగరంలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది.
గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని చారిత్రాత్మక బాపూఘాట్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీకి రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నివాళులు అర్పించింది.