Publish Date:Apr 29, 2025
సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ ఎక్స్‌లో మరో ఆసక్తికర ట్వీట్ చేశారు. తెలంగాణ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్న స్మితా సబర్వాల్‌ను ప్రభుత్వం ఫైనాన్స్ కమిషన్ సభ్యురాలుగా ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. ఈ నేపథ్యంలో ట్వీట్టర్ వేదికగా స్మితా స్పందించారు. భగవద్గీతలోని "కర్మణ్యే వాధికారస్తే, మా ఫలేషు కదాచన" శ్లోకాన్ని ఉటంకిస్తూ ఆమె తన పోస్ట్‌ను ప్రారంభించారు. "పర్యాటక శాఖలో నాలుగు నెలలు పనిచేశాను. నా వంతుగా అత్యుత్తమంగా సేవలు అందించేందుకు ప్రయత్నించాను. రాష్ట్రానికి మొట్టమొదటిసారిగా, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న 2025-30 పర్యాటక విధానాన్ని తీసుకువచ్చాం. ఇది ఇప్పటివరకు నిర్లక్ష్యం చేయబడిన టూరిస్ట్ ప్రాంతాలకు దిశానిర్దేశం చేయడంతో పాటు, పెట్టుబడులను ఆకర్షించడానికి బలమైన పునాదిగా నిలుస్తుంది" అని ఆమె వివరించారు. తెలంగాణలో తొలిసారిగా, 2025-30 టూరిజం పాలసీ తీసుకొచ్చాం. ఇది ఇప్పటివరకు నిర్లక్షించబడిన పర్యాటక ప్రాంతాలకు దిశను చూపేందుకు, పెట్టుబడులను ఆకర్షించేందుకు బలమైన పునాది అవుతుంది.
శాఖ పనితీరును మళ్లీ ఆకళింపు చేసి, బాధ్యతను నూరిపోసే ప్రయత్నం చేశాను. ఒక గ్లోబల్ ఈవెంట్‌కు అవసరమైన ప్రణాళికా మౌలికతల ఏర్పాటుకు పునాది వేశాను. ఇది చాలా అవకాశాలకు తలుపులు తీయగలదని నమ్మకం ఉంది’ అని స్మితా సబర్వాల్ పేర్కొన్నారు. పర్యాటక శాఖలో పనిచేయడం గర్వంగా, గౌరవంగా ఉందని నమస్కారం సింబల్ జోడించారు.ఈ సందర్భంగా స్మితా సబర్వాల్‌కు నెటిజన్లు విషెస్ తెలియజేస్తున్నారు. మీరు టూరిజం లో చాలా మార్పు తీసుకొని వచ్చారని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఇటీవల హైదరాబాద్ శివార్లలోని కంచ గచ్చిబౌలి భూముల కేటాయింపు వ్యవహారంలో స్మితా సబర్వాల్ ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం చర్చనీయాంశమైంది. ఈ వివాదం నేపథ్యంలోనే ఆమెపై బదిలీ వేటు పడి ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గచ్చిబౌలి భూముల అంశంలో ఆమెకు పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం కూడా తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఆమెను తక్కువ ప్రాధాన్యత కలిగిన ఆర్థిక సంఘానికి బదిలీ చేశారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/smita-sabharwal-39-197166.html
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.
2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్ ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది.
ఏపీలో జరుగుతున్న పురపాలక సంఘం ఎన్నికల ఫలితాల్లో అధికార కూటమి పక్షాలు తమ జోరును ప్రదర్శిస్తున్నాయి.
రాష్ట్రంలోని పలు ముఖ్యమైన మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయాలు నమోదు చేస్తున్నారు. ముఖ్యంగా కడప జిల్లాలోని బద్వేల్ మున్సిపల్ చైర్పర్సన్ పీఠాన్ని కూటమి దక్కించుకుంది.
పులివెందుల మున్సిసిపల్ ఎన్నికల పోలింగ్ రోజున వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్లాన్ చేసిన డ్రామాలు, ఎన్నికల వాతావరణాన్ని దెబ్బతీసేందుకు చేసిన ప్రయత్నాలను ఎస్ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడమే లక్ష్యంగా వైసీపీ శ్రేణులు ప్రవర్తించాయని, రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడానికి ప్రయత్నించారని ఆరోపించారు.
తాను ఒక్కసారి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ప్రత్యర్థులు ఎవరూ నిలబడలేరని ఆయన హచ్చరించారు. ఈ అస్తవ్యస్త పరిస్థితుల మధ్య ఎన్నికల్లో ఓటు వేయడం అంటే ఆ అక్రమాలను అంగీకరించడమే అవుతుందని భావించి, తాను ఓటు హక్కును వినియోగించుకోకుండానే పులివెందుల నుంచి వెనుదిరగారు.
Publish Date:Oct 31, 2026
రేపే మున్సిపల్ ఎన్నికల పోలింగ్.. ప్రశాంతంగా సాగేనా.?