కంగ్రాట్స్ టీమ్ సీబీఎన్ అంటూ ట్వీట్: పుర పోరులో ఓటమిపై జగన్ అక్కసు.!

Publish Date:Nov 4, 2026

Advertisement

పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో   మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు. ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయాన్ని జీర్ణించుకోలేక  ఆయన అక్కసు వెళ్లగక్కుతున్నారు. గతంలో చేసిన విమర్శలే చేస్తూ.. అదే తప్పును పునరావృతం చేస్తున్నారు. పార్టీ పరాజయానికి కారణాలు, క్యాడర్ లో భరోసా నింపడంలో తన వైఫల్యాలపై ఆత్మ విమర్శ చేసుకోవడం, పార్టీ తీరుపై సమీక్షలు నిర్వహించడం అన్నది ఆయన డిక్షనరీలోనే లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.  

రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి హవా స్పష్టంగా కనిపించింది. ప్రతిచోటా అధికార పక్షం వైపే ఓటర్లు మొగ్గు చూపడంతో వైకాపాకు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. ఈ భారీ పరాభవంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన వైఎస్ జగన్... సోషల్ మీడియా వేదికగా తన అక్కసును వెళ్లగక్కారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పోలీసులు,  ఎన్నికల సంఘాన్ని ట్యాగ్ చేస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. 

ప్రతిపక్షం పోటీ చేసే అవకాశమే ఇవ్వకుండా ఎన్నికల్లో అద్భుతంగా గెలవడం ఎలాగో మీరు నిరూపించారంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమౌతున్నాయి.  రాష్ట్రంలో జరిగినవి  ఎన్నికలు కాదని  సెలెక్షన్స్ అనీ జగన్ ఆరోపించారు. 
అధికార పార్టీ మరియు ఎన్నికల సంఘాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ విధంగా విమర్శలు చేయడం ద్వారా, ప్రజల తీర్పును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని జగన్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజాతీర్పును  గౌరవించకుండా జగన్ చేసిన వ్యాఖ్యలు ఆయనకు ప్రజాస్వామ్యంపై విశ్వాసం లేదన్న విషయాన్ని చాటుతున్నాయంటున్నారు.  క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయాలను తెలుసుకుని తప్పులను సరిదిద్దుకునే దిశగా వైకాపా అధినాయకత్వం అడుగులు వేయడం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఇదే వైఖరిని కనుక కొనసాగిస్తే పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి ఏర్పడుతుందంటున్నారు. 

ప్రజల నుంచి వచ్చిన స్పష్టమైన తీర్పును అంగీకరించి ఆత్మసమీక్ష చేసుకోవడానికి బదులుగా,  నిందలు మోపి, పరాజయానికి నెపం తెలుగుదేశం పార్టీపైనా, ఎన్నికల సంఘంపైనా నెట్టేయడం సరి కాదంటున్నారు.   ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును శిరసావహించి, ప్రజల మధ్య ఉంటూ సమస్యలపై పోరాడితేనే మళ్లీ పుంజుకునే అవకాశం ఉంటుందని లేకపోతే పార్టీ భవిష్యత్  ప్రమాదంలో పడుతుందని హెచ్చరిస్తున్నారు. 

[Jagan Reaction On Defeat, Municipal polls, AP Local Body Election Results,   Team CBN Tweet, AP politics, Telugu One]

By
en-us Political News

  
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు. 
 2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్   ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో  పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది. 
ఏపీలో జరుగుతున్న పురపాలక సంఘం ఎన్నికల ఫలితాల్లో అధికార కూటమి పక్షాలు తమ జోరును ప్రదర్శిస్తున్నాయి.
రాష్ట్రంలోని పలు ముఖ్యమైన మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయాలు నమోదు చేస్తున్నారు. ముఖ్యంగా  కడప జిల్లాలోని బద్వేల్ మున్సిపల్ చైర్‌పర్సన్ పీఠాన్ని కూటమి దక్కించుకుంది.
 పులివెందుల మున్సిసిపల్ ఎన్నికల పోలింగ్ రోజున వైసీపీ  అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్లాన్ చేసిన డ్రామాలు, ఎన్నికల వాతావరణాన్ని దెబ్బతీసేందుకు చేసిన ప్రయత్నాలను ఎస్ఈసీ  దృష్టికి తీసుకెళ్లారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడమే లక్ష్యంగా వైసీపీ శ్రేణులు ప్రవర్తించాయని, రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడానికి ప్రయత్నించారని ఆరోపించారు.
తాను ఒక్కసారి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ప్రత్యర్థులు ఎవరూ నిలబడలేరని ఆయన హచ్చరించారు.    ఈ అస్తవ్యస్త పరిస్థితుల మధ్య ఎన్నికల్లో ఓటు వేయడం అంటే ఆ అక్రమాలను అంగీకరించడమే అవుతుందని భావించి, తాను ఓటు హక్కును వినియోగించుకోకుండానే పులివెందుల నుంచి వెనుదిరగారు.
రేపే మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌.. ప్రశాంతంగా సాగేనా.?
విజయసాయి ఈ వీడియో చేయడం వెనుక పొలిటకల్ స్ట్రాటజీ ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తారకరత్న కుమార్తెతో వీడియో చేయడం ద్వారా తెలుగుదేశం శ్రేణుల మద్దతు పొంది తన పొలిటికల్ రూట్ లో ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ర్నాబ్ తుపానుతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ సరఫరాను సత్వరమే పునరుద్ధరించడానికి తమిళనాడు సహాయాన్ని కోరింది. ఈ మేరకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తమిళనాడు ప్రభుత్వాన్ని  రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ పునరుద్ధరణ  వేగవంతం చేయడానికి  అదనపు విద్యుత్ శాఖ సిబ్బందిని, పరికరాలను కోరారు.
సాధారణంగా వైసీపీ ఎకో సిస్టమ్ ఎలా ఉంటుందంటే.. ఎవరైనా సరే  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని , ఆయన పాలనా విధానాలను పొగిడితే వెంటనే ఆ పొగిడిన వారిపై విమర్శలు గుప్పించేస్తుంది. ఇందుకు గతంలో చాలా చాలా ఉదాహరణలు ఉన్నాయి.
పులివెందుల మునిసిపోల్ రణరంగంగా మారే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పోలీసులూ అప్రమత్తమయ్యారు. ఎలాంటి హింసాత్మక ఘటనలకూ తావులేకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అవసరమైతే  ఇటు తెలుగుదేశం కూటమి, అటు వైసీపీకి చెందిన ముఖ్య నేతలను హౌస్ అరెస్టు చేసేందుకైనా వెనుకాడబోమని పోలీసులు విస్పష్ట హెచ్చరికలు జారీ చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.