Publish Date:May 24, 2025
తిరుమలలో ముగ్గరు తాగుబోతు ఖాకీలు హల్ చల్ చేశారు. మద్యం సేవించి తిరుమలకు వచ్చిన ముగ్గురు కానిస్టేబుళ్లు రెండో ఘాట్‌రోడ్డులో ర్యాష్ డ్రైవింగ్‌తో పలు వాహనాలను ఢీకొట్టారు. ఇక కొండపై భక్తులను ఇబ్బందులకు గురిచేశారు.
Publish Date:May 24, 2025
Publish Date:May 24, 2025
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతులు ఎత్తేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇంకా రెండేళ్ళు అయినా అవకుండానే అట్టర్ ప్లాప్ సినిమా చూపిస్తోంది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మూడు ముక్కల ఆటలో మునిగి తేలుతోంది. మరో వంక కాళేశ్వరం మొదలు కారు రేసు వరకు అనేక అవినీతి ఆరోపణలు, విచారణలు బీఆర్ఎస్ ను వెంటాడుతున్నాయి.
Publish Date:May 24, 2025
మనం ఏది ఇస్తే అదే తిరిగి వస్తుందన్నది నానుడి. ఎవరైనా సరే కర్మ ఫలం అనుభవించ కతప్పదంటారు. ఇప్పుడు వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూస్తుంటే సరిగ్గా అదే జరుగుతోందనిపిస్తున్నది. అధికారంలో ఉండగా చేసిన పాపాలు, అక్రమాలు, దౌర్జన్యాలకు ఫలితం అనుభవించక తప్పని పరిస్థితి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ సొంత తల్లినీ, చెల్లినీ కూడా దూరం పెట్టేసిన సంగతి తెలిసిందే.
Publish Date:May 23, 2025
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వేసవి సెలవలకు తోడు వారాంతంం కూడా కావడంతో తిరుమలేశుని దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు.
Publish Date:May 23, 2025
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఇప్పుడు ఫేస్ బుక్ పోస్టు ఒక తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఇటీవల మాజీ ముఖ్యమంత్రి జగన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ విజయసాయిరెడ్డిపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఆ ఆరోపణలు, విమర్శలపై విజయసాయి రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తారనీ, జగన్ ను ఉక్కిరిబిక్కిరి చేసేలా ఆ కౌంటర్ ఉంటుందనీ అంతా భావించారు. అయితే జగన్ విమర్శలకు విజయసాయి రెడ్డి కంటే ముందు.. ఎవరూ ఊహించని విధంగా, దివంగత తారకరత్న సతీమణి అలేఖ్య నుంచి స్పందన వచ్చింది.
Publish Date:May 23, 2025
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ మరో సారి అస్వస్థతకు గురయ్యారు. బాపులపాడు మండలంలో వెలుగు చూసిన నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసుకు సంబంధించి ఆయన్ను విచారణ నిమిత్తం విజయవాడ జిల్లా జైలు నుంచి కంకిపాడు పోలీసులు శుక్రవారం (మే 23) కస్టడీలోకి తీసుకున్నారు.
Publish Date:May 23, 2025
నా తండ్రికి ఉత్తరం రాసిన మాట వాస్తవమే. కానీ అది రెండు వారాల క్రితమే రాశాను. పార్టీలో జరుగుతున్న అంతర్గత కుట్రలను ఇప్పటికే అనేకసార్లు చెప్పాని కవిత క్లారిటీ ఇచ్చారు.
Publish Date:May 23, 2025
గత వైసీపీ ప్రభుత్వం చేసిన విధ్వంసానికి రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే పదేళ్లు పడుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులతో భేటీ తర్వాత మీడియాతో మాట్లాడారు. ఏపీ ప్రజలు తమకు చారిత్రాత్మక తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు
Publish Date:May 23, 2025
కోకో గింజలు కొనుగోలు ధరపై రాష్ట్ర ప్రభుత్వం ఏలూరు కలెక్టరేట్ లో నిర్వహించిన ద్వైపాక్షిక చర్చలు పూర్తిగా విఫలమైనట్లు ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర నాయకులు ప్రకటించారు.
Publish Date:May 23, 2025
తెలంగాణలో మొదటి కరోనా కేసు నమోదైంది. హైదరాబాద్, కూకట్‌పల్లిలోని డాక్టర్‌కు కరోనా పాజిటివ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.
Publish Date:May 23, 2025
తెలంగాణ అభివృద్ధి కోసం ఎన్నిసార్లైనా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలుస్తామని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని హుగ్గెళ్లి చౌరస్తాలో బసవేశ్వరుడి విగ్రహాన్నిముఖ్యమంత్రి ఆవిష్కరించారు.
Publish Date:May 23, 2025
ఏపీ లిక్కర్ స్కామ్‌లో కసిరెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కెసిరెడ్డి ఉపేంద్రరెడ్డి, రాజ్ కెసిరెడ్డి పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది.