మహిళా ఐఏఎస్ అధికారి లక్ష్యంగా అనుచిత పోస్టుల కేసు దర్యాప్తునకు సజ్జనార్ నాయకత్వంలో సిట్
Publish Date:Jan 13, 2026
Advertisement
మహిళా ఐఏఎస్ అధికారిణిని లక్ష్యంగా చేసుకుని కొన్ని న్యూస్ చానెళ్లు, యూట్యూబ్ చానెళ్లు, సోషల్ మీడియా అవమానకరమైన, అసభ్యకరమైన కంటెంట్ పోస్ట్ చేడయం, అలాగే సీఎం రేవంత్ రెడ్డి ఫొటోను మార్ఫింగ్ చేసి సోషల్ మీడాయాలో పోస్టు చేసిన కేసుల దర్యాప్తునకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటైంది. ఈ రెండు కేసులనూ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. దీంతో లోతైన దర్యాప్తునకు డీజీపీ శివధర్ రెడ్డి 8 మంది సభ్యులతో కూడిన సిట్ ఏర్పాటు చేశారు. ఈ సిట్ కు హైదరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వం వహిస్తారు. సీఎం రేవంత్ రెడ్డి ఫొటోను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేసిన కావలి వెంకటేశ్ అనే వ్యక్తిపై కాంగ్రెస్ నేత గుళ్ల నరసింహ ఫిర్యాదు మేరకు నారాయణపేట జిల్లాలో కేసు నమోదైంది. మరోవైపు, ఓ మంత్రికి, మహిళా ఐఏఎస్ అధికారిణికి సంబంధించి తప్పుడు వార్తలు ప్రసారం చేశారంటూ రెండు న్యూస్ చానళ్లతో పాటు పలు యూట్యూబ్ చానెళ్లు, సోషల్ మీడియా హ్యాండిల్స్‌పై హైదరాబాద్ సీసీఎస్‌లో ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ తరఫున ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. ఈ రెండు కేసులనూ సిట్ దర్యాప్తు చేయనుంది.
http://www.teluguone.com/news/content/sit-to-investigate-untoward-allegation-on-women-ias-officer-36-212477.html





