సింగపూర్‌లో సీబీఎన్ టీమ్ బిజీ బీజీ.. పెట్టుబడుల ఆకర్షణే టార్గెట్

Publish Date:Jul 27, 2025

Advertisement

 

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని బృందం సింగపూర్‌లో దౌత్య కార్యక్రమాల్లో బిజీగా మారింది. ఈ క్రమంలో తాజాగా భారత హైకమిషనర్ డాక్టర్ శిల్పక్ అంబులేతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మంత్రులు పి. నారాయణ, నారా లోకేష్, టీజీ భరత్‌తో పాటు ఏపీ ప్రభుత్వ అధికారులు కూడా పాల్గొన్నారు. ఈ సమావేశం సింగపూర్‌తో ఆంధ్రప్రదేశ్‌ సహకారాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఒక కీలకమైన అడుగుగా భావించవచ్చు.


హైకమిషనర్ శిల్పక్ అంబులే సింగపూర్‌‎లో ఆరోగ్యం, గ్రీన్ హైడ్రోజన్, ఏవియేషన్, సెమీ కండక్టర్స్, పోర్టులు, పారిశ్రామిక రంగాల్లో సాధించిన ప్రగతిని వివరించారు. సింగపూర్‌ ప్రభుత్వ విధానాలు, గ్రోత్ రేట్, అక్కడి భారతీయుల కార్యకలాపాల గురించి సమగ్రంగా చర్చించారు. సింగపూర్‌లో 83 శాతం పబ్లిక్ హౌసింగ్ ఉండటం ద్వారా వారి సమాజంలో సమతుల్యతను ఎలా సాధిస్తున్నారో కూడా వివరించారు. ఇండియాతో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌తో సింగపూర్‌ సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తున్నట్లు శిల్పక్ తెలిపారు. సీఎం చంద్రబాబు గతంలో అమరావతి రాజధాని ప్రాజెక్టులో సింగపూర్‌తో భాగస్వామ్యం గురించి గుర్తు చేస్తూ, కొన్ని కారణాల వల్ల ఆ భాగస్వామ్యం కొనసాగలేదని, ఇప్పుడు ఆ లోటును సరిచేసేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు.

సింగపూర్ సంస్థలు ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నాయని హైకమిషనర్ వెల్లడించారు. ముఖ్యంగా, సీఎం చంద్రబాబు బ్రాండ్‌కు సింగపూర్‌లో ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. ఏపీ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన పాలసీలు, పెట్టుబడులకు గల అవకాశాలను సీఎం వివరించారు. గ్రీన్ ఎనర్జీ రంగంలో 160 గిగావాట్ల ఉత్పత్తి లక్ష్యంతో ఏపీ ముందుకు సాగుతోంది. గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులు ఇప్పటికే పట్టాలెక్కాయని, విశాఖలో గూగుల్ డాటా సెంటర్ ఏర్పాటవుతోందని సీఎం తెలిపారు. 

అమరావతిలో ఇండియా క్వాంటం మిషన్‌లో భాగంగా క్వాంటం వ్యాలీ కూడా ఏర్పాటు కానుందని వెల్లడించారు.రాయలసీమ ప్రాంతం డిఫెన్స్, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ సంస్థలకు అనువైన ప్రాంతంగా మారుతుందని సీఎం చెప్పారు. సింగపూర్ నుంచి ఇండియాకు ముఖ్యంగా ఏపీకి పెట్టుబడులు రావాలని, ఈ పెట్టుబడులకు ఏపీ గేట్‌వేగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ ఏపీలో చేపడుతున్న ప్రాజెక్టుల గురించి వివరించారు. 

పెట్టుబడులకు అవసరమైన సహకారాన్ని అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం హైకమిషనర్‌కు తెలియజేశారు. మంత్రి నారా లోకేష్ విద్యా రంగంలో ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఏపీలో ప్రముఖ విద్యా సంస్థలు ఇప్పటికే ఏర్పాటవుతున్నాయని, మరిన్ని ప్రతిష్టాత్మక విద్యా సంస్థలను స్థాపించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. సింగపూర్‌ సహకారంతో విద్య, పరిశ్రమలు, సాంకేతికతలో ఏపీ కొత్త శిఖరాలను అధిరోహించేందుకు సన్నద్ధమవుతోంది.

By
en-us Political News

  
విపక్షాల నిరసనల నేపథ్యంలో   పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. 
 ధనుష్‌ తన కొత్త రాజకీయ పార్టీ కోసం  తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు  ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
ఆఫ్రికాలోని కాంగో నదిలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన పడవ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది.
వైద్యశాస్త్ర రంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతంగా భావించే నోబెల్ బహుమతి ప్రకటన వెలువడింది.
ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతమైన జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల సంఘం ప్రధానాధికారి (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్
చేతిలో రూ.3 లక్షలు.. ఇప్పుడు రూ.100 కోట్ల బిజినెస్.!
కేబీఆర్ పార్క్ ఫ్లైఓవర్ ప్రణాళికల్లో కీలక మార్పులు.. .!
కొందరు దుండగులు ఏకంగా జ్యువెలరీ షాప్‌నే టార్గెట్‌ చేశారు.
తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా అద్వైత్ కుమార్ సింగ్ ఐఏఎస్ పూర్తి అదనపు బాధ్యతలు (FAC) స్వీకరించారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.