Publish Date:Nov 29, 2023
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో కీలకమైన ప్రచార ఘట్టం మంగళవారం (నవంబర్28) సాయంత్రంలో ముగిసింది. ఇలా ప్రచార గడువు ముగియడంతోనే రాష్ట్రంలో 144 సెక్షన్ అమలులోకి వచ్చింది. ప్రచార గడువు ముగిసింది కనుక స్థానికేతరులు నియోజకవర్గాలు విడిచి వెళ్లాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. పోలింగ్ ఈ నెల 30న జరగనున్న సంగతి విదితమే. దీంతో ఎన్నికల సంఘం నిబంధనల్లో భాగంగా 24 గంటల ముందే ప్రచారం ముగిసింది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన అక్టోబర్ 9వ తేదీ నుండి దాదాపు రెండు నెలల పాటు రాష్ట్రంలో రాజకీయ నేతలు ప్రచారం హోరెత్తించారు. ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల అగ్రనేతలు రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేశారు.
హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నెల రోజులలో సగటున రోజుకు మూడు చొప్పున దాదాపు 95 బహిరంగ సభల్లో పాల్గొనగా.. గులాబీ పార్టీ స్టార్ క్యాంపెయినర్లు మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ రోడ్ షోలు, ర్యాలీలు నిర్వహించారు. మరో పక్కా బీఆర్ఎస్‌ను గద్దె దింపడమే టార్గెట్‌గా పెట్టుకున్న కాంగ్రెస్ సైతం ప్రచారం హోరెత్తించింది. కర్నాటక ఎన్నికల ఫలితాల తరువాత గ్రాఫ్ అమాంతం పెరగడంతో.. తెలంగాణలో కాంగ్రెస్ శ్రేణులు నూతనోత్సహంతో ప్రచారం నిర్వహించాయి.
కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక, ఖర్గే, డీకే, సిద్ధారామయ్య వంటి నేతలు తెలంగాణలో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా జోరుగా ప్రచారం చేశారు. మరో పక్క బీజేపీ సైతం పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. ప్రధాని మోడీ, అమిత్ షా, నడ్డా, యోగి సహా పలువురు బీజేపీ అగ్రనేతలు కీలక నేతలు తెలంగాణను చుట్టేశారు. మూడు పార్టీల నేతల ప్రచారంతో హోరెత్తిన తెలంగాణ.మంగళవారం (నవంబర్ 28) సాయంత్రం నుండి మూగబోయింది. గురువారం (నవంబర్ 30) న పోలింగ్ జరగనుండగా.. ఆదివారం (డిసెంబర్ 3) ఓట్ల లెక్కింపు జరిగగి ఫలితాలు వెలువడనున్నాయి. తెలంగాణ తీర్పు ఏ పార్టీకి అనుకూలం అన్నది ఆ రోజు తేలిపోనున్నది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/silence-telangana-39-166028.html
జగన్ చుట్టపుచూపుగా రాష్ట్రానికి వస్తున్నారు. అడపాదడపా పరామర్శలంటూ రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో వినా మిగిలిన సమయంలో రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి ఉనికి మాత్రంగానే మారింది. గత ఎన్నికలలో వైసీపీ కేవలం 11 స్థానాలలో మాత్రమే గెలిచిన సంగతి తెలిసిందే. ఆ గెలిచిన స్థానాలలో కూడా వెసీపీ స్తబ్దుగానే ఉంది. అయితే మచిలీపట్నంలో మాత్రం వైసీపీ హడావుడి ఒకింత ఎక్కువగా ఉంది.
ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన జనసేన నేతలు ద్వారంపూడిపై చర్యల తీసుకోవాల్సిందే అని ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అవినీతి బండారాన్ని బట్టబయలు ప్రభుత్వం పకడ్బందీగా అడుగులు వేస్తున్నదని అంటున్నారు. రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్‌లో ద్వారంపూడికి ఉన్న పట్టును సడలించడం ద్వారా ఆయన ప్రాభవాన్ని తగ్గించాలని ప్రయత్నిస్తున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై అంబటి రాంబాబును కొద్ది రోజుల కిందట గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. అయితే.. ఆ సమయంలో పోలీసు స్టేషన్‌లో తనను చిత్రహింసలకు గురిచేశారని ఆరోపిస్తూ అంబటి రాంబాబు తాజాగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
మాజీ మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రా రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మహేశ్ రెడ్డి, నరేందర్ రెడ్డి, వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ వంటి నేతలను అక్రమంగా నిర్బంధించడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఆవేదనను వినాల్సింది పోయి, వారికి మద్దతుగా వస్తున్న విపక్ష నేతలపై ఆంక్షలు విధించడం దారుణమన్నారు.
రిలే దీక్షకు మద్దతుగా గ్రామానికి చేరుకోవాలని ప్రయత్నించిన బీఆర్ఎస్ నేతలు, కార్య కర్తలను పోలీసులు మార్గ మధ్యలోనే నిలిపివేస్తూ వెనక్కి పంపించేశారు. దీంతో పరిగి పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది.
ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ చారిత్రాత్మక విజయం సిద్ధించిన రోజిదని పేర్కొన్నారు. అమరావతి రైతుల త్యాగాలకు దక్కిన న్యాయమన్నారు. అమరావతి ఇప్పుడు కేవలం నగరం కాదు, మన ఆత్మగౌరవానికి ప్రతీక అని బాలకృష్ణ పేర్కొన్నారు.
జములమడుగులో ఊహించిన దానికంటే అత్యధికంగా అభివృద్ధి పనులు కొనసాగిస్తున్నామని వివరించారు. వైసిపి అధ్యక్షుడు పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి వైఖరిని తూర్పారబట్టారు.. ప్రజలను కన్ఫ్యూజ్ చేసి మేలు పొందాలని ప్రయత్నిస్తున్నారంటూ జగన్ పై విమర్శలు కురిపించారు. పకృతిలో పంచభూతాల కూడా తన అధీనంలోనే ఉన్నాయని చెప్పుకునే పెను భూతంగా ఆయన జగన్ రెడ్డిని అబివర్ణించారు.
ఈ కీలక పరిణామం నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ముఖ్యమంత్రి స్పందిస్తూ.. ఐదు కోట్ల ఆంధ్రుల చిరకాల కోరిక నేడు నెరవేరిందని పేర్కొన్నారు. అమరావతి చట్టానికి ఆమోదం తెలిపి రాష్ట్ర భవిష్యత్తుకు భరోసానిచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఏపీ ప్రజల తరఫున ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ చట్ట సవరణకు ఆమోదముద్ర వేయడంతో, కేంద్ర న్యాయశాఖ తుది నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఈ పరిణామంతో అమరావతికి పూర్తిస్థాయిలో చట్టబద్ధత లభించినట్లయింది.
అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ మధ్య పోరు హోరాహోరీగా సాగే అవకాశం ఉంది, దీని ఫలితాన్ని అనేక నిర్మాణాత్మక మరియు రాజకీయ అంశాలు ప్రభావితం చేస్తున్నాయి.
కాపు రిజర్వేషన్ ఉద్యమ నేతగా ముద్రగడ పద్మనాభం తన చోటుకు ఎసరు వస్తున్నదా అన్న అనుమానంతో.. ఆ కాపు నేత తానేనని చాటుకోవడానికి తన వంతు ప్రయత్నాలు మొదలెట్టేశారంటున్నారు. నేను సైతం అంటూ ఆయన రంగంలోకి దిగినట్లు వైసీపీ వర్గీయులే అంతర్గత సంభాషణల్లో చెప్పుకుంటున్నారు. ఇందుకు తార్కానాలు కూడా చూపుతున్నారు.
ఉభయ సభలలో ఆమోదం పొందిన ఆ బిల్లు ఇప్పుడు దేశ ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వద్దకు చేరింది. ఇక ఆమె సంతకం పెట్టడానూ ఈ బిల్లు చట్టంగా మారుతుంది. ఆమె నేడో, రేపో ఈ బిల్లుపై సంతకం చేయడం ఖాయమని అంటున్నారు.
తమిళనాడులో 2026 ఎన్నికలు హోరాహోరీగా సాగే పోరుగా రూపుదిద్దుకుంటున్నాయి, ఇందులో స్పష్టమైన విజేత ఎవరూ లేరు. స్వల్ప ఓట్ల మార్పులు సీట్ల ఫలితాలపై నిర్ణయాత్మక ప్రభావాన్ని చూపవచ్చు.