చంద్రబాబుకు సరెండర్ అవుతున్న అక్రమార్కులు!

Publish Date:Nov 29, 2023

Advertisement

వైసీపీ ఇంటికి.. తెలుగుదేశంకు అధికారం. మరోసారి సీఎం కుర్చీ చంద్రబాబుదే. రానున్న  ఎన్నికలలో ఏపీలో తెలుగుదేశం అధికారం దక్కించుకోవడం గ్యారంటీ. ఇదే ఇప్పుడు ఏపీ రాజకీయాలలో  విస్తృతంగా వ్యాప్తిలో ఉన్న అభిప్రాయం. అయితే., ఈ మాట సర్వే సంస్థలు, పరిశీలకులు, విశ్లేషకులు మాత్రమే  కాదు. రాజకీయాలను అవపోసన పట్టిన మేధావులు,  ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, బడా వ్యాపార వేత్తలు కూడా ప్రైవేటు సంభాషణల్లో చెబుతున్న మాట.  అందుకే ఇప్పుడు ఏపీలో ఐఏఎస్, ఐపీఎస్, ఉన్నతాధికారులు చంద్రబాబుకు జగన్ హయాంలో తాము నిస్సహాయులుగా మారి ప్రభుత్వం చెప్పినట్లల్లా చేయాల్సి వచ్చిందని చెప్పుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటే..  బడా బడా వ్యాపార వేత్తలు, జగన్ హయాంలో పెద్దపెద్ద కాంట్రాక్టులను చేజిక్కించుకుని యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడిన వాళ్లూ కూడా  చంద్రబాబుతో భేటీకి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా నాలుగున్నరేళ్లుగా.. వ్యాపార వేత్తల ముసుగులో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో  అక్రమార్జనతో కోటికి పడగలెత్తిన వారు కూడా ఇప్పుడు చంద్రబాబు ఇంటి బాట పడుతున్నారు. ఇప్పటికే జగన్ సర్కార్ అవినీతిపై  తెలుగుదేశం నేతలు, పలువురు మేధావులు కోర్టులలో పిటిషన్లు వేయడం, దర్యాప్తు సంస్థలకు సమాచారం అందిస్తుండడంతో ఈ దోపిడీ దారులకు వెన్నులో వణుకు పుడుతుంది. ఒకవేళ  అధికారం మారిపోయి, చంద్రబాబు గద్దె ఎక్కడం జరిగితే ఈ కేసులు తమ మెడకు యమపాశాలుగా మారతాయన్న ఆందోళనతో ముందుగానే  చంద్రబాబు శరణు కోరుతున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. రాష్ట్రంలో అధికార మార్పు ఖాయమన్న అభిప్రాయం  ఇటు రాజకీయవర్గాలనూ పరిశీలకులలోనే కాదు, అటు అధికారులు, రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని అక్రమార్జనకు పాల్పడిన బడా వ్యాపారవేత్తలు, కాంట్రాక్టర్లలో కూడా బలంగా వ్యక్తం అవుతోంది.  జగన్‌ నాలుగున్నరేళ్ల పాలనలో  కొద్ది మంది వ్యాపారులు, కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తలు వేల కోట్ల రూపాయల ప్రజాధనం దోచుకున్నారన్నది కాదనలేని వాస్తవం. ఈ దోపిడీ పర్వాల మీద ఇప్పుడు తెలుగుదేశం నేతలు  న్యాయస్థానాలలో కేసులు వేస్తున్నారు. నిఘా, దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదులు చేస్తున్నారు.  స్పష్టమైన ఆధారాలతో,  న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు.  ఈ తీరు చూసిన అక్రమార్కులలో వణుకు మొదలైంది.  జగన్ ప్రభుత్వం పతనమై.. చంద్రబాబు అధికారంలోకి వస్తే జరగబోయేది  ఊహించుకుని వణికిపోతున్నారు. అందుకే చంద్రబాబు ఇంటికి దారి వెతుక్కుంటున్నారు. ఎన్నికలకు ముందే చంద్రబాబుతో  సయోధ్య కుదుర్చుకొంటే సేఫ్ అని భావిస్తున్నారు. 

ఈ క్రమంలోనే తాజాగా ఓ ఎలక్ట్రికల్‌ కంపెనీ అధినేత చంద్రబాబును కలిసినట్లు తెలుస్తున్నది. అది కూడా జగన్ కుటుంబంతో దగ్గరి సంబంధాలు ఉన్న ఆ వ్యాపారవేత్త వైసీపీ ఎంపీకి బినామీ అనే ప్రచారం కూడా ఉంది. అలాంటి వ్యక్తి ఓ ఐఏఎస్ అధికారి మధ్యవర్తిత్వంతో చంద్రబాబుతో భేటీ కాగలిగారు. ఇక ఇదే వరసలో రెండు తెలుగు రాష్ట్రాలను శాసించే మరో ఇద్దరు బడా ఇంజనీరింగ్ అండ్ కనస్ట్రక్షన్ కంపెనీల యజమానులు, ఓ ఫార్మా కంపెనీ యజమాని కూడా చంద్రబాబు అపాయింట్ మెంట్ కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తున్నది. ఈ ముగ్గురూ కూడా గత ఎన్నికల సమయంలో కేంద్రం మెప్పు కోసం చంద్రబాబుతో విభేదించారు. ఇక జగన్ ప్రభుత్వం వచ్చాక పూర్తిగా అడ్డగోలుగా లబ్ధి పొందేలా కాంట్రాక్టులూ, పనులూ పొందారు. అయితే ఇప్పుడు పరిస్థితి తారుమారవ్వడంతో  చంద్రబాబు ఆశీస్సుల కోసం  ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తున్నది. 

ఏదో వ్యాపారవేత్తలు, అధికారులే చంద్రబాబు శరణం గచ్ఛామీ అనడం కాదు.. ఏకంగా వ్యాపారాలతో సంబంధాలున్న రాజకీయ నేతలు కూడా ఇప్పుడు చంద్రబాబు అండకోసం ప్రయత్నాలు చేస్తున్నారంటే వచ్చే ఎన్నికలలో వైసీపీ ఓటమి ఖాయం అనడానికి ఇంత కంటే ఆధారాలేం కావాలని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   వైసీపీలో ఉంటూ చంద్రబాబుపైనే దాడికి ప్రయత్నించిన నేత తనయుడు కూడా బాబుతో సయోధ్యకు మధ్యవర్తుల ద్వారా ప్రయత్నం సాగిస్తున్నారంటే ఇక్కడ పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. జగన్ ప్రభుత్వంలో మద్యం అక్రమాలలో ఈ నేత తనయుడిదే మేజర్ వాటా కాగా.. రాయలసీమలో గ్రానైట్‌, కంకర దందా.. ప్రభుత్వ భూముల ఆక్రమణ వంటివి అదనంగా ఉన్నాయి. ఇప్పటికే ప్రతి అంశంపై ఫిర్యాదు ఉండగా ఏ క్షణమైనా దర్యాప్తు ఆరంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ కారణంగానే తండ్రిని కూడా కాదని ఈ తనయుడు చంద్రబాబు శరణు కోరినట్లు తెలుస్తుంది. ఇక, కృష్ణ, ఉభయ గోదావరి, ఉత్తరాంధ్రలకు చెందిన పలువురు వైసీపీ నేతలు కూడా ఇదే తరహాలో
చంద్రబాబు ప్రాపకం కోసం ప్రాకులాడుతున్నట్లు చెప్తున్నారు. ఇలా జగన్ హయాంలో అక్రమాలకు పాల్పడి , ఆయాచిత లబ్ధి పొందిన వారంతా  ఇప్పుడు చంద్రబాబును శరణుజోచ్చుతున్నారు.  అయితే చంద్రబాబు ఎలా స్పందిస్తారు, వీరి ద్వారా జగన్ అక్రమాలు , అవినీతిని ప్రజల ముందు ఉంచుతారా అన్నది చూడాల్సి ఉంది.  

By
en-us Political News

  
జగన్ చుట్టపుచూపుగా రాష్ట్రానికి వస్తున్నారు. అడపాదడపా పరామర్శలంటూ రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో వినా మిగిలిన సమయంలో రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి ఉనికి మాత్రంగానే మారింది. గత ఎన్నికలలో వైసీపీ కేవలం 11 స్థానాలలో మాత్రమే గెలిచిన సంగతి తెలిసిందే. ఆ గెలిచిన స్థానాలలో కూడా వెసీపీ స్తబ్దుగానే ఉంది. అయితే మచిలీపట్నంలో మాత్రం వైసీపీ హడావుడి ఒకింత ఎక్కువగా ఉంది.
ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన జనసేన నేతలు ద్వారంపూడిపై చర్యల తీసుకోవాల్సిందే అని ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అవినీతి బండారాన్ని బట్టబయలు ప్రభుత్వం పకడ్బందీగా అడుగులు వేస్తున్నదని అంటున్నారు. రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్‌లో ద్వారంపూడికి ఉన్న పట్టును సడలించడం ద్వారా ఆయన ప్రాభవాన్ని తగ్గించాలని ప్రయత్నిస్తున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై అంబటి రాంబాబును కొద్ది రోజుల కిందట గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. అయితే.. ఆ సమయంలో పోలీసు స్టేషన్‌లో తనను చిత్రహింసలకు గురిచేశారని ఆరోపిస్తూ అంబటి రాంబాబు తాజాగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
మాజీ మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రా రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మహేశ్ రెడ్డి, నరేందర్ రెడ్డి, వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ వంటి నేతలను అక్రమంగా నిర్బంధించడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఆవేదనను వినాల్సింది పోయి, వారికి మద్దతుగా వస్తున్న విపక్ష నేతలపై ఆంక్షలు విధించడం దారుణమన్నారు.
రిలే దీక్షకు మద్దతుగా గ్రామానికి చేరుకోవాలని ప్రయత్నించిన బీఆర్ఎస్ నేతలు, కార్య కర్తలను పోలీసులు మార్గ మధ్యలోనే నిలిపివేస్తూ వెనక్కి పంపించేశారు. దీంతో పరిగి పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది.
ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ చారిత్రాత్మక విజయం సిద్ధించిన రోజిదని పేర్కొన్నారు. అమరావతి రైతుల త్యాగాలకు దక్కిన న్యాయమన్నారు. అమరావతి ఇప్పుడు కేవలం నగరం కాదు, మన ఆత్మగౌరవానికి ప్రతీక అని బాలకృష్ణ పేర్కొన్నారు.
జములమడుగులో ఊహించిన దానికంటే అత్యధికంగా అభివృద్ధి పనులు కొనసాగిస్తున్నామని వివరించారు. వైసిపి అధ్యక్షుడు పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి వైఖరిని తూర్పారబట్టారు.. ప్రజలను కన్ఫ్యూజ్ చేసి మేలు పొందాలని ప్రయత్నిస్తున్నారంటూ జగన్ పై విమర్శలు కురిపించారు. పకృతిలో పంచభూతాల కూడా తన అధీనంలోనే ఉన్నాయని చెప్పుకునే పెను భూతంగా ఆయన జగన్ రెడ్డిని అబివర్ణించారు.
ఈ కీలక పరిణామం నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ముఖ్యమంత్రి స్పందిస్తూ.. ఐదు కోట్ల ఆంధ్రుల చిరకాల కోరిక నేడు నెరవేరిందని పేర్కొన్నారు. అమరావతి చట్టానికి ఆమోదం తెలిపి రాష్ట్ర భవిష్యత్తుకు భరోసానిచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఏపీ ప్రజల తరఫున ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ చట్ట సవరణకు ఆమోదముద్ర వేయడంతో, కేంద్ర న్యాయశాఖ తుది నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఈ పరిణామంతో అమరావతికి పూర్తిస్థాయిలో చట్టబద్ధత లభించినట్లయింది.
అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ మధ్య పోరు హోరాహోరీగా సాగే అవకాశం ఉంది, దీని ఫలితాన్ని అనేక నిర్మాణాత్మక మరియు రాజకీయ అంశాలు ప్రభావితం చేస్తున్నాయి.
కాపు రిజర్వేషన్ ఉద్యమ నేతగా ముద్రగడ పద్మనాభం తన చోటుకు ఎసరు వస్తున్నదా అన్న అనుమానంతో.. ఆ కాపు నేత తానేనని చాటుకోవడానికి తన వంతు ప్రయత్నాలు మొదలెట్టేశారంటున్నారు. నేను సైతం అంటూ ఆయన రంగంలోకి దిగినట్లు వైసీపీ వర్గీయులే అంతర్గత సంభాషణల్లో చెప్పుకుంటున్నారు. ఇందుకు తార్కానాలు కూడా చూపుతున్నారు.
ఉభయ సభలలో ఆమోదం పొందిన ఆ బిల్లు ఇప్పుడు దేశ ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వద్దకు చేరింది. ఇక ఆమె సంతకం పెట్టడానూ ఈ బిల్లు చట్టంగా మారుతుంది. ఆమె నేడో, రేపో ఈ బిల్లుపై సంతకం చేయడం ఖాయమని అంటున్నారు.
తమిళనాడులో 2026 ఎన్నికలు హోరాహోరీగా సాగే పోరుగా రూపుదిద్దుకుంటున్నాయి, ఇందులో స్పష్టమైన విజేత ఎవరూ లేరు. స్వల్ప ఓట్ల మార్పులు సీట్ల ఫలితాలపై నిర్ణయాత్మక ప్రభావాన్ని చూపవచ్చు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.