ఆరోగ్యానికి మంచిది కదా అని పల్లీలు తెగ తినేస్తుంటారా? ఈ నష్టాలు తప్పవు..!
Publish Date:Dec 19, 2025
Advertisement
బరువు.. పల్లీలు అతిగా తింటే బరువు కూడా అతిగా పెరుగుతారట. పల్లీలలో కేలరీలు, కొవ్వులు అధికంగా ఉంటాయి. 100గ్రాముల పల్లీలలో దాదాపు 567కేలరీలు ఉంటాయట. ఎక్కువగా పల్లీలు తింటూ ఉంటే కేలరీలు కూడా పెరిగి బరువు పెరగడం కూడా వేగంగా జరుగుతుందట. జీర్ణ సమస్యలు.. పల్లీలు వేడి కలిగించే గుణం కలిగి ఉంటాయి. వీటిలో ఫైటేట్ లు ఉంటాయి. పల్లీలు ఎక్కువగా తింటే ఉబ్బరం, గ్యాస్, కడుపులో యాసిడ్ ఫీలింగ్, గుండెల్లో మంట వంటివి పెరుగుతాయి. పోషకాలు.. వేరుశనగలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని ఎక్కువగా తింటే పోషకాల శోషణకు ఆటంకం కూడా కలుగుతుంది. ముఖ్యంగా వీటిలో పైటిక్ యాసిడ్ కూడా ఉంటుంది. ఇది శరీరంలో ఐరన్, జింక్ వంటి ముఖ్యమైన ఖనిజాల శోషణకు ఆటంకం కలిగిస్తుంది. దీన వల్ల శరీరంలో ఐరన్, జింక్ లోపం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఎన్ని తినాలి.. ఆరోగ్య నిపుణులు, ఆహార నిపుణుల అభిప్రాయం ప్రకారం రోజుకు ఒక గుప్పెడు పల్లీలు తినడం మంచిది. అంతకంటే ఎక్కువ తినడం వల్ల పైన చెప్పుకున్న సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. *రూపశ్రీ. గమనిక:
ఆరోగ్యకమైన ఆహారాలలో పల్లీలు కూడా ఒకటి. పల్లీలు అటు ఆరోగ్యాన్ని ఇస్తూనే ఇటు మంచి స్నాక్స్ గా కూడా ఉంటాయి. పల్లీలలో మంచి కొవ్వులు, ప్రోటీన్ ఉంటాయి. వీటిని పేదవారి బాదం అని అంటారంటే వీటిలో ఎన్ని పోషకాలు ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. అయితే అతి సర్వత్ర వర్జయేత్ అనే మాటకు తగ్గట్టు పల్లీలు అయినా సరే.. ఎక్కువగా తినడం చాలా చెడ్డదని ఆహార నిపుణులు అంటున్నారు. రుచిగా ఉంటాయి కదా అని పల్లీలను అతిగా తింటే.. ఆరోగ్యానికి మేలు చేయకపోగా చేటు చేస్తాయని అంటున్నారు. మరీ ముఖ్యంగా పల్లీలు అంటే తెగ ఇష్టపడేవారు ఈ విషయం తప్పకుండా తెలుసుకోవాలి. పల్లీలను ఎక్కువగా తినడం వల్ల కలిగే నష్టాలేంటో తెలుసుకుంటే..
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
http://www.teluguone.com/news/content/side-effects-of-eating-too-many-peanuts-34-211255.html




