LATEST NEWS
క‌మ్యూనిస్టుల‌కు  ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అనే ప‌ద‌వి ఎంత  ప‌వ‌ర్ ఫుల్లో.. బీఆర్ఎస్ వంటి పార్టీల‌కు వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ప‌ద‌వి అంటే అంత వేల్యుబుల్.  అయితే బీఆర్ఎస్ లో సమస్య ఏమిటంటే.. పార్టీ అధినేత కేసీఆర్ త‌ర్వాత అంత‌టి వాడిగా.. ఆయన పొలిటిక్ వారసుడిగా కేటీఆర్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. అయితే ఆయన పార్టీ కార్యనిర్వాహక అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తరువాత జరిగిన ఏ ఎన్నికలోనూ పార్టీ విజయాన్ని నమోదు చేసింది లేదు. నల్లేరు మీద బండినడక అనదగ్గ ఎన్నికలలో కూడా బీఆర్ఎస్ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇదే విషయాన్ని ఎత్తి చూపుతూ కేటీఆర్ నాయకత్వంపై విమర్శలు గుప్పించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.  వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ఉన్నంత కాలం బీఆర్ఎస్ పరాజయాలను ఎదుర్కొంటూనే ఉంటుందన్నారు.  వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ఎంపికైన నాటి  నుంచి ఇప్ప‌టి  వ‌ర‌కూ   గ్రేట‌ర్, కార్పొరేషన్, ఆ తరువాత 2023 అసెంబ్లీ ఎన్నికలు, 2024 సార్వత్రిక ఎన్నికలు, ఇవి రెండూ పూర్తయిన తరువాత  రెండు ఉప ఎన్నికలు, తాజాగా పంచాయతీ ఎన్నికలు జరిగాయి. అయితే పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఈ అన్ని ఎన్నికలలోనూ ఆయన ప్రచార బాధ్యతను భుజాన వేసుకుని పని చేశారు. అయితే వేటిలోనూ పార్టీని విజయం దిశగా నడిపించలేకపోయారు.  దుబ్బాక నుంచి మొద‌లు పెడితే నిన్న మొన్న‌టి  జూబ్లీహిల్స్ బై పోల్ వ‌ర‌కూ ప్ర‌తి ఎన్నికలోనూ పార్టీని పరాజయమే వరించింది.  ఇటీవ‌లి స్థానిక ఎన్నిక‌ల‌లోనూ కేటీఆర్ సారథ్యంలో బీఆర్ఎస్ ఓటమినే మూటగట్టుకుంది.   రేవంత్  విమర్శలను పక్కన పెడితే..  కేటీఆర్ కి కానీ,  బీఆర్ఎస్ కి కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి అచ్చిరాలేదన్న ప్రచారం బీఆర్ఎస్ శ్రేణుల్లోనే జోరుగా సాగుతోంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావం తరువాత తొమ్మిదేళ్ల పాటు బీఆర్ఎస్ అధికారంలో ఉండగా కేటీఆర్ సమర్ధ నాయకుడిగా గుర్తింపు పొందడం వెనుక తండ్రి ఇమేజ్ ఉంది. సీఎం కుమారుడిగా, మంత్రిగా ఆయన మాటే వేదంగా అప్పట్లో ప్రభుత్వ, పార్టీ వ్యవహారాలు సాగాయి. అయితే ఆ ఘనత అంతా కేసీఆర్ దేనని అంటారు విమర్శకులు. ఇప్పుడు పార్టీ అధికారం కోల్పోయిన తరువాత.. ముందుండి పార్టీని నడిపించడంలో కేటీఆర్ వైఫల్యాలు ప్రస్ఫుటంగా కనిపిస్తుండటంతో సొంత పార్టీలోనే కేటీఆర్ నాయకత్వంపై సందేహాలు, అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయనడం ఎంత మాత్రం అతిశయోక్తి కాదు.  ఎన్నికలలో వరుస పరాజయాలతో వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆయన కొనసాగింపుపైనా బీఆర్ఎస్ లో అభ్యంతరాలు వ్యక్తం అవుతున్న పరిస్థితి.  అయినా బీజేపీ, కాంగ్రెస్ వంటి పార్టీలలో కూడా కార్యనిర్వాహక అధ్యక్ష పదవిలో కొనసాగుతున్న వారు ఉన్నారు. కానీ వారి విషయంలో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిపై ఈ స్థాయి చర్చ జరగడం లేదు. ఒక్క కేటీఆర్ విషయంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయన సామర్థ్యం, అర్హతపై రాజకీయ ప్రత్యర్థలు నుంచే కాదు, బీఆర్ఎస్ శ్రేణులు, నేతల నుంచి కూడా ప్రశ్నలు ఎదురౌతున్నాయి. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..  కేటీఆర్  పార్టీకి వ‌ర్కింగ్ ప్రెసిడెంట్  గా  ఉన్నన్ని రోజులూ బీఆర్ఎస్ గెలుపు అన్న మాటను మరచిపోవడం మంచిదన్న సూచన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అంతే కాదు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావే సోషల్ మీడియాలో పదె్ద ఎత్తున క్యాంపెయిన్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు.  చూడాలి మరి వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ముందు ముందు ఎలా నెట్టుకుని, నెగ్గుకుని వస్తారో?
లోకేష్ ని 2027 ఉగాది నాటిక‌ల్లా  ముఖ్య‌మంత్రిని చేసే దిశ‌గా  కొన్ని  పావులు క‌దులుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. లోకేష్ ఢిల్లీ వెళ్లి మోడీ క‌లిసిన‌పుడు జ‌రిగే  ప్ర‌ధాన  చ‌ర్చ ఇదేనంటారు చాలా మంది. ఇటు ఢిల్లీ, అటు నాగ్ పూర్ వ‌ర్గాల స‌మాచారాన్ని బ‌ట్టి చూస్తే ఇదే జ‌ర‌గ‌వ‌చ్చ‌న్న అభిప్రాయం పరిశీలకుల్లో సైతం వ్యక్తం అవుతోంది.  ఏపీలో ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో  నంబర్ 1, 2,  3 అంటూ హైరాక్కీని బట్టి చూస్తే లోకేష్ మూడో స్థానంలో ఉన్నారు. జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తరువాత రెండో స్థానంలో ఉన్నారని చెప్పాల్సి ఉంటుంది.  అయితే ఈ హైరాక్కీని దాటి   త్వ‌ర‌లో  లోకేష్ కి ముఖ్య‌మంత్రి ప‌ద‌విని అప్ప‌గించేందుకు గ్రౌండ్ వర్క్ జరుగుతోందా అన్న అనుమానాలు పొలిటికల్ సర్కిల్స్ లో వ్యక్తం అవుతున్నాయి. లోకేష్ కు సీఎం పదవి విషయంలో కేంద్రంలోని ఎన్డీయే కూటమి అగ్రనాయకత్వం సుముఖంగా ఉందంటున్నారు. ఈ విషయంలో పవన్ కల్యాణ్ నుంచి కూడా ఎటువంటి అభ్యంతరం వ్యక్తం కావడం లేదంటున్నారు పరిశీలకులు. సీఎం పదవి కోసం పవన్ తొందరపడటం లేదనీ, ఆయన తన పాతికేళ్ల పొలిటికల్ కేరీర్ లు ప్లాన్ చేసుకుని ముందుకు సాగుతున్నారని చెబుతున్నారు.   అన్నిటికీ మించి లోకేష్ కు సీఎం పట్టాభిషేకం చేయడానికి నంబర్స్ కూడా బలంగా ఉన్నాయి. రాష్ట్ర అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీకి మ్యాజిక్ ఫిగర్ కు మించిన సంఖ్యా బలం ఉంది. ఇక కూటమి ఐక్యత విషయానికి వస్తే.. పవన్ కు కూటమి అవసరమా? కూటమికి పవన్ అవసరమా? అన్న ప్రశ్నే తలెత్తే పరిస్థితి లేదు. పవన్ కల్యాణ్ కూటమి పటిష్ఠత గురించే ఎక్కువ మాట్లాడుతున్నారు. అలాగే రాష్ట్ర ప్రగతిలో లోకేష్ క్రెడిట్ ను గుర్తించడానికే మొగ్గు చూపుతున్నారు.  ఈ నేపథ్యంలోనే   సీఎం చైర్ కు లోకేష్ లైన్ క్లియ‌ర్ అయ్యిందనే అంటున్నారు పరిశీలకులు. 
ఒక‌ప్పుడు ఇందిరాగాంధీ, ఆ తరువాత  రాజీవ్ గాంధీ.. భార‌త రాజ‌కీయాల్లో సంచ‌ల‌న విజ‌యాలు సాధించారు. వారికి చట్టసభల్లో సంఖ్యాబలానికి ఒక పరిమితి అంటూ ఉండేది కాదు.  ఇప్పుడైతే వ‌రుస‌గా మూడోసారి బీజేపీ నాయకత్వంలో ఎన్డీయే వరుసగా మూడో సారి అధికారంలోకి వచ్చినా, మూడో సారి బీజేపీకి స్వయంగా వచ్చిన స్థానాలు   240 కాగా.. ఎన్డీయే  భాగ‌స్వామ్య ప‌క్షాల‌తో ఎలాగోలా  గ‌ట్టెక్కి అధికార పీఠం చేప‌ట్ట‌గ‌లిగింది. అదే ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీల హయాంలో అయితే అప్ప‌ట్లో  లోక్ సభలో కాంగ్రెస్ సంఖ్యా బలం  400కు మించి ఉన్న సందర్భాలు ఉన్నాయి. కానీ అప్పుడెవ‌రూ కాంగెస్ ని ఓట్ చోరీ అంటూ ఎగ‌తాళి  చేయ‌లేదు. ఎవ‌రి  క‌ష్టం  వారు ప‌డుతూ.. ప్ర‌జ‌ల్ని మెప్పించే ప‌ని మాత్ర‌మే చేస్తూ వ‌చ్చేవార‌మ‌ని తాజాగా మాజీ ప్ర‌ధాని దేవెగౌడ‌ వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ ఓట్ చోరీ అంటూ చేస్తున్న ఆర్భాటాన్నీ, హంగామానూ బిల్డప్ ప్రక్రియగా కొట్టి పారేశారు.  ఏదో ఒక నేరేటివ్ బిల్డ‌ప్ చేయ‌డంలో భాగంగా రాహుల్ గాంధీ ఈ త‌ర‌హా ప్ర‌చారాన్ని  తెర‌పైకి తెచ్చారంటున్నారు. రాహుల్ అందిపుచ్చుకున్న ఓట్ చోరీ..  వ్యూహ‌క‌ర్త‌లిచ్చిన స‌ల‌హా  లేదా సూచ‌న  కావ‌చ్చు. అదీ కాదంటే కాంగ్రెస్ అగ్రనాయకత్వమే స్వయంగా ఈ నినాదాన్ని ఎత్తుకుని ఉండవచ్చు. అయితే ఓటు చోరీ నినాదం ప్రజల్లోకి లోతుగా వెళ్లినట్లనిపించినా.. అది కాంగ్రెస్ కు ఎలాంటి ప్రయోజనం చేకూర్చింది లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఓట్ చోరీ స్లోగ‌న్ తో బీహార్ ఎన్నిక‌ల‌కు వెళ్తే అది బూమ‌రాంగ్ అయ్యింది. రాహుల్ లాంటి ప్ర‌చార‌క్ ఉన్నంత వ‌ర‌కూ బీజేపీ  అధికారంలోకి వ‌స్తూనే ఉంటుంద‌న్న టాక్  అధికార కూటమిలో జోరుగా స్ప్రెడ్ అవుతోంది.  రాహుల్ విషయంలో చెప్పుకోవలసిందంటూ ఏదైనా ఉంటే ఆయన చేపట్టిన భారత్ జోడో యాత్ర.  ఆ యాత్ర ద్వారా.. రాహుల్  ఇటు కాంగ్రెస్ ని అటు ఇండి కూట‌మిని  ఈ మాత్ర‌మైనా  నిలబెట్టగలిగారు.   అలాగ‌ని రాజ‌కీయ ప‌రంగా అధికార ప‌క్షాన్ని ఇరుకున పెట్టేలాంటి చ‌ర్య‌లేవీ చేప‌ట్ట‌క పోవ‌డం వ‌ల్ల  కాంగ్రెస్ లో పెద్దగా జోష్ కనిపించడం లేదు.  కార్య‌క‌ర్త‌లను ఏదో ఒక కార్యక్రమంతో బిజీగా ఉంచాలి.  అందులో భాగంగానే రాహుల్ గాంధీ.. ఈ నినాదం భుజానికి  ఎత్తుకున్నారు. త‌ర‌చూ త‌న వాద‌న‌ల రూపంలో  ఏదో ఒక అంశాన్ని, సమస్యను తెరమీదకు తీసుకువస్తుంటారు. తినగతినగ వేమ తియ్యగుండు అన్నట్లుగా.. నిరంతరం జనంలోకి ఏదో ఒక అంశాన్ని తీసుకువెడుతుంటే.. ఏదో ఒక లీడ్ దొరికి అధికారం ‘చేతి’కి రాకుండా ఉంటుందా అన్నది ఆయన ఆలోచనో, వ్యూహమో అయి ఉంటుందంటున్నారు పరిశీలకులు.   ఇవాళ్రేపు రాజ‌కీయంగా ఒక నెగిటివిటీని నూరిపోస్తే త‌ప్ప రాణించ‌లేని గ‌డ్డు కాలం న‌డుస్తోంది. అందుకే రాహుల్ ఈ దేశం నుంచి ఆర్ఎస్ఎస్, మోడీ, అమిత్ షాల‌ను పార‌దోలాల్సిన  అవ‌స‌రం క‌నిపిస్తోంద‌నీ,  వారి ప్ర‌భావం నుంచి దేశాన్ని కాపాడాలని అంటున్నారు కానీ అది ఎలా సాధ్యం అన్న విషయంలో మాత్రం రాహుల్ లో కానీ, కాంగ్రెస్ లో కానీ క్లారిటీ కానరావడం లేదంటారు పరిశీలకులు. ఓట్ చోరీ నినాదం విషయంలో మాజీ ప్రధాని దేవెగౌడ రాహుల్ పై చేసిన వ్యాఖ్యలు కూడా అలానే ఉండటం యాధృచ్ఛికమేనా?  
మెడిక‌ల్ కాలేజీల పీపీపీ విధానాల‌ పై ప్ర‌జావ్య‌తిరేక‌త ఎంత ఉందో తెలియ చేస్తూ కోటి సంత‌కాల సేక‌ర‌ణ చేసింది వైసీపీ. పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని మొత్తం 175 నియోజ‌క‌వ‌ర్గాల  నుంచి మెడికల్ కాలేజీల ప్రభుత్వ, ప్రైవేటు   భాగస్వామ్యం విధానానికి వ్యతిరేకంగా కోటీ  4 ల‌క్ష‌ల   ఈ సంత‌కాల సేక‌ర‌ణ చేసి గ‌వ‌ర్న‌ర్ కి స‌మ‌ర్పించారు జగన్.  ఈ సందర్భంగా ర్యాలీలు కూడా నిర్వహించారు. జగన్ స్వయంగా 40 మంది బృందంతో కాలినడకన వెళ్లి మరీ ఆ సంతకాల పత్రాలను గవర్నర్ కు అందజేశారు. అసలింతకీ ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యాన్ని ఒక్క చంద్రబాబు కాదు, కేంద్ర ప్రభుత్వం సహా అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలూ అనుసరిస్తున్నాయి. ఈ పీపీపీ విధానం వల్ల ఎటువంటి నష్టం లేదని కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ ఢంకా బజాయించి మరీ చెబుతున్నారు.  ఎవరెంతగా చెప్పినా జగన్ మాత్రం తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లన్నట్లు వ్యవహరిస్తున్నారు.  ఇంత‌కీ జ‌గ‌న్ అండ్ కో  పీపీపీ విధానంపై చేస్తున్న విమర్శలు ఏమిటంటే..   పీపీపీ విధానంలో మెడిక‌ల్ కాలేజీ అభివృద్దికి ముందుకు వచ్చే ప్రైవేటు వ్యక్తులు కేవలం లాభాపేక్షతోనే వస్తారు. కోట్లు కొల్లగొడతారు. దీని వల్ల పేదలకు వైద్య విద్య మ‌రింత ఖ‌రీద‌వుతుంది. ఇది వారి పాలిట ఆశ‌నిపాతంగా మారుతుంది. ఇదీ జగన్ అండ్ కో అంటే జగన్, వైసీపీయులు చేస్తున్న వాదన. ఇక కోటి సంతకాలను గవర్నర్ కు సమర్పించే సందర్భంగా  జగన్ హాట్ కామెంట్లు కూడా చేశారు. అందులో యోగాంధ్ర కార్యక్రమం గురించి ప్రస్తావించారు. యోగాంధ్ర కోసం 330 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ప్రభుత్వం పేదల మెడికల్ విద్య కోసం వెయ్యి కోట్లు ఖర్చు చేయలేదా అని ప్రశ్నించారు.  ఇక్కడే ఆయన ఆర్థిక అజ్ణానం బయటపడుతోంది. వాస్తవానికి ప్రభుత్వం స్వయంగా ఖర్చు చేయడం లేదు.. ప్రైవేటు వ్యక్తులను ఆ వ్యయంలో భాగస్వాములను చేస్తున్నది. అదే పంధాలో సంక్షేమ పథకాలనూ అమలు చేస్తున్నది. జగన్ హయాంలో అభివృద్ధిని పూర్తిగా అటకెక్కించేసి బటన్ నొక్కుడు అంటూ ఖజానా మొత్తం సంక్షేమం అంటే ధారపోసి జగన్ బావుకున్నదేంటి? రాష్ట్రానికి ఒరిగిందేమిటి? అంటే జగన్ కు ఘోర పరాజయం, రాష్ట్రానికి తలకు మించిన అప్పులు మాత్రమే.  ప్రభుత్వానికి తలకు మించిన భారం కాకుండా  ప్రైవేటు వ్య‌క్తుల‌ను కూడా ఇన్వాల్వ్ చేయ‌డం మంచిదే కదా అంటున్నారు ఆర్థిక నిపుణులు. జ‌గ‌న్  హయాంలో ఆయన రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసి, ఇంకా అన్ని నిబంధనలనూ తుంగలోకి తొక్కి అప్పులు తెచ్చి మరీ సంక్షేమం అంటూ చేసిన పందేరం.. ఓట్ల వేటే తప్ప మరేదీ కాదంటున్నారు.  ఇటీవల వలంటీర్ల విషయంలో తనకు జ్ణానోదయం అయ్యిందని ఇటీవల జగన్ ప్రకటించారు. మరి అప్పులు చేసి రష్ట్ర ప్రగతిని శూన్యం చేసి అమలు చేసిన సంక్షేమం దారి తప్పిందన్న విషయంలో ఆయనకు ఇంకా జ్ణానోదయం కలిగినట్లు లేదంటున్నారు విశ్లేషకులు.   ప్ర‌తిదీ ప్ర‌భుత్వం నుంచే ఖ‌ర్చు చేయ‌డం వ‌ల్ల అది  పెట్టుబ‌డి అనిపించుకోదు.   ప్ర‌భుత్వ‌మే  అన్నీ ఉచితంగా చేయ‌డం వ‌ల్ల ఎన్ని నిధులూ సరిపోవు. అప్పులే శరణ్యం అవుతుంది. అందుకే ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం అంటున్నది చంద్రబాబు సర్కార్.  ఈ విషయం అర్ధం చేసుకోకుండా,  జగన్ ఇలాగే వ్యవహరిస్తే..  2029 కాదు.. 2034నాటికి కూడా  వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవని రాజకీయ విశ్లేషకులే కాదు... వైసీపీయులు కూడా  అంటున్నారు.  ఎవరో అనడం ఎందుకు జగన్ తాను స్వయంగా చేయించుకున్న సర్వేలు కూడా అవే చెబుతున్నాయి కదా!  మరి జగన్  ఈ తీరు వైసీపీని ఏ తీరానికి చేరుస్తుందో వేచి చూడాల్సిందే. 
తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలపై సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. మంత్రులతో కలిసి గురువారం (డిసెంబర్ 17) మీడియాతో మాట్లాడిన ఆఈయన ఈ రెండేళ్లలో తమ ప్రభుత్వ పని తీరుకు పంచాయతీ ఎన్నికలు రిఫరెండంగా ఆయన అభివర్ణించారు.  పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించిన అధికారులను అభినందించిన ఆయన ఈ ఎన్నికలలో పార్టీ విజయం కోసం కష్టపడిన కార్యకర్తలకు, అలాగే పార్టీని ఆశీర్వదించిన ప్రజలకు కృతజ్ణతలు తెలిపారు.  మొత్తం 12 వేల 702 పంచాయతీల్లో 7 వేల 527 గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ విజయం సాధించిందనీ, అంటే 66శాతం స్ట్రైక్ రేట్ సాధించిందనీ చెప్పిన రేవంత్, బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కైపోటీ చేశాయనీ, అయినా కూడా రెండు పార్టీలూ కలిపి 33 శాతం పంచాయతీల్లోనే గెలిచాయని రేవంత్ అన్నారు.   పంచాయతీ ఎన్నికల్లో 808 మంది కాంగ్రెస్ రెబల్స్ గెలిచారన్న రేవంత్ రెడ్డి వారిని కూడా కలుపుకుంటే కాంగ్రెస్ మొత్తం 8 వేల 335 పంచాయతీలలో జెండా పాతిందన్నారు.  ఈ ఫలితాలను బట్టి చూస్తే.. ఎన్నికలు జరిగిన 94 అసెంబ్లీ సెగ్మెంట్లలో 87 సెగ్మెంట్లలో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యత కనబరిచిందన్నారు.  అంటే  2028 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మూడింట రెండు వంతుల మెజారిటీతో అధికారంలోకి వస్తామని స్పష్టమౌతోందన్నారు.  2028 ఎన్నికలలో రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్సే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 
ALSO ON TELUGUONE N E W S
The anticipation surrounding Natural Star Nani’s upcoming period action epic, The Paradise, has reached a fever pitch. Directed by Srikanth Odela, this high-budget entertainer promises a visceral blend of raw emotion and high-octane action.  Following the viral success of Nani’s initial posters, the production team has now unveiled a striking new look featuring Sampoornesh Babu. In a departure from his usual screen persona, Sampoornesh Babu appears completely unrecognizable in the role of Biryani. Tasked with portraying the epitome of loyalty, Biryani is the most trusted confidant of Nani’s character, Jadal.  To meet Odela’s specific creative vision, the actor underwent a significant physical transformation, losing considerable weight to inhabit this "massy" and rugged avatar. Produced by Sudhakar Cherukuri, this Pan-India spectacle is set for a grand multi-language release on March 26, 2026. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
  'దసరా' తర్వాత న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో రూపొందుతోన్న మూవీ 'ది ప్యారడైజ్'(The Paradise). శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా ఫిల్మ్, 2026 మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో సంపూర్ణేష్ బాబు కీలక పాత్ర పోషిస్తున్నాడు. తాజాగా ఈ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదలై.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.   హృదయ కాలేయం, సింగం 123, కొబ్బరి మట్ట వంటి సినిమాలతో కామెడీ హీరోగా మంచి గుర్తింపు పొందాడు సంపూర్ణేష్ బాబు. ఇతర హీరోల సినిమాల్లోనూ అప్పుడప్పుడు మెరుస్తాడు. అయితే సంపూర్ణేష్ పేరు వింటే.. మొదట గుర్తుకొచ్చేది కామెడీనే. అలాంటి సంపూర్ణేష్.. ఇప్పుడు 'ప్యారడైజ్' కోసం మాస్ అవతారమెత్తాడు. (Sampoornesh Babu as Biryani)   'ది ప్యారడైజ్'లో నాని జడల్ అనే పాత్ర పోషిస్తుండగా, అతని స్నేహితుడు బిర్యానీ పాత్రలో సంపూర్ణేష్ నటిస్తున్నాడు. తాజాగా బిర్యానీ రోల్ లుక్ ని రివీల్ చేశారు మేకర్స్. ఒంటి నిండా నెత్తుటి మరకలతో.. భుజాన గొడ్డలి వేసుకొని.. బీడీ తాగుతూ నిల్చొని ఉన్న సంపూర్ణేష్ లుక్ అదిరిపోయింది. ఈసారి తనలోని మాస్ యాంగిల్ ని చూపించబోతున్నాడని పోస్టర్ తో అర్థమవుతోంది.   Also Read: BMW టీజర్.. భార్యకు తెలియకుండా స్పెయిన్ లో భర్త రాసలీలలు!   'ది ప్యారడైజ్'పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ఆకట్టుకుంది. ముఖ్యంగా నెవర్ బిఫోర్ లుక్ లో నాని కనిపించిన తీరు సర్ ప్రైజ్ చేసింది. ఇక ఇప్పుడు సంపూర్ణేష్ బాబు లుక్ చూసిన తర్వాత.. ఇందులో మరిన్ని సర్ ప్రైజ్ లు చూడబోతున్నామని అనిపిస్తోంది.    
Ravi Teja is trading heavy-duty action for high-octane humor in his latest outing, Bharta Mahasayulaku Wignapthy. Following a string of mass entertainers, the "Mass Maharaja" is back in a full-fledged comic avatar, and the newly released teaser suggests he hasn’t missed a beat. Directed by Kishore Tirumala, the film features Ravi Teja as a husband navigating the chaotic complications of an extra-marital affair. The teaser showcases the actor’s vintage comedic timing, reminiscent of his iconic performances in Venky and Dubai Seenu. His effortless wit, trademark expressions, and energetic body language signal a triumphant return to the "goated" sense of humor fans have long craved.   The teaser also highlights a nostalgic and hilarious chemistry between Ravi Teja and Sunil, a duo that has historically delivered box-office magic. Kishore Tirumala appears to have crafted a fresh, relatable characterization that leans into the actor’s natural charisma. Produced on a lavish scale by Sudhakar Cherukuri, the film stars Ashika Ranganath and Dimple Hayathi as the leading ladies. With its vibrant visuals and sharp writing, this teaser firmly establishes the movie as a must-watch family entertainer for the Sankranti season, for 13th January 2026. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
    ఎందుకు చేసాడు  ఏం మాట్లాడాడు ఆదిత్య దర్ ఏమన్నాడు     'ధురంధర్'(Dhurandhar)విజయపరంపర ఇప్పట్లో ఆగేలా లేదు. ప్రేక్షకుల మౌత్ టాక్ కి తోడు పలువురు సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు ధురంధర్ ని చూసి బాగుందని చెప్తుండటంతో ఇండియా వైడ్ గా ప్రేక్షకులు భారీ ఎత్తున థియేటర్స్ కి క్యూ కడుతున్నారు. ఇండియన్ క్రికెట్ టీం సైతం బిజీ షెడ్యూల్ లో ఉన్నా కూడా ధురంధర్ ని వీక్షించడంతో సక్సెస్ రేంజ్ ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. రీసెంట్ గా ప్రఖ్యాత దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma)ధురంధర్ పై స్పందించడం జరిగింది.     ఎక్స్ వేదికగా వర్మ స్పందిస్తు 'ధురంధర్ లాంటి మూవీ ఇప్పటి వరకు రాలేదు. చరిత్రలో నిలిచిపోవడం ఖాయం. ఏ భాషలో తెరకెక్కిందనేది ముఖ్యం కాదు. ధురంధర్ భారతీయ సినిమా. ప్రారంభం నుంచి చివరి వరకు ప్రతి సన్నివేశం మన మనసులకి హత్తుకుంటుంది.  వినోదాన్ని పంచడంతో పాటు ప్రేక్షకుల మనసు గెలుచుకోవడం చిత్ర బృందం సాధించిన అతి పెద్ద విజయం. ప్రతి సీన్ ఎప్పటికి గుర్తుండిపోతుంది. హాలీవుడ్ చిత్రాల్లా కాకుండా మన నేటి వీటికి తగిన విధంగా అంతర్జాతీయ స్థాయిలో కథలు తెరకెక్కించవచ్చని కూడా ఆదిత్య దర్ నిరూపించాడని వర్మ ఎక్స్ వేదికగా ట్వీట్ చేసాడు.     Also read:  అవతార్ ఫైర్ అండ్ యాష్  మూవీ రివ్యూ    వర్మ ట్వీట్ కి ఆదిత్య దర్(Aditya Dhar)స్పందిస్తు 'వర్మ సార్ నా మూవీ గురించి పోస్ట్ చేయడం నమ్మలేకపోతున్నాను. ఒక అభిమానిగా ఎంతో ఉప్పొంగిపోతున్నాను. దీంతో  నా బాధ్యత మరింత పెరిగిందని అనుకుంటున్నాను. ఇక పై ఏ మూవీని తెరకెక్కించిన ఆ పోస్ట్ చూసే తెరకెక్కిస్తాను. ఎన్నో ఏళ్ళ క్రితం ఒక చిన్న సూట్ కేసుతో ముంబై వచ్చాను. వర్మ సార్ దగ్గర అసిస్టెంట్ గా పని చేస్తే చాలని అనుకున్నానని బదులిచ్చాడు.        
  మాస్ మహారాజా రవితేజ ఓ మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఆయన హీరోగా నటించిన గత చిత్రాలు బాక్సాఫీస్ ఫెయిల్యూర్స్ గా మిగిలాయి. దీంతో కిషోర్ తిరుమల దర్శకత్వంలో చేస్తున్న 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' పైనే ఆశలు పెట్టుకున్నాడు. ఎస్ఎల్వీ సినిమాస్ నిర్మిస్తున్న ఈ మూవీ, 2026 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ చిత్ర టీజర్ ను విడుదల చేశారు మేకర్స్. (Bhartha Mahasayulaku Wignyapthi)   భార్య-ప్రేయసి మధ్య నలిగిపోయే వ్యక్తి కథగా, వినోదభరిత చిత్రంగా 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' తెరకెక్కింది. నిమిషంన్నర నిడివితో రూపొందిన ఈ టీజర్ సరదాగా సాగింది. వెన్నెల కిషోర్ తో కలిసి సైకాలజిస్ట్ దగ్గరకు రవితేజ వెళ్ళే సన్నివేశంతో టీజర్ ప్రారంభమైంది. ఇందులో రవితేజ భార్యగా డింపుల్ హయాతి, లవర్ గా ఆషికా రంగనాథ్ కనిపిస్తున్నారు. తన భర్త రాముడు లాంటివాడు అని డింపుల్ హయాతి నమ్మకం. కానీ, రవితేజ మాత్రం స్పెయిన్ వెళ్ళినప్పుడు.. అక్కడ అనుకోని పరిస్థితుల్లో ఆషికా రంగనాథ్ తో శారీరికంగా కలిసి, ఆమెకు దగ్గరవుతాడు. ఈ విషయం భార్యకు తెలియకుండా ఉండటం కోసం రవితేజ ఏం చేశాడు? రవితేజకు ఆల్రెడీ పెళ్లి అయిందని తెలిసి ఆషిక ఎలా రియాక్ట్ అయింది? వంటి అంశాలతో టీజర్ ను సరదాగా రూపొందించారు. (BMW Teaser)   Also Read: సౌండ్ లేని 'రాజా సాబ్'.. ఇది నిజంగా ప్రభాస్ సినిమాయేనా..?   'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ చూస్తుంటే.. సినిమాలో ఎంటర్టైన్మెంట్ కి బోలెడంత స్కోప్ ఉందని అర్థమవుతోంది. రవితేజ అంటేనే ఎంటర్టైన్మెంట్. పైగా, సంక్రాంతి సీజన్ లో ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ కి మంచి ఆదరణ ఉంటుంది. టీజర్ కూడా ప్రామిసింగ్ గా ఉంది. చూస్తుంటే.. ఈ సినిమాతో రవితేజ అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చేలా ఉన్నాడు.   కాగా, టీజర్ తో పాటు రిలీజ్ డేట్ ని కూడా రివీల్ చేశారు మేకర్స్. జనవరి 13న థియేటర్లలో అడుగు పెట్టనుంది.    
      సినిమా పేరు: అవతార్ ఫైర్ అండ్ యాష్ తారాగణం: సామ్ వర్తింగ్టన్, జియో సాల్డానా, స్టీఫెన్ లాంగ్, కేట్ విన్స్ లేట్ తదితరులు     తదితరులు  ఎడిటర్: డేవిడ్ బ్రేన్నర్, జాన్  మ్యూజిక్:సైమన్ ఫ్రాంగ్లన్ రచన, దర్శకత్వం: జేమ్స్ కామెరూన్   సినిమాటోగ్రాఫర్: రసల్ కార్పెంటర్ బ్యానర్: లైట్ స్తోమ్ ఎంటర్ టైన్ మెంట్  నిర్మాతలు:జేమ్స్ కామెరూన్, జోన్ లండు విడుదల తేదీ: డిసెంబర్ 19, 2025        ప్రపంచ సినీ ప్రేమికులతో పోటీపడుతు తెలుగు సినిమా ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న మూవీ 'అవతార్ ఫైర్ అండ్ యాష్'(Avatar fire and ash). దీంతో పండోర గ్రహంలో మరోసారి ప్రపంచ సినీ పితామహుడుగా పిలవబడే  జేమ్స్ కామెరూన్(James Cameron)సృషించిన అద్భుతమైన విశ్వాన్ని చూడటానికి ఉదయం నుంచే థియేటర్స్ కి క్యూ కట్టారు.మరి మూవీ మెప్పించిందా లేదా చూద్దాం.     కథ   పోరాటయోధుడైన జేక్ (సామ్ వర్తింగ్టన్) తన కుటుంబం, తన మనుషులతో పండోర గ్రహంలో నివసిస్తూ ఉంటాడు. వాళ్ళందరంటే జేక్ కి  ప్రాణం. జేక్ బార్య నైత్రీ కూడా పోరాటయోధురాలు. ఏలియన్స్ అయిన వీళ్ళతో పాటు స్పైడర్ అనే మాములు మనిషి జీవిస్తుంటాడు. జేక్ ఫ్యామిలీకి స్పైడర్ అంటే ఎంతో ఇష్టం. వీళ్ళకి దూరంగా ఒక రహస్య ప్రాంతంలో కల్నల్ క్వారీచ్‌(స్టీఫెన్ లాంగ్) నేతృత్వంలోని ఆర్ డి ఏ టీం, బ్రిడ్జి హెడ్ అనే ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేస్తుంది. మాములు మనుషులైన వాళ్ళ లక్ష్యం జేక్ ని తమ అదుపులో ఉంచుకోవడం. మరో వైపు యాష్ పీపుల్' నాయకురాలు, ఏలియన్ అయిన వరాంగ్(ఊనా చప్లీన్) లక్ష్యం జేక్ ని అంతం చేయడం. ఈ క్రమంలో స్పైడర్ ని అతని శరీరంలో ఉన్న 'అల్గే' కోసం కల్నల్ మనుషులు తీసుకెళ్తారు. అసలు అల్గే అంటే ఏంటి? జేక్ పై  కల్నల్ క్వారీచ్‌, వరాంగ్ కి పగ ఎందుకు?  జేక్ అతని తెగపై ఏం ఆశించి పోరాటం చేస్తున్నారు? ఆ పోరాటంలో క్వారీచ్‌, వరాంగ్ ఒక్కటయ్యారా! ఒక్కటయ్యితే  ఆ పోరాటాన్ని జేక్ వర్గం ఎలా ఎదుర్కొంది. ఆ పోరాటంలో ఎవరు విజేతలుగా నిలిచారు ? అసలు టోటల్ గా అవతార్ ఫైర్ అండ్ యాష్ ఏ ఉద్దేశంతో తెరకెక్కిందనేదే  చిత్ర కథ.      ఎనాలసిస్    అవతార్ రెండు పార్టులు చూసిన వాళ్లకి పార్ట్ 3 ఈజీగా అర్ధమవుతుంది. కొత్త వాళ్ళు అయితే అంత త్వరగా అర్ధం చేసుకోలేరు. ఈ విషయాన్నీ మేకర్స్ గుర్తించి రెండు భాగాల కథని మొదట ఐదు నిమిషాల్లో చెప్పాల్సింది. ఫైర్ అండ్ యాష్ ని చూసుకుంటే స్టార్టింగ్ నుంచే స్లో గా కథనం నడవడంతో పాటు క్యారక్టర్ ల బాడీ లాంగ్వేజ్ కూడా చివరి దాకా అదే విధంగా నడిచాయి. విజువల్స్ పరంగా బాగున్నా ఒకే పాయింట్ పై కథ నడవడంతో చూసిన సీన్స్ మళ్ళీ చూసినట్టుగా అనిపించడం మైనస్. ప్రేక్షకులని మెప్పించాలనే రీతిలో మేకర్స్ తెరకెక్కించలేదని స్టార్టింగ్ నుంచే అనిపిస్తుంది. అసలు తమకి ముప్పు ఉంటుందని జేక్ అండ్ వర్గానికి తెలుసు కాబట్టి వాళ్ళ పోరాటాన్ని ఎంటర్ టైన్ మెంట్ కోణంలోనే ఎదుర్కొని ఉంటే బాగుండేదేమో.     ఫస్ట్ హాఫ్  చూసుకుంటే మొదటి ఇరవై నిమిషాల దాకా ఆకట్టుకునే సీన్స్ రాలేదు. ఆ తర్వాత వచ్చిన సీన్స్ లో భావోద్వేగాలు మాత్రం బాగున్నాయి. సినిమా చివరి దాకా అదే విధంగా భావోద్వేగాలు కంటిన్యూ అవుతూ వస్తుంటాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ లో కూడా పెద్దగా మెరుపులు ఏమి లేవు. ఇక సెకండ్  హాఫ్ కూడా ఫస్ట్ హాఫ్ చూసినట్టుగానే ఉంది. ఒక సెంటిమెంట్ సీన్, ఆ తర్వాత యాక్షన్ ఎపిసోడ్స్ రాయడంతో మైమరిచిపోయిందేమి లేదు. విలన్స్ ఎంతో కష్టపడి పట్టుకున్న వ్యక్తి  చాలా నాచురల్ గా తప్పించుకోవడం, మళ్ళీ అతనితో పోరాటం చేయడం అనేది ఇబ్బందిగా అనిపిస్తుంది. దీంతో గూస్ బంప్స్ రావు.  కాకపోతే చివర్లో సముద్రంలో వచ్చిన పోరాట సన్నివేశాలతో పాటు   సదరు సన్నివేశాల్లో విజువల్స్ మాత్రం సూపర్ గా ఉన్నాయి.   నటీనటులు సాంకేతిక నిపుణుల పని తీరు   అందరూ తమ క్యారక్టర్ ల పరిధి మేరకు సూపర్ గా చేసారు.టెక్నీకల్ గా చూసుకుంటే విజువల్స్, ఫొటోగ్రఫీ చాలా బాగుంది. ఆర్ ఆర్ స్కోర్ మాత్రం మెస్మరైజ్ చేసేంత స్థాయిలో లేదు. కథకి తగ్గట్టుగానే జేమ్స్ కామెరూన్ దర్శకత్వం సాగినా, కథనాన్ని చెప్పే విషయంలో మెప్పించలేకపోయాడు. ఎడిటింగ్ కూడా అంత క్యాచీగా లేదు.    ఫైనల్ గా చెప్పాలంటే క్యారక్టర్ డిజైన్స్ బాగున్నా వాటిని ఉపయోగించుకోవడంలో  మేకర్స్ మెతక వైఖరి అవలంభించారు. ప్రస్తుత ట్రెండ్ కి తగ్గట్టుగా కాన్సెప్ట్ కి తగ్గ స్పీడ్  కూడా  మూవీలో లేదు. విజువల్ గా మాత్రం బాగుంది. రేటింగ్ 2 .5 /5                                                                                                                                         అరుణాచలం     
  మూడు వారాల్లో రాజా సాబ్ రాక కనిపించని ప్రభాస్ రేంజ్ హైప్! ఓవర్సీస్ బుకింగ్స్ కి షాకింగ్ రెస్పాన్స్! ప్రభాస్ ఫ్యాన్స్ రియాక్షన్ ఏంటి?   'బాహుబలి'తో పాన్ ఇండియా స్టార్ గా అవతరించాడు ప్రభాస్. ఆయన సినిమా వస్తుందంటే ఇండియాలోనే కాకుండా, ఓవర్సీస్ లో కూడా ఎంతో క్రేజ్ ఉంటుంది. అలాంటిది ప్రభాస్ అప్ కమింగ్ ఫిల్మ్ 'ది రాజా సాబ్' విషయంలో ఆ రేంజ్ హైప్ కనిపించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. (The Raja Saab)   ప్రభాస్ హీరోగా మారుతీ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న మూవీ 'ది రాజా సాబ్'. ఈ హారర్ కామెడీ ఫిల్మ్ సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ బాగానే ఆకట్టుకున్నాయి. రెండు సాంగ్స్ కూడా విడుదల కాగా.. సెకండ్ సింగిల్ కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. వింటేజ్ ప్రభాస్ ని చూడబోతున్నారంటూ మూవీ టీమ్ మొదటి నుంచి ప్రచారం చేసింది. విడుదలకు ఇంకా మూడు వారాలే సమయముంది. అయినప్పటికీ ఎందుకనో రాజా సాబ్ పై రావాల్సిన హైప్ రాలేదు.   మామూలుగా ప్రభాస్ సినిమా బుకింగ్స్ ఓపెనింగ్స్ అయితే.. సరికొత్త రికార్డులు నమోదవుతుంటాయి. అలాంటిది 'రాజా సాబ్' ఓవర్సీస్ బుకింగ్స్ కి రెస్పాన్స్ అంతంత మాత్రంగానే ఉంది. తెలుగునాట కూడా రెగ్యులర్ ప్రభాస్ సినిమాల స్థాయిలో దీని గురించి చర్చ జరగట్లేదు.   Also Read: హాట్ టాపిక్ గా ఛాంపియన్ ట్రైలర్.. బైరాన్‌పల్లి రక్త చరిత్ర!   రాజా సాబ్ నుంచి ఇంకా కొన్ని సాంగ్స్, రిలీజ్ ట్రైలర్ రావాల్సి ఉంది. ఆ అప్ కమింగ్ కంటెంట్ తో మెస్మరైజ్ చేసి, అందరి దృష్టిని తమ వైపు తిప్పుకునేలా మూవీ టీమ్ చేయాల్సి ఉంది. మరి అలాంటి మైండ్ బ్లోయింగ్ కంటెంట్ రాజా సాబ్ నుంచి వస్తుందేమో చూడాలి.   అయితే 'రాజా సాబ్'పై భారీ హైప్ లేదనే చర్చల నేపథ్యంలో ప్రభాస్ ఫ్యాన్స్ రియాక్షన్ వేరేలా ఉంది. ప్రభాస్ గత చిత్రం 'కల్కి 2898AD' విషయంలోనూ ఇలాగే అంతగా బజ్ లేదన్నారు. కట్ చేస్తే ఆ సినిమా రూ.1000 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. ఇప్పుడు 'రాజా సాబ్' కూడా అలాంటి సర్ ప్రైజ్ ఇవ్వడం ఖాయమని ప్రభాస్ ఫ్యాన్స్ నమ్ముతున్నారు.  
  ట్రైలర్ తో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన మూవీ 'ఛాంపియన్'. రోషన్ మేకా హీరోగా ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో స్వప్న సినిమా నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. నిన్నటిదాకా సినిమాపై పెద్దగా అంచనాలు లేవు. తాజాగా విడుదలైన ట్రైలర్ ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. (Champion Trailer)   'ఛాంపియన్' సినిమా పీరియడ్ డ్రామాగా తెరకెక్కింది. తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో ఉన్న బైరాన్‌పల్లి గ్రామానికి పోరాటాల పురిటిగడ్డగా పేరుంది. నిజాం పాలనలో రజాకార్ల అరాచకాలను వ్యతిరేకంగా పోరాడి, వంద మందికి పైగా గ్రామస్థులు వీరమరణం పొందారు. ఆ వీరగాథ ఆధారణంగానే 'ఛాంపియన్' రూపుదిద్దుకోనుంది.   బ్రిటిష్ పాలన కాలంలో ఫుట్ బాల్ ఛాంపియన్ కావాలని కలలు కనే యువకుడి పాత్రలో రోషన్ కనిపిస్తున్నాడు. బైరాన్‌పల్లి వీరగాథలో అతను ఎలా భాగమయ్యాడు? అతని ప్రేమ కథ ఏంటి? అతని ఫుట్ బాల్ ఛాంపియన్ కల నెరవేరిందా? అనే కోణంలో ట్రైలర్ కట్ చేశారు.    Also Read: ఈ వారం ఓటీటీలో వినోదాల విందు.. ఒకేసారి ఇన్ని సినిమాలు, సిరీస్ లా!   'ఛాంపియన్' ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. కథా నేపథ్యం, విజువల్స్, నటీనటుల పర్ఫామెన్స్, నిర్మాణ విలువలు, సంగీతం ప్రతిదీ ఆకట్టుకున్నాయి. ఒక్క ట్రైలర్ తో ఇప్పుడు ఈ సినిమా గురించి అంతటా చర్చ జరుగుతోంది. డిసెంబర్ 25న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేసేలా కనిపిస్తోంది.    
Cast: Sam Worthington, Zoe Saldaña, Sigourney Weaver, Stephen Lang, Kate Winslet, Oona Chaplin, Jack Champion Crew:  Written by James Cameron, Rick Jaffa, Amanda Silver, Josh Friedman, Shane Salerno Music by Simon Franglen Edited by Stephen E. Rivkin, David Brenner, Nicolas de Toth, John Refoua, Jason Gaudio, James Cameron Cinematography by Russell Carpenter Directed by James Cameron Produced by James Cameron, Jon Landau Avatar The Fire and Ash is one of the most awaited films, globally, from the master craftsman James Cameron. He created a great franchise in Avatar but his second film, Avatar: The Way of Water, felt like a rehash of first one with new setting. Still, the movie became a massive 2.3 Billion USD grosser. After a three-year gap, tthe third installment is here. Let's discuss about the movie in detail.  Plot:  Jake Sully (Sam Worthington) and his wife Neytiri (Zoe Saldana) have been chased by Colonel Miles (Stephen Lang)'s Avatar and he is hell-bent on arresting Jake. But his higher officials lose trust in him but he doesn't stop. Neytiri is unable to forgive herself for losing her son and moving away from home. She starts to indirectly hate Jake and her relationship as well, as it reflects humans or sky people, whom she rightfully hates to the core as the invaders and destroyers of their peaceful home.  Colonel Miles is also on search for his son, Spider (Jack Champion), but Spider never accepts himself as a human but rather he feels like he is indigenous Na'vi. Neytiri starts to hate him as the cause of her son's demise too. At one point, Jake starts to look at him as a threat for their well-being while his son Lo'ak (Britain Dalton), Kiri (Sigourney Weaver) and other daughter Tu'k protest this move. With the help of Wind Traders, Jake decides to drop him at a human settlement. But they are attacked by looters - Fire and Ash people.  Entire family gets disbanded and Kiri through Ey'wa helps Spider to breathe on his own, making him a human-Na'vi hybrid. Now, he becomes even more important for the Humans to reverse engineer and grow such hybrids for humans to breathe freely on Pandora. Will they catch him? What will Jake Sully do to end the animosity of Colonel Miles towards him? Will the looters prove to be even bigger threat? Watch the movie to know more.  Analysis:  James Cameron is currently enjoying the status of being an absolute God as none of his films, in recent memory have collected below US$ 2 Billion in almost three decades. Titanic, Avatar and Avatar 2 have been such huge blockbusters. But the second installment did not better the first one's collections and cross the 3 Billion mark as anticipated, hinting at people wishing for more than that the maker offered for an Universal acceptance that he enjoyed in previous films.  So, many hoped that he would course correct in the third part and change things. Also, second part had a long waiting for upto 12 years for him to bring another Avatar film, which made people to just go and watch it. Here, Fire and Ash, needed even bigger plot points to move the story forward and give new dimensions than playing around the same. Unfortunately, Cameron just released an elaborate second part for his Avatar 2 as Avatar 3.  The story moves around at a snail pace when you can actually predict what is going to happen from miles away. You know that he is not a filmmaker who would take too many risks when such huge commerce is at stake. So, he needed to mix the narrative with enough innovation for audiences to feel compelled or fall in love again with Na'vi. Avatar did work because it showcased very serious message about climate change and global pollution that is leading to "death of earth" as we know it.  He also pointed at the greed that humans tend to overlook as ambition. But in his second and third, which look like one six-hour-film cut into two parts, he could not really nail the point. He again touched on marine life being used as tool for exploitation and brought in occults, pirates into the mix. The narrative of innocent Na'vi and Pandora tribes against Humans has been hinted at being a clash within the Pandora tribes which again propelled by Humans. Which means, he retold the first movie story as two parts in two films, once again.  While the visuals are unbelievable, each department aced themselves to craft mind-blowing environments but nothing really invests audiences into the story. The human hybrid angle feels like a rehash of Jake Sully being accepted from the first one and majority of sequences, also feel like rehashs from his previous films too. On the whole, the movie underwhelms with a lacklustre narrative. Only for the visual brilliance and imagination it seems watchable but that too with limited appeal.  Bottomline:  For those who enjoy visuals as it lacks emotional investment.  Rating: 2.5/5  Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. Viewers' discretion is advised before reacting to them.
  The makers of the highly anticipated Sankranthi entertainer Mana Shankara Vara Prasad Garu have released exclusive stills of Megastar Chiranjeevi, instantly setting social media and fan circles abuzz.   In these striking stills, Megastar Chiranjeevi appears stylish, youthful, and brimming with charisma, reaffirming his timeless appeal and unmatched screen presence. His vintage charm and effortless grace have once again captured the imagination of audiences, making these posters an instant talking point.   The film has already gained strong momentum with the release of its first two songs, “Meesaala Pilla” and “Sasirekha,” both of which turned into chart-topping sensations, clocking huge numbers and receiving an overwhelming response. The excitement is set to rise further with the third song scheduled for release in the last week of December.   Hit Machine, Director Anil Ravipudi is presenting Megastar Chiranjeevi in a classic and nostalgic avatar that fans have been longing to witness, adding to the film’s growing anticipation. After a long gap, it will be a delight to see Chiranjeevi in a thoroughly entertaining role.   Produced on a lavish scale, Mana Shankara Vara Prasad Garu is gearing up for a grand worldwide release this Sankranthi on January 12, promising a wholesome festive treat for audiences.        
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
మన జీవితంలో మనకు తెలియకుండానే చాలా తప్పులు చేస్తాం. కానీ ఆ తప్పుల వల్ల మనం డబ్బు పోగొట్టుకుంటాం. చాణక్యుడి ప్రకారం, కొన్ని తప్పులు ధనవంతులను కూడా పేదలుగా మారుస్తాయి. ఆ తప్పులేంటో చూద్దాం. ఆచార్య చాణక్యుడు గొప్ప పండితుడు అన్నది అందరికీ తెలిసిన విషయమే. చంద్రగుప్త మౌర్యుడిని రాజుగా చేయడంలో అతని పాత్ర గొప్పది. చాణక్యుడి ఈ తత్వశాస్త్రం మన జీవితంలో చాలా ముఖ్యమైనది.ఆచార్య చాణక్యుడు రచించిన నీతిశాస్త్రంలో జీవితం, డబ్బు, సమాజం, సంబంధాలు, వ్యక్తిగత జీవితం గురించి ఎన్నో ఆలోచనలు ఇచ్చారు. ఆయన సూత్రాలను పాటిస్తూ జీవనం సాగిస్తే విజయం వరిస్తుంది.అలాగే, చాణక్యుడు ప్రకారం, జీవితంలో మనం చేసే తప్పులు డబ్బు నష్టానికి,  బాధకు దారితీస్తాయి. అదేవిధంగా మన సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి పెరుగుతాయి. ప్రధానంగా డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బును కుటుంబ పోషణ,  ఇతరుల సంక్షేమం కోసం ఉపయోగించాలి.  మిగిలిన డబ్బును పెట్టుబడి పెట్టాలి.మీరు సంపాదించిన డబ్బును జూదం, బెట్టింగ్ మొదలైన వాటిపై ఎప్పుడూ వృధా చేయకండి. ఆనందం కోసం డబ్బును దుర్వినియోగం చేయడం సమీప భవిష్యత్తులో మిమ్మల్ని మరింత సమస్యగా మార్చే అవకాశం ఉంది.డబ్బు ఎప్పుడూ ఇతరుల మంచికే ఉపయోగించాలి. ఇతరులకు హాని కలిగించడానికి ఎప్పుడూ ఉపయోగించకూడదు. ఇది లక్ష్మీ దేవికి కోపం తెప్పిస్తుంది. తద్వారా మనం డబ్బును కోల్పోవచ్చు.మరీ ముఖ్యంగా డబ్బు ఆదా చేసే అలవాటు ఉండాలి. ఎంత డబ్బు వచ్చినా ఖర్చు పెట్టకూడదు. మనం వీలైనంత తక్కువ డబ్బు ఖర్చు చేయాలి. ఇది మీకు ప్రయోజనం చేకూరుస్తుంది.
  పెళ్లయ్యాక భార్యభర్తల మద్య గొడవలు అనేవి చాలా సహజం.  చాలా మంది భార్యాభర్తల మధ్య జరిగే గొడవలు ఇంటి గొడవలు అని చెబుతారు. అవి ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే గొడవలే అయినా,  ఇంటికి, కుటుంబానికి సంబంధించినవి అయినా టోటల్ గా ప్రతి భార్యభర్త జంట మధ్య కొన్ని గొడవలు కామన్ గా జరుగుతాయని రిలేషన్షిప్ నిపుణులు చెబుతున్నారు.పెళ్లయ్యాక ప్రతి జంట మధ్య జరిగే కామన్ గొడవలు ఏంటో తెలుసుకుంటే.. ఇవి అందరి మధ్యన జరుగుతాయి కాబట్టి వీటిని సీరియస్ గా తీసుకుని బంధాన్ని విచ్చిన్నం చేసుకోకూడదు అని ప్రతి జంట అర్థం చేసుకోగలుగుతుంది.  ఇంతకీ అందరు భార్యాభర్తల మధ్య కామన్ గా జరిగే గొడవలు ఏంటో తెలుసుకుంటే.. తల్లిదండ్రుల శైలి.. భార్యాభర్తల ఇద్దరి తల్లిదండ్రులు ఒకరి కుటుంబ విధానాన్ని మరొకరు విమర్శించుకోవడం చాలా కుటుంబాలలో కనిపిస్తుంది. ఒకరేమో చాలా నిర్లక్ష్యంగా పెంచారు అనే నిందలు వేస్తుంటారు, మరొకరు ఏమో ఏమీ చేత కాకుండా పెంచారని అంటారు, కొన్నిసార్లు చాలా స్ట్రిక్ట్ గా పెంచి పిరికివాళ్లుగా మార్చారని అంటారు.  ఇలా రెండు కుటుంబాలలో విబిన్న విధాలుగా పెంపకం ఉంటుంది.  పెళ్లైన తర్వాత వారికి చిన్నతనం నుండి అలవాటైన విధానం ఇప్పుడు కూడా కొనసాగాలని కోరుకుంటారు.   అంతేకాదు.. తమ చిన్నతనం ఎలా గడిచిందో అదే విధంగా తమ పిల్లలను కూడా పెంచాలని చూస్తారు. ఇది ప్రతి ఇంట్లో, ప్రతి కుటుంబంలో సాగే గొడవ.  దీన్ని వీలైనంత చాకచక్యంగా పరిష్కరించుకోవాలి. డబ్బు.. డబ్బు చాలా ముఖ్యమైన అంశం.  కొన్ని కుటుంబాలు డబ్బుల విషయంలో చాలా ఆంక్షలు విధిస్తూ పెంచుతారు. మరికొన్ని కుటుంబాలు డబ్బు అనేది పిల్లల కోసమే కదా అనే ఆలోచనతో పిల్లలకు డబ్బు అలవాటు చేస్తారు, డబ్బు వల్ల వచ్చే సమస్యలు కొన్నిసార్లు చాలా తీవ్రమైన గొడవలకు కారణం అవుతాయి. భార్యాభర్తల అభిరుచులు డబ్బు విషయంలో ఒకటిగా ఉంటే పర్లేదు. కానీ ఒకరు పొదుపరి,  మరొకరు బాగా ఖర్చు పెట్టేవారు అయితే చాలా గొడవలు వస్తుంటాయి.  ముఖ్యంగా ఎప్పడైనా డబ్బు కారణంగా ఇంట్లో  ఆర్థిక సమస్యలు వస్తే జరిగే గొడవలు చాలా పెద్దగా ఉంటాయి. సాన్నిహిత్యం.. భార్యాభర్తల మధ్య మంచి అనుబంధం ఉండాలంటే వారి మధ్య సాన్నిహిత్యం కూడా చాలా బాగుండాలి. ఒకరు తమ ప్రేమను ఎక్స్పెస్ చేయగలిగితే మరొకరు అలా ప్రేమను ఎక్ప్రెస్ చేయకుండా తమలోనే దాచుకుంటారు.  దీని వల్ల ఒకరి మీద ఒకరికి విబిన్న అభిప్రాయాలు ఏర్పడతాయి.  ప్రేమించడం తెలియదు, ప్రేమ లేదు,  ప్రేమ లేకుండా పెళ్లి చేసుకున్నారు వంటి అపార్థాలు వస్తాయి.  ఎప్పుడు ప్రేమ గురించి తప్ప బాధ్యతగా ఉంటున్నానని ఆలోచించట్లేదు అని మరొకరు అనుకుంటారు. ఇలా చాలా విధాలుగా అపార్థాలు వస్తుంటాయి. భవిష్యత్తు.. పెళ్లైన ప్రతి జంటకు భవిష్యత్తు గురించి కొన్ని కలలు ఉంటాయి. పిల్లల కోసం ఒకరు కష్టపడతారు, మరొకరు కెరీర్ ను కూడా వదిలేసుకుంటారు.  జీవితంలో లక్ష్యాల కోసం ఒకరు ఆరాటపడతారు,  నేను ఎన్ని త్యాగాలు చేసినా నన్ను అర్థం చేసుకోవట్లేదు అని ఒకరు అనుకుంటారు.  ఇలా చాలా విధాలుగా ఇద్దరూ తమలో తాము సంఘర్షణ పడుతుంటారు.  వీటి వల్ల కూడా భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతూ ఉంటాయి. పైన పేర్కొన్న  ప్రతి గొడవ పెళ్లైన ప్రతి జంట మధ్య తప్పనిసరిగా జరుగుతుంది.  కేవలం తమ మద్య మాత్రమే గొడవ జరుగుతుందనే ఆలోచన చేస్తూ గొడవ జరిగినప్పుడు దానికి గల కారణాన్ని సమస్యగా చూసి దాన్ని పరిష్కరించుకోవాలి. అంతే కానీ భాగస్వామినే సమస్యగా చూస్తే ఆ బందం పెళుసుగా మారుతుంది.  అంతేకాదు.. భార్యాభర్తల మద్య గొడవలు జరిగినప్పుడు,  సమస్య వచ్చినప్పుడు రాజీ పడటం ప్రధానం.  ఎవరో ఒకరు రాజీ పడితే తప్ప బందం నిలవదు.  రాజీ పడటం అంటే తాము ఓడిపోవడం,  చిన్నతనం కావడం కాదు.. బంధాన్ని నిలబెట్టుకోవడం.                           *రూపశ్రీ. 
నేటి కాలంలో అమ్మాయిలు అబ్బాయిలతో సహా అన్ని రంగాలలో రాణిస్తున్నారు.  అన్ని పనులు చేయగలుగుతున్నారు. కొన్ని సందర్బాలలో అబ్బాయిల కంటే ధైర్యాన్ని చూపగలుగుతున్నారు. అయినా సరే అమ్మాయిల విషయంలో సమాజం నుండి ఇంటి వరకు ప్రతి చోట ఒక చిన్నతనం కనిపిస్తుంది.  కొన్ని ప్రశ్నలు అమ్మాయిలను చాలా అసౌకర్యానికి గురి చేస్తుంటాయి. అమ్మాయిలను ఎప్పుడు అడగకూడని ప్రశ్నలు కొన్ని ఉన్నాయి. వీటిని అడగకుండా ఉండటం వల్ల అమ్మాయిల గౌరవాన్ని కాపాడటమే కాకుండా వారి మానసిక స్థితిని కూడా కాపాడిన వాళ్లమవుతాము.  ఇంతకీ అమ్మాయిలను ఎప్పుడూ అడగకూడదని ప్రశ్నలేంటి? ఆ ప్రశ్నలను ఎందుకు అడగకూడదు? తెలుసుకుంటే.. శరీరం గురించి.. అమ్మాయిలు లావుగా  ఉండటం లేదా చాలా సన్నగా ఉండటం చాలామందిలో ఉంటుంది.  ఇది పైకి కనిపించే విషయమే.  ఎప్పుడైనా సరే అమ్మాయిలను కామెడీ కోసం లేదా సీరియస్ గా అయినా శరీర ఆకృతి గురించి,  బరువు గురించి అస్సలు అడగకూడదు.  ఇంత లావుగా ఉన్నావేంటి.. లేదా ఇంత సన్నగా ఉన్నావేంటి? వంటి ప్రశ్నలు ఎప్పుడూ వేయకూడదు. ఇది బాడీ  షేమింగ్ చేయడం కిందకు వస్తుంది.  ఇలా చేయడం వల్ల అమ్మాయిల ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. శరీరం లావుగా లేదా సన్నగా ఉండటానికి చాలామంది అన్ని జాగ్రత్తలు తీసుకున్నా హార్మోన్స్ ప్రాబ్లమ్ వల్ల అలా ఉంటారు. దీనికి కామెంట్ చేస్తూ ప్రశ్నించడం తప్పు. పిల్లలు.. పెళ్లైన ప్రతి స్త్రీ కి ఎదురయ్యే ప్రశ్న పిల్లల గురించి.  కొత్తగా పెళ్లైన దగ్గర నుండి  పిల్లలు కలగడం ఆలస్యమయ్యే వారి వరకు ఎప్పుడూ పిల్లలను ఎప్పుడు కంటావ్ అని అడుగుతారు.  పిల్లలను కనాలనే నిర్ణయం కేవలం అమ్మాయిలది మాత్రమే కాదు.. వారి కుంటుంబానిది, మరీ ముఖ్యంగా భర్త కూడా దీనికి కీలకం.  అందుకే పిల్లల గురించి మహిళలను పదే పదే ప్రశ్నలు వేయకూడదు. ఇది వారిని మానసిక  ఒత్తిడికి గురి చేస్తుంది. వివాహం.. వయసు పెరుగుతున్నా వివాహం ఆలస్యం అవుతున్న అమ్మాయిలు కూడా ఉంటారు. లేదంటే భర్త చనిపోయిన తరువాత వివాహం చేసుకోకుండా అలాగే ఉండిపోయిన మహిళలు కూడా ఉంటారు. ఇలాంటి వారితో ఎందుకు పెళ్లి చేసుకోలేదు అని ప్రశ్నలు వేయకూడదు. వివాహం  అనేది  మహిళల వ్యక్తిగతం. అలాగే అది కుటుంబ సమస్య కూడా.  దీని గురించి ప్రశ్నించడం వల్ల వారి ఆత్మగౌరవం దెబ్బతింటుంది. వృత్తి.. మగవారికి వారి జీవితకాలం వృత్తి పరమైన కెరీర్ ఉంటుంది. కానీ చాలామందికి  మహిళలు తమ కెరీర్ మధ్యలో వదిలేస్తారు అనే ఆలోచన ఉంటుంది.  పెళ్లి అయిన తరువాత  పిల్లలు పుడితే ఇక మహిళలు తమ కెరీర్ ను కొనసాగించలేరేమో అనే అభిప్రాయంతో ఉంటారు. కానీ ఇది చాలా తప్పు. మహిళల కెరీర్ వారి ఇష్టం.  వారు తమ కుటుంబాన్ని చూసుకుంటూ వారి కెరీర్ కొనసాగించుకుంటే వచ్చే నష్టం ఏమీ లేదు.  అనవసరంగా వారి కెరీర్ ఇంకెన్నాళ్లు ఉంటుంది అని ప్రశ్నించకూడదు. సమయం.. చాలామంది మహిళలు బయటకు ఎక్కడికి వెళ్లినా ఎప్పుడైనా ఆలస్యం అయితే అందరూ అడిగే ప్రశ్న ఇంత ఆలస్యం ఎందుకైంది అని. అదే తొందరగా వారు ఎక్కడికైనా హాజరైతే ఇంత త్వరగా ఇంటి నుండి వచ్చావేంటని.  ఇవి మహిళలను అసౌకర్యానికి గురిచేస్తాయి.  మహిళలు కుటుంబాన్ని,  తమ పనులను చేసుకోవడంలో ప్రాధాన్యతలు, టైం మేనేజ్మెంట్ దగ్గర చాలా ఇబ్బందులు పడుతుంటారు. వారి ఆలస్యం గురించి కానీ,  వారి తొందర గురించి కానీ అలా  అడగకూడదు. ఇది విమర్శ చేసినట్టు అనిపిస్తుంది. సోషల్ మీడియా.. సోషల్ మీడియా ఇప్పట్లోచాలా సహజం. అయితే సోషల్ మీడియాలో చురుగ్గా ఉన్న మహిళలు  అనేకం.  చాలామంది అలాంటి మహిళల పట్ల ఎందుకు సోషల్ మీడియాలో  అంత యాక్టీవ్ ఉంటావు అని ప్రశ్నిస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో గడపడం మహిళల వ్యక్తిగతం,  అది వారి అభిరుచి, ఆసక్తి ఆధారంగా ఉంటుంది.  దాని గురించి అందరూ ప్రశ్నించాల్సిన అవసరం లేదు. డ్రస్సింగ్.. ప్రతి మహిళ తమ సౌకర్యం గురించి ఆలోచిస్తుంది.  కొందరు ప్యాషన్ ట్రెండ్ ను ఫాలో అవుతుంటారు.  ఏది ఏమైనా మహిళల డ్రెస్సింగ్ గురించి వారు ధరించే దుస్తుల గురించి ప్రశ్నించడం,  కామెంట్ చేయడం అస్సలు మంచిది కాదు. పైన పేర్కొన్న 7 విషయాలు మహిళల వ్యక్తిగతం,  కుటుంబానికి సంబంధించినవి.   వాటిని ప్రశ్నించడం వల్ల మహిళల వ్యక్తిగత జీవితంలో జోక్యం చేసుకున్నట్టే. అంతేకాదు.. పై ప్రశ్నలు అడగడం వల్ల మహిళలు చాలా అసౌకర్యానికి ఫీలవుతారు. అలాగే వారి ఆత్మ విశ్వాసం కూడా దెబ్బతింటుందని వ్యక్తిత్వ విశ్లేషణ నిపుణులు అంటున్నారు.                                     *రూపశ్రీ.
శరీరం ఆరోగ్యంగా ఉంటే సరిపోదు. మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే శరీరం కూడా పూర్తీ ఆరోగ్యంగా ఉన్నట్టు అనిపిస్తుంది.  అయితే నేటి కాలంలో మానసిక  ఆరోగ్యం చాలా క్లిష్టమైన సమస్యగా మారింది. అధిక శాతం మంది మానసిక ఇబ్బందులు పడుతున్నారు.  మానసికంగా బలంగా మారడానికి ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. అయితే ఆఫీసు ఒత్తిడులు,  జీవిత సమస్యలు, లక్ష్యాలు చేరుకోవడంలో పడే సంఘర్షణ.. ఇలా ఒకటేమిటి.. చాలా విషయాలు మానసికంగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి.  కానీ కొన్ని సాధారణ అలవాట్లు మానసిక ఆరోగ్యానికి శ్రీరామ రక్షలా పనిచేస్తాయి.  ఇంతకీ ఆ అలవాట్లు ఏమిటో తెలుసుకుంటే.. కృతజ్ఞత.. కృతజ్ఞత భావం మనిషిని చాలా స్వచ్చంగా ఉంచుతుంది.  ప్రతి వ్యక్తి మొదటగా గడిచే ప్రతి రోజు పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి.  రోజు తన జీవితంలో జరిగిన మంచి విషయాలను గుర్తు చేసుకోవాలి.  ఇలా చేస్తే చాలా పాజిటివ్ మైండ్ సెట్ అలవాటు అవుతుంది. ఇది మానసికంగా బలంగా ఉండటానికి సహాయపడుతుంది. వ్యాయామం.. శరీరంలో ఒత్తిడి హార్మోన్ తగ్గడానికి వ్యాయామం మంచి మార్గం.  ప్రతి రోజూ 20 నుండి 30 నిమిషాలు వ్యాయామం చేయడం వల్ల ఎండార్ఫిన్లు విడుదల అవుతాయి.  ఇవి ఒత్తిడిని తగ్గిస్తాయి. శ్వాస వ్యాయామం.. శారీరక వ్యాయామమే కాకుండా మానసికంగా దృఢంగా ఉండటానికి శ్వాస వ్యాయామాలు కూడా చాలా బాగా సహాయపడతాయి. రోజూ కొన్ని నిమిషాలు శ్వాస వ్యాయామాలు చేయడం వల్ల మనస్సు ప్రశాంతంగా మారుతుంది.  ఒత్తిడి కూడా తగ్గుతుంది. శ్రద్ద.. ఏ పని మీద అయినా దృష్టి పెట్టడాన్నే మైండ్ ఫుల్ నెస్ అని అంటున్నారు.  ఇంటి పని చేసినా,  వ్యాయామం చేసినా, ఆహారం తీసుకున్నా, ఆఫీసు పని చేసినా.. ఇలా ప్రతి పని చేసినప్పుడు ఆ పని మీద పూర్తిగా మనసు లగ్నం చేయాలి. ఇందుకోసం ధ్యానం చేయడం మంచి ఫలితాలు ఇస్తుంది. ఇలా చేయడం వల్ల మెయింటైన్ స్కిల్స్ మెరుగవుతాయి. ప్రకృతి.. మనిషిలో ఒత్తిడిని తగ్గించే సూపర్ మెడిసిన్ ఏదైనా ఉందంటే అది ప్రకృతి.  తాజా గాలిలో,  సూర్యరశ్మిలో సమయం గడపడం,  మొక్కలు,  చెట్లు,  పక్షులు,  జంతువుల సమక్షంలో సమయాన్ని గడపడం వల్ల ఒత్తిడి తగ్గి మానసికంగా దృఢంగా మారతారు. మనసు విప్పడం.. ఎలాంటి విషయాలు అయినా కొందరితోనే మనసు విప్పి మాట్లాడగలుగుతారు.  వారిలో స్నేహితులు,  బంధువులు,  ఆత్మీయులు ఇట్లా చాలా ఉంటారు. అయితే ఎవరి దగ్గర ఏదైనా చెప్పుకోగల చనువు ఉంటుందో వారితో ఓపెన్ గా మాట్లాడాలి. దీనివల్ల చాలా విషయాలలో మంచి సలహాలు దొరకడమే కాకుండా క్లిష్ట పరిస్థితులలో మంచి సపోర్ట్ కూడా దొరుకుతుంది. బంధాలు.. స్నేహం అయినా, ప్రేమ అయినా,  వైవాహిక బంధం అయినా, కొలీగ్స్ తో పరిచయం అయినా.. వారితో ఉండే రిలేషన్ పదే పదే తెగిపోతూ ఉంటే అది మానసిక సమస్యలకు దారి తీస్తుంది.  అందుకే బంధాలను కాపాడుకోవాలి.  ఎక్కువకాలం బంధాలు నిలిచి ఉండేలా చూసుకోవాలి. ఎమోషనల్ గా బంధాలతో కనెక్ట్ అయి ఉండాలి. నచ్చిన పని.. మానసికంగా బాగుండాలంటే అన్నింటి కంటే ముఖ్యమైనది నచ్చిన పని చేయడం. చాలా వరకు ఇతరుల సలహాలు,  ఇతరుల కమాండింగ్ మీద చాలా మంది పని చేస్తూ ఉంటారు. కానీ నచ్చిన పని చేయడంలో చాలా తృప్తి ఉంటుంది. ఇది మానసికంగా బలంగా ఉంచుతుంది. ఆత్మ విమర్శ.. ప్రతి రోజూ పడుకునే ముందు ఉదయం నుండి జరిగిన ప్రతి విషయాన్ని గుర్తు చేసుకోవాలి.  ముఖ్యంగా మంచి విషయాలను గుర్తు చేసుకోవడం వల్ల చాలా పాజిటివ్ మైండ్ అలవాటు అవుతుంది. పాజిటివ్ మైండ్ ఉంటే అది మానసిక ఆరోగ్యాన్ని కూడా బలంగా ఉంచుతుంది.                                  *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
రక్తంలో  చక్కెర శాతం ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉండటాన్ని చక్కెర వ్యాధి లేదా డయాబెటిస్ అని అంటారు. ప్రపంచ దేశాలలో చక్కెర వ్యాధి బాధితులు భారతదేశంలోనే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగించే అంశం.   కేవలం తీపి పదార్థాలు,  స్వీట్లు, పంచదార వంటివి తినడమే డయాబెటిస్ కు కారణం అనుకుంటే పొరపడినట్టే.. రోజువారీ ఆహారపు అలవాట్ల మీద డయాబెటిస్ ముడిపడి ఉంటుందని వైద్యులు అంటున్నారు. రోజు వారి తీసుకునే కొన్ని ఆహారాలు.. ఇవి ఏం చేస్తాయి లే అనుకునే పదార్థాలు టైప్-2 డయాబెటిస్ కు కారణం అవుతాయని అంటున్నారు వైద్యులు.  ఈ ఆహారాలను ఎక్కువగా తినడం వల్ల డయాబెటిస్ ఈజీగా వస్తుందట. డయాబెటిస్ కు కారణమయ్యే ఆహారాలు ఏంటో తెలుసుకుంటే.. డీప్ ఫ్రైడ్ స్నాక్స్.. సమోసాలు, పకోడాలు,  చిప్స్  ఇవన్నీ చిన్న పిల్లల నుండి పెద్ద వారి వరకు చాలా ఇష్టమైన స్నాక్స్.  కానీ ఈ ఆహారాలలో అనారోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఈ కొవ్వు క్రమంగా శరీరంలో పేరుకుపోతుంది.  బరువు పెరగడానికి దారి తీస్తుంది. బరువు పెరగడం  ఇన్సులిన్ నిరోధకతను పెంచుతుంది, ఇది టైప్ 2 డయాబెటిస్‌కు ప్రధాన కారణం. ఫాస్ట్ ఫుడ్‌లో ఉపయోగించే నూనెను  పదే పదే వేడి చేయడం వల్ల ట్రాన్స్ ఫ్యాట్ ఏర్పడుతుంది. ఇది రక్తంలో చక్కెరను మరింత పెంచుతుంది. మార్కెట్ ఫుడ్స్.. మార్కెట్లో అమ్మే గ్రానోలాతో పాటు  అనేక బ్రేకఫాస్ట్  తృణధాన్యాలు ఆరోగ్యకరమైనవని అనుకుంటారు.   కానీ వాటిలో షుగర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది.  గ్రానోలా బార్‌లు, ఓట్ బార్‌లు,  రెడీ టూ ఈట్ ఫుడ్స్ లో చాలా ఎక్కువ మొత్తంలో చక్కెరలు ఉంటాయి. వీటి వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు చాలా వేగంగా పెరుగుతాయి. ప్రాసెస్డ్ మీట్.. సాసేజ్, బేకన్,  సలామీ వంటి ప్రాసెస్ చేసిన మాంసాలలో సోడియం,  నైట్రేట్లు అధికంగా ఉంటాయి.  ఇవి గుండెకు హాని చేయడమే కాకుండా   డయాబెటిస్‌కు నేరుగా కారణం అవుతాయి. ప్రాసెస్ చేసిన మాంసాలు వాపును పెంచుతాయి,  జీవక్రియను నెమ్మదిస్తాయి. రక్తంలో చక్కెరను నియంత్రించడం కష్టతరం చేస్తాయి. డ్రింక్స్.. శీతల పానీయాలు,  ప్యాక్ చేసిన సోడాలలో చక్కెర చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక సోడా డ్రింక్ లో  ఉండే చక్కెర పరిమాణం కొన్ని  రోజులు తీసుకునే నేచురల్  చక్కెర కంటే ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఈ పానీయాలు వెంటనే రక్తంలో గ్లూకోజ్‌ను పెంచుతాయి.  క్లోమంపై  ఒత్తిడిని ఎక్కువగా  కలిగిస్తాయి. ఇలాంటి డ్రింక్స్ తీసుకున్న ప్రతి  సారి  శరీరం అదనపు ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. ఇది కాలక్రమేణా ఇన్సులిన్ నిరోధకతను పెంచుతుంది. రిపైండ్ ఫ్లోర్,  బ్రెడ్.. తెల్ల బ్రెడ్, బన్స్, కుకీలు,  నాన్ వంటి ఆహారాలు మైదాతో తయారు చేస్తారు. ఈ ఆహారాలలో గ్లూకోజ్ చాలా త్వరగా విచ్చిన్నమవుతుంది. ఈ రిఫైండ్ ఫ్లోర్ లో  ఫైబర్ ఉండదు.  దీని వల్ల రక్తంలో చక్కెర వేగంగా పెరుగుతుంది. అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ ఆహారాలను తరచుగా తీసుకోవడం వల్ల శరీరం రక్తంలో చక్కెర సమతుల్యతను కాపాడుకోవడానికి కష్టపడి పనిచేయవలసి వస్తుంది. ఈ అలవాటు క్రమంగా మధుమేహం ప్రమాదాన్ని పెంచుతుంది. వైట్ రైస్.. తెల్ల బియ్యం భారతీయ ఆహారంలో ముఖ్యమైన భాగం. కానీ ఇందులో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ. దీని గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా ఎక్కువే.  ఇది తిన్న తర్వాత గ్లూకోజ్‌గా మారుతుంది. ఇది నేరుగా రక్తంలో చక్కెరను పెంచుతుంది. రోజూ పెద్ద మొత్తంలో తెల్ల బియ్యం తినడం వల్ల బరువు పెరగడం,  రక్తంలో చక్కెర నియంత్రణ బలహీనపడటం జరిగి, టైప్ 2 డయాబెటిస్ ప్రమాదం పెరుగుతుంది. ముఖ్యంగా చాలా పాలిష్ పట్టిన బియ్యంతో వండే అన్నం ఎక్కువ తినడం మానేయాలి.                           *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...