చిక్కుల్లో సిద్దు కాంగ్రెస్’లో కలవరం
Publish Date:Jun 18, 2022
Advertisement
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సిద్దరామయ్య నోరు జారారు. అది కూడా ఒక అధికార పార్టీ దళిత ఎమ్మెల్సీ మీద నోరు జారారు. నోరు జారడం అంటే ఎదో ఒక మాటనడం కాదు ... దళిత ఎమ్మెల్సీని చలవాది నారాయణస్వామిని కులం పేరుతో దూషించారు. ఇలాంటి అవకాశం కోసమే ఎదురు చూస్తున్న బీజేపీ నేతలు రంగంలోకి దిగారు. పోలీసు కేసు పెట్టారు. సిద్దరామయ్య తనను కులం పేరుతో దూషించాడని, చలవాది నారాయణస్వామి మాజే మఖ్యమంత్రి పై ఎస్సీ ఎస్టీ వేధింపుల కేసు పెట్టారు. పోలీసులు కేసు నమోడు చేసారు. ఇటీవలే బీజేపీ టికెట్ పై ఎమ్మెల్సీ గా గెలిచిన చలవాది నారాయణస్వామి గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఇప్పడ బీజేపీలో చేరి ఎమ్మెల్సీ అయ్యారు. ఇలా ఎమ్మెల్సీ అయిన వెంటనే సిద్దరామయ్య పై ఏకంగా ఎస్సీ ఎస్టీ వేధింపుల కేసు పెట్టడం, రాజకీయ వర్గాలలో కలకలం రేపుతోంది. బెంగళూరులోని హైగ్రౌండ్స్ పోలీస్ స్టేషన్లో అయన కేసు ఫైల్ చేసారు. అదలా ఉంటే చలవాది నారాయణస్వామి, మాజీ ముఖ్యమంత్రి గత గత చరిత్రను కూడా ఏకరువు పెట్టారు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నరోజుల నుంచి సిద్దరామయ్యకు దళితులంటే చిన్న చూపేనని, ఆయన ఎప్పుడు దళితులకు విలువ ఇవ్వలేదని ఫిర్యాదులో పేర్కొనారు. అలాగే, కేసు నమోదు చేసిన సందర్భంగా మీడియాతో మాటలాడిన ఎమ్మెల్సీ నారాయణస్వామి తనను కులం పేరుతొ దూషించడమే కాకుండా, దళితజాతి మొత్తాన్ని అవమానించారని బీజేపీ ఎమ్మెల్యే ఆరోపించారు.అందుకే, యన పై తనకు వ్యక్తిగతంగా గౌరవం ఉన్నా, కేసు పెట్టవలసి వచ్చిందని నారాయణస్వామి అన్నారు. సిద్దరామయ్యను అరెస్టు చెయ్యడంలో పోలీసులు ఆలస్యం చేస్తే తాను నిరాహారదీక్షకు దిగి ధర్నా చేస్తానని ఎమ్మెల్సీ హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, మాజీ మంత్రి, దళితురాలు మోటమ్మకూడా తన ఎదుగుదలకు మాజీ సీఎం సిద్దరామయ్య అడ్డుపడ్డారని ఆమె ఆత్మకథలో రాశారని, మోటమ్మ విషయంలో, నా విషయంలో సిద్దరామయ్య తీరు గమనిస్తే ఆయన దళితులకు మర్యాద ఇవ్వరని అర్థం అవుతోందని చలవాది అన్నారు. మొత్తం మీద మాజీ సీఎం మీద ఎస్సీ ఎస్టీ కేసు నమోదు కావడం ఇప్పుడు కర్ణాటకలో, కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చనీయంగా మారింది. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మాజీ ముఖ్యమంత్రి పై ఇలాంటి ఆరోపణలు రావడం,, పార్టీకి నష్టం కలగ చేస్తుందని పార్టీ వర్గాలు ఆందోళన వ్యక్త పరుస్తున్నాయి.
http://www.teluguone.com/news/content/siddu-in-trouble-worry-in-congress-25-137945.html





