కెప్టెన్స్ అంటే వీళ్లేరా!

Publish Date:Oct 4, 2025

Advertisement

 

భార‌త కెప్టెన్సీ శ‌కం మొద‌లైంది.. క‌పిల్ దేవ్ నుంచి. ఆయ‌న 1983లో అబేధ్య‌మైన వెస్టిండీస్ జ‌ట్టు నుంచి వన్డే వ‌ర‌ల్డ్ క‌ప్పు ఎప్పుడు కైవ‌సం  చేస్కున్నారో.... ఆనాటి నుంచి కెప్టెన్సీ అనేది ఒక‌టుంద‌న్న విష‌యం మ‌న‌కు స్ప‌ష్టంగా  తెలిసి రావ‌డం మొద‌లైంది.

అప్ప‌టి వ‌ర‌కూ ప్ర‌పంచానికి తెలిసింది ఒకే ఒక్క‌ క్లైవ్ లాయిడ్ కెప్టెన్సీ మాత్ర‌మే. క్లైవ్ లాయ‌డ్ వ‌రుస క‌ప్పులు కొట్ట‌డం వెన‌క ఆయ‌న నాయ‌క‌త్వ చిట్కాలే ప్ర‌ధాన‌ కార‌ణ‌మ‌న్న‌ది అప్ప‌టి వ‌ర‌కూ  ఉన్న కెప్టెన్సీ కామెంట్. కావాల‌ని కొంద‌రి క్యాచ్ లు జార‌విడ‌వ‌డం వంటివి లాయిడ్ చేసేవార‌నీ.. ద‌టీజ్ కెప్టెన్సీ అంటూ ఆహా ఓహో అంటూ ఆయ‌న గురించి ఊద‌ర‌గొట్టేవారు.

క్లైవ్ లాయిడ్ త‌ర్వాత ఆ కెప్టెన్సీ గ్రేట్ నెస్ త‌న పేరిట లిఖింప చేసుకున్న‌ది మాత్రం భార‌త క్రికెట్ ఫ‌స్ట్ లెజండ్, హ‌ర్యానా హ‌రికేన్ క‌పిల్ దేవ్ మాత్ర‌మే. ఒక స‌మ‌యంలో జ‌ట్టు ఇక ఓడిపోతుంద‌న్న స‌మ‌యంలో 175 ప‌రుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడి.. వ‌న్డే హ‌య్య‌స్ట్ స్కోర్ వ‌ర‌ల్డ్ రికార్డ్ స్థాపించ‌డంతో క‌పిల్ పేరు ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత‌మైంది. ఇక ఆనాటి వ‌ర‌ల్డ్ క‌ప్ సైతం సాధించ‌డంతో.. ప్ర‌పంచ క్రికెట్ చరిత్ర‌లోనే  కెప్టెన్సీ ఇన్నింగ్స్ అన్న‌దొక ఎరా మొద‌లైంది.

ఒక అండ‌ర్ డాగ్ టీమ్.. కూడా వ‌ర‌ల్డ్ క‌ప్ కొల్ల‌గొట్ట‌గ‌ల‌ద‌న్న ఇన్ స్పిరేష‌న్ వ‌చ్చిందే క‌పిల్ నుంచి. ఈ ప్ర‌భావంతోనే ఇమ్రాన్ ఖాన్- పాకిస్థాన్, ఆపై అర్జున ర‌ణ‌తుంగ‌- శ్రీలంక‌కు క‌ప్పులు సాధించి పెట్టారంటే అతిశ‌యెక్తి కాదేమో. 

త‌ర్వాత భార‌త జ‌ట్టు వ‌రుస వ‌ర‌ల్డ్ క‌ప్పులు ఆడుతూ వ‌చ్చింది. కానీ అజ‌ర్ వంటి వారు అప్ప‌టి భార‌త‌ జ‌ట్ల‌కు కెప్టెన్ గా ప‌ని చేసిన పేరే గానీ.. సార‌ధ్యం అంటే ఇది, కెప్టెన్సీ అంటే ఇదీ అన్న పేరొచ్చింది మాత్రం.. గంగూలీ నుంచి మొద‌లైంద‌ని చెప్పాల్సి ఉంటుంది. ఎప్పుడైతే కెప్టెన్సీని త‌న ప‌ర్స‌న‌ల్ ఇష్యూ గా గంగూలీ తీస్కుని లార్డ్స్ లో చొక్కా ఎగ‌రేశారో ఆనాటి నుంచి మ‌న వాళ్ల కెప్టెన్సీలో ఒక జోష్ వ‌చ్చిందని చెప్ప‌క త‌ప్ప‌దు.

ఆ త‌ర్వాత మ‌న‌కు ధోనీ రూపంలో ఒక కంప్లీట్ కెప్టెన్ దొరికాడ‌నే చెప్పాలి. ఈ రాంచీ రాక్ స్టార్.. ఇటు 2007 టీ ట్వంటీ వ‌ర‌ల్డ్ క‌ప్, ఆపై 2011 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్, అటు పిమ్మ‌ట టెస్ట్ చాంపియ‌న్ షిప్ సైతం సాధించి.. ఇటు క‌పిల్ కి కూడాలేని అరుదైన రికార్డు త‌న పేరిట లిఖింప చేస్కుని ఆల్ టైం గ్రేటెస్ట్ ల‌లోనే టాప్ మోస్ట్ గా నిలిచాడు.

ఆపై కోహ్లీ వంటి వారు కెప్టెన్సీ చేసినా.. అదేమంత రిజ‌ల్ట్ ఇవ్వ‌లేదు. రోహిత్ శ‌ర్మ సార‌ధ్యంలోని భార‌త జ‌ట్టు తొలినాటి వెస్టిండీస్ జ‌ట్టులా త‌యారైంది. అయితే ఇక్క‌డ ఆస్ట్రేలియా ప్ర‌స్తావ‌న కొంత చేయాల్సి ఉంటుంది.

అలెన్ బోర్డ‌ర్, రికీపాంటింగ్, పాట్ క‌మిన్స్ వీరంతా కూడా వ‌ర‌ల్డ్ క‌ప్ విన్నింగ్ కెప్టెన్సే. వ‌ర‌ల్డ్ క‌ప్ విన్నింగ్ కెప్టెన్సే ఎందుకు ప్రామాణికం అంటే  అవి వారి వారి కెప్టెన్సీకి గీటురాళ్లు కాబ‌ట్టి. మ‌న ద‌గ్గ‌ర కెప్టెన్సీ ఎఫెక్ట్ ఆన్ టీం మొద‌లైందే.. వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి కాబ‌ట్టి.. దీన్ని మ‌నం ప‌రిగ‌ణ‌లోకి తీస్కోవల్సి వ‌స్తోంది. 

అయితే ప్ర‌పంచ క్రికెట్ జ‌ట్ల‌న్నీ వేరు వేరు. ఆస్ట్రేలియా మాత్ర‌మే వేరు వేరు. కార‌ణం ఏంటంటే.. ఆస్ట్రేలియా జ‌ట్టు అన్న‌ది కేవ‌లం కెప్టెన్సీ మీద ఆధార‌ప‌డ్డ జ‌ట్టు కాదు. అస‌లా బోర్డే సూప‌ర్ డూప‌ర్ బోర్డు. అక్క‌డ ఆస్ట్రేలియా ప్లేయ‌ర్లు క్రికెట్ ఆడ‌రు. ఆ బోర్డు వారి చేత ఆడిస్తుంది. క‌మిన్స్ లాంటి బ‌ల‌హీనులున్నా కూడా క‌ప్పు కొల్ల‌గొట్ట‌డం ఖాయం. ఇలా ఎందుకు అనాల్సి ఉంటుందంటే.. ఇదే క‌మిన్స్ హైద‌రాబాద్ స‌న్ రైజ‌ర్స్ కెప్టెన్ కూడా. మ‌రి పోయిన ఐపీఎల్ లో ఆయ‌న కెప్టెన్సీ పెర్ఫామెన్స్ ఏపాటిదో మ‌న‌మంతా చూసే ఉంటాం. దీన్నిబ‌ట్టీ చూస్తే.. కెప్టెన్లంటే ఆస్ట్రేలియ‌న్లు ఈ కోవ‌లోకి రారని చెప్పాల్స ఉంటుంది. 

ఈ లెక్క‌న మ‌నం క‌పిల్ త‌ర్వాత పాత త‌రంలో ఇమ్రాన్, ర‌ణ‌తుంగ‌నైనా కెప్టెన్లుగా అంగీక‌రించ‌వ‌చ్చుగానీ  వ‌ర‌ల్డ్ క‌ప్ విన్న‌ర్ల‌యిన బోర్డ‌ర్, పాంటింగ్, క‌మిన్స్ ని ఊహించుకోలేం. వీరిలో పాంటింగ్ ఒక‌టిక‌న్నా ఎక్కువ క‌ప్పులు కొల్ల‌గొట్టిన కెప్టెన్. అయినా స‌రే ఆయ‌న‌కంటూ ఆ కిరీటం పెట్ట‌డానికి వీల్లేదంటాఉ క్రికెట్ క్రిటిక్స్.  కార‌ణం ఏంటంటే వారి టీమే అల్టిమేట్ గా ఉంటుంది. రిజ‌ర్వ్ బెంచ్ కూడా ఎంతో స్ట్రాంగ్ గా ఉండే టీముల్లోనే నెంబ‌ర్ వ‌న్ ఆసీస్ కావ‌డం వ‌ల్ల‌.. వారికంటూ ప్ర‌త్యేక కెప్టెన్సీ కెపాసిటీని ఆపాదించ‌లేం.

సో.. త‌ర్వాతి కాలంలో టీమిండియా కెప్టెన్సీల్లోనే బాగా పేరు ప‌డింది.. మాత్రం రోహితే.. రోహిత్ శ‌ర్మ నాయ‌క‌త్వంలోని టీమిండియా ఎన్నో టైటిళ్లు.. అన్ డిఫీట‌బుల్ గా కొల్ల‌గొట్టింది. ఆ మాట‌కొస్తే గ‌త వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ లో రోహిత్ కెప్టెన్సీలో మ‌న వాళ్లు ఫైన‌ల్లో త‌ప్ప మరే మ్యాచ్ లోనూ ఓడి పోలేదు. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్2024 కూడా ఇలాగే ఎక్క‌డా ఓడిపోకుండా గెలిచింది రోహిత్ నాయ‌క‌త్వంలోని టీమిండియా.

ఈ లెక్క‌న చూస్తే భార‌త బెస్ట్ కెప్టెన్స్ వ‌రుస‌ ఒక‌సారి చూసుకుంటే మొట్ట మొద‌ట క‌పిల్ ద ఫ‌స్ట్ లెజండ‌రీ కెప్టెన్ కాగా, సెకండ్ వ‌న్- ధ‌నా ధ‌న్ ధోనీ. ఆ మ‌ధ్య కాలంలో సౌర‌వ్ గంగూలీ. ఆ త‌ర్వాత మాత్రం రోహిత్ శ‌ర్మగానే ప‌రిగ‌ణించాల్సి ఉంటుంది. ఎనీహౌ కంగ్రాట్స్ రోహిత్! వియ్ ప్రౌడ్ ఆఫ్ యూ!! థాంక్యూ థాంక్యూ వెరీ మ‌చ్ ఫ‌ర్ యువ‌ర్ మెమ‌ర‌బుల్ కెప్టెన్సీ నాక్స్ ఎట్ ఆల్!!! అన్న‌ది స‌గ‌టు భార‌త క్రికెట్ అభిమాని కామెంట్ గా తెలుస్తోంది.
 

By
en-us Political News

  
తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో ఏఎన్ఎం పోస్టులు ఇప్పిస్తామంటూ ఉమ్మడి వరంగల్, హనుమకొండ జిల్లాల్లో రూ.లక్షల్లో వసూలు చేస్తున్న దళారీల దందా వెలుగులోకి వచ్చింది. యూనియన్ ముసుగులో జరుగుతున్న ఈ అక్రమాలపై జిల్లా వైద్యాధికారి డాక్టర్ రాజారెడ్డి విచారణ ప్రకటించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
హైదరాబాద్‌లోని సరూర్ నగర్ సాగరిక ఇంటెగ్రేటెడ్ హైస్కూల్‌లో రాఖీలు, తిలకం తొలగింపు వివాదంపై బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి టీచర్‌ను హిజాబ్‌‌పై ప్రశ్నించడం సంచలనంగా మారింది. పోలీసులు కార్పొరేటర్‌పై సుమోటో కేసు నమోదు చేశారు.
హైదరాబాద్‌లోని అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో కన్న కూతురిపై లైంగిక దాడికి యత్నించిన భర్త శ్రీనివాస్‌ను భార్య రమాదేవి గొడ్డలితో నరికి చంపింది. అల్వాల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జమ్మూ కాశ్మీర్‌లోని కథువా జిల్లా సీఐఎస్ఎఫ్ క్యాంపులో హెడ్ కానిస్టేబుల్ ఏకే 47 రైఫిల్‌తో చేసిన విచక్షణారహిత కాల్పుల్లో నలుగురు జవాన్లు మృతి చెందారు. సేవా పవర్ ప్రాజెక్ట్ వద్ద జరిగిన ఈ దారుణ ఘటనపై సీఐఎస్ఎఫ్ డీజీ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు.
ఒడిశా తాల్చేర్ ప్రాంతంలో సంచలనం సృష్టించిన దారుణ హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
హైదరాబాద్ మాధాపూర్‌లో స్పా సెంటర్ ముసుగులో నడుస్తున్న అక్రమ వ్యభిచార రాకెట్‌ను ఎస్‌ఓటీ పోలీసులు మట్టుబెట్టారు. నలుగురు యువతులను రక్షించి, రూ. 45 వేల నగదు, 8 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
యాదాద్రి భువనగిరి జిల్లా చల్లూరులో భూభారతి వెబ్‌సైట్ ద్వారా ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండానే 7.18 ఎకరాల భూమి వేరొకరి పేరు మీదకు మారిపోయింది. యజమానులకు తెలియకుండా జరిగిన ఈ భారీ భూ భాగోతం పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఏపీ సచివాలయ ఉద్యోగాలు, డీఎస్సీ నియామకాలు మరియు మెడికల్ సీట్లలో నకిలీ స్పోర్ట్స్ సర్టిఫికెట్ల అక్రమాలపై విచారణ ముమ్మరమైంది. హైకోర్టు ఆదేశాలు, విజిలెన్స్ తనిఖీలు మరియు సాప్ చేపట్టిన స్కిల్ టెస్ట్ వివరాలు ఇక్కడ చూడండి.
150 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న వందేమాతరం గేయానికి జాతీయ గీతంతో సమాన హోదా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ తెచ్చింది. 3 నిమిషాల 10 సెకన్ల ఆలాపన, సుప్రీంకోర్టు విచారణ మరియు చట్టపరమైన నిబంధనల పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
హైదరాబాద్ రాయదుర్గంలో ఐటీ కంపెనీ మహిళా ఉద్యోగిపై ఫుడ్ వెండర్ షేక్ నబీ కూల్ డ్రింక్‌లో మత్తుమందు కలిపి లైంగిక దాడి చేశాడు. ప్రైవేట్ వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేస్తూ రూ. 43 లక్షలు నొక్కేసి మూడేళ్లు వేధించిన నిందితుడిని రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు.
విజయవాడ ఎన్‌టీపీఎస్ కాలువలో లభించిన మహిళ శరీర భాగాల మిస్టరీ వీడింది. చేతిపై ఉన్న ఈక టాటూ ఆధారంగా మృతురాలిని మంగళగిరికి చెందిన 29 ఏళ్ల కళ్యాణిగా గుర్తించిన పోలీసులు, విచారణలో మటన్ షాప్ షఫీ చేసిన కిరాతక హత్యను ఛేదించారు.
కన్యాకుమారి యూట్యూబర్ ఇంట్లో ఏకంగా 118 సవర్ల (944 గ్రాములు) బంగారం, భారీగా నగదు చోరీకి గురయ్యాయి. సోషల్ మీడియాలో రీల్స్ కోసం చూపించిన సంపదే దొంగలను ఆకర్షించిందా అనే కోణంలో పోలీసుల దర్యాప్తు సాగుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.