నిమ్మకాయ గురించి షాకింగ్ నిజాలు!

Publish Date:Jan 25, 2023

Advertisement

డ్రింక్స్ దగ్గర నుండి ఆహార పదార్థాల తయారీలో ఉపయోగించడం వరకు నిమ్మకాయ చేసే మ్యాజిక్ అంతా ఇంతా కాదు. మరీ ముఖ్యంగా నిమ్మకాయంతో పులిహోర, పచ్చడి, నిమ్మకాయ జ్యుస్ వంటివి రోజులో రొటీన్ గా మారిపోతాయి చాలామందికి. ఎండపొద్దున కాసింత నిమ్మకాయ జ్యుస్ తగిస్తే మధ్యతరగతి, దిగువ తరగతి కుటుంబాల వారికి చెప్పలేనంత కిక్. వారి ఆర్థిక పరిస్థితికి అదే గొప్ప కూల్ డ్రింక్. కానీ ఎన్ని డబ్బులు పెట్టి కొన్న కూల్ డ్రింక్ అయినా ఈ నిమ్మ జ్యుస్ ముందు దిగదుడుపే. 


నిమ్మకాయ మనకు నిత్యజీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆరోగ్యాన్ని కలిగించే పోషక విలువలతోబాటు, రోగ నిరోధకశక్తి అధికంగా కలిగి ఉంది. దీనిని అనేక రకాలుగా ఉపయోగించవచ్చు. షర్బత్లలోను, ఊరగాయగాను వాడటం కామన్. అయితే నిమ్మకాయను  నిత్యం ఉపయోగించుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి. పండిన నిమ్మ కాయ తోలునుంచి తీసె నిమ్మనూనె, నిమ్మరసం బాగా ఉపయోగపడతాయి. శరీరానికి పుష్టి కలిగించే విటమిను 'ఎ' విటమిను 'బి', విటమిను 'సి'లు నిమ్మకాయలో పుష్కలంగా లభిస్తాయి. ఇంకా ఐరన్. కాల్షియం భాస్వరము పొటాషియం మొదలగు పోషక పదార్థాలు లభిస్తాయి.


 దీనిలో వేడిని కలిగించే గుణం వుంది. పౌష్టికాహారమే కాకుండా దీనిని ఇతర ఆహార పదార్థాలలో పిండినప్పుడు కొత్త రుచిని కలిగిస్తుంది. ఇందులో విటమిను 'సి' ఎక్కువగా ఉన్నందువల్ల ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుతుంది. డిప్తీరియా, టెటానస్ వంటి వ్యాధులను కలిగించే విషక్రిములను నశింపచేస్తుంది. అన్నిరకాల వైరస్ల నుంచి కాపాడుతుంది.


ప్రతిరోజు భోజనానికి అరగంటముందు నిమ్మరసం త్రాగితే జీర్ణశక్తి పెరుగుతుంది. మసూచి, పొంగు, ఆటలమ్మ వంటి వ్యాధులతో మిక్కిలి దప్పికతో బాధపడేవారికి 15 నుండి 25 గ్రాముల నిమ్మరసం ఇస్తూ ఉంటే.. దప్పిక తగ్గుతుంది. వాంతులయ్యే వారికి, అజీర్తితో బాధపడేవారికి ఇది ఎంతగానో మేలు చూకూరుస్తుంది. నిమ్మరసం రెండు పూటలా సేవిస్తే చిగుళ్ళ వ్యాధి సోకదు. రక్తవిరేచనముల నివారణకు ఎంతగానో ఉపయోగపడుతుంది.


దీనిని రోజూ వాడితే ముఖవర్చస్సు, శరీరకాంతి పెరుగుతుంది. ఒకప్పుడు చాలా ఇళ్లలో నిమ్మ చెట్లు కనిపించేవి. ఇప్పుడు అదంతా కనుమరుగయ్యింది.  ప్రతివారు తమ ఇంట్లో నిమ్మచెట్టు ఉంచుకోవటం మంచిది. అందువల్ల ఆరోగ్యం సులభంగా మనకు అందుబాటులో వున్నట్లే, నిమ్మరసం, వెల్లుల్లి రసం కలిపి సేవిస్తే కీళ్ళవాతం నయమవుతుంది. నిమ్మరసం న్యూయోనియా వ్యాధిని నివారిస్తుంది. జలుబును దూరం చేస్తుంది. మొటిమల నుంచి కాపాడుతుంది. నిమ్మరసంతో మర్థనచేస్తే చర్మవ్యాధులు దగ్గరకే రావు. 450 గ్రాముల పాలలో తగినంత నిమ్మరసం కలిపి త్రాగితే మూలశంఖ రోగుల ఆసనం నుంచి రక్తం కారడం ఆగుతుంది. వికారాన్ని పోగొడుతుంది. దంత వ్యాధులను నిరోధిస్తుంది. ఇది మానవులపాలిటి ఆరోగ్యాన్ని ప్రసాదించే “కల్పవృక్షం” వంటిది. కాబట్టి నిమ్మకాయను మరీ అంత తీసి పడేయకండి. సాధారణ వ్యక్తులకు కూడా సులువుగా లభించే నిమ్మను వాడటం మరచిపోకండి.


                                         ◆నిశ్శబ్ద.

By
en-us Political News

  
మెదడు ఆరోగ్యం గురించి అవగాహన పెంచే లక్ష్యంతో ప్రతి సంవత్సరం జూలై 22న ప్రపంచ మెదడు దినోత్సవాన్ని జరుపుకుంటారు.
 మన శరీరంలోని ప్రతి భాగం మన ఆరోగ్యం గురించి ఏదో ఒక విషయం చెబుతుంది.
ప్రాచీన భారతీయ వైద్య శాస్త్రమైన  ఆయుర్వేదం ఆరోగ్యకరమైన,  సమతుల్య జీవితాన్ని గడపడానికి చాలా  రహస్యాలను పేర్కొన్నది.
గర్భధారణ సమయంలో చాలా సార్లు తల్లి లేదా బిడ్డ ఆరోగ్యాన్ని పరిగణనలోకి తీసుకుంటే సాధారణ ప్రసవం సాధ్యం కాని పరిస్థితులు తలెత్తుతాయి.
భారతదేశంలో స్వీట్లకు, ముఖ్యంగా గులాబ్ జామున్‌కు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.
ఆహారం శరీరానికి శక్తి వనరు.  తీసుకునే ఆహారాన్ని బట్టి శరీర ఆరోగ్యం ఆధాపడి ఉంటుంది.
భారతదేశంలో టీ కేవలం ఒక పానీయంగా మాత్రమే కాదు, ఒక భావోద్వేగంగా మారిపోయింది.
ఆయుర్వేదంలో ఎన్నో శతాబ్దాలుగా అనేక వ్యాధుల చికిత్సకు ఎన్నో మొక్కలు ఉపయోగిస్తున్నారు.
వర్షాకాలం చాలామందికి బాగా ఇష్టంగా ఉంటుంది.  
రుతుపవనాలు వచ్చాయి. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి.
డయాబెటిస్ రోగులు క్రమం తప్పకుండా రక్తంలో చక్కెరను తనిఖీ చేసుకోవడం చాలా ముఖ్యం.
లాంగ్ జర్నీ చాలామందికి ఇష్టం. అయితే అనుకున్న సులువుగా వీటిని ప్లాన్ చేయడానికి ధైర్యం సరిపోదు.
మోకాళ్ల నొప్పులు ప్రజల జీవితాన్ని కష్టతరం చేస్తాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.