సాఫ్ట్ వేర్ సీతారాం ఆత్మహత్య కేసు దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి!

Publish Date:Apr 30, 2026

Advertisement

హైదరాబాదు నగరాన్ని కుదిపేసిన సాఫ్ట్ వేర్  ఉద్యోగి సీతారాం ఆత్మహత్య కేసులో సంచలన మలుపు చోటుచేసుకుంది. భార్య అక్రమ సంబంధాలు, ప్రైవేట్ వీడియోల పోస్టింగ్, కుటుంబ కలహాలు…చివరకు మానసిక వేదన భరించలేక ఆత్మహత్య...ఈ ఘటనలో ఒక్కొక్కటిగా బయటపడుతున్న వివరాలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ కేసులో పోలీసులు పోలీసులు సీతారాం భార్య రేణుక,  ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఇద్దరు వ్యక్తులను తాజాగా అరెస్టు చేశారు. 

ఈ ఏడాది ఫిబ్రవరిలో సీతారాం హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. మొదట ఇది సాధారణ ఆత్మహత్యగా పోలీసులు భావించారు.  అయితే ఆ తరువాత  లభించిన 19 పేజీల సూసైడ్ నోట్ కేసు దిశను పూర్తిగా మార్చింది. సీతారాం ఆత్మహత్య చేసుకోబోయే ముందు రాసిన సూసైడ్ నోట్ లో సీతారాం తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న మానసిక వేదనను వివరంగా పేర్కొన్నాడు. 

సీతారాం తన భార్య రేణుకకు ముగ్గురితో అక్రమ సంబంధాలు ఉన్నాయని ఆ లేఖలో తీవ్ర ఆరోపణలు చేశాడు. తాను నెలకు రెండు లక్షల జీతం సంపాదిస్తూ భార్యను ఎంతో ప్రేమగా చూసుకున్నాననీ.. , కానీ తనకు తెలియకుండా ఆమె ఇతరులతో సంబంధాలు కొనసాగించిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఎంత నచ్చజెప్పినా ఆమె వ్యవహారశైలి మారలేదని..  మధ్యతరగతి వ్యక్తిగా భార్యను గుడ్డిగా నమ్మడమే తాను చేసిన పెద్ద తప్పు అంటూ అతను సూసైడ్ నోట్‌లో రాసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ పరిస్థితులను తట్టుకోలేకనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని సీతారాం పేర్కొన్నాడు.

ఈ కేసు దర్యాప్తులో మరో షాకింగ్ అంశం వెలుగులోకి వచ్చింది. రేణుకతో కలిసి ఉన్న ప్రైవేట్ వీడియోలను ఆమె ప్రియుడు రమణరెడ్డి సోషల్ మీడియాలో పోస్టు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ విషయంపై గతంలోనే పెద్ద వివాదం చోటుచేసుకొని, రేణుక,  రమణ రెడ్డి ఇద్దరూ ఆత్మహత్యాయత్నం చేసినట్లు దర్యాప్తులో బయటపడింది. 
సీతారాం వదిలిన సూసైడ్ నోట్‌ను కీలక ఆధారంగా  పోలీసులు కేసును మరింత లోతుగా విచారించారు. ఇటీవల పోలీసులు రేణుకతో పాటు ఆమె ప్రియుడు రమణ రెడ్డి, మరో వ్యక్తి శ్రవణ్‌లను అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇంకా మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని, దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు.
మే డే(మే 1వ తేదీ) సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కార్మిక వర్గానికి ప్ర‌త్యేకంగా అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్ష‌లు తెలిపారు.
కుప్పం నియోజకవర్గ ప్రజల చిరకాల స్వప్నమైన విమానాశ్రయ నిర్మాణానికి ఉన్న అతిపెద్ద న్యాయపరమైన అడ్డంకి ఎట్టకేలకు తొలగిపోయింది.
అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత అధ్యక్ష రేసులో ఉన్న డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై మరోసారి విరుచుకుపడ్డారు.
కృష్ణా జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు (మే 1) శుక్రవారం పర్యటించనున్నారు.
తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజారోగ్య పరిరక్షణే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది.
ప్రపంచవ్యాప్తంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, రక్షణ రంగ పరికరాల తయారీలో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ పాత్ర అత్యంత కీలకం. ప్రస్తుతం ఈ ఖనిజాల ఉత్పత్తిలో చైనా ప్రపంచ దేశాలను శాసిస్తోంది. అయితే.. ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతంలో ఈ అరుదైన ఖనిజాలు అపారంగా నిక్షిప్తమై ఉన్నాయనీ.. వీటిని సమర్థవంతంగా వెలికితీస్తే చైనాపై ఆధారపడటాన్ని భారత్ పూర్తిగా తగ్గించుకోవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక వ్యూహాత్మక ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు.
బెంగళూరు శివార్లలో వెలుగుచూసిన ఒక విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
హైదరాబాద్ నగరానికి గర్వకారణమైన వైద్య విజయం నమోదైంది.
వైసీపీ అనుకూలుడిగా పలు అక్రమాలకు పాల్పడి .. పనిష్మెంట్‌లో ఉన్న సీఐ తన అరాచక బుద్ది మాత్రం మార్చుకోలేదు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో బుధవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది.
కరాచీ వంటి ప్రధాన నగరాల్లో ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ల కొరత వేధిస్తోంది. దీంతో స్థానికులు భారీ పరిమాణంలో ఉన్న ప్లాస్టిక్ బెలూన్లను అంటే సంచులను ఇంధనాన్ని నిల్వ చేసుకోవడానికి ఉపయోగిస్తున్నారు. గ్యాస్ సరఫరా చేసే ప్రధాన పైపుల నుంచి ఈ బెలూన్లలోకి నేరుగా గ్యాస్‌ను నింపుతున్నారు. చిన్నపాటి లీకేజీ లేదా నిప్పు రవ్వ తగిలినా క్షణాల్లో పేలిపోయే ప్రమాదం ఉన్నప్పటికీ.. గత్యంతరం లేని స్థితిలో ప్రజలు ఈ పద్ధతిని అనుసరిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.