Publish Date:Mar 17, 2020
వెంకటేశ్వర రావుపై ఏపీ ప్రభుత్వం విధించిన సస్పెన్షన్ ను క్యాట్ సమర్థించి వెంకటేశ్వర రావు పిటిషన్ ను ట్రిబ్యునల్ కొట్టి వేసింది. ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు క్యాట్ లో చుక్కెదురైంది. గత నెలలో వెంకటేశ్వరరావును సస్పెండ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బాధ్యతల నిర్వహణలో అక్రమాలకు పాల్పడ్డారని.. నిఘా పరికరాల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడినట్లు డీజీపీ నివేదిక సమర్పించారని.. ఆ మేరకు క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది.
తన కుమారుని సంస్థకు ప్రయోజనం కలిగించేలా కొన్ని కొనుగోలు ఒప్పందాలను చేసుకున్నారంటూ ఏబీ వెంకటేశ్వరరావును రెండు నెలల క్రితం ఏపీలోని జగన్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేసిన ఏబీ.. ఒకవైపు కేంద్ర ట్రైబ్యునల్‌ను ఆశ్రయిస్తూ.. మరోవైపు కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వాదనను హోంశాఖకు నివేదించింది. ఈ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం సబబైనదేనని కితాబునిచ్చింది. ఏబీవీని సస్పెండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర హోం శాఖ కూడా సమర్థించింది.
సస్పెన్షన్‌నను సమర్థించడమే కాకుండా.. ఏబీవీపై వచ్చిన ఆరోపణలపై లోతైన దర్యాప్తు జరపాలని ఏపీ డీజీపీని కేంద్ర హోం శాఖ ఆదేశించింది. ఏబీవీపై వచ్చిన ఆరోపణలపై వెంటనే ఛార్జీ షీట్ ఓపెన్ చేయాలని నిర్దేశించింది. ఏరియల్ వాహన కొనుగోలులో అవకతవకలు జరగాయనడానికి ప్రాథమిక ఆధారాలున్నాయని కేంద్రం అభిప్రాయపడిందది. ఏరోసాట్, యూఏవీల కొనుగోలు కోసం వెచ్చించిన 25.5 కోట్ల రూపాయల వ్యవహారంలో భారీ అక్రమాలు జరిగినట్లు ప్రాధామిక ఆధారాలున్నాయని పేర్కొన్నారు. ఏఫ్రిల్ 7 లోగా ఛార్జిషీట్ దాఖలు చేయాలని ఏపీ చీఫ్ సెక్రటరీకి రాసిన లేఖలో కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఏబీ అక్రమాలకు ప్రాథమిక ఆధారాలున్నాయని, వెంటనే దీనిపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని హోంశాఖను కేంద్రం కోరింది.
ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ వెంకటేశ్వరరావు క్యాట్‌ను ఆశ్రయంచారు. తన సస్పెన్షన్ చట్టవిరుద్ధమని రాజకీయ దురుద్దేశం తీసుకున్న నిర్ణయమని ఏబీ పిటిషన్లో పేర్కొన్నారు. తన 30 ఏళ్ల సర్వీసులో చిన్న ఆరోపణ లేదని.. అవార్డులు కూడా వచ్చాయన్నారు. ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత మే 30న తనను బదిలీ చేసి.. 8 నెలలుగా పోస్టింగ్ ఇవ్వలేదని.. జీతం కూడా ఇవ్వలేదని ఆరోపించారు. తన సస్పెన్షన్‌పై స్టే ఇవ్వాలని క్యాట్‌ను కోరారు. ఏబీ వెంకటేశ్వర్రావు.. 1989 ఏపీ క్యాడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. చంద్రబాబు హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పనిచేశారు. 2019 ఎన్నికల సమయంలో ఫిర్యాదు మేరకు గత ఎన్నికలకు ముందు ఆయన్ను ఇంటెలిజన్స్ చీఫ్ పదవి నుంచి ఎన్నికల సంఘం బదిలీ చేసింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/shock-to-ab-venkateswara-rao-in-cat-25-95724.html
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.