సునీతకు షర్మిల అండ

Publish Date:Apr 27, 2023

Advertisement

ఆడదానికి ఆడదే శత్రువు అంటారు... కానీ వైఎస్ వివేకా కుమార్తె సునీత విషయంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ (వైఎస్సార్టీపీ) అధ్యక్షురాలు షర్మిల వ్యవహరిస్తున్న తీరుతో అది తప్పుని తేలిపోయింది.  వివేకా హత్య జరిగిన నాటి నుంచి  సునీతకు.. వైఎస్ ఫ్యామిలీలో ఎవరైన అండ దండగా నిలిచారంటే.. అది ఒక్క   షర్మిల మాత్రమే.   తాజాగా మరోసారి  సునీతకు మద్దతుగా నిలుస్తూ వైయస్ షర్మిల చేసిన వ్యాఖ్యలు..  పోలిటికల్ సర్కిల్‌లో   కాక రేపుతోన్నాయి. ఇటీవల వైయస్ వివేకా ఇమేజ్‌ను డ్యామేజ్ చేస్తూ కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రిభాస్కరరెడ్డిలు చేసిన వ్యాఖ్యలపై  వైయస్ షర్మిల తాజాగా హైదరాబాద్‌లో తనదైన శైలిలో స్పందించారు. వారి వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. అలాగే వివేకా హత్య వెనుక ఆయన కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్‌రెడ్డి ఉన్నారంటూ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అర్థరహితమని ఆమె కొట్టిపారేశారు. వివేకా పేరిట ఎలాంటి ఆస్తుల్లేవని, అవన్నీ ఆయన కుమార్తె సునీత పేరు మీదే ఉన్నాయని ఆమె స్పష్టం చేశారు. అలాంటప్పుడు తమ సొంత చిన్నాన్న హత్య వెనుక సునీత, ఆమె భర్త ఉన్నారనే ఆరోపణలు చేయడం సరికాదని వైయస్ షర్మిల అభిప్రాయ పడ్డారు.  

పోనీ.. ఓ వేళ సునీత భర్త ఆస్తి కోసం ఇదంతా చేశాడనుకుంటే... చంపాల్సింది  వివేకానందరెడ్డిని కాదు.. సునీతను.. అంటు వైయస్ షర్మిల పక్కా క్లారిటీగా వివరించారు. అలాగే చిన్నాన్న వివేకా వ్యక్తిత్వంపై ఆరోపణలు చేయడం చాలా అన్యాయమన్నారు. ప్రజల కోసం పని చేసిన ఆయన వ్యక్తిగత జీవితంపై మాట్లాడే అర్హత ఎవరికీ లేదని చెప్పారు.  ప్రజా నాయకుడైన ఆయన వ్యక్తిత్వం గురించి మాకంటే.. ఉమ్మడి కడప జిల్లా ప్రజలకు, అలాగే పులివెందుల ప్రజలకే ఎక్కువగా తెలుసునని  షర్మిల స్పష్టం చేశారు. వివేకా హత్య కేసు విషయంలో  షర్మిల  ఇలా స్పందించడం ఇదే తొలిసారి కాదు.. గతంలో కూడా చాలా సార్లు ఇలాగే స్పందించారు.  ఇంకా క్లియర్ కట్‌గా చెప్పాలంటే.. ఈ హత్య కేసులో ఢిల్లీ వెళ్లీ ఆమె స్వయంగా సీబీఐకి వాంగ్మూలం ఇవ్వడమే కాదు... ఆ సీబీఐ కార్యాలయం వెలుపలే.. మీడియా ముందు మాట్లాడుతూ.. వివేకా హత్య కడప ఎంపీ సీటు విషయంలోనే జరిగిందంటూ ప్రకటించారని... ఆ తర్వాత.. వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ తాబేలు స్పీడ్‌తో సాగుతోంటే.. లోటస్ పాండ్‌లోని తన పార్టీ కార్యాలయంలో.. ప్రెస్‌మీట్ పెట్టి..   ఏళ్లకు ఏళ్లు గడుస్తోన్నా.. తన సొంత చిన్నాన్న హత్య కేసులో ఇంత వరకు అతీగతీ లేదంటూ.. సదరు దర్యాప్తు సంస్థపై వైయస్ షర్మిల విమర్శలు సైతం గుప్పించారు. ఆ తర్వాతే ఈ హత్య కేసులో విచారణను సీబీఐ వేగవంతం చేసిందనే ఓ చర్చ సైతం రాజకీయ వర్గాలలో సాగుతోంది.  

ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. వివేకా హత్య కేసును.. అటు దర్యాప్తు చేస్తున్న సీబీఐ మరిచిపోయినా.. ఇటు ప్రజలు మరిచిపోయినా.. షర్మిల మాత్రం రంగంలోకి దిగి..  ప్రెస్‌మీట్ పెట్టి.. ఆ అంశాన్ని తెరపైకి తీసుకు వస్తూ వచ్చారన్న అభిప్రాయం  పోలిటికల్ సర్కిల్‌లో వ్యక్తమవుతోంది. 

ఓ సోదరుడు  జగన్ ముఖ్యమంత్రిగా... మరో సోదరుడు   అవినాష్ రెడ్డి కడప ఎంపీగా ఉండి కూడా తనకు న్యాయం జరగడం లేదని గ్రహించి.. న్యాయం కోసం.. న్యాయస్థానం మెట్లెక్కిన సునీతకు అన్ని విధాల  షర్మిల మద్దతుగా నిలిచారనడంలో సందేహం లేదు.  

మరోవైపు సీమ పౌరుషానికి కడప పురిటిగడ్డ... ఫ్యాక్షనిజానికి కడప అడ్డా, మాట తప్పం.. మడం తిప్పమంటూ లాంటి డైలాగులు సినిమా థియేటర్లకు ప్రేక్షకులను రప్పించడానికో.. .. ఎన్నికల ప్రచారంలో ఓట్లు దండుకోవడానికో ఉపయోగపడతాయనే అభిప్రాయం సైతం సదరు సర్కిల్‌లో వినిపిస్తోంది. 

ఇంటి ఆడపడుచు.. స్వయంగా గుమ్మంలోకి వచ్చి.. నాకు ఆస్తి కాదు.. అంతస్తు కాదు.. నాకు న్యాయం కావాలి... కన్న తండ్రి హత్య కేసులో దోషులు ఎవరో బయటకు రావాలి.. వారికి శిక్ష పడాలి... అలా అయితేనే.. భవిష్యత్తులో ఇటువంటి తప్పులు మళ్లీ మళ్లీ జరగకుండా సమాజానికి ఓ స్పష్టమైన సందేశం ఇచ్చిన వారమవుతామంటూ ముఖ్యమంత్రి  జగన్‌ని ప్రాధేయపడిన ఓ చెల్లికి.. ఆయన ఎంత న్యాయం చేశారో ఏమో కానీ.. ఓ సోదరిగా   సునీతకు ఆమె చేస్తున్న  న్యాయపోరాటంలో   షర్మిల నూటికి నూరు శాతం మద్దతుగా నిలుస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   వివేకా హత్య కేసు దర్యాప్తు ఇక్కడి దాకా వచ్చిందంటే.. అదంతా  సునీత,   షర్మిల వల్లే సాధ్యమైందనే ఓ చర్చ వైసీపీ శ్రేణుల్లోనే జరుగుతోంది.

By
en-us Political News

  
 వివేకా హత్య కేసులో  మనీలాండరింగ్ అంశంపై జరుగుతున్న విచారణలో భాగంగా  కడప ఎంపీ, వైసీపీ సీనియర్ నేత  వైఎస్ అవినాశ్ రెడ్డి హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.  
గతంలో ప్రజారాజ్యం పార్టీలో పవన్ కల్యాణ్‌తో కలిసి రాధ పనిచేశారు. 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున స్టార్ క్యాంపెయినర్‌గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. ప్రస్తుతం ఆయన జనసేన చేరికపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.  
తనపై నమోదైన   పరువునష్ట కేసును కొట్టివేయాలని కోరుతూ రాహుల్‌ గాంధీ గతంలో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కానీ, ఆయన చే పిటిషన్‌ను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. కేసును కొట్టివేయలేమని స్పష్టం చేస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
సరే పలు కేసులలో అరెస్టై కొన్ని నెలల పాటు జైలులో గడిపి బయటకు వచ్చారు. ఆ తరువాత అయితే పూర్తిగా అజ్ణాత వాసంలో ఉన్నారా అన్నట్లుగా వంశీ పూర్తిగా మౌనం వహించారు. ఇంత సుదీర్ఘ విరామం తరువాత ఏమైందో ఏమో కానీ.. ఒక్కసారిగా తాను రాజకీయంగా యాక్టివ్ అవుతున్నట్లు ప్రకటించారు.
కరోనా మహమ్మారి బారినపడి కోలుకున్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు ఇప్పటికీ లాంగ్ కొవిడ్ తీవ్ర దుష్ప్రభావాలతో సతమతమవుతున్నారు.
సంతానం కలగలేదన్న కారణంతో భార్యను తప్పుబడుతూ విడాకులు కోరలేరని మద్రాసు హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.
శారీరక వైకల్యాన్ని జయించి..అమెజాన్‌లో కొలువు కొట్టిన నిట్ గ్రాడ్యుయేట్.!
వాతావరణ మార్పుల ఎఫెక్ట్: కిడ్నీ ఆరోగ్యంపై షాకింగ్ రిపోర్ట్.!
బతుకమ్మ సంబరాల నుంచి ఇంటికి వెళ్తుండగా విషాదం.!
రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధం తెలుగు రాష్ట్రాల్లో ఒక కుటుంబానికి తీరని విషాదాన్ని మిగిల్చింది.
భారత యువ క్రికెటర్ పృథ్వీ షా, నటి ఆకృతి అగర్వాల్ వ్యక్తిగత జీవితంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడ గోల్ఫ్ ఎడ్జ్ అపార్ట్‌మెంట్స్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.