చంద్రబాబుతో తమిళనాడు సీఎం విజయ్ భేటీ: ఏం చర్చించారంటే.?

Publish Date:Oct 13, 2026

Advertisement

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా మంగళవారం (అక్టోబర్ 13) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుతో భేటీ అయ్యారు. అంతకు ముందు ఆయన బెజవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక చంద్రబాబుతో భేటీలో  తెలుగు గంగ ద్వారా చెన్నైకు నీటి విడుదలపై చర్చించారు.   చెన్నైలో తాగునీటి అవసరాలు, జలాశయాల్లో నిల్వలు, తెలుగు గంగ ద్వారా అందుతున్న నీటి పరిమాణం వంటి అంశాలపై వీరి మధ్య చర్చ జరిగింది.  

రాష్ట్రంలోని సాగునీటి, తాగునీటి అవసరాలు, జలాశయాల్లో నీటి నిల్వలు, భవిష్యత్తు అవసరాలను అంచనా వేసిన తర్వాతే అదనపు నీటి విడుదలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఏపీ నుంచి ఈ ఏడాది చెన్నైకి 4.08 టీఎంసీల నీరు అందిందని చెప్పిన విజయ్.. నీటి విడుదల పెంచాలని చంద్రబాబును కోరారు. నీటి లభ్యతను బట్టి నిర్ణయం తీసుకుంటామని ఈ సందర్బంగా చంద్రబాబు అన్నారు. అలాగే ఈ భేటీలో నదుల అనుసంధానంపై కూడా ఇరు రాష్ట్రాల సీఎంల మధ్య చర్చ జరిగింది. కాగా చంద్రబాబుతో భేటీ అనంతరం తమిళనాడు సీఎం విజయ్ విజయవాడ ఉత్సవ్ లో పాల్గొన్నారు. 

[Chandrababu Naidu Vijay Meeting, Telugu Ganga Water Release, Tamil Nadu CM Vijay, Chennai Drinking Water, Godavari Cauvery River Linking, Andhra Pradesh Tamil Nadu Water Sharing, Telugu One]

By
en-us Political News

  
తనపై నమోదైన   పరువునష్ట కేసును కొట్టివేయాలని కోరుతూ రాహుల్‌ గాంధీ గతంలో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కానీ, ఆయన చే పిటిషన్‌ను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. కేసును కొట్టివేయలేమని స్పష్టం చేస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
సరే పలు కేసులలో అరెస్టై కొన్ని నెలల పాటు జైలులో గడిపి బయటకు వచ్చారు. ఆ తరువాత అయితే పూర్తిగా అజ్ణాత వాసంలో ఉన్నారా అన్నట్లుగా వంశీ పూర్తిగా మౌనం వహించారు. ఇంత సుదీర్ఘ విరామం తరువాత ఏమైందో ఏమో కానీ.. ఒక్కసారిగా తాను రాజకీయంగా యాక్టివ్ అవుతున్నట్లు ప్రకటించారు.
కరోనా మహమ్మారి బారినపడి కోలుకున్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు ఇప్పటికీ లాంగ్ కొవిడ్ తీవ్ర దుష్ప్రభావాలతో సతమతమవుతున్నారు.
సంతానం కలగలేదన్న కారణంతో భార్యను తప్పుబడుతూ విడాకులు కోరలేరని మద్రాసు హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.
శారీరక వైకల్యాన్ని జయించి..అమెజాన్‌లో కొలువు కొట్టిన నిట్ గ్రాడ్యుయేట్.!
వాతావరణ మార్పుల ఎఫెక్ట్: కిడ్నీ ఆరోగ్యంపై షాకింగ్ రిపోర్ట్.!
బతుకమ్మ సంబరాల నుంచి ఇంటికి వెళ్తుండగా విషాదం.!
రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధం తెలుగు రాష్ట్రాల్లో ఒక కుటుంబానికి తీరని విషాదాన్ని మిగిల్చింది.
భారత యువ క్రికెటర్ పృథ్వీ షా, నటి ఆకృతి అగర్వాల్ వ్యక్తిగత జీవితంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడ గోల్ఫ్ ఎడ్జ్ అపార్ట్‌మెంట్స్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది.
అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మరో అవినీతి బాగోతాన్ని వెలుగులోకి తెచ్చారు.
కవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ, మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో  వేదికపై పంచుకుంటూ మెట్రో రైలులో ప్రయాణించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి  రేకెత్తిస్తోంది.
జాతీయ రాజధాని ఢిల్లీలో రాజకీయ వేడెక్కుతున్న వేళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ అత్యంత కీలకమైన ఆదేశాలు జారీ చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.