జగన్ తో ప్రత్యక్ష యుద్ధానికి షర్మిల శంఖారావం!

Publish Date:Jan 4, 2024

Advertisement

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి , తన సోదరుడు వైఎస్‌ జగన్‌ తో వైఎస్‌ షర్మిల  ప్రత్యక్ష యుద్ధానికి శంఖారావం మోగించేశారు.   తన వైఎస్సార్‌ తెలంగాణ పార్టీని  కాంగ్రెస్‌ పార్టీలో విలీనం చేయడం ద్వారా ఆమె పూర్తిగా కాంగ్రెస్ నాయకురాలిగా పరివర్తనం చెందారు.  దీంతో  దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి రాజకీయ వారసత్వాన్ని కాంగ్రెస్‌ హస్తగతం చేసేశారు.  వైఎస్‌ రాజశేఖర రెడ్డి తాను జీవించి ఉన్నంత కాలం కాంగ్రెస్‌ నాయకుడే ఆయినప్పటికీ రాష్ట్ర విభజన అనంతరం ఆయన కుమారుడు జగన్ సొంతంగా వైసీపీ పార్టీని స్థాపించి వైఎస్ రాజకీయ వారసత్వాన్ని సొంతం చేసుకున్నారు. అప్పట్లో వైఎస్ భార్య విజయమ్మ, తనయ షర్మిల కూడా జగన్ తో పాటే అడుగులు వేశారు. దాంతో వైఎస్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీతో ఉన్న అనుబంధం పూర్తిగా తెగిపోయింది.

 అయితే  ఇప్పుడు వైఎస్ తనయ షర్మిల రాజశేఖర రెడ్డి బిడ్డగా తాను కాంగ్రెస్‌ పార్టీలో చేరానని, రాహుల్‌ గాంధీని ప్రధానిగా చూడాలన్న తన తండ్రి వైఎస్ కలను సాకారం చేసేందుకు తన వంతు కృషి చేస్తానని ప్రకటించడం ద్వారా మళ్లీ వైఎస్ వారసత్వాన్ని కాంగ్రెస్ చేతుల్లో పెట్టేశారు. మరో వైపు వైఎస్ కుమారుడు జగన్ తన పాలనా వైఫల్యాలతో వైసీపీకి వైఎస్ తో ఉన్న అనుబంధాన్ని తుంచేశారు. వైఎస్ అనుచరులు, అభిమానులూ కూడా వైసీపీ వైఎస్ రాజకీయ పరంపరను కొనసాగించడం లేదని బాహాటంగానే చెబుతున్నారు. ఇక వైఎస్ కుటుంబ సభ్యులు కూడా దాదాపుగా జగన్ కు దూరం అయ్యారు. దీంతో వైసీపీకి వైఎస్ రాజకీయ సిద్ధాంతానికీ ఉన్న సంబంధం కూడా పుటుక్కుమని తెగిపోయినట్లే భావించాల్సి ఉంటుంది. అటువంటి తరుణంలో షర్మిల తన తండ్రి రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తానంటూ కాంగ్రెస్ పార్టీలో చేరి ఆయన ఆశయాల సాధనకు కృషి చేస్తానంటున్నారు. దీంతో ఇక షర్మిలే వైఎస్ రాజకీయవారసురాలిగా రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.

ఇక షర్మిల కాంగ్రెస్ గూటికి చేరడం ఏపీలో రాజకీయ సమీకరణాలను ఒక్కసారిగా మార్చేసినట్లైంది. నాలుగున్నరేళ్ల పాలనలో సీఎంగా జగన్ అన్ని రంగాలలో విఫలమయ్యారు. దీంతో విపక్ష తెలుగుదేశం రాష్ట్రంలో బలంగా పుంజుకుంది. మరో ప్రతిపక్షం జనసేన కూడా తెలుగుదేశంతో చేతులు కలిపింది. ఇక జనగ్ పార్టీలో అసమ్మతితో రగిలిపోతున్న వారందరికీ  ఇప్పటి వరకూ తెలుగుదేశం, జనసేన పార్టీలలో ఒక దానిలో చేరడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేకుండా పోయింది. అయితే షర్మిల కాంగ్రెస్ గూటికి చేరడంతో జగన్ పార్టీలో అసమ్మతి, అసంతృప్తి వాదులందరికీ ఇప్పుడు తమ రాజకీయ గమ్యం కాంగ్రెస్ గా మారిపోయింది.

దీని వల్ల విపక్ష కూటమి తెలుగుదేశం, జనసేనకు రెండిందాల మేలు జరుగుతుంది. ఒకటి వైసీపీ నుంచి కుప్ప తెప్పలుగా వచ్చి పడే అసమ్మతి నేతలను తమ పార్టీలలో ఎలా అకామిడేట్ చేయాలా అన్న మీమాంస పోతుంది. రెండు జగన్ ను వ్యతిరేకించి కాంగ్రెస్ లో చేరే వారి సంఖ్య పెరగడంతో.. జగన్ ఓటు వైసీపీ, కాంగ్రెస్ ల మధ్య చీలిపోయి.. వైసీపీని మరింత బలహీనం చేస్తుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఇప్పటికే తెలుగుదేశం, జనసేన కూటమికి దఖలు పడిపోయిందని సర్వేలు ఇప్పటికే తేల్చేశాయి.తటస్థులూ జగన్ పాలనకు చరమగీతం పాడేది తెలుగుదేశం పార్టీ మాత్రమేనన్న నిర్ణయానికి వచ్చేశారని పరిశీలకులు అంటున్నారు. ఇక ఏపీలో జగన్ కు పడే ఓట్లేమైనా ఉన్నాయంటే.. అవి కాంగ్రెస్ ఓట్లే.. ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ గూటికి చేరడంతో కాంగ్రెస్ ఓటు మళ్లీ కాంగ్రెస్ పార్టీకే వెడుతుందని విశ్లేషిస్తున్నారు.  తాజా సర్వేలలో  వచ్చే ఎన్నికలలో వైసీపీ 9శాతం ఓట్లు కోల్పోతుందని తేలింది. ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ లో చేరి ఏపీలో క్రియాశీలంగా వ్యవహరిస్తే వైసీపీ కోల్పోయే ఓట్ల శాతం మరింత పెరుగుతుందని అంటున్నారు.  షర్మిల చేరిక వల్ల కాంగ్రెస్ కు ఇప్పటికిప్పుడు అంటే వచ్చే ఎన్నికలలో విజయం సాధించి అధికారంలోకి వచ్చే అవకాశం ఉండదు కానీ,  వైసీపీని వెనక్కు నెట్టి  రెండో స్థానంలో బలంగా నిలబడేందుకు దోహదపడుతుందని పరిశీలకుల విశ్లేషిస్తున్నారు.  

By
en-us Political News

  
సీఎం పర్యటన ద్వారా ఈ కేసులోని సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ డీఎంకే ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. భారతి సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత ఆలస్యం కాకుండా ఉండేందుకు, తమకు అనుకూలంగా నిర్ణయం వచ్చేలా చూసేందుకు ఆమె ముందు జాగ్రత్తగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
కోలీవుడ్‌లోని మరికొందరు స్టార్స్ రాజకీయాలలోకి అడుగులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరో ధనుష్ కూడా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన విలువలతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు రూపంగా నిలిచారు. సొంత ఇల్లు కూడా లేకుండా, ఒక పాత స్కూటర్ మినహా ఎలాంటి ఆస్తులు కూడబెట్టకుండా నిరాడంబరంగా జీవించారు.
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్‌కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.